Tuesday, December 31, 2024

ABABA RAMA NAMAM ATYADBUTHAM - అబ్బబ్బా రామనామం అత్యద్భుతము

 అబ్బబ్బా రామనామం అత్యద్భుతము


తాళం: ఆది (చాపు)
రాగం: ధన్యాసి (మేళకర్త 8, తోడి జన్యరాగ)
రూపకర్త: రామదాసు

ఆరోహణ: స గ2 మ1 ప ని2 స
అవరోహణ: స ని2 ద1 ప మ1 గ2 రి1 స

పల్లవి:
అబ్బబ్బా రామనామం అత్యద్భుతము
గొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది.

చరణము(లు):

సారములేని సంసారసాగరమీదే రామనామం
పారదోలు మున్నూటరువది భవరోగములన్నీ ||1||

చేరి పంచేంద్రియములన్ని చేరనియ్యదు రామనామం
ఘోరమైన యమదూతలకొట్టెడిది రామనామం ||2||

దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామం
ధనకనక వస్తువులు దయచేయు రామనామం ||3||

ముక్కంటిసతికి శాశ్వతకీర్తినిచ్చే రామనామం
ఎక్కువై వాల్మీకిఋషికి యెప్పుడనుష్ఠాననామం ||4||

కామక్రోధలోభ మోహగర్వంబణచు రామనామం
స్వామి భద్రగిరీశుని సద్గతి శ్రీరామనామం ||5||

నీమముతో బిలిచినను నిత్యమోక్ష పదవినామం
రామదాసునేలిన శ్రీరామచంద్రునినామం ||6||

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...