Thursday, November 28, 2024

చతుర్ధ భావ మందున్న గ్రహ ఫలితాలు

చతుర్ధ భావ మందున్న గ్రహ ఫలితాలు

1. జన్మ లగ్నము నుండి నాల్గవ రాశియే చతుర్ధ భావము. దీనినే మాతృ భావము, విద్యా స్థానము, క్షేత్ర-సుఖ-వాహన స్థానములనియు దెలియ వలెను. 
2. చతుర్ధ భావము ద్వారా - జాతకుని ప్రాపంచిక సుఖానుభవములు, విద్య, సుఖము, తల్లి, వాహనములు, భూములు, క్షేత్రములు, జయము, మాతృవర్గము, పితృధనము, గృహము, పశుసంపద, ఆయువు, నిధి నిక్షేపములు, కీర్త్, సముద్రయానము, శాస్త్ర పరిజ్ఞానము, బోధన, హృదయము, వక్షస్థలము, స్వభావం, స్నేహశీలత, జాతి, శయనము, జలొపద్రవములు, స్థాన చలనము, కృషి మొదలగు విషయములను గురించి తెలుసుకొనదగియున్నది. 
3. చతుర్ధ భావమున రవి యున్న - తండ్రికి వ్యతిరేకత, తల్లి సౌఖ్యము లోపించుట, పిత్రార్జిత ఆస్తి హాని, అస్థిరమైన నివాసము, భూవ్యయము, స్వల్ప సుఖ - భోగములు, హృదయ రోగము కల్గును. 
4. చంద్రుడు చతుర్ధమందున్న - బంధు మిత్రాధిక్యత, అధిక సంతానము, స్త్రీ-పుత్ర సుఖములు, బ్రాహ్మణ భక్తి, శిల్ప విద్యా ప్రవేశము, సేవకులు, వాహనము, విద్యా-గృహ సౌఖ్యములు కల్గును. క్షిణ చంద్రునిచే - దీనికి వ్యతిరేక ఫలితములు లుండగలవు. 
5. చతుర్ధములందు కుజుడున్న - దౌర్భల్యము, మూర్ఖత, సుఖలోపము, రోగము, దుఃఖము, పరగృహ భోజనము, బంధుద్వేషము, విద్యా విహీనత, దోషయుక్త గృహ నివాసము కల్గును. 
6. బుధుడు చతుర్ధ భావము నందున్న - పాండిత్యము, మాత్రుసుఖము, ధన-ధాన్య వృద్ధి, గీతా వాద్య ప్రయత్నములు కల్గును. 
7. గురువు చతుర్ధము నందున్న - బంధువులు, స్త్రీలు వస్త్రాభరణములు, పశులాభము, గోసంపద, రాజానుగ్రహము, భూమి, విద్య, సుఖ-సౌఖ్యములు, వాహనయోగములు ప్రాప్తించగలవు . 
8. చతుర్ధమునందు శుక్రుడుండిన - అధికారము, నిత్య ఐశ్వర్యము, అలంకార గృహము, సర్వజన ప్రియత్వము, అధిక కామాసక్తి, సంగీత-సాహిత్య ప్రకాశము, వాహన యోగములు కల్గును. 
9. శని చతుర్ధము నందున్న - స్త్రీ, బంధు, సేవకులు లేకుండుట;నిలకడ లోపించుట, వసతి కొరకు ఇబ్బందులు, మాతృ సౌక్య హాని; స్వగృహము లేకుండుట, భునష్టము, సుఖలోపములు కల్గును. 
10. రాహువు చతుర్ధము నందున్న - గ్రామవాసము నీచ స్నేహము, పురాతన - శిధిల గృహ వాసము, జీర్ణ వస్త్రధారణ, మతి భ్రమ, స్వల్ప భూవసతి, వాహన రాహిత్యము, బంధు ద్వేషము కల్గును. 
11. చతుర్ధము నందు కేతువున్న - మాతృ సౌఖ్య హీనత, మిత్రాభిమాన దురత్వము, పిత్రార్జిత నష్టము, తొందరపాటు, దేశద్రిమ్మరితనము కల్గును.

విద్యాయోగములు 

1. చతుర్ధ భావము, చతుర్ధాదిపతి, విద్యాకారక గ్రహముల బలాబలముల ద్వారా విద్యాయోగము ప్రాప్తించగలధు.
2. లగ్న, ద్వితీయ, చతుర్ధాధిపతులైన గ్రహములు 6-8-12 స్థానపతుల నైసర్గిక పాప గ్రహముల సంబంధములు కలుగక; 1-4-5-7-9-10 స్థానముల యందున్న - విద్య యందు అసమాన ప్రతిభ కల్గును.
3. చంద్ర-శుక్రులు కలసి గాని, శుక్రుడోక్కడేగానీ 1-4-7-10 స్థానముల యందున్న - విద్యా యోగము కల్గును
4. లాభాదిపత్యముగల శుక్రుడు చతుర్ధము నందున్న - విద్యావంతులులగుదురు.
5. చతుర్దాధిపతి 6-8-12 స్థానముల యందుండి, పాప గ్రహ సంబంధము కల్గియున్న - స్వల్ప విద్య కల్గును.
6. చతుర్దాధిపతి 1-4-7-10 స్థానముల యందుండి, బుధుడు ఉచ్చనంది, చంద్ర లగ్నమునకు 1-4-7-10 స్థానములలో శుక్రుడుండిన - గొప్ప విద్యా వంతుడు కాగలడు .
7.సంపూర్ణ బలముగల గురువు ద్వితీయము నందున్న, భాగ్యాధిపతి బలీయ నవాంశయందున్నను - వేద విద్యావేత్తయగును. శాస్త్రాభిలాషి కాగలడు.

మాతృ సౌఖ్య యోగములు 

1. క్షీణచంద్రుడు -6-8 స్థానముల యందుండుట; చంద్ర లగ్నము నుండి - 7 వ స్థానంలో కుజ - శనులుండుట; చతుర్ధ భావమునందు పాప గ్రహములుండి; శుభ సంబంధము లేకుండుట వలన - మాత్రుభావము నిర్వీర్యము కాగలదు. 
2. చతుర్దాధిపతి 6-8-12 స్థానము లందున్న తల్లి నిందితురాలు కాగలదు.
3. షష్టాధిపతి శని కలసి చతుర్ధ భావము నందున్న జాతకుని తల్లి శిలశంకితురాలు కాగలదు 
4. షష్టాధిపతి - నైసర్గిక పాపగ్రహమై, మరొక నైసర్గిక పాపగ్రహముతో గలసి చతుర్థము నందున్నను, రాహు దృష్టి నందినను తల్లి శీలము లోపించి యుండగలదు.
5. జన్మ లగ్నమును నుండిగానీ, పూర్ణచంద్ర లగ్నము నుండిగానీ 8 వ స్థానాధిపతీ, చతుర్ధ స్థానాధిపతీ ఇతర పాపగ్రహములతో గలసి యున్న జాతకుని తల్లి జారిణి యగును.
6. దశమాధిపతి బలయుక్తుడై, లగ్నము నందున్న - జాతకుని తల్లి పతివ్రత కాగలదు.
7. చతుర్ధాధిపతి - శుభగ్రహములతో గలసియుండి, రవి ద్రుష్టి నందిన - తల్లి పతివ్రత యగును.
8. చతుర్ధాధిపతి- చతుర్ధముందుండి, లగ్నాధిపతిచే చూడబడుచున్న లేక శుభగ్రహ యుక్తుడైయున్న - తల్లి ప్రేమకు పాత్రుడు కాగలడు.
9. చతుర్ధాధిపత్యము గల గురువు 1-9-10 స్థానములందు బలయుక్తుడై యుండి, చంద్రదృష్టి నందిన - మాతృసౌఖ్యము ప్రాప్తించగలదు.
10. చతుర్ధాధిపత్యము గల పూర్ణచంద్రుడు - చతుర్థము లేక మిత్ర క్షేత్రము లందున్న తల్లికి సుఖము కలిగించు వాడగును.
11. చతుర్ధాధిపతి- శుభగ్రహమై, గురునితో గలసి 1-4-5-7-9-10 స్థానములందున్న - తల్లికి విశేష సుఖము ప్రాప్తించగలదు.
12. లగ్న దశమాధిపతులు పరస్పర మిత్రులై యుండి, శుభగ్రహ సంబంధము కల్గిన - తల్లి జాతకునియందు బహు ప్రేమగలదయి యుండును.
13. చతుర్ధాధిపతితో కలిసియున్న లగ్నాధిపతికి - 6-11 స్థానాధిపతుల ద్రుష్టి కల్గిననూ లేక ఇతర పాపగ్రహముల దృష్టి కల్గిననూ - తల్లితో శత్రుత్వము కల్గును.
14. మాతృకారక గ్రహము (పగలు - శుక్రుడు, రాత్రి - చంద్రుడు) బలము కల్గి శుభగ్రహ దృష్టి నంది, శుభాంశయందున్ననూ లేక లగ్నాదిగా 7 వ స్థానము శుభగ్రహ రాశియై యున్ననూ - తల్లికి దీర్ఘాయువు కల్గును.
15. చతుర్ధ భావమునందు శనియుండి, శుభగ్రహములచే చూడబడుచుండిన - తల్లికి దీర్ఘాయువు కల్గును.
16. మాతృకారక గ్రహము - నైసర్గిక పాపగ్రహములతోగలసి    స్థానము నందున్న - తల్లికి అల్పాయువు కలుగును.
17. చతుర్ధమునందున్న శనికి పాపగ్రహముల దృష్టియున్న యెడల - త్వరితముగా మాతృవియోగము కల్గును.
18. లగ్నమునందు - కుజుడూ, వ్యయము (12వ స్థానం)న గురువు యుండి, మిగిలిన శుభగ్రహములన్నియు 6వ స్థానము నందున్న - తల్లి జీవింపదు.
19. రవి, కుజ, శనులు 6-8 స్థానము లందున్న - తల్లికి అరిష్టము కల్గును.
20. వృశ్చికాంశయందు జన్మించిన జాతకుని తల్లికి - స్తన్యములు శుష్క్రించును.
21. చంద్రుడు - తృతీయాధిపతితో గలసి 6-8-12 స్థానములయందున్న - జాతకుడు అన్యస్త్రీ స్తన్యపానము వలన పెరుగును.
22. చతుర్ధమందున్న పాపగ్రహమునకు శుభగ్రహ ద్రుష్టి లేకున్న - ఆ పాపగ్రహ దశాంతర్దశల యందు మాతృమారకము సంభవించగలదు.

