Sunday, December 29, 2024

GAALINE POYA గాలినే పోయ గలకాలము

 పల్లవి 

గాలినే పోయ గలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు ||

చరణములు 
అడుసు చొరనే పట్టె నటునిటు గాల్లు
గుడుగుకొననే పట్టె గలకాలము |
ఒడలికి జీవుని కొడయడైనహరి
దడవగా గొంతయు బొద్దులేదు ||

కలచి చిందనే పట్టె గడవగ నించగ 
బట్టె కలుషదేహపుబాధ గలకాలము |
తలపోసి తనపాలి దైవమైన హరి
దలచగా గొంతయు బొద్దులేదు |

శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె
గరిమల గపటాల గలకాలము |
తిరువేంకటగిరి దేవుడైనహరి
దరిచేరా గొంతయు బొద్దులేదు ||

No comments:

Post a Comment

Pruthvi Stotram -Stavanam - పృథ్వీ స్తోత్రం - స్తవనం

పృథ్వీ స్తోత్రం శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌ । చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥ రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌ । వ...