Thursday, August 13, 2026

Rakshasa Pravrtti - రాక్షస ప్రవృత్తి

రామాయణం సుందరకాండ ఇరువది మూడు, ఇరువది నాలుగు సర్గలు - రాక్షస ప్రవృత్తి

రావణుడు అంతఃపురం చేరాడు,

అశోకవనంలోని రాక్షస స్త్రీ లందరూ సీతను చుట్టుముట్టి క్రోధంతో: 

మా ప్రబువు రావణుడంటే ఎవరనుకుంటున్నావో, పులస్త్య వంశంలో ప్రబవించిన మహామహుడు అటువంటి ఉత్తమపురుషుని వరించడానికి బాధపడతావేమే! అని గర్జించిందొకతె.

ఏకజట: ప్రజాపతులు ఆరుగురు. వీరందరూ బ్రహ్మమానసపుత్రులు. వారిలో నాలుగవవాడు పులస్త్యుడు. ఆయన కుమారుడు విశ్రవసువు, 
హాతేజశ్శాలి, మహర్షి, వీరి కుమారుడు మా ప్రభువు, రావణుడు. ఆయనను వరించడం నీ అదృష్టం. 

హరిజట: దేవతా శ్రేష్ఠులను జయించిన 
మ రాక్షస ప్రభువే నీకు యోగ్యుడయిన భర్త.

ప్రఘన: 
హావీరుడు, శూరుడు. యుద్ధరంగంలో వెన్ను చూపని మహాయోధుడయిన మా మహారాజును వరించడానికి సంకోచం దేనికీ? ఆయన తన ప్రీయురాండ్రందరను విడిచి నిన్నే దగ్గరకు తీసుకుంటాడు. వేలసంఖ్యలో ఉన్నారు ఆయనకు భార్యలు. వారినీ, మణి, రత్న, శోబితమయిన అంతఃపురాన్నీ విడిచి నిన్నే ఆరాదిస్తాడాయన.

వికట: దేవ, నాగ, గంధర్య, రాక్షసవీరులను మన్ను కరిపించిన మా 
హారాజు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి శ్రీమంతునితో ఉండడానికి ఎందుకంగీకరించవు?

దుర్ముఖి: తెలుసా నీకు; ఆయనకు భయపడి సూర్యుడు విజృంభించలేడు. వాయువు ప్రచండంగా చలించలేడు. లతలు, తరువులు పూలవానలు కురుస్తూంటాయి. అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు. అంతటివాడు మా ప్రభువు. నా మాటవిని అయనను వరించు. లేదా నీ ప్రాణాలుండవు.

సర్వప్రాణికోటికీ ఆహ్లాదం కలిగించే రీతిలో సర్వభోగాలతో ఉంటుంది ఆయన అంతఃపురం. అక్కడకు వెళ్ళి హాయిగా వుండు.

నువ్వు మానవస్త్రీవి కనుక మానవుడి భార్యవయావు. బావుంది. కాని యిప్పుడింక మనసు మార్చుకో,

త్రిలోకాలలో వుండే సంపదలతో వెలిగే మా రాక్షస ప్రభువుతో స్వేచ్చగా చరించు.

రాజ్యహీనుడు, ఎందుకూ కొరగానివాడు అయిన రామునికోసం బాధపడకు, అని ఒక్కొక్కరే బెదరిస్తూ బోధిస్తుంటే కన్నీట తడిసి సీత:

మీ మాటలు సర్వలోకాలకూ అసహ్యమయినవి. ఈ పాపకార్యానికి నా మనస్సులో చోటు లేదు. మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను మీ మాట వినను.

దీనుడయినా, రాజ్య హీనుడయినా రాముడే నా భర్త. ఇంద్రుని వెంట శచీదేవి, వశిష్ఠులతో అరుంధతి, చంద్రుని కూడి రోహిణి, అగస్త్యులవారితో లోపాముద్ర, చ్యవనునితో సుకన్య.

సావిత్రీ - సత్యవంతులూ, శ్రీమతి - కపిలుడు, మదయన్తీ - సౌదానులు, కేశినీ - నగరులు, నల - ద
యంతులు, అలానే నేను రామునితో ఉంటాను, అని నిశ్చలంగా చెప్పింది.

రాక్షస వనితలకు క్రోధం రేగింది. పరిపరి విధాల పరుష భాషలతో వేధిస్తున్నారు.

శింశుపావృక్షశాఖలలో ఉండి చూస్తున్నాడు హనుమంతుడు.

