Sunday, December 29, 2024

E PURAANAMULA NENTA VEDIKINAA ఏపురాణముల నెంత వెదికినా

 పల్లవి 

ఏపురాణముల నెంత వెదికినా
శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||

చరణములు 
వారివిరహితములు అవి గొన్నాల్లకు
విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలి చిటు నమ్మినవరములు
నిరతము లెన్నడు నెలవులు చెడవు ||

కమలాక్షుని మతిగాననిచదువులు
కుమతంబులు బహుకుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు
విమలములే కాని వితథముగావు ||

శ్రీవల్లభుగతి జేరనిపదవులు
దావతులు కపటధర్మములు |
శ్రీవేంకటపతి సేవించునేవలు
పావనము లధికభాగ్యపుసిరులు ||

No comments:

Post a Comment

Sri Tripura Bhairavi Sahasra Namavali - శ్రీ త్రిపురభైరవీ సహస్ర నామావళి

శ్రీ త్రిపురభైరవీ సహస్ర నామావళి ఓం త్రిపురాయై నమః । ఓం పరమాయై నమః। ఓం ఈశాన్యై నమః । ఓం యోగసిధ్ధ్యై నమః ఓం నివాసిన్యై నమః । ఓం సర్వమంత్రమయ్యై...