Tuesday, August 11, 2026

Rakshaseeganam - రాక్షసీగణం

రామాయణం సుందరకాండ పదిహేడవ సర్గ - రాక్షసీగణం

నీలి నీలి కాంతుల జలాలున్న సరోవరంలో హంస ప్రవేశించినట్లు కలువపూగుత్తివంటి చంద్రుడు ఆకాశంలో దిగువకు వచ్చాడు. నిర్మల ప్రభలతో చల్లగా సోకుతూ హనుమంతునికి తోడుపడుతున్నాడు. ఆ సమయంలో శోకభారంతో ఉన్న సీతాదేవి బరువెక్కి నీట మునిగిన నావలా ఉంది.

చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలవైపు ఆయన దృష్టి మరలింది. వారిలో-

ఒకే కన్ను కలది.
ఒకే చెవి గలది.
ఒకదానికి చెవులులేవు.
మరొకతెకు మేక చెవులు.
ఒకదాని ముక్కు శిరసువైపు తిరిగి ఉంది.

ఏనుగు తలకాయ, బారెడు పొడవైన కంఠం, తెగిన కేశాలు. కేశాలే లేనిది, కంబళీజుట్టు, వ్రేలాడిపోయిన చెవులు, నుదురు, పొట్ట, వక్షోజాలు. పెదవులు, బుగ్గలు. అంతేకాదు ఒకతెకు మోకాళ్ళుకూడా వ్రేలాడుతున్నాయి.

పొట్టిది, బాగా పొడుగుది, గూనిది, మరుగుజ్జుది, వికటంగా ఉండేది, వంగిన ముఖం, పచ్చని కళ్ళు, వికృత ముఖం. ఇంకా చూస్తూన్నాడు-

కొందరు పచ్చరంగు, మరి కొందరు నల్లరంగు. కలహ ప్రీతితో కొందరు, క్రోధస్వభావంతో కొందరు, ఇనుప శూలాలూ, ముధ్గరాలూ ధరించి కొందరు.

పంది ముఖాలు, లేడి తలకాయలు, పులిశీర్షాలు, నక్క మొహాలు, దున్నపోతు రూపాలు. ఏనుగు పాదాలు, గుర్రపు డెక్కకాళ్ళు, లొట్టిపిట్ట కొళ్ళు, లోపలకుపోయిన తలకాయలతో కొందరు. గాడిద, గుర్రం, ఆవు, ఏనుగు, సింహాల చెవులతో కొందరు.

ముక్కలేనివారు, అడ్డ ముక్కులవారు, పెద్ద ముక్కులు, కుంభకుచాలు, కుండ కడుపులు, అందరూ క్రోధంతోనే ఉన్నారు.

సురాపానం, మాంస భోజనం, నిరంతరం అదేపని వారికి. అటువంటి వారి మధ్య సీతాదేవి.

పుణ్యక్షయమై నేలకు జారిన నక్షత్రంలా ఉంది.

ఏ అలంకారమూలేకున్నా భర్తృవాత్సల్యమే భూషణంగా కనిపిస్తున్నది.

సింహాల మధ్య ఆడు ఏనుగులా ఉంది.

శరత్కాల మేఘం వెనుక చంద్రకళలా, తీగలులేని వీణలా, ధూళి నిండిన తామరతూడులా వుంది. పాతివ్రత్యమే రక్షగా వుంది.

దుఃఖాల రాశిలా వుంది.

సీతాదర్శనంతో ఆయన మనస్సు క్లేశరహితమై రామచంద్రునికి అభివాదాలర్పించింది. లక్ష్మణస్వామికి కూడా అభివాదాలు చేసి ఆ చెట్టు కొమ్మలలో రహస్య ప్రదేశానికి చేరాడు, హనుమంతుడు.

రావణప్రవేశం

Aalochana - ఆలోచన

రామాయణం సుందరకాండ పదహారవ సర్గ - ఆలోచన

చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములయిన కుల, గురు, వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటివానికి పూజ్యుడూ, గురువూ అయిన రామచంద్రుని భార్యకు యిటువంటి క్లేశం కలిగిందంటే కాలం ఎంత బలీయమయినదో!

ఈవిడకు రామ లక్ష్మణుల ధీ ధీరశక్తులు పూర్తిగా తెలుసు కనుకనే అంతగా కలతపడడంలేదు. వర్షాకాలపు మేఘాలను చూచి గంగానది క్షోభిస్తుందా!