ఆ క్రూరరూపిణులు పళ్ళుకొరికి, పెదవు లాడిస్తూ, గండ్రగొడ్డళ్ళు పైకెత్తి;

ఇది మన ప్రభువుకు తగదు, అని గర్జించారు.

వారిలో వినత;

సీతా! ఇంతవరకూ చూపిన పతిభక్తిచాలు, సంతోషించాం. దేనికయినా అతి పనికిరాదు. నా హితవు ఆలకించు. దీనదశలోవున్న మానవ భర్తను విడిచి, ఇంద్రస
పరాక్రముడయిన మా రాక్షసేశ్వరుని వరించు. దివ్యభోగాలతో మహారాణిగా వెలుగుతావు. రాముడికెప్పుడో ఆయువు చెల్లిపోయింది. 
అటువంటి వాడికోసం బాధపడకు. నామాట వినవో, నిన్ను చీల్చుకు తినెయ్యగలం.

వికట: ఓసి దుష్టురాలా! ఇంతవరకూ నీ పాడుమాటలు వింటూ కనికరాంతో వదిలిపెట్టాం. నువ్వెక్కడున్నావో తెలుసా? ఏ ప్రాణీ దాటిరాలేని సముద్రానికి ఈవలి ఒడ్డున ఉన్నావు.

రావణుని అంతఃపురంలో వున్నావు. ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. ఎందుకేడుసావు! నా మాటవిను. సుఖంగా ఉంటావు. మా మహారాజును వరించు.

నవ నవలాడే ఈ యౌవనం స్థిరంగా శాశ్వతంగా వుండదు. అది పోకుండానే సుఖసంతోషాలలో తేలియాడాలి.

చూశావా! ఉద్యానవనాలు, పర్వత, కాననాలు, మా ప్రభువు కనుసన్నలలో మెలిగే ఏడువేలమంది కామినీ జనులు అన్నీ నీ కోసం యిస్తాడాయన

వినిపిస్తున్నదా నా మాట! వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాం

చండోదరి: ఇదిగో యీ శూలం చూశావా! నిన్ను చూసిననాటినుండి నీ గుండె చీల్చి ప్రేగులు చుట్టబెట్టి, తల పగలగొట్టి తినాలని నాలుక ఊరుతున్నది.

ప్రఘన: ఓ సీతా! ఇంక నేను ఆలస్యం సహించలేను. నీ గొంతునులిమేస్తాను. నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకి చెపితే, హాయిగా ఆరగించండి అని -ఆజ్ఞాపిస్తాడు మా ప్రభువు.

అజాముఖీ: దీన్ని చంపి సమంగా పంచుకు తినాలి ఈలోగా నంజుడికి మంచి పచ్చళ్ళ, త్రాగడానికి కల్లూ కావాలి.

శూర్పణఖ : నీ మాట సబబుగా ఉంది అలా కానియ్యి, సర్వదుఃఖాలకూ విరుగుడయిన కల్లు తెప్పించండి త్వరగా సుఖంగా త్రాగి దీని మాంసం తిని నికుంభిలాదేవి దగ్గరనాట్యం చేద్దాం.

ఇలా ఎవరికి తోచినట్లు వాఋ గర్జనలు సాగిస్తుంటే బెదరిన హృదయంతో శోకసాగరంలో మునిగింది జానకి.

విషాదం

Ravanuni Krodham - రావణుని క్రోధం

రామాయణం సుందరకాండ ఇరువదిరెండవ సర్గ - రావణుని క్రోధం

జానకి పలుకులలో పారుష్యం భరించలేక రావణుడు:

నెమ్మదిగా మాట్లాడి వశం చేసుకుందా మనుకుంటుంటే నన్నే వంచుతున్నావు. ప్రేమగా మాట్లాడుతుంటే పరాభవిస్తున్నావు.

నీ మీది అనురాగం నా క్రోధతీవ్రతను హరిస్తున్నది. కాముకుడికి దయ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే నిన్ను ఏమీ చెయ్యకుండా వదలవలసి వస్తున్నది. లేకుంటే ఎప్పుడో నిన్ను కడతేర్చి ఉందును.

ఇంకా నీకు రెండు మాసాల గడువుంది. ఈలోపున నువ్వు నా శయనమందిరం చేరి, నన్ను భర్తగా గ్రహించావా, మేలు.

