Sunday, January 4, 2026

Apadaleni Adivaram Katha - ఆపదలేని ఆదివారము కథ

ఆపదలేని ఆదివారము కథ

ఒక బ్రాహ్మణున కొక కుమారుడు కలడు. ఆ చిన్నవాని కాతడు వివాహముచేసి కోడలిని తన యింటికి తీసికొనివచ్చెను. ఆమె ఆపద అనిన  తెలియక ప్రతిదినము మామగారింటికి రాగానే-మామా! ఆపదంటే యేమిటి? యని యడుగు చుండేది. ప్రతిదినమిట్లు అడుగుచుండగా విసుగువచ్చి ఆ బ్రాహ్మణుడు దర్భాసనపు త్రాడు పుచ్చుకొని పెద్దమనుమడి ని కొట్టెను. ఆ పిల్లవాడాదెబ్బకు మూర్చపడిపోయెను. ఆ యాపద చూడలేక యాచిన్నవాని తల్లి అడవిలోకి వెళ్ళి విచారించుచుండగా భూమి పై విహారానికి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి యేమి ఇట్లున్నావని యడిగిరి. 

అప్పుడా చిన్నది నాకు ఆపదమనసు అయి ప్రతిదినము మా మామగారిని ఆపదయంటే యేమిటి? యని అడుగగా ఆయనకు కోపమువచ్చి దర్భాసన త్రాటితో నాపెద్దకొడుకును కొట్టినారు. అతడు మూర్చపడినారు. ఆయాపద భరింపజాలక యీలాగువచ్చినానని బ్రాహ్మణ స్త్రీ చెప్ప పార్వతీ పరమేశ్వరులు "నీవు క్రిందటి జన్మమున ఆపదలేని ఆదివారము నోముపట్టి ఉల్లంఘన చేసినావు.
అందుచేత నీకు ఆపద మనస్సైనది. ఇప్పుడు నోముపట్టి క్రమముగా ఉద్యాపన చేసికొన్న యెడల నీకీ యాపద పోవునని చెప్ప పార్వతీ పరమేశ్వరులు అంతర్జానము నొందిరి. ఆ బ్రాహ్మణ స్త్రీ యింటికి వెళ్ళి యానోముపట్టి క్రమముగా నుద్యాపన చేసికొని ఏవిధమైన ఆపదలులేక సుఖముగా నుండెను. 

ఉద్యాపనము: అయిదు మానికెల పాలలో మానెడు సోలడు బియ్యముపోసి పరమాన్నమువండి అడుగు అట్టు పై అట్టు తీసుకొని సూర్యునకు నైవేద్యము పెట్టి ఆ మథ్య పరమాన్నము అయిదుమూళ్ళ పంచ, దక్షిణ తాంబూలములతో 
 అయిదు మంది బ్రాహ్మణులకు వాయన మియ్యవలయును. 

Friday, January 2, 2026

Streela Vrata Kathalu - స్త్రీల వ్రత కథలు

1. మోబేటి పద్మము (మూగనోము)






































































































Velaga Gowri Nomu Katha - వెలగ గౌరీ కథ

వెలగ గౌరీ కథ

వెలగ వెలగ అనరాదు - వేలుపెట్టి చూపరాదు
వెలగ చెట్టుయొక్క నీడకు వెళ్ళరాదు - వెలగపండు తినరాదు.

ఉద్యాపనము: పదమూడు జోడాల ముచ్చికలతోనున్న వెలగకాయలు తెచ్చి దక్షణ తాంబూలము, నల్లపూసలు, లక్కజోడు పెట్టి పదముగ్గురు ముత్తయిదువులకు యియ్యవలెను. 

Grama Kumkuma Nomu Katha - గ్రామ కుంకుమ నోము కథ

గ్రామ కుంకుమ నోము కథ

ఒక బ్రాహ్మణయువతి ప్రతిదినము గౌరినారాధించుచుండగ నొక దినమున గౌరి యామె స్వప్నమున కనపడి "అమ్మాయీ! నీ భర్తకు కొద్ది రోజులలో ప్రాణాపాయము కలగనున్నది. నీవు ఆ సమయంబునందు గ్రామకుంకుమ నోముపట్టి మధ్యలో వ్రతోల్లంఘనము చేయక పూర్తి చేసినచో నీ మంగళ సూత్రము శాశ్వతముగ నిలిచియుండు" నని చెప్పెను.

