Tuesday, December 31, 2024

TAKKUVEMI MANAKU - తక్కువేమి మనకూ

 తక్కువేమి మనకూ


తాళం
రాగం
రూపకర్త: రామదాసు


పల్లవి

తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ

చరణము
ప్రక్కతోడుగా భగవంతుడు
మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥

మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ
మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥

భూమిస్వర్గములు పొందుగ గొలచిన
వామనుండు మనవాడై యుండగ ॥ 3 ॥

దశగ్రీవుముని దండించిన ఆ
ధశరధ రాముని దయ మనకుండగ ॥ 4 ॥

దుష్టకంసునీ దుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై గృపతో నుండగ ॥ 5 ॥

రామదాసుని గాచెడి శ్రీ
మన్నారాయణి నెరనమ్మియుండగ ॥ 6 ॥

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...