భూ - గ్రహ యోగములు 

01. గ్రహమునకు - గురు-శుక్రులూ, భూములు, స్థలములు, వన క్షేత్రములకు - కుజుడూ కారక గ్రహములు కాగలరు. 
02. చతుర్ధాధిపతి - 10 వ స్థానమందు, దశమాధిపతి - 4 వ స్థానమందూ యుండి, కుజుడు బలీయుడై యున్న - పంటలు పండు అనేక భూములు వుండగలవు. 
03. చతుర్ధ - దశమాధిపతులకు - అధిమిత్రస్థితి కల్గిన గ్రహములు బలవంతులై యున్న - పెక్కు భూము లుండగలవు.
04. లగ్న - చతుర్ధాధిపతులు - పరస్పర భావములందు (ఏ ఒక్కరైనను)బలము కల్గియుండి, శుభగ్రహ ద్రుష్టి నందిన - స్వార్జిత భూము లేర్పడగలవు. 
05. శుభ స్థానములందు - చతుర్ధ - తృతీయాధిపతు లిరువురు కలసి యుండిన - అనేక క్షేత్రములు ప్రాప్తించును. 
06. చతుర్ధమునందు శుక్రుడుండి, చతుర్ధాధిపతి 7 వ స్థానమందుండి ఇరువురికి అదిమిత్ర స్థితి కల్గిన - భార్య ద్వారా క్షేత్ర లాభము లుండగలవు. 
07. చతుర్ధ - సప్తమాధిపతులు - సప్తమ - చతుర్ధములందు పరివర్తన పొందియున్న భార్యద్వారా భూములు ప్రాప్తించగలవు.
08. చతుర్ధాధిపతికి 6-8-12 స్థానములు గాక మిగిలిన ఏ భావాధిపతుల సంబంధము బలవత్తరముగా నుండునో ఆ భావ సంబంధమగు భూ లాభముండగలదు. 
09  చతుర్ధాధిపతి పాపగ్రహములతో గలసి ద్వితీయము నందున్నను లేకనీచ శత్రురాశుల యందున్నను, ఉచ్చయందుండి పాపగ్రహములతో గలసినను భూ వ్యయము కాగలదు.
10. దశమాధిపతి పాపగ్రహములతో గలసి చతుర్ధము నందున్న పూర్వార్జిత భూములన్నియు నష్టపడగలరు.
11. చతుర్దభావమునందు పాపగ్రహములున్నను పాపగ్రహ మాధ్యమందు భావస్థితియున్నను, భావమునకు అధిక పాపసంభంధము కల్గినను భావాధిపతికి కూడా యిటులనే పాప దృగ్యోగాది సంబంధములు కల్గినను కారకుడు పాపాధిక సంబంధముల నందినను సమస్త భూసంపదలు నష్టపడగలవు. 
12. లగ్నాధిపతికి- ఉచ్చ స్వక్షేత్ర, మూల, త్రికోణ, మిత్ర, క్షేత్ర స్థితి యందు చతుర్ధాధిపతి కలయిక; శుభ గ్రహ సంబంధములు వున్న యెడల తన ప్రయత్నము లేకనే గృహ మేర్పడగలదు. 
13. చతుర్ధాధిపతి - నవాంశ చక్రము నందే రాశిలో నుండునో రాశి చక్రమునందు లగ్నాదిగా 1-4-7-10 స్థానముల యందున్న గృహ మేర్పడగలదు. 
14. చతుర్ధాధిపతి ఉచ్ఛయందుండి, భాగ్యాధిపతి 1-4-7-10 స్థానముల యందున్నచిత్రమైన గృహము ప్రాప్తించగలదు. 
15. శనికి దశమాధిపత్యము కల్గి చతుర్ధాధిపతితో కలసి 1-4-7-10 స్థానముల యందున్న యెడల ప్రకారము గల మెడలు కలుగగలవు.
16. చతుర్ధాధిపతిగాని గృహకారక గ్రహముగాని ద్వితీయాధిపతి లేక లాభాధిపతితో కలసి శుభాగ్రహ  దృష్టినందియున్న సంపదలతో గూడిన గృహము ప్రాప్తించగలదు. 
17. చతుర్థ భావము చరరాశియై యుండి, చతుర్ధాధిపతియును చరరాశియందు శుభాగ్రహ దృష్టి కల్గియున్న- విదేశములందు గృహ యోగము కల్గును. 
18. చతుర్థము చరరాశియై చతుర్ధాధిపతి గృహకారక గ్రహము చర రాశులలో నుండిన అనేక స్థలములందు గృహములు  ఏర్పడగలవు. 
19. 2-4-12 రాశుల అధిపతులు కలసి 1-4-6-7-9-10 స్థానములందున్న చక్కని గృహ యోగము కల్గును. 
20. 1-7 రాశ్యాధిపతులు కలసి లగ్న- చతుర్థ స్థానములందున్నగృహ లాభముండును. 
21. చతుర్థ- దశమాధిపతులు కలసి, 1-4-7-10 స్థానములందుడి శని కేంద్ర స్దాన స్థిరుడై యుండిన గొప్ప గృహము నిర్మించ గలరు 
22. చతుర్ధాధిపతి 8వ స్థానమందుండి, పాప గ్రహ వీక్షితుడైన గృహ నాశనము సంభవించగలదు. 
23. అంశ చక్రమునందు రవి-రాహువులకు కుజ దృష్టి కల్గిన గృహము దగ్ధము కాగలదు.
24. రవి 1-4-5-7-9-10 స్థానములందున్న- గృహము శిధిలమగును.
25. జన్మ లగ్న, అంశ లగ్నములలో బలయుక్తమగు లగ్నమునకు చతుర్ధ స్థానమందు చంద్ర - శుక్రులున్న - ఉన్నత గృహ యోగం కలదు, శని - రాహువులున్న పాషాణ గృహ యోగంగలదు, కుజ - కేతువులున్న ఇటుకలచే నిర్మించు గృహముండును, గురువున్న - కఱ్ఱల ఇల్లు, రవి యున్న - రెల్లుగడ్డి లేక గడ్డి ఇల్లు కల్గును. 
26. లగ్న చతుర్ధాధిపతులుగలసి, చతుర్ధమందుండి వారిలో ఒకరికి ఆ రాశి ఉచ్చగాను, రెండవ వారికి మిత్ర క్షేత్రముగాను నుండిన అకస్మాత్ గృహ లాభయోగము కల్గును.
27. లగ్న, ద్వితీయ, చతుర్ధాధిపతిలలో ఎంతమంది 1-4-5-7-9-10 స్థానములయందుందురో అన్ని గృహ యోగము లుండగలవు. 

వాహన యోగములు 

01. వాహన కారక గ్రహము - శుక్రుడు. ఈ గ్రహము దుష్ట లక్షణములు లేకుండా బలము కలిగియుండిన వాహన యోగములు కల్గు అవకాశములున్నవి. 
02. చతుర్ధ స్థానాధిపతి బలము కల్గియుండి, చతుర్ధ స్థానమందు శుభ గ్రహములున్న యెడల వాహన సిద్ధి కలుగగలదు. 
03. చతుర్ధాధిపతి 9వ స్థానమందుండి; సప్తమాధిపతి, శుక్రుడు కలసి 1-4-5-7-9-10 స్థానముల యందున్న వాహన యోగము ప్రాప్తించగలదు. 
04. గురువు లగ్నమునుండి; చతుర్ధాధిపతి, శుక్రుడు కలసి, శుభ స్థానముల యందున్న వాహన యోగము కల్గును. 
05. ద్వితీయాధిపతికి లగ్నస్థితీ, రాజ్యాధిపతికి ద్వితీయస్థితీ కల్గి; చతుర్థము నందొక ఉచ్చనందిన గ్రహమున్న - అనేక వాహనములకు అధిపతి కాగలడు. 
06. లగ్నాధిపతికి - కేంద్రస్థానములందు చతుర్ధాధిపతియు, చతుర్ధాధిపతికి కేంద్రములందు
( 1-4-7-10 స్థానముల ) నవమాధిపతియు యుండి; లగ్నాధిపతి బలయుక్తుడైయున్న అనేక వాహనములకు అధిపతిగాగాని వాటి కధికారిగా గాని యుండగలరు. 
07. చతుర్ధ భావమందు పూర్ణచంద్రుడుండి, శుక్రవీక్షితుడైన నౌక వ్యాపారము సంభవించగలదు. 
08. చంద్ర శుక్రులు పరస్పర ద్రుష్టి గలవాడైనను, లేక చంద్రునికి తృతీయమందు శుక్రుడున్నను - నిరంతర వాహన సంచారి కాగలడు. 
09. చంద్ర - చతుర్ధాధిపతులుగాని, లగ్నాదిపతులుగానీ కలసి; లగ్నమందున్న - వాహనయోగ ముండగలదు. 
10. చతుర్ధాధిపతి - గురువుతోగాని, శుక్రుడితోగని కలసి లగ్నమందున్న - పల్లకీ యోగముండును. 
11. లగ్న - దశమాధిపతులు, లగ్న - దశమములందు పరివర్తన కల్గియున్న - అనేక వాహనములుండగలవు. 
12. చతుర్ధాధిపతి, గురు-చంద్ర-శుక్రులతో గలసి; కేంద్ర కోణంలందున్న - ఉన్నత వాహన యోగము కల్గును. 
13. రాజ్యాధిపతి (10 వ స్థానం)- చతుర్ధమునందుండగా శుక్రుడు పరమోచ్చ భాగాలయందుండిన ఉన్నత పదవులు కల్గి, ఎచ్చటికి వెళ్లినను మంగళ వాద్యములతో సన్మానించ బడుచుండగలడు. 
14. చతుర్ధాధిపతి, 6-8-12 స్థానములందుండి, పాపగ్రహ ద్రుష్టి కల్గిన - వాహనభంగము వాటిల్లును. 
15. చతుర్ద భావమునందు - 6-8-12 స్థానాధిపతులుండి, శుక్రుడు పాపగ్రహ ద్రుష్టినందిన వాహనభంగము కల్గును. 
16. శుక్రుడు 6 వ స్థానము, చతుర్ధాధిపతి 8 వ స్థానము, దశమాధిపతి 12 వ స్థానము లందుండి; చతుర్ధమందు పాపగ్రహములున్న - వాహన గండములు కల్గును. 
17. చతుర్ధాంశాధిపతి - శుక్రునితో గలసి, 8 వ స్థానమందుండి; కుజ వీక్షితులైన యెడల లేక అష్టమాధిపతిదృష్టి కల్గియుండిన - వాహనముల ద్వారా మృత్యువు సంభవించును.  

సుఖ యోగములు

01. చతుర్ధ భావమునకు చంద్ర & శుక్రుల సంభంధముచే సుఖము కల్గును. 
02. చతుర్ధాధిపతి -వృషభ, మిధున, కర్కాటక, కన్య, తులా, ధనుర్ రాశుల యందున్న లేక ఆ నవాంశలు కల్గియున్న - జాతకునికి సుఖ జీవనమగును. 
03. లగ్నాధిపతి - ఉచ్చ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రము లందుండి; శుభ సంబంధము పొందియున్న - జాతకుడు జీవితాంతము సుఖియగును. 
04. లగ్నాధిపతి - గురునితో కలసి 1-4-7-10 స్థానములందున్న - జాతకుని యౌవనకాలము సుఖమయము కాగలదు. 
05. లగ్నమునందు శుక్రుడున్న - జీవితములోని మొదటి భాగం సుఖవంతమగును. 
06. 9 వ స్థానమునుండి 12 వ స్థానము వరకు గల స్థానములలో - శుభ గ్రహములన్నియు నుండిన - జీవితాంతమునందు సుఖపడగలడు. 
07. 5 గ్రహములు స్వక్షేత్రము లందున్న - గొప్ప సుఖము ప్రాప్తించగలదు. 
08. లగ్నాధిపతి బలము కలిగియుండి, గురువు 1-4-7-10 వ స్థానము యందున్న - బాల్యదశలో సుఖము అనుభవించగలడు. 
09. శుభగ్రహములు (గురు-శుక్రులు)- 1-11-12 స్థానములందున్న ప్రౌఢదశ వరకు సుఖ భోగములు ప్రాప్తించగలవు. 
10. లగ్నమునందు - ఒక శుభగ్రహమూ, ద్వితీయమునందొక పాప ఉండి; 4-7-10 స్థానములలోను పాపగ్రహములుండి; లగ్నాధిపతి ఉత్తమాంశ మందున్న - ప్రారంభ జీవితమునందు కష్టములు, చివరి జీవితమునందు - సుఖములు ప్రాప్తించగలవు.
11. నవమాధిపతి 1-4-7-10 స్థానములందున్న - బాల్యములో సుఖముండును. 
12. భాగ్యాధిపతి (9 వ అధిపతి)- 5-9 స్థానములలోగాని లేక స్వక్షేత్ర ఉచ్ఛరాశులయందు గానీ యున్న - మధ్య వయసులో సుఖము కల్గును. 
13. లగ్నము నుండి 5 స్థానం వరకు బాల్య దశను,  6 నుండి 9 వరకు మధ్యమ వయసును, 
10 -11-12 చివరి జీవితమును సూచించినదైయున్నది. 
14. లగ్నాధిపతి ద్వితీయం మందున్నను లేక తన నవాంశంమందున్నను; అదే వవిధముగా  లాభాధిపతి- ద్వితీయమందున్నను లేక లగ్నాధిపతి నవాంశమందున్నను- 20 సంవత్సరముల పిమ్మట సుఖయోగము కలుగును. 
15. అంశ చక్రము నందు లగ్నాధిపతి యున్న రాజ్యాధిపతి- రాశి చక్రంలో ఉచ్చనందిననూ,  కేంద్ర కోణములందున్ననూ 20 సంవత్సరములు తర్వాత సుఖ యోగము ప్రాప్తించును. 
16. లగ్నాధిపతి శుభారాశి యదుండి, అధిక శుభ సంబంధములు కలిగియున్న 16 సంవత్సరముల తరువాత సుఖ యోగము కలుగును. 
17. వ్యాయాధిపతికి- శుభ సంబంధము కలిగి; ఉచ్చయందు గానీ శుభ వర్గులయందుగాని యుండిన- హంస తూలికా తల్పమునందుశయన సుఖము ప్రాప్తించగలదు. 
18. వ్యాయాధిపతికి- పాపవర్గులు, నీచ; లగ్నాధిపతికి షష్ఠాష్టమ వ్యయ స్థితి, పాప దృష్టి; చతుర్ధాధిపతికి- పాప సంబంధము, పాపక్షేత్ర స్థితి; శుక్రునికి దుష్టస్థానస్థితి వలన -సుఖ నాశనము కాగలదు. 