కుల రూప గుణ శీలాలలో యిద్దరూ సమానులే. అందువల్లనే ఈమెకు అయన, ఆయనకు ఈవిడ తగినవారు.

ఈ విశాలాక్షికోసం వాలిని నేలకూల్చాడు రాముడు.

రావణసముడయిన కబంధుణ్ణి హతమార్చాడు.

విరాధుడికీ అదే గతి పట్టింది. వాడేం తక్కువవాడా! శంబరాసురు నంతటివాడు.

భీకరాకారులయిన ఖర దూషణాదులతో వారి సేన పదునాలుగు వేలు జనస్థానంలో నామ రూపాలు లేకుండా పోయింది; యీవిడకోసం.

సర్వవానరేశ్వరు డయిన వాలిని నేలకూల్చి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపింది యీవిడ కోసమే.

నదీ నద సాగరాలు లంఘించి లంకానగరాన్ని నేను చూడగలిగానంటే ఈ యిల్లాలి వల్ల కాదా!

ఈవిడ కోసం రా
చంద్రుడు ముల్లోకాలు తలక్రిందులు చేసినా ఆశ్చర్యంలేదు.

ఈ జనకరాజనందనతో చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక. దర్మపరుడైన జనకుని పుత్రిక, పతివ్రతా శిరో
ణి.

విదేహాధీశుడు యజ్ఞంకోసం నాగలిపట్టి దున్నుతున్నవేళ పద్మపరాగ సమధూళినుండి బైెటపడ్డ దీవిడ.

పూజ్యుడూ, పరాక్రమోపేతుడూ అయిన దశరధుని యింటికి కీర్తిని తెచ్చిపెట్టిన పెద్దకోడలు.

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని.

అటువంటి నారీమతల్లి ఈ రాక్షసజన మధ్యంలో పడింది. సర్వరాజ భోగాలూ విడిచి భర్తృవాల్లభ్యంతో అరణ్యక్లేశా లనుభవించడానికి ఆయనతో వచ్చిన ఉత్తమురాలు.

కందమూలఫలాలు తింటూ హాయిగా భర్తను సేవించుకున్నది. ఎన్నడూ క్లేశాలు ఎరుగనిది, ఈ నా డింతటి అవస్థ అనుభవిస్తునది.

శీలసంపన్నయైన యీవిడకోసం రాము డెదురు చూస్తున్నాడు. ఈవిడ దొరికితేచాలు భూ మండలమంతా సాధించిన సంతోషం కలుగుతుంది రామునికి.

ఇక్కడ బంధుజనం లేరు, భోగాలు లేవు. అయినా యీవిడ జీవించకలుగుతున్నదంటే రామసమాగమకాంక్ష కాక వేరేమున్నది.

ఈవిడ తన చుట్టూ వున్న రాక్షసగణాన్ని కాని, పూల తీవెలనుకాని చూస్తున్నట్టులేదు. రామదర్శనమందే ఏకాగ్రమై ఉన్నది, యీవిడ మనస్సు.

ఈ పద్మనయనను, సుఖబోగార్హను యీ దశలో చూస్తుంటే నా మనస్సు చింతా
యి మవుతున్నది.

రా
 లక్ష్మణుల రక్షణలో ఉండవలసిన యీ భూజాత యీ వికృతాకార జన మధ్యంలో ఉన్నది.

మంచు దెబ్బతిని వాడిన పద్మంలా దుఃఖపరంపరతో కృశించి ఉంది. ప్రియుడు దూరమయిన చక్రవాకిలా దీనంగా ఉంది.

పూలబరువుతో వంగిన కొమ్మలతో ఉన్న ఈ అశోకం కూడా యీవిడకు సంతోషాన్ని కలిగించడంలేదు. మంచుపొరల అడ్డంలేని శీతకిరణుడు కూడా యీమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు, అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు హనుమంతుడు.

రాక్షసీగణం

Ashadha Amavasya - ఆషాఢ అమావాస్య

ఆషాఢ అమావాస్య

ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా తెలంగాణ ప్రాంతంలో చుక్కల అమావాస్య, తమిళనాట ఆడి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తయి, శ్రావణ మాసానికి నాంది పలుకుతుంది.

ఆషాఢంలో సంక్రమణంనాడుగానీ నెలనెలా పంచమీనవముల్లోగానీ మాసాంతంలోగాని (పూర్ణిమ - అమావాస్య) మనసాదేవిని అర్చించినవారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. సర్ప భయం ఉండదు. కీర్తిమంతులూ విద్యావంతులూ గుణవంతులూ అవుతారు. 

