Sunday, December 29, 2024

NIMUSHAMEDATEGAKA నిముషమెడతెగక హరి నిన్ను తలచి

 పల్లవి 

నిముషమెడతెగక హరి నిన్ను తలచి |
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ||

చరణములు 
నిదురచే కొన్నాల్లు నేరముల కొన్నాల్లు
ముదిమిచే కొన్నాల్లు మోసపోయి |
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే
మది మదినె యుండి ఏమరక బతుకుట గాక ||

కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత
వెడయాసలకు కొంత వెట్టిసేసి |
అడరి కావలెననిన అందు సుఖమున్నదా
చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ||

ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను |
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే
కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...