చతుర్ధ భావము వల్ల కలుగు ఇతర యోగములు

01. లగ్నాధిపతి, చతుర్దాతుపతులూ - పరస్పర మిత్రులైన అనేకమంది స్నేహితులు ఉండగలరు. 
02. చతుర్ధ భావమునకు- శుభగ్రహ సంబంధముండి, కారకుడు బల యుక్తుడైన బంధు పూజితుడు కాగలడు. 
03. ఏ గ్రహముకైనను చతుర్ధము ఉచ్చస్థానమై ఆ గ్రహమందుండి- గురువును వీక్షిస్తూ ఉన్న- బంధువులచే పూజింపబడగలరు. 
04. చతుర్దమున- గురుడుండి, చతుర్ధాధిపతి- గురు దృష్టి నందినను లేక శుభ గ్రహములతో కలిసియున్నను- బందు సమృద్ధి యుండగలదు. 
05. చతుర్ధాధిపతి- పాపదృష్టి నందక, కేంద్ర కోణముల యందున్న- బంధువుల  కుపకారియగును. 
06. చతుర్ధమునందు- పాప గ్రహములున్నను, చతుర్ధాధిపతి- నీచ అస్తంగతములను జెందిననూ  బంధుద్వేషి కాగలడు. 
07. లగ్నాధిపతికి, చతుర్ధాధిపతికి, నవమాధిపతికి- నీచ-అస్తంగత శత్రు క్షేత్ర దోషములు లేకయుండి; దశమస్థాన మందుండగా దశమాధిపతి లగ్నస్థితుడై యున్న ఎడల- సింహాసన యోగము కలుగును లేదా గొప్ప పదవి అలంకరించగలడు. 
08. చతుర్ధాధిపతికి- 5- 9 రాశ్యాధిపతుల కలయిక, వారి దృష్టి -రాజ్య ప్రాప్తి ఇవ్వగలదు. 
09. చతుర్ధము నందు -రవి గాని, క్షీణచంద్రుడు గాని యుండిన- క్షణిక కపటికాగలడు. 
10. నవాంశ చక్రమునందు  చతుర్ధాధిపతియున్న రాశ్యాధిపతి సప్తమాధిపతి యొక్క దృష్టి నందియున్న -జలగండములు ప్రాప్తించగలవు. 
11. చతుర్దమున నీచనందిన గ్రహముండి, చతుర్ధాధిపతి 6 స్థానంలోనూ, కుజుడు 12వ స్థానంలోనూ నుండిన -జాతకుడు మూగవాడగును. 
12. పంచమున రవి-బుధ-రాహువు ఉన్నను, ద్వితీయమునందు రవి-బుధులున్నను జ్యోతిష్య- వైద్య విద్యలు తెలిసినవాడగును. 
13. తుల యందు చంద్రుడునున్న- జ్యోతిష్యము, ద్వితీయమున శుక్రుడున్న -కవిత్వము వచ్చును. 
14. చతుర్దబావమందు అనేక పాప గ్రహములున్నను, బహు పాప గ్రహములు చతుర్ధమును చూచుచున్నాను, అట్టి గ్రహ స్థితియందు గురు-శుక్ర-చంద్రులు బలరహితులై యున్న- జాతకుడు తల్లిని పొందువాడవును మరియు పాపకార్యాసక్తుడు, దుర్మార్గుడు కాగలడు. 
15. లగ్నాధిపతి 6-8-12 స్థానములందు నీచయందున్న- శయన సుఖము లోపించగలదు. 
16. వ్యాయాధిపతి పాపసంబంధము కలిగి, శుభ సంబంధము లేక యున్న శయన  సుఖముండదు. 
17. వ్యాయాధిపతి పాపియై శుభవర్గులయందున్నను; లగ్నాధిపతి మందీగుళికులతో కలిసి యున్నను శయన సుఖముండదు. 
18. లగ్న వ్యయములందు పాప గ్రహములు 4 వ స్థానమున కుజుడు, 5 స్థానమున రవి-బుధ-రాహువులు, 8 స్థానమును శని యుండిన -గొప్ప దుఃఖములు ప్రార్థించగలవు. 
19. వ్యాయమందు పాప గ్రహములుండి గురువు, బలహీనుడైన -దుఃఖములు కలుగును.  
20. దశమాధిపతి పాపగ్రహములతో గలసినను,  నీచ నందినను- ధనమెంత యున్నను దుఃఖములు తప్పవు. 


పంచమ భావము నందున్న గ్రహ ఫలితాలు

పంచమ భావము నందున్న గ్రహ ఫలితాలు

01. జన్మ లగ్నము నుండి 5వ రాశి పంచమ భావము.  దీనిని పుత్ర భావము, మంత్రస్థానం, లక్ష్మీస్థానము, మనస్తానమనియు అందురు.
02. పంచమ భావము ద్వారా జాతకుని యొక్క బుద్ధి, వివేకము, పుత్ర సంతతి, జ్ఞాపకశక్తి, సంతోషము, మాట నేర్పు, కళాభినివేశము, లలిత కళలు, గ్రంథ రచనాశక్తి, వ్యూహ నిర్మాణము, మంత్రి పదవి, మంత్రోపాసన, దేవతా ప్రసన్నము, ఆటలు, వ్యాపారము, వ్రాతయందు నేర్పు, భవిష్యత్ జన్మకు సంబంధించిన విషయములు, మెదడు, పొట్ట, గర్భస్రావము, దత్త విషయములు, పితృభాగ్యము అను విషయములను గురించి తెలుసుకోనవలెను.
03. పంచమ భావమునకు గురువు కారక గ్రహము. ఇందు బుద్ధికి సంబంధించిన విషయములకు చంద్రుని; సంతాష, అధికారాది విషయములకు శుక్రుని కారక గ్రహముగా గ్రహించవలెను.
04. పంచవ భావము నందు శుభగ్రహములుండి, గురుదృష్టి కలిగి పంచమాధిపతి శుభస్థానములందు శుభ సంబంధాదికుడై ఉండుట వల్ల -భావ ఫలితములు వృద్ధికరముగా ఉండగలవు.
05. భావాధిపతికి పాప సంబంధము, పాపస్థితి భావమున పాప గ్రహములుండుట, గురుడు పాప సంబంధాధికృత నందుట వలన -బావ ఫలితములు అనయు చెడిపోగలవు.
06. పంచమ భావము నందు రవియున్న -కుశాగ్ర బుద్ధి, మంత్రి, విద్యా పరిజ్ఞానము, మోసము, అధిక కోపము, స్వల్ప భోగము, ఏకపుత్ర సంతానము, అట్టి సంతానము వలన బాధలు, బాల్య దశయందు దుఃఖము, యవ్వన దశయందు కష్టములు, భుజరోగములచే మృత్యవు కలుగును.
07. చంద్రుడు పూర్ణ కళలు కలిగి, పంచముమందున్న -విశేషధన- సుఖ -, స్త్రీ సంతానాదిక్యత, పుత్ర ప్రాప్తి, మాతృ నష్టము కలుగ గలవు. క్షీణ చంద్రడున్న -కుటుంబ సౌఖ్యము, స్వల్ప భోగము, స్త్రీ సంతతి, చంచల. స్వభావములు కలుగును.
08. పంచమ భావము నందు కుజుడున్న -పుత్ర హీనత, ధనలోపము, దుఃఖము, కఠిన హృదయము, నేర్పు గలిగిన వ్యాపారము కలుగును.
09. కుజుడు పంచమ భావం లోనుండిన- తీవ్రమైన వాంఛ అధికము, నిదానముండదు. దుస్సాహస ఉండగలదు. ప్రేమ- ద్వేషము కూడా అధికముగా ఉంటది. ప్రతీకార వాంఛ, పగ, ద్వే, దీర్ఘ కోపము, చొరవ, సాహసము అహింస భావము, కఠినవర్తిన గాడమగు వస్తువులు, తమోగుణ ప్రధానమగు ఫలితము ఉండగలవు.
10. పంచమంలో కుజునతో ఏ గ్రహము గలసిన -ఆ గ్రహకారక ఫలితములు తీవ్రతరము కలిగి యుంటవి.
11. పంచమ భావములో బుధుడున్న- సంతాన సుఖము, పుత్ర భాగ్యము, చక్కని ముఖము, స్త్రీ సంతానాదిక్యత, భోగము, ఐహిక వాంఛలు, లోతైన హృదయము, అన్ని విషయములందు మంచి చెడ్డలు గ్రహింపగల శక్తి, వ్యవహార జ్ఞానము, ఉపాయము, యుక్తి, విజ్ఞానము, విమర్శనాశక్తి, క్రయ-విక్రయ నైపుణ్యము, పుస్తక ప్రచురణలు కలుగ గలవు.
12. పంచమంలో గల బుదునికి రవి మరియు శుభగ్రహముల కలయిక వల్ల -శుభ ఫలాభివృద్ధి యుండును. శని మొదలగు వ్యతిరేక పాప గ్రహముల కలయిక వల్ల -అశుభ ఫలితములు అధికముగా ఉండగలవు. 
13. గురుడు పంచమ భావం లో నుండుట వల్ల -శరీర కాంతి, ఆరోగ్యము, పుత్ర సంతానాధిక్యత, సత్కళత్రము, మంచి స్నేహితులు, కీర్తి, ఆనందము, నిర్మల హృదయము, దైవభక్తి,  ఆధ్యాత్మిక- జ్ఞాన విషయాను, భక్తి, ధర్మవృద్ది, మంత్ర శాస్త్ర ప్రావీణ్యము, ధన-వాహన-సుఖములు ప్రార్థించగలవు. 
14. శుక్రుడు పంచమ మందున్న శాంతము, సద్గుణము, స్వల్పపుత్ర సంతానము, స్త్రీ  సంతానాదిక్యత, ఐహిక సుఖ-భోగములు, దాతృత్వము, బందు-మిత్ర పుణ్యత, ధన సమృద్ధి, అధికారము, స్త్రీ లోలత, భోగము, భాగ్య వర్ధనము ఉండగలవు. 
15. పంచమంలో శనియున్న-నిధానము, ప్రేమ వ్యవహారములందు విఫలము, మానసిక బాధలు, నిరాశ, విరక్తి, కార్యాటంకములు, నిరాడంబరత, ఐహిక సుఖహీనత, బాల్యంలో బంధు నష్టము, అనారోగ్యము, కళత్రము, సంతానహీనత లేక సంతాన నష్టముల ద్వారా విచారము (రోగగ్రస్త సంతాన ప్రాప్తి) సామాన్య జీవితము కలుగును. 
16. పంచమ భావం శనికి నీచ స్థానమైనను, శత్రు స్థానమైనను సంతతిని నశింపజేయును. ఉచ్చ, మిత్ర స్థాన, ఉచ్చాOశలైనా-స్వల్పసంతతి కలుగును. 
17. రాహువు పంచమంలో నుండిన-మలిన సంతానము, దీనత్వము, అవ్యక్త మనోవేదన, అస్థిర బుద్ధి కలుగును. ఈ రాహువునకు పంచమంలో పాప గ్రహ సంబంధములు కలిగిన వయసు పైబడిన కొలది మానసిక బాధలు, అశాంతి, దేహ జాడ్జ్యాములు,  ఆశాభంగము, మనోచాంచల్యము, ఆటంకములు, కష్ట-నష్టములు కలువ గలవు.
18. పంచమంలో కేతువున్న-పుత్రవిచారము, మంత్ర శాస్త్ర-రసవాద విద్యా ప్రవేశము, గణిత శాస్త్ర పరిజ్ఞానము, వ్రాతయందు నేర్పు, జన కలహము, పితృద్వేషము, తత్వ విచారము, ఐహికామూష్మిక సుఖములు కలుగును. 
19. పంచమ భావంలో గురు-శుక్రులు కలిసి ఉన్న- అధిక పురుష సంతానము, శని-శుక్రులు కలిసి ఉన్న అధిక స్త్రీ సంతానము ఉండగలదు. 