అజ్ఞానంతో మనసాదేవిని నిందించినవారికి సర్పభయం తప్పదు. దరిద్రులవుతారు.

గంగ లో అమావాస్య నాడు స్నానం చేస్తే నూరు రెట్లు అధిక పుణ్యాన్నిస్తుంది.

గ్రీష్మ రుతువు అంటే జ్యేష్ట, ఆషాఢ మాసాలలో అయోధ్యా పూరీ యాత్ర చేయాలి పంచ క్రోశ యాత్రలో కని పించే రామేశ్వరమే ఇది.

పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, గృహ లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోవడానికి ఈ అమావాస్య ఎంతో విశిష్టమైనది.

ఆషాఢ అమావాస్య మరియు ఆ రోజు కూష్మాండ దీపం (గుమ్మడికాయ దీపం) వెలిగించడం వెనుక ఉన్న విశిష్టత, లాభాలు మరియు వెలిగించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

కూష్మాండ (గుమ్మడికాయ) దీపం వెలిగించడం వల్ల లాభాలు:
ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్య సమయంలో బూడిద గుమ్మడికాయతో దీపం వెలిగించడం వల్ల అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి.

దిష్టి మరియు నరదృష్టి నివారణ: ఇంట్లోని ప్రతికూల శక్తి, నరదృష్టి, కంటిదృష్టి తొలగిపోతాయి.

గ్రహదోష నివారణ: శని దోషాలు, రాహు - కేతు దోషాలు ఉన్నవారికి ఇది శ్రేష్ఠమైన పరిహారం.

పితృదేవతల శాంతి: పితృ దోషాల ప్రభావం తగ్గి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.

గుమ్మడికాయ దీపం వెలిగించడానికి కావలసిన సామగ్రి?
చిన్న బూడిద గుమ్మడికాయ, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, వత్తులు,రాతి ఉప్పు మరియు బియ్యం.

వెలిగించే విధానం:
సిద్ధం చేయడం:
బూడిద గుమ్మడికాయను నిలువుగా లేదా అడ్డంగా సగానికి కోయాలి. అందులోని విత్తనాలు, గుజ్జును కొద్దిగా తొలగించి రెండు ప్రమిదల లాగా తయారు చేయాలి.

అలంకరణ: ఆ గుమ్మడికాయ ప్రమిదలకు బయట వైపు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.

స్థాపన: నేరుగా నేలపై పెట్టకుండా, ఒక పళ్లెంలో కొంత రాతి ఉప్పు, దానిపై కొద్దిగా బియ్యం పోసి, దానిపైన ఈ గుమ్మడికాయ ప్రమిదలను ఉంచాలి.

దీపారాధన: అందులో నువ్వుల నూనె (లేదా ఆవు నెయ్యి) పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.

దీపం వెలిగించి ఏమి చేయాలి?ఎక్కడ వెలిగించాలి?:
ఈ దీపాన్ని ఇంట్లోని పూజా మందిరంలో కంటే ఇంటి ప్రధాన ద్వారం బయట (సింహద్వారం వద్ద) లేదా ఇంటి ఈశాన్యం/దక్షిణ దిశలో వెలిగించడం శ్రేష్టం. లేదా గుడిలో (శివాలయం/దుర్గాదేవి ఆలయం) వెలిగించవచ్చు. 108 సార్లు ఓం నమః శివాయ జపం చేయాలి.

మరుసటి రోజు:
మరుసటి రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను, ఉప్పు - బియ్యాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో వేయాలి/పారవేయాలి (ఇంట్లో వంటకు ఉపయోగించకూడదు).

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sravana Maasam - శ్రావణ మాసం

శ్రావణ మాసం

శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. సహజంగా శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వస్తుంది. శ్రావణ మాసం నుండి వర్షఋతువు ప్రారంభం అవుతుంది. దీని మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.

శ్రావణమాసం పూజల మాసం, శుభప్రదమైన మాసం, లక్ష్మీప్రదమైన మాసం, పండుగల మాసం, మహిళలకు ప్రీతిపాత్రమైన మాసం, వర్ష ఋతువుతో పరిసరాలు కళకళలాడే మాసం, ఈ సకల శుభాల శ్రావణమాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో దేవతా పూజలతో అలరారుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. గొప్ప పవిత్రమాసం.

దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణమాసం. శ్రీమన్నారాయణ జన్మనక్షత్రం శ్రవణం ఆ పేరు మీద వచ్చిన నక్షత్రం కావడంతో లక్ష్మీదేవికి ఈ నెల అత్యంత ప్రీతికరం.ఇళ్లన్నీ పూజాధికాలతో శోభిల్లే కాలం ఇది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు , శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం.

శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణమాసంలోనే అలానే శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేదు. ఈ నెలలో చేసే దైవకార్యం శుభ ఫలితాన్నిస్తుంది. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.

సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా , అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. 

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం, సంపద కలుగుతాయి. ఈ నెలలో శివుని ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

ఈ మాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే కావున మహిళలు భక్తిశ్రద్ధలతో నోములు, వ్రతాలు ఆచరించి విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటారు.

ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీ కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య చాలా ముఖ్యమైన పర్వదినాలు.

ఈ మాసంలో మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు,పెండ్లికాని యువతులు ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.

క్షీర సముద్ర మథనంలో ఆవిర్భవించిన హాలాహలం విశ్వాన్ని దహించి వేస్తుండగా దేవతలు రాక్షసులు శివుని శరణు వేడగా, విశ్వరక్షకుడు, లయకారకుడు అయిన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు.

కానీ తింటున్నవాడు తన భర్త అని, తింటున్నది విషమని, తింటే లోకానికి మేలవుతుందని తెలిసిన పార్వతి 'మింగివేయండి'(పరవాలేదు) అన్నది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో!

(పార్వతికి 'సర్వమంగళ' అని పేరు. వధువులు భర్తల ప్రాణరక్షణార్థం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ కథే దీనికి మూలం.)

ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి , శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్రొత్తగా పెళ్లి అయిన స్త్రీలు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసం లో వచ్చే అయిదు మంగళవారాలు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి.

శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.

శ్రావణ శుద్ద చవితి, పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమిని జరపుతారు. ఆ రోజున పుట్టలో పాలుపోస్తే సర్వదోషాలు తొలిగిపోతాయని భావిస్తారు.

శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని మహిళలు భక్తితో కొలుస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు.

పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.

శ్లోకం : 
బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే

అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం , మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి.

నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్ధిస్తారు.

అదే విధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా, రక్షబంధనంగా జరుపుతారు. అదే రోజున అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కడతారు.

ఈ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమగా జరుపుతారు. ఉపనయనం అయిన ప్రతి ఒక్కరు ఈ రోజు నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.

శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆరోజున శ్రీ కృష్ణాష్టమి ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.

శ్రావణ మాసం కృష్ణ పక్ష అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునే వారు, పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకున్నవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు.

శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.

ఈ నెలలో శివుడితో పాటు గౌరీదేవి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ప్రతిరోజూ దీపారాధన, దేవుని ధ్యానం, పుణ్యక్షేత్రాల సందర్శన, దానధర్మాలు చేయడం మంచిదని నమ్ముతారు.

స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలను కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ మాసంలో వచ్చే పండుగలు
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.
నాగపంచమి,
వరలక్ష్మీ వ్రతం
రాఖీ పౌర్ణమి,
హయగ్రీవ స్వామి జయంతి,
పుత్రదా ఏకాదశి,
రాఘవేంద్ర జయంతి,
శ్రీ కృష్ణాష్టమి,
కామిక ఏకాదశి,
మాసశివరాత్రి,
పోలాల అమావాస్య

వ్రతాలు
మంగళ గౌరీ వ్రతం,
వరలక్ష్మీ వ్రతం

Sitaasandarsanam - సీతాసందర్శనం

రామాయణం సుందరకాండ పదిహేనవ సర్గ - సీతాసందర్శనం

శింశుపావృక్షంమీది నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా గోచరిస్తున్నది. ఋతుభేదం లేకుండా అన్నీ చివుళ్ళతో, మొగ్గలతో, పూలతో, పండ్లతో అలరారే లతా, తరువులే.

నిండుగా పూచిన అశోకాలతో ఆ వనం రాత్రిపూట కూడా ఉదయ సూర్యశోభతో ఉంది. విరగబూసిన పూలబరువుకి ఆగలేక కొండగోగు నేల మీదికి వంగింది. కొమ్మ, మ్రాను కనిపించకుండా విరిసింది అశోకం. అంగుళం ఖాళీ లేకుండా పూలు నిండిన వెూాదుగ కాంతులు మిరుమిట్లు  గొలుపుతున్నాయి.

