Monday, December 30, 2024

TANDANANA AHI తందనాన అహి

 పల్లవి 

తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ||

అనుపల్లవి 
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే ||

చరణములు 
కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ||

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర - అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ||

అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే |
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ||

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ||

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ||

No comments:

Post a Comment

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...