ఆమె అటులనే తన భర్తకు ప్రాణాపాయము సంభవింపనున్నదని కొనిన దినమున వీసె ఏబులం(కేజిన్నర), పసుపు, పసుపంత కుంకుమను కావిట్లలో వేయించుకొని పండ్లు పట్టుకొని వెళ్ళిగ్రామములో పంచిపెట్టు చుండెను. ఒక వీధిలో పంచి పెట్టెసరికి ఒక కొడుకువచ్చి "అమ్మా? నాన్నగారికి జబ్బుగానున్నది రమ్మ" ని చెప్పి పిలిచెను. అందుకామె "నాయనా! ఒక్కవిధి అయినద" ని చెప్పి రెండవ వీధికి పోయెను. అంత రెండవ కుమారుడువచ్చి "అమ్మా! నాన్నగారికి చాల జబ్బుగానున్నది రమ్మ" ని జెప్పెను. అప్పుడామె మూడవవీధికి వెడలి పంచి పెట్టసాగెను. అంతట మూడవకుమారుడు వచ్చి "అమ్మా! నాన్నగారిని క్రింద బడవేయుచున్నారు.రమ్మనగా-"ఇక రెండు వీధులున్నవి వచ్చెదనని" చెప్పి ఆమె నాలుగవ వీధికి వెళ్ళెను. నాల్గవ కుమారుడు వచ్చి అమ్మా నాన్నగారికి ప్రాణము పోయినదని చెప్పగా- యిక నొక్క వీధి యున్నదని చెప్పి యామె అయిదవ వీధికి వెళ్లి పంచిపెట్టుకొని, యింటికి వచ్చేసరికి భర్త దిగ్గునలేచి కూర్చుండెను. అప్పుడు ఊరందరు ఆశ్చర్యముతో అమ్మా! ఏమినోము పట్టినావు? ఏమి ప్రతము చేసినావని అడిగిరి. గ్రామకుంకుమ నోము పట్టి అది అయిదు వీధులను పంచిబెట్టుకొని వచ్చేసరికి వారు లేచి కూర్చున్నారని చెప్పినది.

ఉద్యాపనము :- వీసెయేబులం(1-1/2 Kg) కుంకుమ, వీసేయేబులం పసుపు పండ్లు ఊరిలో పంచి పెట్టుకోవలెను.

Poorna Aadivaramula Nomu Katha - పూర్ణాదివారము నోము కథ

పూర్ణాదివారము నోము కథ

ఒక రాజుకూతురు చిన్ననాటినుండి కడుపు శోకము కలిగినదై అయిదుగురు బిడ్డలను పోగొట్టుకొనెను. తరువాత ఆ దుఃఖము తాను భరించలేక అడవిలోకిపోయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించు చుండగా పార్వతీ పరమేశ్వరులామెకు ప్రత్యక్షమై యేమి యిట్లు విచారించుచు కూర్చున్నావని యామెనడిగిరి. అంత నామె "నాయనా! పుట్టిచచ్చిపోతున్న బిడ్డలతో పడలేక ఏడ్చుచున్నాను,”నని చెప్పగా పార్వతీ పరమేశ్వరులు - "నీవు క్రిందటి జన్మమున పూర్ణాదివారము నోముపట్టి ఉల్లంఘనము చేసినావు. ఆ కారణమున నీ దుఃఖము సంప్రాప్తమైనది. ఇప్పుడు తిరిగి నీవా నోముపట్టి కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని యుద్యాపనము చేసుకొన్న యెడల నీకీ దుఃఖము బోవునని చెప్పి అంతర్జానము నొందిరి. ఆ రాజకుమార్తెయు పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారము నోముపట్టి ఉద్యాపనము చేసుకొని అంతటి నుండి కడుపుశోకము లేనిదయ్యెను.