పున్నాగం, ఏడాకుల అరటి, సంపెంగ విరగపూసి సువాసనల మత్తు జల్లుతున్నాయి. ఆ వనంలో అశోకాలు కొన్ని బంగారు రంగువి, కొన్ని అగ్నిశిఖా సదృశాలు, దట్టంగా పెరిగి కొన్ని కాటుకరాసిలా ఉన్నాయి.

ఇంద్రుని నందనవనంలా, కుబేరుని చైత్రరథ వనంలా దివ్యంగా వున్న ఆ వనం పూవులనే నక్షత్రాలతో, నీలాకాశంలా, రత్నాకరంలా, మనోహర పరిమళభరితమయిన గంధమాదనంలా వుంది.

ఎదురుగా ఒక ప్రాసాదం కనబడింది.

అది వేయిస్తంభాలతో కైలాసగిరిలా ఉంది.

పగడాల మెట్లతో బంగారువేదికలు.

ఆకాశాన్ని అంటే ఎత్తు,

చూస్తున్నాడు హనుమంతుడు.

నిశితంగా దృష్టిని కేంద్రీకరించాడు.

శుక్ల పాడ్యమినాటి చంద్రరేఖవలె, ఉపవాసాలతో కృశించిన దీనవదనంతో, మలినవస్త్రధారిణియై, రాక్షసీజనపరివృతయై, పొగక్రమ్మిన అగ్ని జ్వాలవలె, కుజగ్రహ పీడిత
యిన రోహిణీ నక్షత్రంలా, క్రూర మృగాలమధ్య ఆడులేడిలా, నల్లత్రాచువంటి జడతో, పచ్చనివస్త్రం ధరించి ఉన్న విశాలనయనను చూశాడు.

చూచి చూచి:

ఈవిడ సీత అయివుండాలి.

ఔను - నాడు రావణుడు తీసుకువచ్చేటప్పుడు తాము ఋశ్యమూకం నుండి చూచిన వనితారత్నం యిలానే ఉంది.

అదే చంద్రవదనం, అదే భ్రూ
ధ్యం, అదే దేహకాంతి. పద్మ దళనయన, బింబాధర, రతీదేవిలా ఉన్నది నియమనిష్టలతో ఉన్న తాపసి. భయకంపితయై రోజుతూన్న నాగరాజ పత్నిలా ఉంది.

సందిగ్ధమయిన స్మృతిలా క్షీణ సంపద వలె, ప్రతిహతమయిన ఆశలా, విఘ్నమయిన కార్యంలా, కలుషమయిన బుద్ధిలా, చెదరిన శ్రద్దవలె, అపవాద దూషితమయిన కీర్తివలె ఉన్నది.

రావణుడు అపహరించాడనే బాధతో కృశించింది. రాక్షస స్త్రీలు పెట్టే బాధలు పడలేనట్లుంది. బెదరిన లేడిపిల్లలా చూస్తున్నది.

కన్నీటితో నిట్టూర్పులు విడుస్తూ, కారుమేఘాల మా
టున చంద్రకాంతిలా, మననం లేక విస్మరించిన విద్యలా, వ్యాకరణసంస్కారం లేక అనర్థద్యోతకమయిన వాక్కులా ఉంది.

జానకీదేవి ఏఏ అలంకారాలు ధరించేదని రాముడు వివరించాడో వాటి గుర్తులు కనిపించాయి.

అవే కర్ణాభరణాలు, అవే కంకణాలు. అవిగో మాణిక్య దీప్తులు, పగడాల కాంతులు. కొంచెం తగ్గి నల్లబడ్డాయి.

ఋశ్యమూకం మీద పడవేయగా మిగిలిన నగలు కాబోలివి. ఆనాడు ఆ నగలమూటకు కట్టిన పట్టుచీర చెరగు, ఈ చీరదే, ఇంతకాలంగా కడుతున్నా నలిగినా, మాసినా పూర్తిగా రంగు మాయలేదు.

ఈ కనకాంగి నిశ్చయంగా రామపత్నియే. ఈమె మనస్సు ఆయన మీదనే ఉన్నట్టుంది.

రాముని కీమెయందు జాలి - అబల బలాత్కృతయై అపహరింపబడినదని.

ఈమె యందు ఆదరభావం - తననే నమ్ముకుని వచ్చి యిలా కష్టాలపాలయిందని.

దుఃఖం - ఇటువంటి యిల్లాలితో వియోగంవల్ల,

మదన తాపం - హృదయేశ్వరి దూరమయిందని.

ఇంక సందేహం లేదు.

ఈవిడే ఆయన భార్య.