కాదంటే - నిన్ను ఉదయపు ఫలహారానికి వండించేస్తాను. అంటూంటే రావణుని వెంట వచ్చిన దేవ, గంధర్వ కన్యలు దుఃఖంతో సీతను చూస్తూ, అటువంటి ప్రమాదం రాదని హస్త, నేత్ర సంజ్ఞలతో జానకికి ధైర్యం కలిగించారు.

గుండె దిటవు చేసుకుని సీతాదేవి:

రావణా! ఈ అకార్యం నుంచి నిన్ను సక్రమ మార్గాన నడిపించే వాడు ఒక్కడూ ఈ లంకలోలేడు, అంటే నీ పరిజనులందరూ నీ నాశనాన్నే కోరుతున్నారు. ఇంద్రునికి శచీదేవివలె నేను రాముని ధర్మపత్నిని. అటువంటి నన్ను వాంఛించేవాడు ముల్లోకాలలో ఉండడు. నీకే పుట్టింది ఈ దుర్బుద్ధి.

ఆయన క్రోధాగ్ని నుంచి నువ్వు తప్పించుకోలేవు.

నువ్వెరుగుదువో, ఎరగవో!
ఆయన మత్తేభం,
నువ్వు చెవులపిల్లివి.

ఈ క్షణం వరకూ నువ్వు ఆయన కంటబడలేదు కనుక సిగ్గులేకుండా తిరుగుతున్నావు నిర్భయంగా.

నావంటి పతివ్రతను దుష్టబుద్ధితో చూచిన క్షణంలోనే నీ కళ్ళు నేల రాలవలసింది, ఈ దుర్భాషలాడే నీ నాలుక ఈపాటికే ఊడిపోవలసింది.

రామాజ్ఞ లేదు కనుక, పాతివ్రత్య నియమానుసారం నేను నిన్ను బూడిద చెయ్యకుండా వదలిపెట్టాను.

ఇంతకూ నీ చావుకోసమే నన్ను అపహారించి తెచ్చావు. యక్షేశుడయిన కుబేరుని సోదరుడవు.

మహాశూరుడవు కదా! ఇలా వంచనతో పర దారాపహరణ నీచకార్యం ఎందుకు చేశావు? అని అంటుంటే రావణుడు తన అరుణ నయనాలు మరింత ఎరుపెక్కించాడు. జిహ్వాగ్రం కూడా మండుతున్నట్టుంది.

ఉత్తుంగ భుజద్వయంతో రెండు శిఖరాలతో అలరారే మందరగిరిలా ఉన్నాడు.

సర్వాంగాలంకృతుడై వసంతునిలా ఉన్నా ఆ తీవ్రక్రోధంతో శ్మశాన చైత్యంలా ఉన్నాడు. కుపిత భుజంగం బుసకొడుతూన్నట్టు నిట్టూర్పులు విడుస్తూ సూర్యకాంతి సంధ్యాతిమిరాన్ని చెదరగొట్టేట్లు నిన్ను భస్మం చేసేస్తాను, అని అక్కడి రాక్షస స్త్రీజనాన్ని సాభిప్రాయంగాచూస్తూ:

ఎలా అయినా యీ సీత మనసు మార్చండి. సామ, దాన, భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించండి.

అని భయంకరాకారంతో సీతవైపు తిరిగాడు.

అప్పుడు ధాన్యమాలిని అనే నారీమణి చకచక రావణునిచేరి, గాఢంగా కౌగలించుకుని:

నాథా! కృశించి, దీనంగా పడివున్న యీ మానవప్రాణితో నీ కేమిటయ్యా. నాతో భోగించు. దీనికి నీ భోగాలు అనుభవించేయోగం లేదు.

మనమీద యిష్టంలేని వారితో వెడితే. శరీరతాపమే తప్ప సుఖంలేదు.

నిన్ను కోరేవారితో భోగం తృప్తినిస్తుంది, అని పాగుడుతూంటే, రావణుడు అట్టహాసం చేసి వెనుదిరిగాడు. ఆయనతో వచ్చిన వారందరూ అనుసరించి వెళ్ళారు.

ధర్మనిష్ఠురాలయిన జానకీదేవి గజ గజ వణుకుతూ ఉండిపోయింది.

Wednesday, August 12, 2026

Trnaprayum - తృణప్రాయుం

రామాయణం సుందరకాండ ఇరువది ఒకటవ సర్గ - తృణప్రాయుం

రావణుని ప్రలోభపూరిత మయిన కామప్రసంగం విన్న సీత, ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి, భయకంపితయై దీనస్వురంతో.