ఉద్యాపనము: కథ జెప్పి అక్షంతలు వేసికొని ప్రతి ఆదివారము ఒంటిపూట భోజనముచేసి ఒక ముత్తయిదువునకు తలంటి నీళ్ళుపోసి దక్షిణ తాంబూలము యిచ్చి అయిదు మానికల బియ్యము పూర్ణపు ఉండ్రములువండి వాయన మియ్యవలెను. 

Sokamuleni Somavaramu Katha - శోకములేని సోమవారము కథ

శోకములేని సోమవారము కథ

ఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులు, నొక కుమార్తెయు కలరు. అతడా కుమార్తెకు వివాహము చేయగా ఆమె మగడు దేశాంతరము వెళ్ళెను. అందుకా చిన్నది మిక్కిలి దుఃఖించుచుండెను. అట్లేడువగా ఏడువగా ఆయుసురు తగిలి ఆ బ్రాహ్మణునకు దరిద్రము వచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడొక చెరువు తవ్వించినాడు. కాని అందులో గంగపడలేదు. అందుకా బ్రాహ్మణుడు మిక్కిలి విచారించుచు భార్యతోగూడి తపస్సు చేయగా పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై ఎందుకు తపస్సు చేయుచున్నారని యడిగిరి. అప్పుడా బ్రాహ్మణుడు నాకొక్క కుమార్తెయున్నది. అది అస్తమానము యెడ్చుచుండును. దాని యుసురుతగిలి మాకు దరిద్రము సంటప్రాప్తమైనది. అందుచే చెరువు త్రవ్వించినాము. అందులో నీళ్ళుపడినవికావు.  అందుచేత తపస్సు చేయు చున్నామని జెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ పెద్దకొడుకును తీసుకొనివచ్చి ఈ తూమున కడ్డముగా వేసినట్లయితే యిందులో నీళ్ళు పడునని జెప్పిరి. బ్రాహ్మణుడు అందుకు వప్పుకొని పెద్దకొడుకును తీసుకొనివచ్చి తూమున కడ్డము వేయగా, వెంటనే గంగపడెను. తరువాత పార్వతీ పరమేశ్వరులు నీకూతురు క్రిందటి జన్మమున శోకములేని సోమవారము నోముపట్టి ఉల్లంఘనము చేసినది. ఆకారణముచేత నీయేడుపు వచ్చినది. ఇప్పుడు తిరుగ నోము పట్టించి కధ చెప్పి అక్షితలు వేసి ఏడాది సోమవారము ఒంటిపూట భోజనము పెట్టి ఎడాది అయిన తరువాత ఉద్యాపన చేయించవలసినదని చెప్పి అదృశ్యమైనది. ఆ బ్రాహ్మణుడు కూతురు నా ప్రకారము నోపించి ఉద్యాపన చేయించగా ఆమె మానెను. సంపద గలిగెను.

ఉద్యాపనము :- మానెడు సోలడు(1-1/4 Kg) బీయ్యము పులగము వండి అడుగు అట్టు పై అట్టు తీసి రవికెలగుడ్డ వాసెనకట్టి దక్షిణ తాంబూలము బెట్టి ముత్తయిదువకు వాయన మియ్యవలయును.

Margasira Lakshmi Varamu Katha - మార్గశిర లక్షివారము కథ

మార్గశిర లక్షివారము కథ

పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది. ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఆ సయమంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీ వారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహా లక్ష్మిని చేసి జిల్లేడు పూలతో, ఆకులతో పూజచేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం బెల్లం నైవేద్యంగా పెట్టేదికొన్నాళ్లకు సుశీల పెద్దదవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయింది. అప్పుడు కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూవచ్చింది. కానీ అత్తింట్లో మాత్రం నిత్య కల్యాణం.. పచ్చ తోరణమైంది.

