Tuesday, December 31, 2024

ABABA DHEBALAKU NORVALENURA - అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా

 అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా


తాళం: ఆది
రాగం: అసావేరి (మేళకర్త 8, హనుమ తోడి జన్యరాగ)
రూపకర్త: రామదాసు

ఆరోహణ: స రి1 మ1 ప ద1 స
అవరోహణ: స ని2 స ప ద1 ప మ1 గ2 రి1 స

పల్లవి:

అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
జబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా.

చరణము(లు):

అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో
కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య || 1 ||

రట్టుతీర్చీవేళ గట్టిగా నీవునను
జెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ || 2 ||

శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాద
శరధిబంధించిన శౌర్యమేమాయెరా || 3 ||

పరంధామ నీ పాదములాన వినరా
పరులకొక్క కాసు నే నివ్వలేదురా || 4 ||

భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడు
ప్రేమతో భజియించు రామదాసునేలు || 5 ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...