Friday, January 2, 2026

Streela Vrata Kathalu - స్త్రీల వ్రత కథలు

1. మోబేటి పద్మము (మూగనోము)






































































































Velaga Gowri Nomu Katha - వెలగ గౌరీ కథ

వెలగ గౌరీ కథ

వెలగ వెలగ అనరాదు - వేలుపెట్టి చూపరాదు
వెలగ చెట్టుయొక్క నీడకు వెళ్ళరాదు - వెలగపండు తినరాదు.

ఉద్యాపనము: పదమూడు జోడాల ముచ్చికలతోనున్న వెలగకాయలు తెచ్చి దక్షణ తాంబూలము, నల్లపూసలు, లక్కజోడు పెట్టి పదముగ్గురు ముత్తయిదువులకు యియ్యవలెను. 

Grama Kumkuma Nomu Katha - గ్రామ కుంకుమ నోము కథ

గ్రామ కుంకుమ నోము కథ

ఒక బ్రాహ్మణయువతి ప్రతిదినము గౌరినారాధించుచుండగ నొక దినమున గౌరి యామె స్వప్నమున కనపడి "అమ్మాయీ! నీ భర్తకు కొద్ది రోజులలో ప్రాణాపాయము కలగనున్నది. నీవు ఆ సమయంబునందు గ్రామకుంకుమ నోముపట్టి మధ్యలో వ్రతోల్లంఘనము చేయక పూర్తి చేసినచో నీ మంగళ సూత్రము శాశ్వతముగ నిలిచియుండు" నని చెప్పెను.

ఆమె అటులనే తన భర్తకు ప్రాణాపాయము సంభవింపనున్నదని కొనిన దినమున వీసె ఏబులం(కేజిన్నర), పసుపు, పసుపంత కుంకుమను కావిట్లలో వేయించుకొని పండ్లు పట్టుకొని వెళ్ళిగ్రామములో పంచిపెట్టు చుండెను. ఒక వీధిలో పంచి పెట్టెసరికి ఒక కొడుకువచ్చి "అమ్మా? నాన్నగారికి జబ్బుగానున్నది రమ్మ" ని చెప్పి పిలిచెను. అందుకామె "నాయనా! ఒక్కవిధి అయినద" ని చెప్పి రెండవ వీధికి పోయెను. అంత రెండవ కుమారుడువచ్చి "అమ్మా! నాన్నగారికి చాల జబ్బుగానున్నది రమ్మ" ని జెప్పెను. అప్పుడామె మూడవవీధికి వెడలి పంచి పెట్టసాగెను. అంతట మూడవకుమారుడు వచ్చి "అమ్మా! నాన్నగారిని క్రింద బడవేయుచున్నారు.రమ్మనగా-"ఇక రెండు వీధులున్నవి వచ్చెదనని" చెప్పి ఆమె నాలుగవ వీధికి వెళ్ళెను. నాల్గవ కుమారుడు వచ్చి అమ్మా నాన్నగారికి ప్రాణము పోయినదని చెప్పగా- యిక నొక్క వీధి యున్నదని చెప్పి యామె అయిదవ వీధికి వెళ్లి పంచిపెట్టుకొని, యింటికి వచ్చేసరికి భర్త దిగ్గునలేచి కూర్చుండెను. అప్పుడు ఊరందరు ఆశ్చర్యముతో అమ్మా! ఏమినోము పట్టినావు? ఏమి ప్రతము చేసినావని అడిగిరి. గ్రామకుంకుమ నోము పట్టి అది అయిదు వీధులను పంచిబెట్టుకొని వచ్చేసరికి వారు లేచి కూర్చున్నారని చెప్పినది.

ఉద్యాపనము :- వీసెయేబులం(1-1/2 Kg) కుంకుమ, వీసేయేబులం పసుపు పండ్లు ఊరిలో పంచి పెట్టుకోవలెను.