అంతట నా సుశీల పుట్టింటి వారికి దరిద్రము వచ్చెను. ఆమె అత్తవారింటివద్ద సిరిసంపదలతో తులదూగుచు "పుట్టింటి వారికి దరిద్రము వచ్చెనిని తెలుసుకొని తోడబుట్టినవానికి కబురంపి ఒక కర్ర దొలిపించి ఆ కర్ర నిండా వరహాలుపోసి తమ్మునకిచ్చెను. అదిపట్టుకొని తమ్ముడు వెళ్ళుచు త్రోవలో కడుపునొప్పివచ్చి ఆ కర్ర చెట్టునకు జారవైచి కొంచెమావలికి వెళ్లెను. అంతట నాత్రోవ వెంబడి కొందరు వెళ్లుచు ఆ కర్రపట్టుకొని చక్కాబోయిరి. అప్పుడా బ్రాహ్మణ చిన్నవాడాకర్ర వెదకి యెందుగానక యింటికి వెళ్ళిపోయెను. 

తరువాత కొన్నాళ్ళకు తమ్ముని వర్తమానము తెలియక మరల నా చిన్నది కబురంపగా నా తమ్ముడు వచ్చెను. అతనిని గాంచి నాయనా స్థితి యెలాగున్నదిని యడుగగా"మునుపటి వలెనే యున్నదిని యాతడు చెప్పెను. అప్పుడామె యొక చెప్పుల జోడు కుట్టించి దాని నిండా వరహాలుపోసి అందులో గడ్డ పెట్టి ఈజోడు పట్టుకువెళ్ళి నాన్నకీయమని తమ్మునకిచ్చెను. అతడా చెప్పుల జోడు పుచ్చుకొని యొక చెరువు గట్టుదగ్గరకు వెళ్లుసరికి వానికి దాహమై యాజోడు నక్కడపెట్టి చెరువులోనికి వెళ్లెను. అప్పుడొక కుక్కవచ్చి అజోడెత్తుకొనిపోయెను. దాహము పుచ్చుకొని పైకివచ్చి మాతడు గట్టున పెట్టిన జోడునుగానక యింటికి వెళ్లెను. 

కొన్నాళ్ళకు తిరుగ వానిని అక్కగారు కబురంపగా నాతడు యూరికేగెను. యేమి "నాయనా! ఏలాగున్నది మీ స్థితియని" వానినడిగెను. ఎప్పటిలాగేయున్నదని యాతడు చెప్పెను. అప్పుడామె యొక గుమ్మడి కాయ దొలిపించి దానినిండా వరహాలుపోసి యది పట్టుకొని వెళ్లుమని తమ్మునికి కిచ్చెను. ఆ కాయ నతడు పట్టుకొనివచ్చి చెరువుగట్టుమీదబెట్టి కాళ్ళు కడుగుకొనుచుండగా నాదారిని పోవుచున్న కోమటి యొకడా కాయను పట్టుకొనిపోయెను. ఒడ్డునకువచ్చి కాయను కానక బ్రాహ్మణ బాలుడు తన యింటికిపోయెను. కోమటి తన యింటివద్దకు వెళ్ళి యాకాయను కొట్టగా యందువరహాలు నిండియుండెను.

అప్పుడా బ్రాహ్మణచిన్నది తన పుట్టింటివారి సంగతి యెట్టున్నరో తెలిసికుందామని యచ్చటికి వచ్చెను, వారు మిక్కిలి దరిద్రులై యుండిరి. అప్పుడామె తల్లిని తీసుకొని వెళ్ళి మార్గశిర లక్ష్మివారము నోము నోపించిన నింత యన్నము కలుగునని తలంచినదై యట్లు తల్లిని తీసుకొనివెళ్ళెను. ఇంటికి వెళ్ళిన తరువాత “అమ్మా! ఈ రోజున మార్గశిర లక్ష్మీవారము కాబట్టి నోట్లోయేమీ వేసుకొనవద్దని చెప్పెను. ఆమె సరే యని చెప్పి పిల్లలకు చద్దియన్నము పెట్టుచు నొక ముద్ద నోటిలో వేసికొనెను. అప్పుడు బ్రాహ్మణచిన్నది తల్లితో "అమ్మా! స్నానము చేయుము నోము నోచుకొందమని చెప్పగా తల్లి అయ్యో! పిల్లలకు అన్నము పెట్టుచు మరచిపోయి యొక ముద్ద నోట
వేసికొన్నానిని చెప్పెను. అప్పుడు చిన్నది ఇక నేవిధముగ చేతను వీండ్రకు భాగ్యము 
అంటదనుకొ”ని తాను మాత్రము నోచుకొన్నదట. 

