Monday, November 16, 2026

Karthika Month - Dhana Deepam - కార్తీక మాసం - ధనదీపం

కార్తీక మాసం - ధనదీపం

శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనది. 

ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 

ఈ క్రమంలోనే అందరూ శివాలయాలు, వైష్ణవాలయాల్లో, ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు. 

అలాకాకుండా కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు పెద్దలు.

పరమపవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. 

అయితే, అందులో భాగంగా ఈ మాసంలో ఏ రోజు అయినా సరే "ధనదీపం" పేరుతో ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే మీ గృహంలో లక్ష్మీదేవి ఆనందతాండవం చేస్తుందంటున్నారు. 

ఈ ధన దీపాన్నే "లక్ష్మీదీపం" అనే పేరుతో కూడా పిలుస్తుంటారని చెబుతున్నారు.

ఈ దీపాన్ని ఎలా వెలిగింలి ??

ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. 

అనంతరం అమ్మవారి చిత్రపటం ముందు శుభ్రంగా ఉన్న పూజకు సంబంధించి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఏర్పాటు చేసుకోవాలి. 

ఆ పళ్లెంకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆపై ఆ పళ్లెంలో గుప్పెడు బియ్యం పోసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. అలాగే అందులో ఒక గులాబీ పువ్వును ఉంచాలి.

ఆ తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. 

ఇప్పుడు రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో మూడు చొప్పున యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్లు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత రెండో మట్టి ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిద మీద ఉంచాలి. 

ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకోవాలి. అనంతరం అందులో రెండు లేదా మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి. అనంతరం దాన్ని ఏక హారతి లేదా ఆగరుబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే "ధనదీపం లేదా లక్ష్మీదీపం" పేరుతో పిలుస్తారు.

ఈ దీపాన్ని కార్తీకమాసంలో ఏ రోజు అయినా వెలిగించుకోవచ్చు. అలాకాకుండా "గురు లేదా శుక్రవారం" వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. 

అయితే, రెండో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించిన తర్వాత జవ్వాది అనే ఒక సుగంధద్రవ్యం వెలుగుతున్న దీపంలో కొద్దిగా వేయాలి. 

ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పును తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్లెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వునూ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి.



కార్తిక పురాణము

No comments:

Post a Comment

Prabodhini Ekadashi - Devutthana Ekadashi - ప్రబోధిని ఏకాదశి - దేవుత్తాన ఏకాదశి

ప్రబోధిని ఏకాదశి - దేవుత్తాన ఏకాదశి దేవుత్తాన ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, హరిబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో 24 ఏకాదశులల...