Poorna Aadivaramula Nomu Katha - పూర్ణాదివారము నోము కథ

పూర్ణాదివారము నోము కథ

ఒక రాజుకూతురు చిన్ననాటినుండి కడుపు శోకము కలిగినదై అయిదుగురు బిడ్డలను పోగొట్టుకొనెను. తరువాత ఆ దుఃఖము తాను భరించలేక అడవిలోకిపోయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించు చుండగా పార్వతీ పరమేశ్వరులామెకు ప్రత్యక్షమై యేమి యిట్లు విచారించుచు కూర్చున్నావని యామెనడిగిరి. అంత నామె "నాయనా! పుట్టిచచ్చిపోతున్న బిడ్డలతో పడలేక ఏడ్చుచున్నాను,”నని చెప్పగా పార్వతీ పరమేశ్వరులు - "నీవు క్రిందటి జన్మమున పూర్ణాదివారము నోముపట్టి ఉల్లంఘనము చేసినావు. ఆ కారణమున నీ దుఃఖము సంప్రాప్తమైనది. ఇప్పుడు తిరిగి నీవా నోముపట్టి కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని యుద్యాపనము చేసుకొన్న యెడల నీకీ దుఃఖము బోవునని చెప్పి అంతర్జానము నొందిరి. ఆ రాజకుమార్తెయు పార్వతీ పరమేశ్వరులు చెప్పిన ప్రకారము నోముపట్టి ఉద్యాపనము చేసుకొని అంతటి నుండి కడుపుశోకము లేనిదయ్యెను.

ఉద్యాపనము: కథ జెప్పి అక్షంతలు వేసికొని ప్రతి ఆదివారము ఒంటిపూట భోజనముచేసి ఒక ముత్తయిదువునకు తలంటి నీళ్ళుపోసి దక్షిణ తాంబూలము యిచ్చి అయిదు మానికల బియ్యము పూర్ణపు ఉండ్రములువండి వాయన మియ్యవలెను. 

Sokamuleni Somavaramu Katha - శోకములేని సోమవారము కథ

శోకములేని సోమవారము కథ

ఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులు, నొక కుమార్తెయు కలరు. అతడా కుమార్తెకు వివాహము చేయగా ఆమె మగడు దేశాంతరము వెళ్ళెను. అందుకా చిన్నది మిక్కిలి దుఃఖించుచుండెను. అట్లేడువగా ఏడువగా ఆయుసురు తగిలి ఆ బ్రాహ్మణునకు దరిద్రము వచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడొక చెరువు తవ్వించినాడు. కాని అందులో గంగపడలేదు. అందుకా బ్రాహ్మణుడు మిక్కిలి విచారించుచు భార్యతోగూడి తపస్సు చేయగా పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై ఎందుకు తపస్సు చేయుచున్నారని యడిగిరి. అప్పుడా బ్రాహ్మణుడు నాకొక్క కుమార్తెయున్నది. అది అస్తమానము యెడ్చుచుండును. దాని యుసురుతగిలి మాకు దరిద్రము సంటప్రాప్తమైనది. అందుచే చెరువు త్రవ్వించినాము. అందులో నీళ్ళుపడినవికావు.  అందుచేత తపస్సు చేయు చున్నామని జెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ పెద్దకొడుకును తీసుకొనివచ్చి ఈ తూమున కడ్డముగా వేసినట్లయితే యిందులో నీళ్ళు పడునని జెప్పిరి. బ్రాహ్మణుడు అందుకు వప్పుకొని పెద్దకొడుకును తీసుకొనివచ్చి తూమున కడ్డము వేయగా, వెంటనే గంగపడెను. తరువాత పార్వతీ పరమేశ్వరులు నీకూతురు క్రిందటి జన్మమున శోకములేని సోమవారము నోముపట్టి ఉల్లంఘనము చేసినది. ఆకారణముచేత నీయేడుపు వచ్చినది. ఇప్పుడు తిరుగ నోము పట్టించి కధ చెప్పి అక్షితలు వేసి ఏడాది సోమవారము ఒంటిపూట భోజనము పెట్టి ఎడాది అయిన తరువాత ఉద్యాపన చేయించవలసినదని చెప్పి అదృశ్యమైనది. ఆ బ్రాహ్మణుడు కూతురు నా ప్రకారము నోపించి ఉద్యాపన చేయించగా ఆమె మానెను. సంపద గలిగెను.

