Sunday, December 29, 2024

MELOKO SRUNGAARARAAYA మేలుకో శృంగారరాయ

 పల్లవి 

మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల |
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ||

చరణములు 
సందడిచే గోపికల జవ్వనవనములోన |
కందువందిరిగే మదగజమవు |
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని |
గంధము మరిగినట్టి గండు తుమ్మెద ||

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో |
రతిముద్దు గురిసేటి రాచిలుకా |
సతుల పదారువేల జంట కన్నుల గలువల- |
కితమై పొడిమిన నా యిందు బింబమ ||

వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై |
నిరతి వాలిన నా నీలమేఘమా |
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద |
గరిమ వరాలిచ్చే కల్పతరువా ||

No comments:

Post a Comment

Sri Kamalathmika Hrudaya Sthotram - శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం

శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం ఓం అస్య శ్రీ మహాలక్ష్మీ హృదయ మాలా మంత్రస్య, భార్గవ ఋషి, ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవతా, అనుష్టుబాదీని నానాఛందాం...