సంతాన యోగములు 

01. పంచమాధిపతి 9 స్థానమందు, నవమాధిపతి పంచమ స్థానమందు ఉన్నను లేక పంచమ-నవమాధిపతులకు పరస్పర దృగ్యోగాది సంబంధములున్నను ముగ్గురు పుత్రులు కలుగు గలరు. 
02. భాగ్యాధిపతి లేక పంచమాధిపతి ఏకాదశ స్థానంలో బలయుక్తులై ఉన్న- నలుగురు పుత్రులు కల్గెదరు. 
03. కుటుంబ (2 స్థానము) లగ్నాధిపతులు పరస్పర దృగ్యోగాది సంబంధములు కలిగి యుండి, పంచమంలో శుక్రుడు ఉన్న- ప్రధమమున పుత్ర సంతానము కలుగును. 
04. పంచమంలో గల కేతువునకు గురు-శుక్ర సంబంధము కలిగిన- స్త్రీ పురుష సంతానము సమముగా నుండును. 
05. పంచమాధిపతి ఉచ్చయందుండి, లగ్నాధిపతితో గలసిన- ఒక పుత్రుడు, ఒక పుత్రిక కలుగ గలరు. 
06. పంచమంలో గురువు, 9 స్థానంలో రవి యుండి; శనికి అయిదవ రాశిలో రాహువు ఉన్న- ఏకపుత్ర సంతానము కలుగును. 
07. పంచము శుభగ్రహ సంబంధము కలిగి, 9 స్థానంలో శుక్రుడు, తృతీయంలో రవియున్న యెడల- వివాహమైన వెంటనే (అతి తక్కువ కాలంలో) పుత్రుడు జన్మించగలడు.
08. జన్మ లగ్నాధిపతి బలము కలిగియుండి, 9వ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్రుడు ఉన్న యెడల- 24వ సంవత్సరమందు పుత్ర సంతతి కలుగును. 
09. పంచమ స్థానములో పాపగ్రహములుండి, గురువుకు పంచమంలో శనియున్న యెడల- మూడవ భార్య ద్వారా సంతతి కలుగును. 
10. పంచమాధిపతిగానీ, లగ్నాధిపతిగానీ 2-3 స్థానములందున్న- మొదట పురుష సంతతి కలుగును. 
11. పంచమాధిపతి యున్న రాశికి 5-7-11 రాశులలో లగ్నాధిపతి యున్నను- మొదట పురుష సంతతి ప్రాప్తించును.
12. పంచమ, సప్తమ స్థానములందు బలముగల రవి-శనితో గలసియున్న- మొదట పుత్రుడు, తర్వాత పుత్రిక కలుగగలరు. 
13. తృతీయంలో పురుష గ్రహముండి, పూర్ణచంద్ర దృష్టి నందిన- ప్రధమంగా స్త్రీ సంతతి ప్రార్థించగలదు. 
14. పంచమాధిపతి 4 వ స్థానమందున్న- మొదట పుత్రిక, తదుపరి పుత్రుడు జన్మించగలరు. 
15. గురువు కర్కాటక రాశి యందున్న- ఒకే ఒక స్త్రీ సంతానముండును. అట్లే ధనస్సునందున్న- పాపసంతతి, మీనమందున్న- స్వల్పసంతతి కలుగును. 
16. జన్మ లగ్నము ధనస్సు, మీనములుగా నుండి; గురువు కర్కాటకమునందున్న- పుత్ర సంతతి యుండును.  అయినను ఆశ్లేష 2 పాదము నందు గురుసంచారమున్న- ఏక పుత్రుడు కలుగును. 
17. చంద్రుడు పంచమంలోగానీ, కర్కాటకంలోగానీ యుండిన- స్వల్ప స్త్రీ సంతతి మాత్రమే యుండును. 
18. ధనస్సు, మకర, మీనా లగ్నములుగల వారికి పంచమంలో రాహువుగానీ, కేతువుగానీ యుండిన- త్వరగా సంతతి కలుగును. 
19. పంచమంలో పాప గ్రహములు, దశమంలో శుభగ్రహములు ఉండి; లగ్న, పంచమ, నవమాధిపతులు శుభగ్రహముల సంబంధికులై 6-8-12 స్థానములందున్న- ఆలస్యముగా సంతానము కలుగును. 
20. పంచమంలో చంద్ర-శుక్రులు ఉండి, 11వ స్థానంలో పాప గ్రహములు ఉన్న- మొదట స్త్రీ సంతానం కలుగును. 
21. పంచమ స్థానం బలహీనమైయుండి, 11వ స్థానంలో రాహువున్న- వార్ధక్యంలో సంతాన ప్రాప్తి కలుగును. 
22. జాతకము నందు సంతానయోగము లుండి, పంచమంలో శని మాత్రమే ఉన్న- బహుకాలమునకు సంతానము కలుగును. 

సంతాన నష్ట యోగములు 

01. పంచమంలోనున్న రవికి పాప గ్రహ దృష్టి కలిగిన- గర్భస్రావము. 
02. పంచమంలో గల కుజునికి పాపగ్రహ దృష్టియున్న- గర్భస్రావము కలుగును. 
03. ద్వితీయాధిపతికి పంచమంలోనూ, పంచమాధిపతి ద్వితీయంలో నుండిన- కలిగిన సంతానంలో స్త్రీ సంతతి నశించగలదు. 
04. పంచమాధిపతి పాపగ్రహ దృష్టి కలిగి 6-8-12 స్థానములందున్న- పుత్ర నష్టము కలుగును. 
05. కన్యా లగ్నమై, అందు రవి ఉండి, పంచమంలో కుజుడున్న- పుత్ర నష్టము కలుగును. 
06. వ్యయస్తానమున శుభులు-పాపులు నగు గ్రహములున్ననూ లేక గురువుకు రాహు సంబంధం కలిగిననూ - పుత్ర సంతాన నష్టం ఉండును. 
07. పంచమాధిపతి నీచ, అస్తంగత, పాప స్థానస్థితి, పాపాంశస్థితి  కలిగి యున్న- సంతాన నష్టము కలుగును. 
08. పంచమంలో సప్తమాధిపతి, సప్తమంలో పంచమాధిపతి ఉండి; శుభగ్రహ సంబంధము లేకయున్న- అధిక సంతాన నష్టములు ఉండగలవు. 
09. బుధుడు లగ్నాధిపతితో గలసి, 4-7-10 స్థానములందుండిన- వంశాంకురముండదు. 
10. లగ్నమందు చంద్ర-గురువులు, సప్తమముందు శని లేక కుజుడున్న- వంశము నిలువదు. 
11. పంచమాధిపతి పాప గ్రహములతో గలసియున్న- మొదట కలిగిన సంతానము నశించి తరువాత సంతానము జీవింప గలదు. 
12. పంచమాధిపతి 12వ స్థానంలో శుభ బలాదికుడైయున్న- జన్మించిన పుత్రుడు కొంతకాలము పెరిగి, తర్వాత నశించగలడు. 
13. కుజుడు, శనులు నీచస్థితి యందున్న- సంతాన నష్టం ఉండును. 
14. పంచమ-సప్తమాధిపతులు దుష్ట స్థానములలో కలిసియుండి, పాప గ్రహ వీక్షణ నందుతున్న- సంతానముతో కూడా భార్యయు నశించగలదు. 

నిస్సంతానా యోగములు

01. పంచమంలో శని లేక రాహువు ఉండి, పాపగ్రహ దృష్టి నందిన- సంతానము కలుగదు. 
02. దశమాధిపతి వ్యయంలో, వ్యాయాధిపతి దశమంలో ఉన్నప్పుడు గానీ; పంచమ స్థానాధిపతి పాపగ్రహ మధ్యగతుడై, శుభగ్రహ సంబంధములు లేనప్పుడుగాని- సంతానము ప్రార్థించదు. 
03. ద్వితీయ-పంచమాధిపతులు పాపగ్రహ దృష్టి కలిగి, పంచమంలోనున్ననూ లేక సప్తమ భావమునకు కుజ-శుక్రులు దృష్టి కలయిక వంటి సంబంధములు కలుగకున్ననూ సంతానయోగం ఉండదు. 
04. పంచమంలో చంద్ర దృష్టి కలిగిన శనియుండి; పంచమాధిపతి రాహువు కలిసియున్న- సర్పశాప దోషము కలిగి సంతతి కలుగదు. 
05. పుత్రకారక గ్రహము, రాహువు కలసిఉండి; పంచమాధిపతి కుజుడున్న అంశాధిపతితో గలసిన- నాగదోషము చే సంతతి కలుగదు. 
06. పంచమాధిపతి గురువు-కుజులతో గలసియుండి; లగ్నాధిపతి, రాహువులు 6-8-12 స్థానములందున్న సంతాన ప్రాప్తి ఉండదు. 
07. పంచమంలో గురువు ఉండి, 9 స్థానంలో పాప గ్రహములు ఉన్న- సంతతి ఉండదు. 
08. లగ్నంలో రవి, సప్తమంలో శనియున్న- సంతాన ప్రాప్తి కాటంకములు కలుగును. 
09. సప్తమంలో రవి-శనులుండ, దశమ భావమునకు గురు దృష్టియున్న సంతానము కలుగదు. 
10. శని 10, కుజుడు 9 స్థానములందున్నను; 11వ స్థానంలో శని, చంద్రులున్నను; 7వ స్థానంలో శని, శుక్రులున్ననూ- సంతానం ఉండదు. 
11. 5-9 స్థానములలో పాప గ్రహములతో గలసి గురువున్న-సంతానము కలుగదు. 
12. వ్యాయాధిపతి లగ్న దశమ స్థానములందున్న- నిస్సంతానము. 
13. 8వ స్థానంలో చంద్రుడు ఉండి, పంచమ-భాగ్యాధిపతులు 6-8-12 స్థానములందున్న సంతానహీనత ఉండును. 
14. సింహ-మకర-కుంభములు అష్టమ స్థానముగానుండి; అందు రవిగాని, శని గాని యుండిన- భార్య గర్భము ధరించదు. 
15. జన్మ లగ్నమందు శనియూ, సప్తమంలో-పాప గ్రహములతో గలసి శుక్రుడు ఉండి; దశమంలో గురువుండుట లేక చూచుట కలిగిన -భార్య గర్భము ధరించదు. 
16. పంచమంలో మూడు పాప గ్రహములు ఉన్నను, లేక పంచమ భావానికి మూడు పాప గ్రహ వీక్షణలు కలిగినను, లేక పంచమాధిపతి యొక్క శత్రు గ్రహములచే పంచమం చూపబడుచున్ననూ- నిసందేహముగా సంతానం ఉండదు. 