ఉద్యాపనము :- మానెడు సోలడు(1-1/4 Kg) బీయ్యము పులగము వండి అడుగు అట్టు పై అట్టు తీసి రవికెలగుడ్డ వాసెనకట్టి దక్షిణ తాంబూలము బెట్టి ముత్తయిదువకు వాయన మియ్యవలయును.

Margasira Lakshmi Varamu Katha - మార్గశిర లక్షివారము కథ

మార్గశిర లక్షివారము కథ

పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది. ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఆ సయమంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీ వారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహా లక్ష్మిని చేసి జిల్లేడు పూలతో, ఆకులతో పూజచేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం బెల్లం నైవేద్యంగా పెట్టేదికొన్నాళ్లకు సుశీల పెద్దదవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయింది. అప్పుడు కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూవచ్చింది. కానీ అత్తింట్లో మాత్రం నిత్య కల్యాణం.. పచ్చ తోరణమైంది.

అంతట నా సుశీల పుట్టింటి వారికి దరిద్రము వచ్చెను. ఆమె అత్తవారింటివద్ద సిరిసంపదలతో తులదూగుచు "పుట్టింటి వారికి దరిద్రము వచ్చెనిని తెలుసుకొని తోడబుట్టినవానికి కబురంపి ఒక కర్ర దొలిపించి ఆ కర్ర నిండా వరహాలుపోసి తమ్మునకిచ్చెను. అదిపట్టుకొని తమ్ముడు వెళ్ళుచు త్రోవలో కడుపునొప్పివచ్చి ఆ కర్ర చెట్టునకు జారవైచి కొంచెమావలికి వెళ్లెను. అంతట నాత్రోవ వెంబడి కొందరు వెళ్లుచు ఆ కర్రపట్టుకొని చక్కాబోయిరి. అప్పుడా బ్రాహ్మణ చిన్నవాడాకర్ర వెదకి యెందుగానక యింటికి వెళ్ళిపోయెను. 

తరువాత కొన్నాళ్ళకు తమ్ముని వర్తమానము తెలియక మరల నా చిన్నది కబురంపగా నా తమ్ముడు వచ్చెను. అతనిని గాంచి నాయనా స్థితి యెలాగున్నదిని యడుగగా"మునుపటి వలెనే యున్నదిని యాతడు చెప్పెను. అప్పుడామె యొక చెప్పుల జోడు కుట్టించి దాని నిండా వరహాలుపోసి అందులో గడ్డ పెట్టి ఈజోడు పట్టుకువెళ్ళి నాన్నకీయమని తమ్మునకిచ్చెను. అతడా చెప్పుల జోడు పుచ్చుకొని యొక చెరువు గట్టుదగ్గరకు వెళ్లుసరికి వానికి దాహమై యాజోడు నక్కడపెట్టి చెరువులోనికి వెళ్లెను. అప్పుడొక కుక్కవచ్చి అజోడెత్తుకొనిపోయెను. దాహము పుచ్చుకొని పైకివచ్చి మాతడు గట్టున పెట్టిన జోడునుగానక యింటికి వెళ్లెను. 

కొన్నాళ్ళకు తిరుగ వానిని అక్కగారు కబురంపగా నాతడు యూరికేగెను. యేమి "నాయనా! ఏలాగున్నది మీ స్థితియని" వానినడిగెను. ఎప్పటిలాగేయున్నదని యాతడు చెప్పెను. అప్పుడామె యొక గుమ్మడి కాయ దొలిపించి దానినిండా వరహాలుపోసి యది పట్టుకొని వెళ్లుమని తమ్మునికి కిచ్చెను. ఆ కాయ నతడు పట్టుకొనివచ్చి చెరువుగట్టుమీదబెట్టి కాళ్ళు కడుగుకొనుచుండగా నాదారిని పోవుచున్న కోమటి యొకడా కాయను పట్టుకొనిపోయెను. ఒడ్డునకువచ్చి కాయను కానక బ్రాహ్మణ బాలుడు తన యింటికిపోయెను. కోమటి తన యింటివద్దకు వెళ్ళి యాకాయను కొట్టగా యందువరహాలు నిండియుండెను.

