Monday, December 30, 2024

SIRUTA NAVVULAVAADU సిరుత నవ్వులవాడు సిన్నెకా

తాళం: ఆది   

రాగం: వకుళాభరణం

రూపకర్త: అన్నమాచార్య 


ఆరోహణ    : స రి2 గ2 మ ప ద ని స' 

అవరోహణ: స' ని2 ద ప మ గ2 రి2 స  


పల్లవి
సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెకా ||

చరణము(లు):
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా |
గొలుసుల వంకల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా ||

మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా |
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా ||

బింకపు మోతల పిల్లగోవివాడు
సింక సూపులవాడు సిన్నెకా |
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెకా ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...