అన్య సంతాన యోగములు 

01. పంచమంలో గల రాహువు బలహీనుడైయున్న- అన్యపురుషుని వలన సంతానము కలుగును. 
02. లగ్నాధిపతి చతుర్ధమందు, చతుర్ధాధిపతి లగ్నము నందు ఉండి; వారిలో ఒకరికైనను రాహు కేతు సంబంధం కలిగిన జారసంతానము కలుగును. 
03. స్వాతి నక్షత్ర యుక్త, విదియ, ఆదివారము నందు గాని, రేవతి నక్షత్ర యుక్త, సప్తమి, సోమవారము నందు గాని, ధనిష్టా నక్షత్రము గల ద్వాదశీ ఆదివారమునందు గాని పుట్టిన వారు బావసంతానముగా చెప్పనగును. 
04. విధియా, సప్తమ, ద్వాదశీ తిధులయందు; పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల జననము- అన్యపురుష సంపర్కమువల్ల కలుగును. 
05. పాపగ్రహ సంబంధాధీకులై, రవి-చంద్రులు కలిసి ఉన్న- బావసంతతి అనవచ్చును. 
06. అంశచక్రంలో- కేతువునకు బుధ-శుక్రులు దృష్టి కలిగియున్నను; శుక్రునికి పాపగ్రహ దృగ్యోగాది సంబంధములుండి, వ్యయంమందున్నను దాసీపుత్రులు కాగలరు.

దత్తపుత్ర యోగములు 

01. రాజ్య భావమూ, అందలి గ్రహస్థితి, రాజ్యాధిపతి అనునవి దత్తపుత్ర విషయంలో ప్రాధాన్యత నంది యుండును. 
02. 6-8-12 స్థానాల్లో రవి నీచ-శత్రు క్షేత్ర స్థితి కలిగి యున్న దత్తపుత్ర ప్రాప్తి. 
03. మకర-కుంభములు, మిధున-కన్యలు పంచమ స్థానముగానుండి అందు శని గుళికులను దత్తపుత్ర యోగము కలుగును. 
04. పంచమంలో శని-కుజులు ఉండి, మకరంలో బుదుడుండిన దత్తపుత్ర యోగము. 
05. లగ్నమున శని 4వ స్థానంలో రాహువుయుండుట; పంచమంలో శని బుధులిద్దరూ నుండుట లేక చూచుట; దశమంలో శనియుండుట, చూచుట లేక దశమాధిపతిని శని చూచుట, కలయుట కలిగియున్న- దత్తతకు వెళ్ళుటగాని లేక తాను మరొకరిని దత్తపుత్రునిగా స్వీకరించుట గాని కలుగును. 
06. పంచమంలో చంద్రుడు పాపగ్రహములతో గలసియుండి, చతుర్ధంలో శని-కుజులున్న యెడల దత్తతకు వెళ్ళును. 
07. పంచమంలో శని-చంద్ర-బుధులున్న ధనము చే కొనబడినవాడు పుత్రుడగును. 
08. పంచమము చరరాశియై, పంచమాధిపతి చరరాశి యందుండగా- పంచమ, పంచమాధిపతులకు శని దృష్టి కలిగిన దత్తపుత్రుడు కాగలడు. 
09. లగ్నమునకు 5-9 స్థానములందు శని-శుక్ర-బుధ-కుజులు గలసియుండి, చంద్ర-రాహువు సంబంధము లేకుండిన దత్తపుత్ర యోగము ప్రాప్తించగలదు. 

కవలల యోగము 

01. పంచమాధిపతి పురుష గ్రహమై బుద్ధునితో గలసియున్న మూడవ కాన్పు, లేక ఆపై కాన్పుల యందు కవల పిల్లలు జన్మించగలరు. 
02. లగ్నము, చంద్ర లగ్నము, మేషాదిగా సమసంఖ్య గల రాశులుగానుండి, బలముగల గ్రహము చే చూపబడుచున్న కవలలు జన్మించాదరు. 
03. లగ్నాధిపతి, తృతీయాధిపతి, రాహువు కలిసి ఉన్న యెడల కవలలు బుట్టెదరు. 
04. లగ్నమందు తృతీయాధిపతి, తృతీయమందు లగ్నాధిపతి యున్న ఎడల కవల పిల్లలు జన్మించగలరు. 
05. లగ్నాధిపతి పాపగ్రహములతో గలసి దశమ భావమందుండి, లగ్నమందు రాహువుండి, ఇతర స్థానములలో ఎక్కడైనను నాలుగు గ్రహములు కలిసియున్న యెడల; ఇద్దరూ లేక అంతకు మించిన శిశువులు జన్మించగలరు. 
06. 9వ స్థానాధిపతి- రవి కలసి పంచమ-నవమ స్థానములందుండి, 6-8-12 స్థానాధిపతుల సంబంధం కలిగియున్నను, లేక శత్రు గ్రహ సంబంధం కలిగియున్నను, జాతకుడు గర్భమునందుండగానే తండ్రి మరణించగలరు. 
07. గురువు పంచమాధిపతి వచ్చునందియు,న్న జాతకుని సంతానము భాగ్యవంతులు కాగలరు. 
08. లగ్న రాజ్యాధిపతులు గలసి 5వ స్థానమందున్నను- గురువునకు 5వ స్థానంలో పాప గ్రహమునున్నను తను గన్న సంతానము వలన సుఖము కలుగదు. 
09. లగ్న-పంచమాధిపతులు పరస్పర స్థానములందు పరివర్తనులై యున్న, జాతకుడు పుత్రునికి వశపడి ఉండగలడు. 
10. పంచమాధిపతి బలహీనుడై-లగ్నాధిపతి చూడబడుచున్నాను, లేక కుజ రాహువుల విక్షణ కలిగియున్నను, సంతానము చే నిందింపబడగలరు. 
11. లగ్న-చతుర్ధ-పంచమములందు పాప గ్రహములతో గలసి బుధుడున్న, పుత్ర సుఖం ఉండదు. 
12. పంచమాధిపతి 4-7-10 స్థానములందు పాపులతో కలిసియున్న దైవసేవచే సంతాన ప్రాప్తి. 
13. లగ్న-పంచమాధిపతులకుగాని- లగ్న, భాగ్యాధిపతులకుగాని పరివర్తన కలిగిన; జాతకుడుగానీ, అతడి పుత్రుడుగాని, ఒకరే జీవించి ఉండగలరు. 
14. లగ్న, తృతీయాధిపతులు బలవంతులై పాపగ్రహములతో జేరియున్న, సవతి సోదరులుండగలరు. 
15. చంద్ర-కుజులు ఏకరాశి యందుండి, తృతీయాధిపతి పాపగ్రహములతో కలిసి ఉన్న, సవతి తల్లికి సంతాన ప్రాప్తియుండును. 
16. తృతీయాధిపతికి లాభ స్థానంలో 11వ స్థానాధిపతి యుండిన సవతి తల్లికి సంతతి కలుగును. 

మంత్ర - దేవత - ఉపాసన యోగములు

01. పంచమ భావమునకు బలయుక్తమకు పురుష గ్రహ సంబంధము వలన పురుషదేవతో పాసనము, బలముగల స్త్రీ గ్రహ సంబంధము చే స్త్రీ దేవతోపాసనము ప్రార్థించగలవు. 
02. అంశ చక్రము నందు 5-9 స్థానములలో పాప గ్రహములుండి, శుభగ్రహ దృష్టి నందిన ఎడల, తా నుపాసించు దేవత యొక్క అనుగ్రహం నందును. 
03. పంచమ భావము నందు బలయుక్తులైన, ఆయా గ్రహములకు స్థితి కలిగిన, ఈ తెలుపబోవు విధముగా దైవ-మంత్రోపాసనలు ప్రాప్తించగలవు. 
    రవి వలన శివోపాసన, చంద్రుని వలన గౌరీ-పార్వతి, యక్షిణి దేవతలు; కుజుని వలన కుమారస్వామి, వీరభద్రుడు, భైరవుడు; బుధుడున్న సరస్వతి, హయగ్రీవుడు, దక్షిణామూర్తి; గురువున్న విష్ణువు, (విష్ణువు అవతార విశేషములు); శుక్రుడున్న చాముండా, దుర్గా; శనియున్న క్షుద్ర దేవతలు; రాహుకేతువులు ఉన్న పరపీడాకర శక్తులు ఉపాసించగలరు. 
04. ఉగ్రమగు పురుష దేవతోపాసనలు ప్రాప్తించుటకు, రవి కుజ గురుల కలయిక- ఉగ్ర స్త్రీ దేవతోపాసనకు శని, కుజ, శుక్రుల కలయిక పంచమములో కలిగి ఉండాలి. 
05. అంశ లగ్నమై ఉన్న రాశి నుండి రాశి చక్రంలో 5-9 స్థానాలలో రెండు పాప గ్రహములు ఉన్నను, ఆ కోణ  స్థానములను పాప గ్రహవీక్షణలు కలిగినను భూత- పిశాచాది పీడ గ్రహములను వశము గావించుకొను భూత మాంత్రికుడు కాగలడు. 
06. మంత్ర కారకగ్రహము 1-4-5-7-9 10 స్థానము నందు శుభగ్రహ నవాంశల యందుండి, బుధా-శుక్రుల ద్రుగ్యోగాది సంబంధములు కలిగియున్న, తన ఉపాసనాబలము వలన జరగబోవు సమస్త విషయములను తెలుపగల సమర్ధుడు కాగలడు. 
07. కేంద్ర స్థానము లందు చంద్రుడు బలము కలిగి, శుభగ్రహ దృష్టి నంది యుండి, పంచమాధిపతి ఉచ్చ- మిత్ర క్షేత్రములందు శుభసంబంధీకుడైయున్న ఎడల త్రికాల వేత్త కాగలడు. 
08. అంశ చక్రమునందు శుక్ర-కేతువులు ఒకరికొకరు చూచుకొనుచున్న యాజ్ఞీ కత్వము   ప్రాప్తించగలదు. 
09. చంద్రుడు-శని కలసి పంచమ స్థానంలో బలవంతులైయుండిన, గొప్ప మేధావులై -దైవ రహస్యముల నెరుంగు శక్తి గలవారగుదురు. 
10. పంచమాధిపతి నీచ నంది, మంత్రకారక గ్రహము శత్రు క్షేత్రము యందుండి, నవమ స్థానము నందు నైసర్గిక పాపగ్రహములున్న; మంత్ర శక్తిచే పరులను హింసించగలడు. 
11. పంచమ, నవములందు 6-8-12 స్థానాధిపతిలుండి, మంత్ర కారక లగ్నాధిపతులు కలసి 8వ స్థానము నందున్న, పరక్రియ మంత్ర శక్తిచే ప్రాణములు కోల్పోవును. 