అప్పుడా బ్రాహ్మణచిన్నది తన పుట్టింటివారి సంగతి యెట్టున్నరో తెలిసికుందామని యచ్చటికి వచ్చెను, వారు మిక్కిలి దరిద్రులై యుండిరి. అప్పుడామె తల్లిని తీసుకొని వెళ్ళి మార్గశిర లక్ష్మివారము నోము నోపించిన నింత యన్నము కలుగునని తలంచినదై యట్లు తల్లిని తీసుకొనివెళ్ళెను. ఇంటికి వెళ్ళిన తరువాత “అమ్మా! ఈ రోజున మార్గశిర లక్ష్మీవారము కాబట్టి నోట్లోయేమీ వేసుకొనవద్దని చెప్పెను. ఆమె సరే యని చెప్పి పిల్లలకు చద్దియన్నము పెట్టుచు నొక ముద్ద నోటిలో వేసికొనెను. అప్పుడు బ్రాహ్మణచిన్నది తల్లితో "అమ్మా! స్నానము చేయుము నోము నోచుకొందమని చెప్పగా తల్లి అయ్యో! పిల్లలకు అన్నము పెట్టుచు మరచిపోయి యొక ముద్ద నోట
వేసికొన్నానిని చెప్పెను. అప్పుడు చిన్నది ఇక నేవిధముగ చేతను వీండ్రకు భాగ్యము 
అంటదనుకొ”ని తాను మాత్రము నోచుకొన్నదట. 

అంతట రెండవవారము తల్లిని బిలిచి అమ్మా! ఈవేళ లక్ష్మివారము, నోట యేమీ వేసికొనకని చెప్పెను. అందుకామె అలాగేనని పిల్లలకు తలంటుచు ఆగిన్నెలో నూనె మిగులగా తలకు రాసుకొన్నదట. అంత కూతురు వచ్చి అమ్మా! స్నానము చేయుమని చెప్పగా అయ్యో అమ్మా! పిల్లలకు రాయగా మిగిలిన నూనెయుండ నాతలకు రాసుకొన్నానని చెప్పెను. పోనీలే యినచెప్పి తాను మాత్రము నోచుకొనెను. 

అంత మూడవవారము రాగా తల్లిని బిలిచి "అమ్మా! ఈవేళ లక్ష్మివారము నోటిలో నేమియు వేసికొనవద్దని చెప్పగా నామె 'యలాగే' యని పిల్లలకు తలదువ్వుచు తనతల దువ్వుకొని కొప్పు పెట్టుకొనెను. ఆ వారము కూడా తాను మాత్రమే నోచుకొని యాచిన్నది.  

నాల్గవ వారము రాగా గోయితీసి యందులో తల్లిని కూర్చుండబెట్టి బల్లమూత వేయించెను. పిల్లలందరు అరటిపండ్లు తిని యాతొక్కలు తీసుకొనిపోయి అమ్మా ! యిదిగోనని బల్లసందులో నుండి పడవేయగా నామె వానిని తిని వేసెను. అంత కూతురువచ్చి స్నానము చేయుమని చెప్పగా “అయ్యో! అమ్మాయీ అరటిపండు తొక్కలు తిన్నానని చెప్పెను. 

