Sunday, December 29, 2024

MUDDUGAARE YASODA ముద్దుగారే యశోద

 రాగం: సాళంగనాట


పల్లవి 
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు |
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ||

చరణములు 
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము |
పంత మాడే కంసుని పాలి వజ్రము |
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస |
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ||

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము |
మితి గోవర్ధనపు గోమేధికము |
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము |
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము |
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము |
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము |
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...