కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది, విష్ణులోకాన్ని పొందుతారు’ అని స్కందపురాణం చెబుతున్నది. కార్తీకమాసం అనేక విశేషాల పవిత్రమైన మాసం.
ఈ మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని వెతుకుతుంటారు. దీనికోసం ఉసరి చెట్టు ఉన్న వనాల దగ్గరకు వెళతారు.
ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హిందూ సంప్రదాయం.
అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షమని అంటారు. దామోదరుడైన విష్ణుమూర్తికి ఇది ఎంతో ప్రీతికరమైనది. ఈ చెట్టును భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు.
అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షమని అంటారు. దామోదరుడైన విష్ణుమూర్తికి ఇది ఎంతో ప్రీతికరమైనది. ఈ చెట్టును భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు.
దేవదానవుల యుద్ధంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి, వాటినుంచి ఉసిరి చెట్టు పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తున్నది.
కార్తీక మాసంలో లక్ష్మీదేవి, నారాయణుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణుపురాణ కథనం. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించి దాని నీడలో వనభోజనాలు చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలితంతోపాటు క్షేత్రాలన్నిటిలో విష్ణుమూర్తిని అర్చించిన ఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతున్నది.
ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట.

వనభోజనానికి ముందు ఉసిరిచెట్టును పూజించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. తర్వాత చెట్టునీడలో వనభోజనాలు చేయాలి.
ఉసిరి అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం. ఉసిరి ఉత్పత్తులు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని చరక సంహిత చెబుతున్నది.
ఉసిరి అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం. ఉసిరి ఉత్పత్తులు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని చరక సంహిత చెబుతున్నది.
అపర సంజీవనిగా పేరున్న ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉసిరి చెంత వనభోజనాల వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
అంతేకాదు, పదిమందితో కలిసి చేసే వనభోజనాలు మనిషిలో సామాజిక స్పృహను పెంచుతాయి.
No comments:
Post a Comment