పాండిత్య ప్రతిభ యోగములు

01. కేంద్ర కోణ స్థానముల యందున్న, గురువు బుధుని చూచుచున్న- వేదాంత ప్రతిభ యుండగలదు. 
02. బుధుడు-కుజుడు కలసి మకరము లేక కుంభమునందుండి రవిదృష్టినందిన, గొప్ప విద్వాంసులతో వాదించగల విద్యా ప్రతిభ కలుగును. 
03. గురువు బలవంతుడై, రవి-శుక్రుల దృష్టినంది స్వక్షేత్రమందుండిన (అంశ లగ్నమునకు ద్వితీయంలో), వ్యాకరణ శాస్త్ర ప్రతిభ కలుగును. 
04. అంశ చక్రమునందు గురు, బుదు లిరువురు కలసి 2-3-5 స్థానములందున్న, మీమాంస శాస్త్రాచార్యత్వము కలుగును. 
05. అంశ చక్రంలో చంద్రుడు-గురువు కలసి 2-9-5 స్థానముల యందున్న, సాంఖ్య యాగాదులలో ప్రతిభావంతులు కాగలరు. 
06. అంశ చక్రంలో గురుచంద్రులు పాపగ్రహములతో గలసి పంచమరాశి యందున్న గ్రంథములు రచించి ప్రతిభ గాంచును. 
07. అంశ చక్రమునందు గురు-కేతువులు కలసి 2-3-5 స్థానములందున్న గణిత విజయం అందు సమాన ప్రతిభ కలుగును విద్య యందు అసమాన ప్రతిభ కలుగును. 
08. 2-3 రెండు మూడు స్థానములందు బుధ-శుక్రులున్న యెడల జ్యోతిష్య ప్రతిభ కలుగును. 
09. ద్వితీయ రాశి యందు గురుడు ఉచ్చనందియుండి, ద్వితీయాధిపతి బలవంతుడైయున్న జ్యోతిష్య విద్య యందు అసమాన ప్రతిభావంతులు కాగలరు. 
10. చంద్రుడున్న రాశికి 5-9 రాశుల యందు గురువు ఉండి, బుధుడున్న రాశికి 5-9 రాశులలో కుజుడుండిన, సమస్త విద్యాపాండిత్య ప్రకర్ష కలుగును. 
11. గురువునకుగానీ, శుక్రునకుగాని ద్వితీయాధిపత్యంకలిగి రవి, కుజుల యతి వీక్షణాది సంబంధముల నంది యుండిన తార్కికుడై ప్రతిభగాంచగలడు. 
12. గురు-శుక్రలలో నే ఒక్కరైనను 5-9 స్థానములందు ఉచ్చనందియున్న గొప్ప తార్కికూడగును. 
13. గురు శనులు, గురు రాహువులు, గురు కేతువులు కలిసియున్నప్పుడు వారికి శుక్రుని దృష్టి కలిగిన, జాతకుడు గొప్ప విద్యా ప్రతిభా కలవాడగును. 
14. రాశి చక్రమందు శుభలతోడను, అంశ చక్రమునందు పాపుల తోడను కలిసి ఉన్న, రవి రాహువుల వలన విష వైద్య చికిత్స ప్రతిభ కలుగును. 
15. అంశ చక్రము నందు చంద్ర-బుధ-శుక్రులకు పరస్పర దృష్టి కలిగిన వైద్యుడిగా వాసికెక్కును. 
16. సంపూర్ణ బలము కల గురువు ద్వితీయమునందుండి, నవమాధిపతి నవాంశయందున్న వేద పండితుడు కాగలరు. 
17. పంచమాధిపతి 6వ స్థానము నందున్న, విద్యా ప్రతిభ యుండును. 

బుద్ధి స్వభావ యోగములు

01. పంచమాధిపతి ఉచ్చనంది- గురువు కేంద్ర కోణము లందున్నను, పంచమాధిపతి కేంద్ర కోణములందుండి- బుధుడు పంచమమందున్నను జాతకుడు సద్భుద్ది గలవాడగును. 
02. పంచమంలో రవి చంద్రులున్న చంచల బుద్ధి కలుగును. 
03. ద్వితీయమునందు శుభగ్రహములుండి, బలహీనులుగు పాప గ్రహములచే చూడబడుచున్న- చపల చిత్తముండగలదు. 
04. చంద్రుడు జన్మలగ్నమునందుండి, శని-కుజుల దృష్టినందిన- బుద్ధి కుశలత లోపించగలదు. 
05. చంద్రుడే రాశి యందున్నను వానికి రవి-కుజ, శనుల దృష్టి కలిగినను -మూర్ఖత్త అధికము. 
06.శుక్రుని దృష్టి దృష్టి కలిగిన చంద్రుడు 6-8-12 స్థానములందున్న- ఆశ్చర్యకరముగు స్వభావము గలవాడగును. 
07. గురునితో గుడి శని-చంద్రులు 1-4-7-10 స్థానములందున్న, బుద్ధిమాందవ్య ముండగలదు. 
08. పాప గ్రహ సంబంధము గల గురువు పంచమమందున్నను, లేక పాప గ్రహ దృష్టి కలిగి బలహీనుడైయున్నను- తెలివిహీనుడగును. 
09. పంచమాధిపతికి- చంద్రునికి, లేక తృతీయాధిపతికి- చంద్రునికి షష్టాష్టక స్థితి కలిగియున్న, మతిలేక తిరుగుచుండగలడు. 
10. రాశి చక్ర- అంశ చక్రములందు చంద్రుడు నీచ స్థితియందున్నను, రాహు-కేతువులతో కలసి యున్నను, నిరంతర ఆందోళన లుండును. 
11. క్షీణచంద్రునికి కుజుని దృష్టి కలిగిన దుష్ట బుద్ధి, కఠిన స్వభావి కాగలరడు.
12. బుధునికి-గురునికి సమసప్తక స్థితి కలుగుట- లేక శుక్ర దృష్టి గల చంద్రుడు తృతీయము నందుండుట వలన హాస్య స్వభావి కాగలడు. 
13. పంచమంలో కుజుడుండిన అహంకారి కాగలడు. 

ఉన్మాద యోగములు

01. 12వ స్థానంలో రవి-బుధులుండి, పంచమాధిపతి నీచనందిన పిచ్చి కలుగును.
02. లగ్నమందు గురువు-సప్తమమందు కుజుడుండి చంద్రుడు నీచనందిన పిచ్చి కలుగును. 
03. శని-కుజులు కలసి లగ్న-సప్తమ స్థానములందున్న ఉన్మాదచేష్టలుండును. 
04. వ్యయమందు క్షీణ చంద్ర-రాహువులుండి, అష్టమంలో శుభగ్రహములున్న యెడల, జాతకునికి ఉన్మాదం కలుగును. 
05. దశమాధిపతి-శని, కుజుడు కలసి సప్తమమందున్న, తీవ్ర పిచ్చి కలుగును.
06. రాజ్యాధిపతి- కుజుడు సప్తమందుండి శని దృష్టి కలిగిన ఉన్మాదయోగము. 
07. రవి 6-12 స్థానములందుండి, పంచవంలో చంద్ర-కుజులున్న, పిచ్చి వాడగును. 


Wednesday, November 27, 2024

TIRUPAVAI -తిరుప్పావై

తిరుప్పావై

ధ్యానం

నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ ।
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ॥

అన్న వయల్ పుదువై యాండాళ్ అరంగర్కు
పన్ను తిరుప్పావై ప్పల్ పదియం, ఇన్నిశైయాల్
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై,
పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు,
శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై,
పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ
వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రం,
నాన్ కడవా వణ్ణమే నల్‍కు.

1. పాశురం
మార్గళిత్తింగళ్ మదినిఱైంద నన్నాళాల్ ,
నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్!
శీర్ మల్గుO  ఆయ్‍ ప్పాడి శెల్వచ్ శిరు  మీర్ కాళ్!
కూర్వేల్ కొడున్   తొళిలన్ నందగోపన్ కుమరన్ ,
ఏరారందకణ్ణి యశోదై యిళం శింగం ,
కార్మేనిచ్చెఙ్గణ్  కదిర్ మది యంబోల్ ముగత్తాన్,
నారాయణనే నమక్కే పఱై తరువాన్ ,
పారోర్ పుగళప్పడిన్దు  ఏలోర్ ఎమ్భావాయ్ ॥ 1 ॥


2. పాశురం
వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్. !


3. పాశురం
ఓంగియులగళన్ద వుత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు
ఓంగు పెరుం శెన్నలూడు కయలుగళ 
పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్తములై పట్రి - వాంగ
కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కల్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్ ॥ 3 ॥


4. పాశురం
ఆళి’మళై’ క్కణ్ణా ఒనృ నీ కైకరవేల్,
ఆళి’యుళ్ పుక్కు ముగందు కొడార్తేఱి,
ఊళి’ ముదల్వనురువంబోల్ మెయ్ కఋత్తు,
పాళి’యందోళుడై ప్పఱ్బనాబన్ కైయిల్,
ఆళి’పోల్ మిన్ని వలంబురిపోల్ నిన్ఱతిర్‍ందు,
తాళా’దే శార్‍ంగముదైత్త శరమళై’ పోల్,
వాళ’ వులకినిల్ పెయ్‍దిడాయ్, నాంగళుం
మార్కళి’ నీరాడ మగిళ్’ందేలోరెంబావాయ్ ॥ 4 ॥


5. పాశురం
మాయనై మన్ను వడమదురై మయిందనై
తూయ పెరునీర్ యమునై తురైవనై
ఆయర్ కులత్తునిల్ తోన్రుమ్ మణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కమ్ శెయిద దామోదరనై
తూయోమాయ్ వందునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయ పిళై యుమ్ పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెంబావాయ్  ॥ 5 ॥


6. పాశురం
పుళ్ళుం శిలుంబినగాణ్ పుళ్ళరైయిన్ కోయిలిల్
వెళ్లై విళిశంగిన్ పేరరవం కేట్టిలైయో?
పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ ములైనంజుండు
కళ్ళచ్చగడం కలక్కళియాక్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై
ఉళ్ళత్తుక్కొండు మునివర్ గళుం యోగిగళుమ్
మెళ్ళ వెళుందు అరియెన్ర పేరరవమ్
ఉళ్ళం పుగున్దు కుళిరెన్దేలో రెంబావాయ్ ॥ 6 ॥


7. పాశురం
కీశు కీశెన్రు ఎంగుం ఆనై చ్చాత్తన్ కలన్దు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో ప్పేయ్ పెణ్ణే!
కాశుం పిఱప్పుం కలగలప్పక్కై పేర్ త్తు
వాశ నఱుంగుళలాయ్ చ్చియర్, మత్తినాల్
ఓశై పడుత్త తయిరరవం కేట్టిలైయో?
నాయగ ప్పెణ్ పిళ్లాయ్ నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుం నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ తిఱవేలో రెంబావాయ్ || 7 ||


8. పాశురం
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరందన కాణ్! - మిక్కుళ్ళ పిళ్లై గళుమ్
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు - ఉన్నై
కూవువాన్ వందు నిన్ఱోం, కోదుగలం ఉడైయ
పావాయ్! ఎళుందిరాయ్! పాడిప్పఱైక్కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా వెన్రారాయన్ అరుళేలోరెంబావాయ్ || 8 || 


9. పాశురం
తూమణిమాడత్తు చ్చుట్రుం విళక్కెరియ,
తూపం కమళ’ త్తుయిలణై మేల్ కణ్వళరుం,
మామాన్ మగళే మణిక్కదవం తాళ్ తిఱవాయ్,
మామీర్ అవళై ఎళుప్పీరో, ఉన్ మగళ్ తాన్
ఊమైయో ? అన్ఱి చ్చెవిడో, అనందలో ?,
ఏమ ప్పెరుందుయిల్ మందిరప్పట్టాళో ?,
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెనృ,
నామం పలవుం నవిన్ఱేలోరెంబావాయ్ ॥ 9 ॥


10. పాశురం

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱఅమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడినారాయణన్- నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్- వండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళందకుమ్బకరణనున్
తోత్తుం ఉనక్కే పెరుందుయిల్తాన్ తందానో?
ఆత్త అనందలుడై యాయ్!అరుంగలమే!
తేత్త మాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్ || 10 || 



