Sunday, December 29, 2024

RAAMUDU RAAGHAVUDU రాముడు రాఘవుడు రవికులు డితడు

 రాగం: కానడ


పల్లవి 
రాముడు రాఘవుడు రవికులు డితడు |
భూమిజకు పతియైన పురుష నిధానము ||

చరణములు 
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున |
పరగ జనించిన పర బ్రహ్మము |
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ |
తిరమై ఉదయించిన దివ్య తేజము ||

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో |
సంతతము నిలిచిన సాకారము |
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి |
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము ||

వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు |
పాదుకొన పలికేటి పరమార్ధము |
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన |
ఆదికి అనాదియైన అర్చావతారము ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...