ఈ 8వ సంఖ్యకు శనిదేవుడు అధిపతి. ఈ సంఖ్య శని ప్రభావంలో ఉంటుంది.
ఈ సంవత్సరంలో శని మంచి మేలు చేస్తాడు. ఈ సంవత్సరంలో భౌతిక సంపదలు సమకూరి, అనుకున్న కోరికలు నెరవేరి, విజయం ప్రాప్తించగలదు. 7 సంవత్సరాల శ్రమకు ఫలితం దక్కుతుంది.
ఈ 8 సంఖ్యకు ఒక పేదవానిని ధనవంతునిగా మార్చే శక్తి ఉంది. రాజకీయ రంగాల వారికి విజయావకాశాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలలో విజయం పొందుతారు. మంచి ర్యాంక్స్ సాధిస్తారు. ఆర్థికంగా మంచి స్టేబిలిటి ఏర్పడుతుంది.
కోర్టు వ్యవహారాలలో అనుకూలంగాను, విజయం సాధిస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆందోళన, ఒత్తిడి, కోపం వీటిమూలంగా వచ్చే హృదయ సంబంధ సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సంవత్సరంలో వస్తువులు, ఆస్తులు కొనవచ్చు కాని అమ్మకూడదు. స్టీలు, లోహ పరిశ్రమల వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పాత ఇనుము అమ్మి, కొనే వ్యాపారులకు మంచి లాభసాటిగా ఉంటుంది.
No comments:
Post a Comment