వీరుభయుల మనస్సులూ ఒకరియందొకరికి లగ్నమయి ఉండడం వల్లనే యింకా జీవించి ఉన్నారు వీరు.

ఈవిడ దగ్గరలేని దుఃఖంతో ఆయన ఎలా జీవించగలుగుతున్నాడో!

ఎంత దుర్భరమయిన వ్యధ, అని సీతా సందర్శన సంతోషంతో నిండిన హనుమంతుని మనస్సు రామచంద్రుని అభినందించింది.

ఆలోచన

Ashokam - అశోకం

రామాయణం సుందరకాండ పదునాలుగవ సర్గ - అశోకం

రావణ భవనప్రాకారం వదలి అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు. ఒక్కసారి శరీరమంతా పులకించింది. తెలయని సంతోషం ఆవహించింది.

వసంత ప్రారంభవేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పాన్న, మామిడి, అశోక, సంపెంగవృక్షాలు గుంపులు గుంపులుగా వున్నాయి.

నారి సారించి విడచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు. రంగు రంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, నెమళ్ళు.

ఆయన గమనవేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి. ఆ పక్షులు రెక్కలాడిస్తూంటే సాలవృక్షం మీది పూలు వానజల్లులా నేలకు రాలాయి.

అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలా ఉన్నాడు.

పుష్పాలంకృతుడై విహరించే ఆయన వసంతునివలె ఉన్నాడు. పూలతో నిండిన ఆ వనభూమి రకరకాల ఆభరణాలతో అలరారే సుందరీ
ణిలా ఉంది.

ఆకులురాలిన కొమ్మలతో, పూలు, పండ్లులేని శాఖలతో ఆ వృక్షాలు వస్త్రాభరణాలుకూడా ఓడిన జూదరిలా ఉన్నాయి.

ఆయన తన వాలంతో, దీర్ఘబాహువులతో, పాదాలతో 
ర్దించిన వృక్షాలు-

శరీరంమీది గంధపుపూత రాలిపోయి, జుట్టు విరబోసుకుని, దంతక్షత, నఖక్షతాలతో నిండిన యువతిలా ఉన్నాయి.

వింధ్యగిరిమీది వర్షామేఘాలు ప్రచండ వాయువుతో చెల్లా చెదరయినట్లు, హనుమంతుని విహారగమనతీవ్రతకు ఆ వనంలోని లతలన్నీ చెదరిపోతున్నాయి.

తిరుగుతూ చూస్తున్నాడు హనుమంతుడు.

సువర్ణ, మాణిక్య, రజత కాంతులీనే ప్రదేశాలు.

స్ఫటిక సోపానాలతో దిగుడుబావులు.

వాటినిండా కలువలు, కమలాలు.

హంసల, చక్రవాకాల, చాతకాల కలస్వనాలు, అమృతమధురంగా ఉండే జలాలు.

అంద
యిన గిరిశిఖరాలు. వాటిమీద ఎన్నో వృక్షాలు. ఆ చుట్టూ శిలామండపాలు.

ప్రియుని ఒడినుండి దూకుతున్న ప్రియురాలివలె ఆ గిరిశిఖరం నుండి జారుతున్న సెలయేరు. దానిలోకి వంగిన కొమ్మలుగల వృక్షాలను చూస్తూంటే, ఎంత కోపం వచ్చినా ప్రియుని విడచి పోకూడదమ్మా, అని వారించే ఆత్మబంధువుల్లా వున్నాయి.

ఒక వంక దూకి, 
లుపు తిరిగిన ఆ యేరు, కోపంవదలి ప్రసన్నురాలయి భర్తను చేరే ప్రేయసిలా ఉంది.

ఆ సమీపంలో రకరకాల విహంగాలు. ముత్యాలకాంతి యిసుకతో, మణిసోపానాలతో, చల్లని నీటితో అలరారే దిగుడుబావి.

ఆ పరిసరాలలో విశ్వకర్మ వినిర్మితమయిన క్రీడావన, భవనాలు. తెల్లని గొడుగులు, బంగారు వేదికలు, సెలయేళ్ళు, శింశుపావృక్షాలు.

అగ్నికాంతులీనే వృక్షాలమిద తిరిగే హనుమంతుడు మేరుపర్వత దీప్తులతో వెలిగే సూర్యునివలె ఉన్నాడు.

బంగరు కాంతుల తరువులను చూస్తూ, గాలి కదిలితే చిరుగంటల మ్రోతలీనే ధ్వనికల శింశుపావృక్షం అధిరోహించాడు. అది లేతచివుళ్ళతో, మొగ్గతొడిగి, వికసితముఖాలుకల పూలతో ఉంది.