అయిదవ వారము చెంగుకు ముడివేసుకొని తానెక్కడికిబోయిన నక్కడికితీసికొనిపోవుచు, రెండుజాములైన తరువాత స్నానము చేయించి నోము నోపించెను. అప్పుడు పూర్ణపు కుడుములు వండి నైవేద్యము పెట్టుకొనిరి. కూతురు నైవేద్యము పెట్టుచుండగా ఊరుకొని తల్లినైవేద్యము పెట్టుటకు వచ్చేసరికి మహాలక్ష్మి వెళ్ళి యెడ గలిగి నిలుచుండెను. అప్పుడు కూతురుచూచి “అదేమని” యడుగగా నీ చిన్నతనములో ఆడుకొనెడి సమయమున నీవు బొమ్మలను పెట్టుకొని ఆడుకొనుచుండగా యమ్మ చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేత నేను వెళ్ళిపోయినానని మహాలక్ష్మీ చెప్పెను. అయ్యో!నేరము వచ్చినది” అని అమ్మా! క్షమియించి ఈవలకివచ్చి నైవేద్యం పుచ్చుకొని వాండ్రకు భాగ్యమువచ్చేలాగు చేయవలసినదని కూతురు వేడుకొనగా నీతల్లి చెత నోము పట్టించమని చెప్పి మహాలక్ష్మీ యదృశ్యమయ్యెను. అప్పుడా చిన్నది తల్లిని మార్గశిర లక్ష్మీవారము నోమునోపించి పట్టిన వారము పులగము, రెండవవారము పరమాన్నము, మూడవవారము ముద్దకుడుములు, నాలుగవ వారము చిత్తాలు, కలమాన్నము వండి పుష్యమాసపువారము పూర్ణిమ కుడుములువండి తల్లిచేత నోమునోపించెను.

ఉద్యాపనము: నాలుగు వారములు నోము నోచుకొని కధ చెప్పి అక్షింతలు వేసుకొని ముత్తయిదువులను పెట్టుకొని నేతి పిండివంట వండుకొని నోము నోచు కొనవలయును.

Sampada Sukravaram Nomu Katha - సంపద శుక్రవారము నోము కథ

సంపద శుక్రవారము నోము కథ

ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కుమారులు కలరు. వారందరు దరిద్రము చేత బాధపడుచుండిరి. ఒకనాడు ఉదయమున శుక్రవార మహాలక్ష్మి వచ్చి ముందుగా వారి పెద్దకోడలి యింటికి వెళ్లెను. ఆమె ప్రొద్దున్నే లేచి పిల్లలకు అన్నం పెట్టి తానుకూడా దినుచుండెను. అది సంపద శుక్రవార మహాలక్ష్మీ చూచి "ఛీ! వీరింటికేల వచ్చినాన" ని గిరుక్కున తిరిగివెళ్లి రెండవకోడలింటికి వెళ్లగా ఆమె చూడగా పేడచేసుకొనుచుండెను. "ఛీ! ఛీ! దీనింటి కేల వచ్చినాన" ని తిరిగి వెళ్ళి మహాలక్ష్మి
మూడవ కోడలి యింటికివెళ్ళగా ఆమె పాత గుడ్డలు కుట్టుచు కూర్చుండెను "ఛీ! దీనియింటికేల వచ్చితిన" నని మహాలక్ష్మీ నాలుగవ కోడలి యింటికి వెళ్లగా ఆమె పాచివాకిట గుంటలో వడ్లు పోసుకొని దంపుచుండెను. అదిచూచి మహాలక్ష్మి "ఛీ! దీనింటికేల వచ్చినాన" ని అయిదవ కోడలి యింటికివెళ్ళగా ఆమె ప్రొద్దున్నే తలదువ్వుకొనుచు కూర్చుండెను. ఆ మహాలక్ష్మి "ఛీ! దీనింటి కేలవచ్చినాని ఆరవకోడలి యింటికి వెళ్లగా ఆమె పాచివాకిటిలో నలుగురి పిల్లలకు తలంటి తాను తలంటుకొనుచుండెను. అది చూచి మహాలక్ష్మీ "ఛీ! దీనింటి కేలవచ్చినాన" ని ఏడవకోడలి ఇంటికి
వెళ్లగా ఆమె ఇల్లు అలుక్కొని, వాకిట కళ్లాపునుజల్లి, స్నానం చేసి, పసుపురాసుకొని, బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మీ ఆరుగు మీద కూర్చుని. ఆ మహాలక్ష్మి ఎవరమ్మా! ఇలారండని ఏడవ కోడలిని పిలువగా "అమ్మా! నా మగడు యాయవారమునకు వెళ్లినాడు. మాకు కట్టుకొనుటకు ఒకటే బట్ట అందుచేత నాబట్ట ఆయనకిచ్చి నేను తలుపు వెనుక కూర్చున్నాన" ని చెప్పగా మహాలక్ష్మి "అయితే యేమి ఇలారావమ్మా! కట్టుకొనుటకు బట్టనేను యిచ్చెదన" ని చెప్పెను. అట్లు చెప్పి తన కట్టుబట్టలో సగము చంపి యామెకిచ్చి అమ్మా నాకు సోలడు బియ్యముపెట్టి అన్నము వండిపెట్టు మని చెప్పెను. అందుకాయిల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చువరకు నింటబియ్యముండవని చెప్పింది. అప్పుడామె ‘‘శుక్రవారపు మహాలక్ష్మీ మాయింటికి వచ్చినది ఆమెకు ఇవి కావలెనని వర్తకులతో చెప్పి తీసుకురా’’ అని చెప్పింది. ఆమె కోమటి యింటికివెళ్ళి తనయింటికి శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినదని తెలిపి, పప్పుబియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్ధాలు ఇవ్వమని కోరగా, అతడు వాటినన్నిటిని యిచ్చెను. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకల వాని యింటిదగ్గర తెలగపిండిని నూనెను కంచరి యింటిదగ్గరి పాత్ర సామగ్రిని, సాలెవాని యింటిదగ్గర బట్టలను తీసుకుని యింటికివెళ్ళి నాలుగు పిండివంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మీకి వడ్డించెను.