నీ 
నస్సు మార్చుకుని నీ నారీజనం మీద నిలుపుకో. పాపికి సత్ఫలితాలు దొరకవు. అలానే నీకు నేను అందను.

నా పుట్టినిల్లు, మెట్టినిల్లు పర
పవిత్రమయినవి నేను యీ అకార్యం చెయ్యను, అంటూ ముఖం ప్రక్కకు త్రిప్పి;

సజ్జనధర్మాన్నీ, వారి నియమాలనూ విస్మరించకు. నేను పతివ్రతా ధర్మశీలను, పరస్త్రీని, అటువంటి నన్ను భార్యగా భావించడం నీకు తగదు.

నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు; వారి రక్షణ నీకెంత ముఖ్యమో నా రక్షణ నా బర్త కంత ప్రదానం.

కట్టుకున్న భార్యతో తృప్తిపడని వానిని చపలచిత్తునిగా, ఇంద్రియ నిగ్రహంలేని వానిగా బావించి పరాభవిస్తారు, పరస్త్రీలు.

ఈ లంకానగరంలో సత్పురుషులే లేరా! ఉన్నా వారి మాట నీ చెవి కెక్కడంలేదా! సదాచారవిరుద్ధంగా నీ బుద్ధి యింతటి విపరీతానికి ఒడిగట్టిందేం! ఆత్మజ్ఞానశూన్యుడై, దురాచారపరుడైన రాజువల్ల రాజ్యం సర్వనాశనమవుతుందని ఎరుగవా!

సర్వసంపదలతో అలరారే ఈ లంకానగరం నీ ఒక్కడి దురాచారాల వల్ల త్వరలోనే నశిస్తుంది. దూరదృష్టి లేకుండా నువ్వు చేసే పాపకర్మలు నిన్ను బలిగొన్నరోజున సర్వభూతకోటీ సంతోషిస్తుంది. ఈనాడు నీ దుర్మార్గాలకు తలవంచిన వారందరూ నిన్ను ఆడిపోసుకునే రోజు రాకపోదు. ఆనాడు దైవం తమను అనుగ్రహించి నిన్ను కడతేర్చిందని సంతోషిసారు.

నీ సిరి సంపదలు నన్ను వంచించవు, సూర్యుని వీడని కాంతిలా రాముని వెన్నంటి నేనుంటాను. సర్వలోకనాధుడయిన శ్రీరామచంద్రుని భుజసీమ ఆధారంగా శయనించె నేను మరొకరిని తాకను. ఆత్మజ్ఞానియైన విప్రునికి లభించే వేదవిద్యవలె నేను రాముని సంపదను. ఈ దుఃఖసాగరం
నుండి నన్ను ఉద్ధరించి రాముని దగ్గరకు పంపు.

నీకు జీవితంమీద ఆశవుంటే నేను చెప్పినట్లు చెయ్యి. రామునితో స్నేహం చేసుకో. ఆయన ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు ఇంద్రియ దౌర్బల్యాలకు లొంగకు. నన్ను నా భర్త దగ్గరకు పంపితే నీకు శ్రేయస్సు కలుగుతుంది, లేదా నీ మరణం తథ్యం.

ఇంద్రుని వజ్రాయుధాన్ని తప్పించుకోవచ్చు.
పాశాన్ని వదిలించుకోవచ్చు.
కాని రామబాణానికి తిరుగులేదు.

అగ్నిశిఖలు జిమ్మే 
హాసర్పముఖాలవలె, రా, లక్ష్మణుల నిశితబాణాలు యిక్కడపడక తప్పదు. ఈ నగరంనిండా రాబందులు చేరి నీ రాక్షసజనాన్ని పీక్కుతింటాయి. రాగరుత్మంతుడు రాక్షస సర్పాలను తనవాడిగోళ్ళ బాణాలతో చీల్చి చెండాడుతాడు.

రాక్షసలక్ష్మిని మూడడుగుల వామనుడు హరించినట్లు శత్రునాశన సమర్థుడయిన రాముడు ఈ రాక్షసశక్తిని నశింపజేసి నన్ను తీసుకువెడతాడు.

జనస్థానంలో నీ రాక్షసబలాన్ని అయన సర్వనాశనం చేసినప్పుడు ఎదుర్కోలేని అసముర్ధుడవు; వారు ఆశ్రమంలో లేనప్పుడు వచ్చావుకనక యీపని చెయ్యగలిగావు.

