కావేరి కార్తికస్నానఫలము, తత్త్వనిష్ట చరితము
ఓ జనకమహారాజా! వినుము. కార్తికమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసిన యెడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును.
మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకుజెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి.
మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లుపల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామధికారిని(మునసబును) బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను.
తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచమైనను భయము లేదు. మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తికస్నానార్థము పోవు చున్నాను. నాతో మీరు కూడా రండి. అని వారిని తీసుకొనిపోయి కావేరీ నదీలో బ్రహ్మ రాక్షసుల నిమిత్తము రాక్షసులచేగూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను
“అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్ధం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహంకరిప్యే” ఇట్లు సంకల్పముచేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానముచేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోషవిముక్తులై దివ్యరూపములను ధరించి వైకుంఠలోకమునకుబోయిరి.
ఓ జనకమహారాజా! వినుము. మోహముచేతగాని, అజ్ఞానముచేత గాని కార్తిక మాసంబున శుక్రనక్షత్రముదయించినపుడు = (తెల్లవారు జామున) సూర్యోదయకాల మందు కావేరీనది యందు స్నానముచేసి పిమ్మట శ్రీ శ్రీవిష్ణుపూజనుజేసిన వానికి పదివేల యజ్ఞములు చేసన ఫలము కలుగును. ఇందుకు సందేహములేదు.
కార్తికమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్నానము జేయనివాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టీ స్త్రీగాని, పురుషుడుగాని కార్తికమాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.

స్త్రీలుగాని, పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తిక వ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు.
కార్తిక పూర్ణిమరోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై యుండును. ఈ విషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.
ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు
తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు,
అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు.
రాజా! ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు బోవుచు గోదావరి తీరమందు ఆకాశమునంటి యున్నట్లుండు ఒక మఱ్ఱిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను.

ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగానున్నది. శరీరము నల్లగానున్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎఱ్ఱగానున్నవి. దంతములు పొడుగుగానున్నవి. చేతిలో కత్తులపైన పుఱ్ఱెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి.
ఆ రాక్షసుల భయముచేత ఆవతవృక్షమునకు ఆఱుక్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆవటసమీపమందు పర్వత సమానశరీరులగు ఆ బ్రాహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకరశబ్దములను జేయుచుండెడి వారు.

అనేక కార్తిక వ్రతములాచరించినా తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మఱ్ఱి చెట్టు మీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను.
తత్త్వనిష్ఠుడు భయపడి శ్రీహరిపాదారవిందములను స్మరించుచు దేవేశా! నన్ను రక్షించుము. లోకేశా! నారాయణా! అవ్యయా! నామొర ఆలకించుము. సమస్తభయముల నశింపజేయు దేవా! నాభయమును పోగొట్టుము నాకు నీవేదిక్కు నీవు తప్ప నన్ను రక్షింపసమర్ధులెవ్వరును లేరు.

ఈ ప్రకారము హరినిగూర్చి మొఱబెట్టుచు వారిభయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతనివెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి గలిగినది.
ఓ రాజా! తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణామము లాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి.

బ్రాహ్మణోత్తమా! మీ దర్శనము వలన మేము పాపరహితుల మైతిమి. మీరాక మాకు ఉపకారము కొఱకయినది. అదిన్యాయమే. మహాత్ములు జీవించుట యాత్రచేయుట లోకమును ఉద్ధరించుట కొఱకే ఉపకారము కొఱకే అగునుగదా.
బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియె.
బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియె.
మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకుజెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి.
మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లుపల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామధికారిని(మునసబును) బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను.
ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని, నాకుటుంబ లాభము కొఱకు బ్రహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకుగాని ఒకనాడయినను అన్నమును బెట్టి యెఱుంగను.
బ్రాహ్మణులసొమ్ము స్నేహముచేత హరించుటచే ఏడుతరముల కుటుంబము నశించును. దొంగతనముగాబ్రాహ్మణుల ధనమపహరించిన యెడల సూర్యచంద్ర నక్షత్రములుండువరకు కుటుంబము నశించును.
తరువాత మృతినొంది యమబాధలను అనేకములనొందితిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని.
కనుక బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము.
అందులో రెండవ వాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును, నా భార్యపిల్లలును షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రముచద్ది అన్నమును పెట్టుచుండువాడను, బంధువులకుగాని, బ్రాహ్మణులకు గాని ఒక నాడయినను అన్నమును పెట్టినవాడనుకాను.

మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వరకు యమభాదలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించతిని. ఓ బ్రాహ్మణోత్తమా! నాకీపాపముతొలగు ఉపాయము జెప్పి నన్నుఉద్దరింపుము.
తరువాత మూడవవాడు నమస్కరించి తనస్థితిని ఇట్లుచెప్పెను. అయ్యా! నేను ఆంధ్రదేశనివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను.

స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలనుజేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయా శూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి “నూనెను అపహరించి వేశ్యాగ్భృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకుయిచ్చి దేవతానివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికివచ్చి నానాజన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై బుట్టి యా మఱిమీద ఉంటిని గనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము.
తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచమైనను భయము లేదు. మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తికస్నానార్థము పోవు చున్నాను. నాతో మీరు కూడా రండి. అని వారిని తీసుకొనిపోయి కావేరీ నదీలో బ్రహ్మ రాక్షసుల నిమిత్తము రాక్షసులచేగూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను
“అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్ధం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహంకరిప్యే” ఇట్లు సంకల్పముచేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానముచేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోషవిముక్తులై దివ్యరూపములను ధరించి వైకుంఠలోకమునకుబోయిరి.
ఓ జనకమహారాజా! వినుము. మోహముచేతగాని, అజ్ఞానముచేత గాని కార్తిక మాసంబున శుక్రనక్షత్రముదయించినపుడు = (తెల్లవారు జామున) సూర్యోదయకాల మందు కావేరీనది యందు స్నానముచేసి పిమ్మట శ్రీ శ్రీవిష్ణుపూజనుజేసిన వానికి పదివేల యజ్ఞములు చేసన ఫలము కలుగును. ఇందుకు సందేహములేదు.
కార్తికమాసమందు ఏదో ఒక ఉపాయముచేత కావేరీస్నానమును తప్పక చేయవలయును.
కార్తికమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్నానము జేయనివాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టీ స్త్రీగాని, పురుషుడుగాని కార్తికమాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.
No comments:
Post a Comment