Tuesday, December 31, 2024

AYAYO NEE NEERANAITHI - అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి

 అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి


తాళం: త్రిపుట
రాగం: మేచబౌళి (మేళకర్త15, మాయా మాళవ గౌళ జన్యరాగ)
రూపకర్త: రామదాసు

ఆరోహణ: స రి1 గ3 ప ద1 స 
అవరోహణ: స ని3 ద1 ప మ1 గ3 రి1 స 

పల్లవి:
అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి

అను పల్లవి:
వెయ్యారు జన్మాల వెత జెందితి గాని
చెయ్యన సద్గతి సాధింప లేనైతి

చరణము(లు):

మోస మేమని తలచియుండు దోస
వాసనల తగిలితేమందు ఆశా
పాశములను అరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి ||1||

మూడు మేలని నమ్మియుంటి నిరు
మూడు శత్రుల కూడియుంటి మాటికి
రెంటి మార్చి శత్రు మూటికెక్కువైన
కూటస్థు పొగడ నేను కూడ లేనయితి ||2||

వదలించి బంధముల విడజేసిన భద్ర
గిరి రాఘవులతో నేను కలసి
సదయుడవైగని శ్రీరామదాసుని
స్థిరముగ పోషించుడని వేడనైతి ||3||

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...