వారి కంటబడితే పెద్దపులులముందు కుక్కలా అయేవాడవు. వృత్రాసురుడు ఇంద్రుని నిగ్రహించలేనట్లే నువ్వు రా
లక్ష్మణులను ఎదుర్కొనలేవు. సూర్యరశ్మి జలాశయాలను ఆవిరిచేసేటట్లు రామలక్ష్మణులు నిన్ను ప్రాణహీనుని చేస్తారు.

కుబేరనిలయుంలో దాగినా, వరుణాలయంలో శరణుపొందినా, పిడుగుపడిన చెట్టువలె నీకు శ్రీరామబాణంతో చావు తప్పదు, అంటున్నది సీత.

అకామాం కామయానస్య
శరీర ముపతప్యతే
ఇచ్చంతీం కామయానస్య
ప్రీతి ర్భవతి శోభనా

రావణుని క్రోధం

Ravana Pranayam - రావణ ప్రణయం

రామాయణం సుందరకాండ ఇరువదవ సర్గ- రావణ ప్రణయం

తాపసిలా ఉన్న ఆ పతివ్రతను చూసి రావణుడు మధుర వాక్యాలతో తన ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు:

ఓ సుందరీ! ఎందు కింత భయం? ఆ భయంతో నీ సౌందర్యం అంతా దాచుకుంటావు దేనికి. సర్వలోకాలనూ ఆకర్షించే నీ అందాన్ని నేను అర్థిస్తున్నాను. నన్ను ఆదరంతో ప్రేమించు.

ఇక్కడ మీ మానవ ప్రాణి లేదు. వీరెవరూ కామరూపశక్తికలవారు కారు. నీలానే మాకు కూడా ధర్మభీతి చాలా ఉంది.

పరస్త్రీలను బలాత్కరించడం, అపహరించడం, వారితో భోగించడం - యిది రాక్షసజాతి ధర్మం. ఈ ధర్మనిర్వహణలో నెను అప్రమత్తంగా ఉంటాను. మరొక్క మాట,

నీ మనస్సు నన్ను కోరేవరకూ నేను నిన్ను ముట్టను. మదన తాపం నా మనస్సును ఎంత వేధించినా నీకు అంగీకారం అయే వరకూ నేను నిన్నేం చెయ్యను, అని నమ్ము. ఎందుకీ దుఃఖం. సుఖంగా నన్ను ప్రేమించు.

కటిక నేలమీద, మలిన వస్త్రంతో, ఏకవేణితో, నిష్కారణంగా ఉపవాసాలతో, ఎందుకు దీర్ఘాలోచనతో కాలం గడుపుతావు.

హాయిగా నా మాట విని, నన్ను అంగీకరించు.

రత్నాభరణాలు, సుగంధ, సుమమాలలు, చీనాంబరాలు, మణిమయ పీఠాలు, రకరకాల పానీయాలు, గీత, నృత్యగోష్ఠులు, హంసతూలికా తల్పాలు అన్నీ అనుభవించు.

నదీ ప్రవాహం వెనుదిరిగిరానట్లే యౌవనం కూడా మళ్ళీరాదు.

నిన్ను చూస్తుంటే, ఆ సృష్టికర్త సర్వసౌందర్యరాశిగా నిన్ను సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడా అనిపిస్తున్నది. పితామహుడయిన బ్రహ్మకు కూడా కన్ను చెదిరే అందం. నీది.

నీ శరీరంలోని అణువణువూ అత్యంత మనోహరమై నా కన్నులకు బంధం వేస్తున్నది.

నా మాటవిని నన్ను భర్తగా గ్రహించు. నా రాణివాసానికి పట్టమహిషిగా ఉండదగిన దానవు.

దిగ్విజయయాత్రలో నేను తెచ్చిన రత్న మాణిక్యరాసులతో నా రాజ్యమూ నేనూ నీ అధీనంలో ఉంటాము.

సర్వనగరశోభితమయిన ఈ భూమండలం అంతా మీ తండ్రి జనకుడికి దానం చేయమన్నా చేస్తాను.

ఈ భువనభవనంలో నన్నెదిరించి నిలువగల విరుడులేడు. సురాసురులలో నాకు శత్రువై బ్రతికే అర్హత కలవాడు లేడు.

ఈ ఆకారం విడిచి స్వేచ్చగా సర్వాలంకారభూషితవై యధేచ్చగా నాతోకూడి పానక్రీడలు సాగించు. నీ చిత్తం వచ్చినట్లు ధన, కనక, భూదానాలు చెయ్యి.