ఇక్కడ జానకి ఉండవచ్చు. రా
దర్శనకాంక్షతో ఆమె యీ పరిసరాలలో తిరుగుతూ ఉండాలి. ఈ చుట్టుప్రక్కల అంతా పొగడలు, సంపెంగలు, మంచిగంధపు తరువులు. జలపక్షి సమూహాలతో పద్మసరోనరం.

రామమనోహరి జానకి. వనశోభలెరిగిన ఆ రాఘవహృదయేశ్వరి, రామ విరహబాధతో తప్పకుండా యీ వనానికి వస్తుంది.

జనకరాజనందన, రా
చంద్రుని అర్ధాంగి, వనవాసప్రియ, సంధ్యాసమయ విధ్యుక్త కార్యనిర్వహణకై యీ శుభప్రదమయిన జలాశయం దగ్గరకువచ్చి తీరుతుంది. ఆవిడ జీవించివుంటే యిక్కడకు రాకుండా ఉండదు, అనుకుంటూ శింశుపావృక్షం మీద నుండి అంతటా పరికిస్తున్నాడు హనువముంతుడు.

సీతాసందర్శనం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Manastaapam - మనస్తాపం

రామాయణం సుందరకాండ 11,12,13 సర్గలు - మనస్తాపం

రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రయిన లతాగృహాలు, నిశాసౌధాలు అన్నీ తిరిగాడు. జానకీదేవి జాడలేదు.

ఈ దుష్ట రాక్షసుని చేతులలో పడడం యిష్టంలేక జానకీదేవి ప్రాణ త్యాగం చేసి ఉండాలీ. ఈ రాక్షస వికృతాకారాలు చూసి గుండె ఆగి మరణించిందేమో!

ఇప్పుడు సీతను చూడకుండా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళడమెలా! ఆ కపిరాజు దండనితి విషయుంలో చాలా తీక్షణదృష్టి కలవాడు. అంతకు ముందుగా - వానరవిరులందరూ కనిపిస్తారు, వారికేం చెప్పాలి. సుగ్రీవుడు పెట్టిన గడువుదాటింది కనక వారంతా ప్రాయోపవేశం చేస్తారు. సముద్రం
దాటివెళ్ళగానే అంగద, జాంబవంతులు ఎదురువస్తే వారికి ఏం చెప్పను, అని చింతించాడు.

అంతలో వివేకం తెచ్చుకుని-

సర్వ అనర్ధాలకూ దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి. అదే శ్రేయస్కరం.

మరోసారి అంతటా వెదకుతాను, అనుకుని మళ్ళీ అన్ని వనాలూ, శాలలూ, భవనాలూ వెదుకుతున్నాడు,

రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్యాసమూహోన్ని చూశాడు. సీత జాడలేదు.

మళ్ళీ విచారంలో పడ్డాడు.

ఇందరు వానరుల శ్రమకూ ఏవిటి ఫలితం?

రా
చంద్రునికి ప్రీతికరమయిన పని చేద్దామని బయలుదేరాను. లంకలో అంగుళం మేర విడవకుండా వెదకగలిగినా అమ్మవారిజాడలేదు.

గృధ్రరాజు సంపాతి చెప్పాడే - సీత లంకలో ఉన్నదని? ఎక్కడుంది ఆవిడ?

మిధిలాధీశుడయిన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా!

ఒకటి జరిగి ఉండవచ్చు- 

రామబాణభీతితో వచ్చే రావణుడు తీవ్రవేగంలో సీతను సముద్రంలో విడిచి ఉండాలి. లేదా సీత స్వయంగానే సాగరమధ్యంలో పడిపోయిందేమో! ఈ దుష్టుడిబాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శీలరక్షణ దీక్షకు విసిగి ఈ రావణుడే ఆ యిల్లాలిని తిని ఉంటాడా! కాకుంటే - ఈ రాక్షస స్త్రీలే ఆరగించి ఉండరుకదా! రామనామ జపంతో ఆవిడే తనువు చాలించిందా!

కాకుంటే ఆ రావణాంతఃపుర పంజరంలో చిలకలా నిరంతరం రామనామం జపిస్తూ ఉండదా!

ఇప్పుడు వెళ్ళీ రామచంద్రునికి ఏం చెప్పాలి! వెళ్ళిన తరువాయి ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏది చెప్పినా ముప్పే.

