Sunday, December 29, 2024

EE SURALU EE MUNULU ఈ సురలీమును లీచరాచరములు

 పల్లవి 

ఈ సురలీమును లీచరాచరములు
యిసకలమంతయు నిది యెవ్వరు ||

చరణములు 
ఎన్నిక నామము లిటు నీవై యుండగ
యిన్ని నామము లిటు నీవై యుండగ |
వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి
యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ||

వొక్కరూపై నీవు వుండుచుండగ మరి
తక్కిన యీరూపములు తామెవ్వరు |
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ
మక్కువ నుండువారు మరి యెవ్వరు ||

శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా
దైవంబులనువారు తామెవ్వరు |
కావలసినచోట కలిగి నీవుండగ
యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ||

No comments:

Post a Comment

Narasimha Jayanti - నరసింహ (నృసింహ)జయంతి

నరసింహ (నృసింహ)జయంతి విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని నాల్గవ అవతారమే నరసింహ స్వామి అవతారం. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధశి నాడు జరుపుకొంటా...