నా సంపదలు, నా యశస్సు చూశావుకదా! ఇటువంటి భోగాలు విడిచి నారబట్టలతో తిరిగే రాముడికోసం బాధపడతా వెందుకు!

వానికి - సంపదలేదు. విజయకాంక్ష లేదు. వనవాసం, కటికనేల మీద శయనం; అన్నిటినీ మించి అసలామనిషి బ్రతికివున్నాడో లేడో తెలియదు. కారుమేఘాల వెనుకనున్న చంద్రకాంతిని చూడలేనట్టే నిన్ను రాముడు చూడడానికి కూడా శక్యం కాదిప్పుడు.

ఇంద్రహస్తగతమయిన కీర్తి హిరణ్యకశిపుడికి అందుతుందా! అలానే నా చేజిక్కిన నిన్ను రాము డందుకోలేడు.

ఓ చారునేత్రా! గరుత్మంతుడు వాడీగోళ్ళతో పామును పట్టినట్లు నీ అందంతో నన్ను హరిస్తున్నావు.

ఈ దశలో నిన్ను చూస్తూంటే నా మనస్సు వికలమై నా అనుగు భార్యలను కూడా ఆదరించలేకపోతున్నది.

సర్వగుణ లక్షణాలతో శోభించే నా అంతఃపుర స్త్రీలందరికీ నువ్వు యాజమాన్యం వహించు.

దేవలోకంలో అప్సరసలు లక్ష్మీదేవిని ఆరాధించే రీతిలో నా నారీజనం నిన్ను పూజిస్తారు.

నా సంపద కుబేరుని సంపదకు మించినది. అదంతా నీకు ధారబోస్తాను.

తపో బల పరాక్రమాలలో, యశస్తేజస్సులలో సంపదలో రాముడు నా గోటీకి పోలడు.

ఓ లలనా! హాయిగా ఆసవపానం చెయ్యి, స్వేచ్చా విహారంతో క్రీడాభోగాలనుభవించు. ఈ రాజ్యశ్రీ అంతా నీది. నీతోపాటు నీ బంధు కోటి కంతకూ యీభోగాలు అనుభవించే అదృష్టం కలిగించు.

వికసించి సువాసనలీనే పూలతోటలలో, సముద్రతీరవనాలలో హాయిగా సర్వాలంకారభూషితవై నాతో సుఖంగా అనుభవించు, అన్నాడు రావణుడు.

తృణప్రాయుం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Tuesday, August 11, 2026

Janakidevi - జానకీదేవి

రామాయణం సుందరకాండ పందొమ్మిదవ సర్గ - జానకీదేవి

ఉత్తమురాలయిన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూపయౌవన సంపన్నుడూ, సర్వాలంకారభూషితుడూ అయిన రావణుని చూస్తూనే పెనుగాలిలో అరటిమొక్కలా కంపిస్తూ, కాళ్ళూ చేతులూ ముడుచుకుని కూర్చుంది.

విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన నావలా ఉంది.

వ్రతనియమంతో, ఏ ఆస్తరణం లేకుండా నేలమీద కూర్చున్న ఆ యిల్లాలు చెట్టునుండి విరిగిపడిన కొమ్మలా ఉంది.

ధూళి ధూసరిత దేహంతో బురదనిండిన తామర తూడులా ఉంది.

తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరకే ఆమె మనస్సు ప్రయాణం చేస్తున్నది. రామునిమీదనే సర్వమూ లగ్నం చేసుకున్నది. మంత్రబద్ధమయిన ఆడత్రాచులా ఉంది. దూమకేతువు ఆవరించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది.

ఆచార కులశీల సంపన్నయై ప్రభవించి అనాచారపీడితయైనట్లుంది.

