Sunday, December 29, 2024

RAMA DASARATHA RAAMAA రామ దశరథరామ నిజ సత్య

 పల్లవి 

రామ దశరథరామ నిజ సత్య
కామ నమో నమో కాకుత్థ్సరామ ||

చరణములు 
కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతిరామ |
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర రవివంశ కోదండ రామ ||

దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ |
మనుజావతారా రామ మహనీయ గుణరామ
అనిలజప్రియ రామ అయోధ్యరామ ||

సులలితయశ రామ సుగ్రీవ వరద రామ
కలుష రావణ భయంకర రామ |
విలసిత రఘురామ వేదగోచర రామ
కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ||

No comments:

Post a Comment

Sri Tripura Bhairavi Sahasra Namavali - శ్రీ త్రిపురభైరవీ సహస్ర నామావళి

శ్రీ త్రిపురభైరవీ సహస్ర నామావళి ఓం త్రిపురాయై నమః । ఓం పరమాయై నమః। ఓం ఈశాన్యై నమః । ఓం యోగసిధ్ధ్యై నమః ఓం నివాసిన్యై నమః । ఓం సర్వమంత్రమయ్యై...