Sunday, December 29, 2024

NALLANI MENI నల్లని మేని

 పల్లవి 

నల్లని మేని నగవు చూపుల వాడు |
తెల్లని కన్నుల దేవుడు ||

చరణములు 
బిరుసైన దనుజుల పింఛమణచినట్టి |
తిరుపు కైదువ తోడి దేవుడు |
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి |
తెరవు చూపినట్టి దేవుడు ||

నీటగలసినట్టి నిండిన చదువులు |
తేట పరచినట్టి దేవుడు |
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు |
తీట రాసినట్టి దేవుడు ||

గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న |
తిరువేంకటాద్రిపై దేవుడు |
తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి |
తెరచి రాజన్నట్టి దేవుడు ||

No comments:

Post a Comment

Sri Kamalathmika Hrudaya Sthotram - శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం

శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం ఓం అస్య శ్రీ మహాలక్ష్మీ హృదయ మాలా మంత్రస్య, భార్గవ ఋషి, ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవతా, అనుష్టుబాదీని నానాఛందాం...