శిదిలమయే కీర్తిలా
అవమానిత శ్రద్ధవలె
క్షీణప్రజ్ఞలా, నెరవేరని ఆశలా
శూన్యమయిన భవిష్యత్తులా

ఎదురు తిరిగిన శాసనంలా, ప్రమాద సమయంలో మండే దిగంతంలా, దొంగిలింపబడిన పూజాద్రవ్యంలా, 

నలగదొక్కిన తామరతూడులా 
సర్వశూరులూ కూలిన సేనలా
చీకటి చుట్టుముట్టిన వెలుగులా
ఎండిన నదిలా
తుడిచిన వేదికలా
ఆరిన అగ్నిలా,
రాహువు నోట చంద్రునిలా

ఆకులూ, పూవులూ పెల్లగించిన ఏనుగు తొండంతో చెల్లాచెదరయిన మృణాళనాళంవలె

కృష్ణపక్షపు రాత్రిలా
ఎండవేడికి వడలిపోతున్న తామరతూడులా
గజరాజు బంధితుడు కాగా దుఃఖించే ఆడ ఏనుగులా,
మేఘాలు లేనిచోట వనంలా

ఉపవాస దుఃఖంతో కృశించి, దీనురాలై, అల్పాహారంతో, తపోధనంతో తన భర్తవల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలిబంధంతో ప్రార్థిస్తున్నట్టుంది.

పవిత్ర చరిత్ర కల ఆ ధవళాయతనేత్రను సంహరించేటట్లు చూశాడు రావణుడు.

రావణ ప్రణయం

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Ravanapravesam - రావణప్రవేశం

రామాయణం సుందరకాండ పద్దెనిమిదవ సర్గ - రావణప్రవేశం

తెల తెల వార నున్నది. ఆ సముయంలో

యజ్ఞకార్య నిర్వహణ సమర్ధులయిన వేదవేత్తల వేదపఠనం వినిపించింది. దానిని అనుసరిస్తూ మంగళవాద్య ధ్వనులు వస్తున్నాయి. అప్పుడు నిద్రలేచిన దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో శయ్య దిగాడు. జారిన ఆభరణాలూ, వస్త్రాలూ విడిచి, నూతనవస్త్రాభరణాలంకృతుడై
అశోకవనానికి బయలుదేరాడు.

మణిఖచిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులను దాటి వస్తున్నాడు.

దేవేంద్రుని వెన్నంటివచ్చే అప్పరసల వలె నూరుగురు గంధర్వ భామినులు ఆయన వెనుక బయలుదేరారు.

కొందరి చేతులలో బంగారు కాగడాలు, కొందరి హస్తాలలో తెల్టని వింజామరలు, మరికొందరి కరాలలో తాళవృంతాలు. బంగారు కుండలలో పవిత్ర జలాలతో కొందరు, మరికొందరు రత్నపీఠాలతో, ఖడ్గపాణులై కొందరు.

రత్నమయ పాత్రలో ఆసవం నింపి ఒకతె.
చంద్రకాంతు లీనే వెండిగొడుగుతో మరొకతె.
అందరూ నిద్రమత్తుతో అలసిన కనులవారే.

వారందరూ మేఘాన్ని అనుసరించే మెరుపులవలె ఉన్నారు. చెదరిన కేశపాశాలు, అస్తవ్యస్తమయిన హారనూపురాలు, జారిన మంచి గంధపు పూతలు, చిరుచెమటలు నిండిన వదనాలు.

అందరూ రావణ ప్రియభామలే; ఎంతో గౌరవంతో, కామంతో సేవించేవారే.

ఆయన మాత్రం సీతనే వాంఛిస్తున్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు,

వస్తూన్న వనితామణుల అందెల రవళులు, వడ్డాణపు గంటల ధ్వనులు హనుమంతుని చెవిని పడ్డాయి.

సువాసనభరితమయిన తైలంతో తడిపిన వస్త్రాలు చుట్టిన కాగడాల కాంతులలో వన ప్రవేశద్వారం చేరాడు రావణుడు. మదనోద్దీప మదంతో ఎరుపెక్కిన విశాలనయనుడైన రావణుడు ఇక్షుశరాసనం చేతిలో లేని మన్మథుని వలె ఉన్నాడు.

అమృతమథన సమయంలో పుట్టిన నురుగువలె ఉన్న ఉత్తరీయం ఆయన భుజకీర్తులలో చిక్కుకుంటుంటే దాన్ని విలాసంగా సవరిస్తున్నాడు.

ఆయన ముందుకు వస్తూంటే హనుమంతుడు ఆకుల గుబురులలో చేరాడు.

రావణ ప్రియకాంతలు కనిపించారు.

అలంకార శోభితుడై, శంకుకర్ణకాంతితో అలరారే విశ్రవస నందనుడైన రావణుని చూచాడు, హనుమంతుడు.

నక్షత్ర మధ్యంలో చంద్రునివలె ఉన్నాడు, రావణుడు.

బాగా పరిశీలించి-

ఓహో! అంతఃపురంలో హంసతూలికా తల్పంమీద నిద్రిస్తున్న దీయనేనా! అనుకున్నాడు.

