Tuesday, December 31, 2024

KANA KANA RUCHIRA కన కన రుచిరా

 కన కన రుచిరా


తాళం: ఆది

రాగం: వరాళి(మేళకర్త 39, జలవరాళి   జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ


ఆరోహణ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స 

అవరోహణ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స


పల్లవి

కన కన రుచిరా కనక వసన నిన్ను

అనుపల్లవి
దిన దినమును అనుదిన దినమును
మనసున చనువున నిన్ను || కన || 

చరణంలు 
పాలుగారు మోమున
శ్రీయపార మహిమ కనరు నిన్ను || కన || 

కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను || కన || 

బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ || కన || 

సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు || కన || 

మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద
పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి
వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను || కన || 

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త
సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ
పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే || కన || 

కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను
వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి
మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ
ముఖ్యులు సాక్షి గాదా సుందరేశ సుఖ కలశాంబుధి వాసా శ్రితులకే || కన || 

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను || కన || 

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...