అప్పుడా బ్రాహ్మణుడు ఎడమూట పెడమూట వేసుకొని మోయలేకుండగా నింటికివచ్చెను. ఇంటికి రాగానే భార్య వానికి భోజనము పెట్టెను. భోజనముచేసి బ్రాహ్మణుడు అవి యన్నియు నెలాగున వచ్చినవని భార్యనడిగెను. ఆమె మనపాలిటి శుక్రవార మహాలక్ష్మీ వచ్చినది అని అందరిని అడిగిపట్టుకొని వచ్చినానని చెప్పెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మీ తానింక వెళ్ళెదనని చెప్పగా ఆమె ఆరాత్రి భోజనంచేసి వెళ్ళవలసినదని కోరెను. అందులకామె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళెదననెను. అప్పుడా బ్రాహ్మణి "అమ్మా! ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు? రేపటి దినమున వెళ్ళవచ్చు" అనెను. అందుకామె సమ్మతించి, నిదురపోయి కొంతరాత్రికి లేచి, తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళివచ్చెదనని చెప్పెను. అందుకా బ్రాహ్మణి "చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు ఆ మూల కూర్చొను" మనెను. మహాలక్ష్మీ అట్లే నాలుగు మూలలందును కూర్చొ ని, తెల్లవారువేళకు మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని, యిల్లు బాగు చేయుటకు చీపురును, చేటను బట్టి గది మూలలను చూచెను. నట్టింట అన్నిచోట్ల బంగారుకుప్పలుండెను. అందు కామె ఆశ్చర్యపడి మహాసంతోషముతో నా సంగతి భర్తతో చెప్పి పాలచేత కడిగి, బంగారు కాసులు పళ్లెములో పెట్టుకొని నా పాలిట శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినది కనుక యీ భాగ్యము కలిగెనని శుక్రవారపు నోము పట్టుటకు మనస్సులో సంకల్పించుకొనెను. ఆలాగునుకొని నట్టింట నాలుగు మూలలు అలికి ముగ్గుపెట్టి తలదువ్వి బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని పయిమీదనే నీళ్ళుపోసుకొని మహాలక్ష్మీని పెట్టి నోము నోచుకొని కథను చెప్పి అక్షింతలు వేసికొనెను.

ఉద్యాపనము :- ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీని కొలిచి, ఒంటిపూట భోజనం చేయ వలెను. అట్లు అయిదేండ్లయిన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండ్రకు తలంటి నీళ్ళుపోసి భోజనం పెట్టి ఐదు రవికె గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవ లెను.

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...