ఆ తేజస్సును చూచి ఒక్కమారు ఎగిరి గంతువేశాడు. మళ్ళీ గుబురులలో దాగి చూస్తున్నాడు.

పరమ సుందరాంగి అయిన జానకిని సమీపిస్తున్నాడు రావణుడు.


జానకీదేవి

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Rakshaseeganam - రాక్షసీగణం

రామాయణం సుందరకాండ పదిహేడవ సర్గ - రాక్షసీగణం

నీలి నీలి కాంతుల జలాలున్న సరోవరంలో హంస ప్రవేశించినట్లు కలువపూగుత్తివంటి చంద్రుడు ఆకాశంలో దిగువకు వచ్చాడు. నిర్మల ప్రభలతో చల్లగా సోకుతూ హనుమంతునికి తోడుపడుతున్నాడు. ఆ సమయంలో శోకభారంతో ఉన్న సీతాదేవి బరువెక్కి నీట మునిగిన నావలా ఉంది.

చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలవైపు ఆయన దృష్టి మరలింది. వారిలో-

ఒకే కన్ను కలది.
ఒకే చెవి గలది.
ఒకదానికి చెవులులేవు.
మరొకతెకు మేక చెవులు.
ఒకదాని ముక్కు శిరసువైపు తిరిగి ఉంది.

ఏనుగు తలకాయ, బారెడు పొడవైన కంఠం, తెగిన కేశాలు. కేశాలే లేనిది, కంబళీజుట్టు, వ్రేలాడిపోయిన చెవులు, నుదురు, పొట్ట, వక్షోజాలు. పెదవులు, బుగ్గలు. అంతేకాదు ఒకతెకు మోకాళ్ళుకూడా వ్రేలాడుతున్నాయి.

పొట్టిది, బాగా పొడుగుది, గూనిది, మరుగుజ్జుది, వికటంగా ఉండేది, వంగిన ముఖం, పచ్చని కళ్ళు, వికృత ముఖం. ఇంకా చూస్తూన్నాడు-

కొందరు పచ్చరంగు, మరి కొందరు నల్లరంగు. కలహ ప్రీతితో కొందరు, క్రోధస్వభావంతో కొందరు, ఇనుప శూలాలూ, ముధ్గరాలూ ధరించి కొందరు.

పంది ముఖాలు, లేడి తలకాయలు, పులిశీర్షాలు, నక్క మొహాలు, దున్నపోతు రూపాలు. ఏనుగు పాదాలు, గుర్రపు డెక్కకాళ్ళు, లొట్టిపిట్ట కొళ్ళు, లోపలకుపోయిన తలకాయలతో కొందరు. గాడిద, గుర్రం, ఆవు, ఏనుగు, సింహాల చెవులతో కొందరు.

ముక్కలేనివారు, అడ్డ ముక్కులవారు, పెద్ద ముక్కులు, కుంభకుచాలు, కుండ కడుపులు, అందరూ క్రోధంతోనే ఉన్నారు.

సురాపానం, మాంస భోజనం, నిరంతరం అదేపని వారికి. అటువంటి వారి మధ్య సీతాదేవి.

పుణ్యక్షయమై నేలకు జారిన నక్షత్రంలా ఉంది.

ఏ అలంకారమూలేకున్నా భర్తృవాత్సల్యమే భూషణంగా కనిపిస్తున్నది.

సింహాల మధ్య ఆడు ఏనుగులా ఉంది.

శరత్కాల మేఘం వెనుక చంద్రకళలా, తీగలులేని వీణలా, ధూళి నిండిన తామరతూడులా వుంది. పాతివ్రత్యమే రక్షగా వుంది.

దుఃఖాల రాశిలా వుంది.

సీతాదర్శనంతో ఆయన మనస్సు క్లేశరహితమై రామచంద్రునికి అభివాదాలర్పించింది. లక్ష్మణస్వామికి కూడా అభివాదాలు చేసి ఆ చెట్టు కొమ్మలలో రహస్య ప్రదేశానికి చేరాడు, హనుమంతుడు.

రావణప్రవేశం

Anuchitam - అనుచితం

రామాయణం సుందరకాండ 36, 37వ సర్గ - అనుచితం భర్తృ భక్తిం పురస్కృత్య రామా దన్యస్య వానర న స్ఫృశామి శరీరం తు పుంసో వానర పుంగవ॥ వాయునందనా! రాముడు శ...