అదీకాక - సీతను చూడకుండా వెడితే నేను ఏం సాధించినట్లు?

సీత కనబడలేదు, అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు. అది చూచి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని ఆయోధ్యలో భరత, శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు.

కృతజ్ఞతకు మారుపేరయిన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా! ఆయనతో పాటు ఆయన భార్య రు
, తార, అంగదుడు వీరందరూ దేహయాకత్ర ముగిస్తారు.

ఈ దుఃఖంతో వానరులందరూ తలలు బ్రద్దలు కొట్టుకుంటారు! విషం మింగుతారు, ఉరిపోసుకుంటారు, అగ్నిగుండాలలో దూకుతారు,

ఉపవాసాలతో 
రణిస్తారు. సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకువంశం, ఇటు సర్వవానరజాతి నాశనం తధ్యం.

అందుచేత నేనిక్కడే వాన ప్రస్ధజీవితం గడిపితే వారందరూ నేనింకా సీతాన్వేషణం చేస్తున్నాననే ఆశతో జీవిస్తారు.

ఏమయినా సరే నేను వెళ్ళక పోవడమే మంచిది. చితి పేర్చుకుని అందులో దూకుతాను. లేదా ఏ చెట్టు క్రిందనో ఉపవాస నియమంతో కూర్చుంటే కాకులూ, కుక్కలూ నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇదొక నిర్యాణ మార్గం,

సీతను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి, అని కొంతసేపు విచారించి:

ఛీ! మరణం కంటె దోషం లేదు. బ్రతికి ఉంటేనే సుఖాలకు ఆస్కారం ఉంది; ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు, ఇప్పుడింక ఈ దశకంఠుని కడతేరుస్తాను. కాదు, వీణ్ణి బలిపశువులా తీసుకుపోయి రాముని ముందు పడేస్తాను.

అనుకుంటూ మళ్ళీ శోకసముద్రంలో మునిగి-

ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో యిక్కడే శేషజీవితం గడుపుతాను, అందువల్ల అయోధ్యలో వారూ కిష్కింధలో వీరూ సుఖంగా ఉంటారు, అనుకుని ముందుకు సాగాడు.

ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇంతవరకూ ఈ వనం చూడలేదు, అనుకుంటూ, ఆదిత్య, వసు, రుద్ర, అశ్వనీ దేవతలకు నమస్కరించి:

తపస్వి జనానికి ఫలసిద్ధివలె ఇక్ష్వాకు కులవర్ధని అయిన సీతాదేవిని రామునికి అందించాలి, అనుకుని:

రామ లక్ష్మణులకు, జానకీదేవికి, ఇంద్ర, రుద్ర, వాయు, యమ దేవతలకు న
స్కారం. సూర్య, చంద్రులకు ప్రణామం. మా ప్రభువు సుగ్రీవునికి అభివాదం, అనుకుంటూ అశోకవనం వయిపుసాగుతూ:

ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు, అనేకులు రక్షిస్తూ ఉండవచ్చు. వాయువుకూడా యిక్కడ తగు మాత్రంగా చలిస్తూంటాడు.

ఇప్పుడింక నా కార్యసాధనకు దేవతలూ, ఋషులూ సాయపడాలి. చతుర్ముఖ ప్రజాపతితో సర్వదేవగణాలూ, అగ్నిహోత్రుడూ, వాయువూ, వజ్రధారి దేవేంద్రుడూ, పాశహస్తుడయిన వరుణుడూ, సూర్య, చంద్రులూ, త్రినేత్రధారి శివుడూ, అశ్వని దేవతలూ అందరూ నాకు కార్యసిద్ధి యివ్వాలి. సర్వభూతాలూ, భూత నాథులూ, నా యత్నానికి తోడుపడాలి. ప్రసన్న 
చంద్రబింబంవంటి మోముగల జానకీదేవి నాకు కనిపించాలి.

పరమదుష్టుడూ, నీచుడూ, క్రూరుడూ అయిన ఈ రావణునిచే అపహరింపబడిన జానకీదేవిని ఎలా చూడగలనో - అనుకుంటూ అశోకవనం వయిపు సాగుతున్నాడు.


అశోకం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Viswasam - విశ్వాసం

రామాయణం సుందరకాండ 32వ సర్గ - విశ్వాసం ఆ మాటలు విన్న సీత మనస్సు తృప్తిపడింది. హనుమంతుని వైపు తిరిగి: అయితే నర వానరులకు సఖ్యం ఎలా కలిగింది? ను...