కార్తీకమాసం అంతా శివాలయాలు, విష్ణు ఆలయాలలో ఆధ్మాత్మిక భావనతో మారుమోగిపోతాయి. అభిషేక ప్రియుడైన శివయ్యకు అభిషేకాలు.. అలంకార ప్రియుడైన శ్రీ మహా విష్ణువుకు సర్వాలంకారాలతో పాటు విశిష్ట పూజలు జరుగుతాయి.
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకమాసం అంతా ప్రతీ రోజు ఆధ్మాకతతో నిండిపోతుంది.
ఉదయం లేచి మహిళలు కార్తీక స్నానాలు, దీపాలు, పూజలు, వ్రతాలు, పురాణ పఠనాలతో ఆధ్మాత్మిక భావనతో ఉంటారు. ప్రతీ ఇల్లు దీప కాంతులతో వెలిగిపోతుంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి చన్నీటి స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలి, దేవాలయాలకు వెళ్లి శివకేశవులను పూజిస్తారు.
దాన ధర్మాలు చేసి కుటుంబాలకు మేలు కలగాలని.. భర్త, పిల్లలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శివకేశవులను కోరుకుంటారు.
కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.
కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.
అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వి
ష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి పూలతో... శివునికి బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెబుతుంటారు.
కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయం, వైష్ణవ ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అనంతమైన ఫలాలు లభిస్తాయి.
కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయం, వైష్ణవ ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అనంతమైన ఫలాలు లభిస్తాయి.
శివాలయ గోపురాన్ని వీక్షిస్తే సాక్షాత్తు పరమశివుడే సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు.
శివాలయం గోపురం దర్శనం, శిఖర దర్శనం, శివలింగ సన్నిధిలో దీపారాధన చేస్తే అన్ని పాపాలు నశించిపోయి అనంత కోటి పుణ్యాలు కలుగుతాయని నమ్ముతారు.
కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, అవి అందుబాటులో లేకపోతే కనీసం ఆముదంతో గానీ దీపారాధ చేస్తే కోటి పుణ్యఫలాలు అందుతాయని పండితులు చెబుతున్నారు.
కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, అవి అందుబాటులో లేకపోతే కనీసం ఆముదంతో గానీ దీపారాధ చేస్తే కోటి పుణ్యఫలాలు అందుతాయని పండితులు చెబుతున్నారు.
అలా చేసినవారికి మోక్షం కలుగుతుందని శివ పురాణం చెబుతోంది. పూర్వ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగించే శక్తి.. కార్తీక మాసం పూజలకు ఉందని పండితులు చెబుతున్నారు.
కార్తీక మాసంలో ఏమీ అందుబాటులో లేకపోయినా ఎంత పేదవారైనా సరే, భక్తితో చిన్న దీపం వెలిగించి హృదపూర్వకంగా శివకేశవులను ప్రార్థిస్తే వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో ఏమీ అందుబాటులో లేకపోయినా ఎంత పేదవారైనా సరే, భక్తితో చిన్న దీపం వెలిగించి హృదపూర్వకంగా శివకేశవులను ప్రార్థిస్తే వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
పూజ చేసే విధానంలో నియమాలు ఉన్నా, భయభక్తులు మాత్రం అత్యంత ప్రధానమైనవని మర్చిపోకూడదు. భక్తి ఎప్పుడు మెప్పు కోసం కాదు మోక్షం కోసం చెయ్యాలి అని పెద్దలు చెబుతారు.
No comments:
Post a Comment