Sunday, December 29, 2024

KOLICHINA VAARALA కొలిచిన వారల

 పల్లవి 

కొలిచిన వారల కొంగుపైడితడు
బలిమి తారక బ్రహ్మమీతడు ||

చరణములు 
ఇనవంశాంబుధి నెగసిన తేజము
ఘనయజ్ఞంబుల గల ఫలము |
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినువుల రఘుకుల నిధానమీతడు ||

పరమాన్నములోపలి సారపుజవి
పరగినదివిజుల భయహరము |
మరిగినసీతా మంగళసూత్రము
ధరలో రామావతారంబితడు ||

చకితదానవుల సంహారచక్రము
సకల వనచరుల జయకరము |
వికసితమగు శ్రీవేంకట నిలయము
ప్రకటిత దశరథ భాగ్యంబితడు ||

No comments:

Post a Comment

Daksha cursed Narada to wander the universe forever without a fixed home - దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట

దక్షుండు నారదుని శపియించి ప్రజాసర్గం బొనరించుట అది ఎలాగంటే - వీరు బాలురు. దేవఋషి పితృబుణాలు తీర్చుకోలేదు. ఏ కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వ...