11. పాశురం
కట్రుక్కఱవై క్కణంగళ్ పలకఱందు,
శెట్రార్ తిఱలళి’య చ్చెనృ శెరుచ్చెయ్యుం,
కుట్రమొన్ఱిల్లాద కోవలర్ తం పొఱ్కొడియే,
పుట్రరవల్‍గుల్ పునమయిలే పోదరాయ్,
శుట్రత్తు తోళి’మారెల్లారుం వందు, నిన్
ముట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్ పాడ,
శిట్రాదే పేశాదే శెల్వ ప్పెండాట్టి,
నీ ఎట్రుక్కుఱంగుం పొరుళేలోరెంబావాయ్ ॥ 11 ॥


12. పాశురం
కన్నెత్తిళం కత్తెరుమై క్కన్రుక్ కిరంగి
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
ననైత్తిల్లం శేరాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్ని లంగై క్కోమానై శెట్ర
మనత్తుక్కు ఇనియానై పాడవుం నీ వాయ్ తిరవాయ్
ఇనిత్తాన్ ఎళుందిరాయ్! ఈదెన్న పేరురక్కమ్!
అనైత్తు ఇల్లత్తారుమ్ అరిన్దు ఏలోర్ ఎంబావాయ్ || 12 || 


13. పాశురం
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
క్కిళ్ళక్కళైన్దానై క్కీర్తి మై పాడిప్పోయ్
పిళ్లైగళెల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్లి యెళుందు - వియాళ మురంగిట్రు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కిడత్తియో పావాయ్! నీనన్నాళాల్
కళ్ళం తవిరుందు కలన్దేలో రెంబావాయ్ || 13 || 


14. పాశురం
ఉంగళ్ పుళక్కడై తోట్టత్తు వావియళ్
శెంగళు నీర్ వాయ్ నెగిళిందు ఆమ్బల్ వాయ్ కూంబినగాణ్
శెంగల్ పొడిక్కూరై వెణ్పల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్
ఎంగళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఏళుందిరాయ్! నాణాదాయ్ నావుడైయాయ్!
శంగొడు శక్కరమ్ ఏందుం తడక్కైయన్
పంగయక్కణ్ణానై ప్పాడేలోరెంబావాయ్ || 14 || 


15. పాశురం
ఎల్లే! ఇళంగిళియే ఇన్నముఱంగుదియో?
శిల్లెన్రు అళైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్! పండే ఉన్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తానాయుడుగ!
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై!
ఎల్లారుం పోందారో? పోందార్ పోందెణ్ణిక్కొళ్;
వల్లానై కొన్రానై, మాత్తారై మాత్తళిక్క
వల్లానై, మాయనై ప్పాడేలోరెంబావాయ్ || 15 || 


16. పాశురం
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే కొడిత్తోన్ఱుం తోరణ వాశల్ కాప్పానే! మణిక్కదవం 
తాళ్ తిరవాయ్ ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై 
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్నేరందాన్
తూయోమాయ్ వందోమ్, తుయిల్ ఎళ పాడువాన్;
వాయాల్ మున్న మున్నం మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కు ఏలోరెంబావాయ్ || 16 || 


17. పాశురం
అమ్బరమే, తణ్ణీరే, శోఱే అరం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎళుందిరాయ్
కొంబనార్ క్కు ఎల్లాం కొళుందే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్!
అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలగళంద
ఉంబర్ కోమనే! ఉరంగాదు ఎళుందిరాయ్; 
శెంబోర్ కళ లడి చ్చెల్వ బలదేవా!
ఉంబియుమ్ నీయుమ్ ఉరంగేలోరెంబావాయ్ || 17 ||


18. పాశురం
ఉన్దు మదగళిత్తనోడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమళుం కుళలీ కడై తిఱవాయ్
వందెగుం కోళి అళైత్తనగాణ్, మాదవి
ప్పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవినగాణ్; 
పందార్ విరలి! ఉన్ మ్మైత్తునన్ పేర్ పాడ 
శెందామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వందు తిఱవాయ్; మగిళిందు ఏలోర్ ఎంబావాయ్ || 18 ||


19. పాశురం
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తైన్ఱ పంచశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడంద మలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్న మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెళ వొట్టాయ్ గాణ్ 
ఎత్తనై ఏలుమ్ పిరివాత్త గిల్లాయాల్
తత్తువమన్ఱు తగవేలోర్ ఎంబావాయ్ || 19 ||


20. పాశురం
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు 
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
వెప్పమ్ కొడుక్కుం విమలా! తుయిలెళాయ్
శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ చ్చిరుమరుంగుల్
నప్పిన్నయ్ నంగాయ్! తిరువే! తుయిలెళాయ్
ఉక్కముం తట్టొళియుం తన్దు వున్ మణాళనై
ఇప్పోతే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్ || 20 ||


21. పాశురం
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్
అత్తప్పడైత్తాన్ మగనే! యఱివుఱాయ్
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిన్రశుడరే! తుయిలెళాయ్
మాత్తారునక్కు వలితులయిందు వున్ వాశఱ్కణ్
ఆత్తాదు వందు వున్నడి పణియు మాప్పోలే
పోత్తియామ్ వందోమ్ పుగళుందు ఏలోరెంబావాయ్ || 21 ||


22. పాశురం
అంగణ్ మా జాలత్తరశర్, అభిమాన
బంగమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శంగమిరుప్పార్ పోల్ వందు తలైప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయ్ దామరై ప్పూప్పోలే
శెంగణ్ శిరిచ్చిరిదే యెమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళుందార్ పోల్
అంగణిరండుంగొండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్
ఎంగల్ మేల్ చాబ మిళందేలో రెంబావాయ్ || 22 ||


23. పాశురం
మారి మలై ముళంగిల్ మన్నిక్కిడందు రంగుమ్
శీరియ సింగ మరివిత్తు తీవిళిత్తు
వేరి మయిర్ పొంగ వెప్పాడుమ్ పేరుందు దఱి
మూరి నిమిరుందు ముళంగిప్పుఱప్పట్టు
పోదరు మాపోలే; నీ పూవైప్పూ వణ్ణా! ఉన్ 
కోయిల్ నిన్రింగనే పోందరుళి, కోప్పడైయ
శీరియ సింగాశనత్తిరుందు, యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెంబావాయ్ || 23 ||


24. పాశురం
అన్రివ్వులగ మళందాయ్ ! అడిపోత్తి
చ్చెన్రంగుతైన్నిలంగై శెత్తాయ్ ! తిరల్ పోత్తి
పోన్రచ్చగడ ముదైత్తాయ్! పుగళ్ పోత్తి
కన్రు కుణిలా వెరిన్దాయ్! కళల్ పోత్తి
కున్రుకుడైయావెడుత్తాయ్ ! గుణం పోత్తి
వెన్రు పగైకెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్రెన్రున్ శేవగమే యేత్తిపఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరంగేలో రెంబావాయ్ || 24 ||


25 పాశురం
ఒరుత్తి మగనాయ్ పిఱందు, ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర
తరిక్కిలానాగి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిళ్లైప్పిత్తు కంగన్ వయిత్తిల్
నెరుప్పెన్న నిన్ర నెడు మాలే !యున్నై
అరుత్తిత్తు వన్దోమ్; పరై రుతియాకిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీరుందు మగిళెందేలో రెంబావాయ్ || 25 ||


26. పాశురం
మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్వనగళ్; వేణ్డువన కేట్టియాల్;
జ్ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచశన్నియమే
పోల్వన శంగంగళ్, ప్పాయ్ ప్పాడుడై యనవే,
శాలప్పెరుమ్ పఱైయే, పల్లాండిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, వితానమే
అలినిలై యాయ్! అరుళేలో రెంబావాయ్|| 26 ||


27. పాశురం
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ || 27 ||


28. పాశురం
కఱవైగళ్ పిన్ శెన్రు కానమ్ శేరుందుంబోమ్
అఱివొన్రు మిల్లాద వాయ్ కులత్తు, ఉన్దన్నై ప్పిఱవి 
పెఱుందనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కుఱైవొన్రు మిల్లాద గోవిందా! ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఇంగొళిక్క ఒళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అంబినాల్ ఉన్దన్నై
శిఱు పేరళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా నీతారాయ్ పఱై, యేలో రెంబావాయ్ || 28 ||


29.పాశురం
శిట్రం శిఋ కాలే వందున్నై శేవిత్తు, ఉన్
పోట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్,
పెట్రం మేయ్‍త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు,
ఇట్రై పఱై కొళ్వాననృ కాణ్ గోవిందా,
ఎట్రైక్కుం ఏళ్’ ఏళ్’ పిఱవిక్కుం, ఉన్ తన్నోడు
ఉట్రోమే యావోం ఉనక్కే నాం ఆట్చెయ్‍వోం,
మట్రై నం కామంగళ్ మాట్రేలోరెంబావాయ్ ॥ 29 ॥


30. పాశురం
వంగక్కడల్ కడైంద మాదవనై కేశవనై,
తింగళ్ తిరుముగత్తు చ్చెయిళై’యార్ శెన్ఱిఱైంజి,
అంగప్పఱై కొండవాట్రై, అణిపుదువై
పైంగమలత్ తణ్‍తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న,
శంగ త్తమిళ్’ మాలై ముప్పదుం తప్పామే,
ఇంగు ఇప్పరిశుఱైప్పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్,
శెంగన్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్,
ఎంగుం తిరువరుళ్ పెట్రు ఇన్బుఋవరెంబావాయ్ ॥ 30 ॥



॥ శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణమ్




Browse Related Categories:


DHANURMASAM-ధనుర్మాసం

ధనుర్మాసం

సూర్యుడు ధను రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలయ్యే మాసం ధనుర్మాసం. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం.

దక్షిణాయననికి చివర ఉత్తరాయణం మొదలు వరకు ఉండే నెల రోజులను ధనుర్మాసం అంటారు.
ఈ నెల రోజులు తెల్లవారుజమున సమయం ఎంతో పవిత్రమైనది.

ఈ నెల రోజులు జరిగే ఆండాళ్ అమ్మ పూజ, గోదా కళ్యాణం, తిరుప్పావై మొదలగునవి ద్రవిడ సాంప్రదాయములు.

ఈ నెల రోజులు తిరుమల లో శ్రీ వేంకటేశ్వరునికి సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠిస్తారు.

ఈ నెల రోజులు సూర్యోదయం సమయము మరియు సూర్యాస్తమ సమయములలో దీపారాధన చేసిన మహాలక్ష్మి కటాక్షం లభించును.

ఈ నెల రోజులు శ్రీవైష్ణవాలయములలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రాతసమయమున సూర్యోదయమునకు పూర్వమే శ్రీమహావిష్ణువుకు పూజలు నైవేద్యాలు నివేదిస్తారు.

ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ కాలంలోనే గోదాదేవి మార్గళి వ్రతం చేసి నారాయణుడిని ఆరాధించింది. ధను సంక్రమణ కాలంలో నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ నెలలో బ్రహ్మ ముహుర్తంలో నారాయణ పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలలో పేర్కొనబడింది.

ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవివాహితులకు వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ నెలలో వివాహ కార్యక్రమాలను మాత్రం చేపట్టరు. ఎందుకంటే ఈ కాలంలో సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి వెళ్తూ ఉంటాడు. సూర్యుడు మీన రాశిలో, ధనస్సు రాశిలో ఉన్నప్పుడు, గురువు మీనంలో ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది. అందుకే ఈ నెలలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఈ కాలంలోనే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి, వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు.

సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం.. పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొనబడింది.

ధనుర్మాసంలో శ్రీ విష్ణుమూర్తిని మధుసూదన పేరిట పూజిస్తారు. ఈ నెలలో తొలి పక్షం రోజుల పాటు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత పక్షం రోజుల పాటు దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఈ కాలంలో పెళ్లి కాని కన్యలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మాసంలోనే గోదాదేవి మార్గళి వ్రతం పేరిట మహా విష్ణువును పూజించి మోక్షం పొందింది. ఈ ధనుర్మాసం వ్రత వివరాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి.