అంతట రెండవవారము తల్లిని బిలిచి అమ్మా! ఈవేళ లక్ష్మివారము, నోట యేమీ వేసికొనకని చెప్పెను. అందుకామె అలాగేనని పిల్లలకు తలంటుచు ఆగిన్నెలో నూనె మిగులగా తలకు రాసుకొన్నదట. అంత కూతురు వచ్చి అమ్మా! స్నానము చేయుమని చెప్పగా అయ్యో అమ్మా! పిల్లలకు రాయగా మిగిలిన నూనెయుండ నాతలకు రాసుకొన్నానని చెప్పెను. పోనీలే యినచెప్పి తాను మాత్రము నోచుకొనెను. 

అంత మూడవవారము రాగా తల్లిని బిలిచి "అమ్మా! ఈవేళ లక్ష్మివారము నోటిలో నేమియు వేసికొనవద్దని చెప్పగా నామె 'యలాగే' యని పిల్లలకు తలదువ్వుచు తనతల దువ్వుకొని కొప్పు పెట్టుకొనెను. ఆ వారము కూడా తాను మాత్రమే నోచుకొని యాచిన్నది.  

నాల్గవ వారము రాగా గోయితీసి యందులో తల్లిని కూర్చుండబెట్టి బల్లమూత వేయించెను. పిల్లలందరు అరటిపండ్లు తిని యాతొక్కలు తీసుకొనిపోయి అమ్మా ! యిదిగోనని బల్లసందులో నుండి పడవేయగా నామె వానిని తిని వేసెను. అంత కూతురువచ్చి స్నానము చేయుమని చెప్పగా “అయ్యో! అమ్మాయీ అరటిపండు తొక్కలు తిన్నానని చెప్పెను. 

అయిదవ వారము చెంగుకు ముడివేసుకొని తానెక్కడికిబోయిన నక్కడికితీసికొనిపోవుచు, రెండుజాములైన తరువాత స్నానము చేయించి నోము నోపించెను. అప్పుడు పూర్ణపు కుడుములు వండి నైవేద్యము పెట్టుకొనిరి. కూతురు నైవేద్యము పెట్టుచుండగా ఊరుకొని తల్లినైవేద్యము పెట్టుటకు వచ్చేసరికి మహాలక్ష్మి వెళ్ళి యెడ గలిగి నిలుచుండెను. అప్పుడు కూతురుచూచి “అదేమని” యడుగగా నీ చిన్నతనములో ఆడుకొనెడి సమయమున నీవు బొమ్మలను పెట్టుకొని ఆడుకొనుచుండగా యమ్మ చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేత నేను వెళ్ళిపోయినానని మహాలక్ష్మీ చెప్పెను. అయ్యో!నేరము వచ్చినది” అని అమ్మా! క్షమియించి ఈవలకివచ్చి నైవేద్యం పుచ్చుకొని వాండ్రకు భాగ్యమువచ్చేలాగు చేయవలసినదని కూతురు వేడుకొనగా నీతల్లి చెత నోము పట్టించమని చెప్పి మహాలక్ష్మీ యదృశ్యమయ్యెను. అప్పుడా చిన్నది తల్లిని మార్గశిర లక్ష్మీవారము నోమునోపించి పట్టిన వారము పులగము, రెండవవారము పరమాన్నము, మూడవవారము ముద్దకుడుములు, నాలుగవ వారము చిత్తాలు, కలమాన్నము వండి పుష్యమాసపువారము పూర్ణిమ కుడుములువండి తల్లిచేత నోమునోపించెను.

ఉద్యాపనము: నాలుగు వారములు నోము నోచుకొని కధ చెప్పి అక్షింతలు వేసుకొని ముత్తయిదువులను పెట్టుకొని నేతి పిండివంట వండుకొని నోము నోచు కొనవలయును.

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....