Tuesday, December 31, 2024

ABABA DHEBBALAKU TALALERA - అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా

 అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా


తాళం: ఆది
రాగం: అసావేరి (మేళకర్త 8, హనుమ తోడి జన్యరాగ)
రూపకర్త: రామదాసు

ఆరోహణ: స రి1 మ1 ప ద1 స
అవరోహణ: స ని2 స ప ద1 ప మ1 గ2 రి1 స


పల్లవి:

అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా. 

చరణము(లు):

మేలుచేయుదు నంటిగదరా మేలుచేసితినేమి భయమంటి గదరా
వరహాలు మొహరీలు జమజేస్తిగదరా నీ పరిచారకులకు నే పెట్టితిగదరా || 1 || 

పరులకొక్కరువ్వ యీయలేదుగదరా ఓ పరమాత్మ నీ పాదముల్‌ నమ్మితిరా 
కొరడాలు తీసుక గొట్టిరిగదరా హరనుత గోవింద హరితాళలేరా || 2 || 

అంతటిలో నిన్ను నెరనమ్మినారా శరణాగత గోవింద హరితాళలేరా
శరధిబంధించిన శౌర్యమెక్కడరా రాక్షససంహార రక్షింపరారా || 3 || 

రామ భద్రాద్రిసీతారామ రామా నీనామమెప్పుడు భజియించితిగదరా
రామదాసుని నిటుల చేయించితేరా || 4 || 

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...