Monday, December 30, 2024

TIRUVEEDHULA MERASI తిరువీథుల మెఱసీ

 పల్లవి 

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ||

చరణములు 
తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద |
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ||

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ||
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును హుRRఅ మెనిమిదోనాడు ||

కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్/మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ||

No comments:

Post a Comment

Sri Kamalathmika Hrudaya Sthotram - శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం

శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం ఓం అస్య శ్రీ మహాలక్ష్మీ హృదయ మాలా మంత్రస్య, భార్గవ ఋషి, ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవతా, అనుష్టుబాదీని నానాఛందాం...