పంచాంగం

surya graham - సూర్యుడు

 సూర్యుడు

స్వభావము    - పాప, క్రూర  
అధిపతి      -పరమశివుడు 
లింగము     -పురుష
తండ్రి        - అంగీరసుడు
తల్లి:            సురూప
భార్య       - తార 
పిల్లలు     -భరద్వాజ, కుచ, కేసరి, అశ్వినీ దేవతలు, శనైశ్వరుడు మరియు యముడు 
వారం       - ఆదివారం 
రుచి           -కారం 
జాతి           -క్షత్రియ  
వర్ణము        - ఎఱుపు 
అధి దేవత -బ్రహ్మ
దిక్కు         -తూర్పు 
వాహనం      - ఏడు గుర్రాల రథం  
తత్వం       - ఆకాశ
జీవులు        -ద్విపాదులు
ప్రకృతి       -పిత్తము
ఋతువు     -గ్రీష్మ 
లోహము     -రాగి 
రత్నము     -మాణిక్యము 
గ్రహ సంఖ్య -మూడు
గుణం          -సత్వ  గుణం
ప్రదేశం        -గోదావరి నుండి వింధ్య ప్రాంతాలు
జప సంఖ్య        - 16000.
నవధాన్యము     - గోధుమ 
మిత్రులు       -కుజుడు, చంద్రుడు, గురువు
శత్రువులు      -శుక్రుడు, శని
సములు        - బుధుడు.
స్వక్షేత్రం         - సింహం 
ఉచ్ఛరాశి         - మేషము 
నీచరాశి            - తుల 
మూలత్రికోణము - సింహము 
నైసర్గిక బల గ్రహము : శుక్రుడు
రాశి లో వుండే సమయం : 30 రోజులు

రవి మహా దశ   - 6 సంవత్సరములు 

గ్రహ కారకత్వములు 

ఆత్మ, శక్తి, అతితీష్ణత -  దుర్గము, సహబలము, ఉష్ణము -అగ్ని, శైవోపాసన -ధైర్యము ముళ్ళతో కూడిన చెట్లు, రాజాశ్రయము, వృద్ధాప్యము, పశువులు, దుష్టత్వము, భూమి, తండ్రి, రుచి, జ్ఞానము, ఊర్ధ్వదృష్టి, పిరికితనం, మానవలోకము, చతురము, ఆస్తి, ఎముకలు,ప్రలాసము, తృణ, గరిక, ఉదరము, ఉత్సాహము, అరణ్యము, ఆయనము, కళ్ళు, పర్వత సంచారము, నాలుగు కాళ్ల జంతువులు, రాజు, ప్రయాణం, వ్యవహారము, కార్యము, పిత్తము, తాపము, వృత్తా కృతి, కంటి రోగము, శరీరము, కొయ్య, సకలదేశాధీశత్వము, ఆరోగ్యము, భూషణము,శిరోవ్యాధి, ఆకాశాధిపతి, హ్రాస్వము, రాగి, రక్తము, పాషాణము, ప్రకటిత ప్రవర్తనము, నదీతీరము, ప్రవాళము, అపహార్ణ బలము, పూర్వదిశ, శత్రువులు శత్రువును స్వాధీనం చేసుకోవడం, సత్వగణము, యోగ్యత, రక్త చందనము, వ్యతిరేకము. 

సూర్యారాధన వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు.
సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడిని ఆరాధించడం వల్ల శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. మన పురాణాలు "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" (ఆరోగ్యాన్ని భాస్కరుడి నుండి కోరుకోవాలి) అని చెబుతున్నాయి.

సూర్యారాధన వల్ల ఆరోగ్య ప్రాప్తి, చర్మ వ్యాధులు: సూర్యరశ్మి సోకడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా ఉదయపు సూర్యకాంతి విటమిన్-డిని అందిస్తుంది.

కంటి చూపు: సూర్యుడిని క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల నేత్ర సంబంధిత సమస్యలు తొలగి దృష్టి మెరుగుపడుతుంది.

శక్తి: శరీరానికి నూతన ఉత్తేజం, శక్తి లభిస్తాయి.

మానసిక ప్రశాంతత మరియు ధైర్యం: సూర్యారాధన వల్ల మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు సంకల్ప బలం చేకూరుతుంది.

జాతకంలో 'రవి' గ్రహం బలంగా ఉంటే సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.

మేధస్సు మరియు ఏకాగ్రత: సూర్యుడు జ్ఞానానికి కారకుడు. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల బుద్ధి వికసిస్తుంది. విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

కర్మ దోషాల నివారణ: తెలియక చేసిన పాపాలు సూర్య దర్శనం వల్ల నశిస్తాయని నమ్మకం.

ఆదిత్య హృదయం పఠించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది.

అర్ఘ్యం సమర్పించడం: సూర్యోదయ సమయంలో రాగి పాత్రతో నీటిని సూర్యుడికి వదలడం అత్యంత శుభప్రదం.

సూర్య నమస్కారాలు: ఇది అటు వ్యాయామం, ఇటు యోగా మరియు భక్తితో కూడిన ప్రక్రియ.

మంత్రం: "ఓం ఘృణి సూర్యాయ నమః" లేదా "ఓం నమో నారాయణాయ"


సూర్యాష్టకం

శ్రీ సూర్యస్తోత్రం

సూర్యమండల స్తోత్రం

ఆదిత్యహృదయం

నవగ్రహస్తోత్రం

సూర్య ఏక వింశతి నామావళి(21 నామాలు)

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Tuesday, November 26, 2024

MRUTYU NIVARAKASTAK STOTRAM - మృత్యునివారకాష్టక స్తోత్రం

మృత్యునివారకాష్టక స్తోత్రం 
-మార్కండేయ కృతం.

దామోదరం ప్రపన్నో స్మికిన్నో మృత్యుః కరిష్యతి ॥ 
శంఖచక్రధరం దేవం వ్యక్త రూపిణ మవ్యయం । 
అధోక్షజం ప్రపన్నోస్మి కిన్నో మృత్యుః కరిష్యతి ॥ 

వారాహం వామనం విష్ణుం నారసింహం జనార్దనం । 
మాధవంచ ప్రపన్నోస్మి కిన్నోమృత్యుః కరిష్యతి । 
పురుషం పుష్కర క్షేత్ర బీజం పుణ్యం జగత్పతిం ।
లోకనాథం ప్రపన్నోస్మి కిన్నోమృత్యుః కరిష్యతి ॥

సహస్రశిరసం దేవం వ్యక్తా వ్యక్తం సనాతనం । 
మహాయోగం ప్రపన్నోస్మి కిన్నో మృత్యుః కరిష్యతి । 
భూతాత్మానం మహాత్మానం యజ్ఞ యోని మయోనిజం ॥ 
విశ్వరూపం ప్రపన్నోస్మి కిన్నో మృత్యుః కరిష్యతి ॥ 

ఇత్యుదీరిత మాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః । 
అపయాతస్తతో మృత్యు ర్విష్ణు దూతైః ప్రషీడితః ॥
ఇతితేన జితో మృత్యుర్శార్కండేయేన ధీమతా । 
ప్రసన్నే పుండరీకాక్షే నృసింహే నాస్తి దుర్లభం ॥

Monday, November 25, 2024

SRI KALIKA KAVACHAM (TRAILOKYA VIJAYAM)- శ్రీ కాళికా కవచం (త్రైలోక్య విజయం )

శ్రీ కాళికా కవచం (త్రైలోక్య విజయం )

శ్రీ సదాశివ ఉవాచ:
త్రైలోక్య విజయస్యాస్య కవచస్య ఋషిః శివః ।
ఛందో
నుష్టు ప్ దేవతా చ ఆధ్యా కాళీ ప్రకీర్తితా ॥ 01 ॥

మాయాబీజం బీజమితి రమా శక్తి రుదాహృత ।
క్రీం కీలకం కామ్యసిద్దౌ వినియోగః ప్రకీర్తితః ॥ 02 ॥

అధ కవచమ్:
హ్రీమాద్యా మే శిరః పాతు శ్రీం కాళీ వదనం మమ ।
హృదయం క్రీం పరా శక్తి: పాయాత్కంఠం పరాత్పరా ॥ 03 ॥

నేత్రే పాతు జగద్ధాత్రీ కర్ణౌ రక్షతు శంకరీ ।
ఘ్రాణం పాతు మహామాయా రసనాం సర్వమంగళా ॥ 04 ॥

దంతాన్ రక్షతు కౌమారీ కపోలౌ కమలాలయా ।
ఓష్టాధరౌ క్షమా రక్షేచ్చిబుకం చారుహాసిని ॥ 05 ॥

గ్రీవాం పాయాత్కులేశాని కకుత్పాతు కృపామయీ ।
ద్వౌ బాహూ బాహుదా రక్షేత్కరౌ కైవల్యదాయిని ॥ 06 ॥

స్కందౌ కపర్ధినీ పాతు పృష్ఠం త్రైలోక్యతారిణి ।
పార్శ్వే పాయాదపర్ణా మే కటిం మే కమఠాసనా ॥ 07 ॥

నాభౌ పాతు విశాలాక్షీ ప్రజాస్థానం ప్రభావతీ ।
ఊరూ రక్షతు కల్యాణీ పాదౌ మే పాతు పార్వతీ ॥ 08 ॥

జయదుర్గాఽవతు ప్రాణాన్ సర్వాంగం సర్వసిద్ధిదా ।
రక్షాహీనం తు యత్ స్థానం వర్జితం కవచేన చ ॥ 09 ॥

తత్సర్వం మే సదా రక్షేదాద్యా కాళీ సనాతనీ ।
ఇతి తే కథితం దివ్యం త్రైలోక్యవిజయాభిధమ్ ॥ 10 ॥

కవచం కాళికాదేవ్యా ఆద్యయా: పరమాద్భుతమ్ ।
పూజాకాలే పఠేద్యస్తు ఆద్యాధికృతమానసః ॥ 11 ॥

సర్వాన్ కామానవాప్నోతి తస్యాద్యాశు ప్రసీదతి ।
మంత్రసిద్ధిర్భవేదాశు కింకరాః క్షుద్రసిద్ధయః ॥ 12 ॥

అపుత్రో లభతే పుత్రం ధనార్ధీ ప్రాప్నుయాద్ధనమ్ ।
విద్యార్ధీ లభతే విద్యామ్ కామీ కామానవాప్నుయాత్ ॥ 13 ॥

సహస్రావృతపాఠేన వర్మణోஉస్య పురస్క్రియా ।
పురశ్చరణసంపన్నం యధోక్తఫలదం భవేత్ ॥ 14 ॥

చందనాగరుకస్తూరీకుంకుమై రక్తచందనైః ।
భూర్జే విలిఖ్య గుటికాం స్వర్ణస్థాం ధారయేద్యది ॥ 15 ॥

శిఖాయాం దక్షిణే బాహౌ కంఠే వా సాధకః కటౌ ।
తస్యాద్యా కాళికా వశ్యా వాంఛితార్ధం ప్రయచ్ఛతి ॥ 16 ॥

న కుత్రాపి భయం తస్య సర్వత్ర విజయీ కవిః ।
అరోగీ చిరజీవీ స్యాద్భలవాన్ ధారణక్షమః ॥ 17 ॥

సర్వ విద్యాసు నిపుణః సర్వశాస్త్రార్థతత్త్వవిత్ ।
వశే తస్య మహీపాలా భోగమోక్షౌ కరస్థితౌ ॥ 18 ॥

॥ ఇతి మహనిర్వాణతంత్రే సప్తమోల్లాసే
త్రైలోక్యవిజయకవచం నామ శ్రీ కాళికా కవచమ్ ॥

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...