Saturday, March 7, 2026

Ajamilopakyanam - అజామిళోపాఖ్యానము

అజామిళోపాఖ్యానము

మహారాజా! పూర్వం కన్యాకుబ్జమనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాపాపాత్ముడు, పరమదరిద్రుడు, నింద్యచరిత్రుడు, మంచిని తిరస్కరించేవాడు. దురాచారపరుడు, నికృష్ట జీవనుడు. జూదాలన్నాా వివాదాలన్నా ఆదరం మెండు. దొంగతనానికి పెట్టింది పేరు. అతడు యౌవనపు మత్తులో ఒక దాసిని భార్యగా చేసుకొన్నాడు. ఆమెయందు పదిమంది కొడుకులను కన్నాడు. ఆతడు ఆ వ్యామోహసముద్రంలో మునిగిపోయాడు.

ఆ పిల్లల ఆలన పాలనలో, ముద్దుముచ్చట్లలో చాలాకాలం గడిపాడు. సంసారలంపటుడై ఆనందంతో మైమరచాడు. ఆ మురిపాలన్నీ ముగిసి ముసలివాడైనాడు.

మలినమైన మనస్సు చివరకు స్వచ్చతను పొందుతున్నట్లుగా అతని తలవెంట్రుకలు తెల్లబడ్డాయి. భార్యాపిలలయందు మమకారం తగ్గినట్లుగా శరీరం బిగువు తగ్గింది. ఇంద్రియాలు తమకు మోహం వద్దన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. తీవ్రమైన కోరికలు వయసుతోపాటు తగ్గినట్లు కంటిచూపు మందగించింది. నోటికి అరుచి కలిగింది. దంతాలు ఊడిపోయాయి. ఆయాసం, దగ్గు పెరిగాయి. తలనొప్పి హెచ్చింది. ఈ విధంగా అతనికి ముసలితనం నాటికి మనసు కూడా చెదిరిపోయింది.

ఈ విధంగా అతడు ఎనభైఎనిమిది సంవత్సరాలు నిండినవాడైనప్పటికీ మోహభ్రాంతుడై చివరి కొడుకైన నారాయణుడు అనే వాడియందు మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవాడు.

ఓ మహారాజా! అజామిళుడు అతని భార్య కలసి చిన్న కొడుకైన నారాయణుణ్ణి మిక్కిలి ప్రేమతో ముద్దుచేసేవారు.

మనోహరమైన, తిన్నని నుదురు కల్గి, తన తండ్రికి ఆత్మబంధుత్వాన్ని పెంచే స్వభావం కలవాడు, అయిన కుమారుణ్ణి (నారాయణుణ్ణి), చూస్తూ ఆ దుశ్శీల బ్రాహ్మణుడైన అజామిళుడు చాలా సంతోషిస్తున్నాడు.

ఆ ఆఖరి కుమారుడిపై ప్రేమతో ఆహార, పానీయాదులయందు, ఆటపాటలయందు కూడా అతనితో కాలం వెళ్ళదీస్తూ జడుడైనందువల్ల తనకు ఆసన్నమైన మరణాన్ని గుర్తించలేక పోయాడు.

అజామిళుడు ఈ విధంగా అజ్ఞానంతో వ్యామోహంలో ఉంటూనే మృత్యువు ఆసన్నమైన సమయంలో తనకు ప్రియ పుత్రుడైన నారాయణుణ్ణి ఆ పేరుతోనే పిలుస్తూ తనలో తానే ఎక్కువగా తలచుకుంటూ కాలం గడుపుతున్నాడు.

ఆ సమయంలో ఆ అజామిళుడు పలురకాల పాపాలను చేసే సర్వలోక ప్రజలను క్రూరంగా శిక్షించే అతి భయంకరులైన యమభటులను శరీరం పట్టు తప్పుతుండగా భయభ్రాంతుడై చూశాడు.

పాపాత్ములను దండించడంలో కఠినంగా ప్రవర్తించేవారు, భయంకరరూపం గలవారు, నిర్థయాజాతకులు అయిన యమభటులను ఆ బ్రాహ్మణుడు దూరం నుండే చూశాడు.

కోపంతో భయంకరంగా వ్రేలాడుతున్న పెదవులు కలిగిన వికారముఖాలలో తీక్షమైన చూపులు కలిగినవారు, పాపులకు భయం కలిగించే యమపాశాలను, ఆయుధాలను కలిగినవారు, మరణవ్వాప్తితో విశేషంగా భయాన్ని కల్గించేవాళ్లు, తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన ముగ్గురు యమదూతలను ఆ బ్రాహ్మణుడు చూచాడు.

జీవితం చివరిదశలో ఉన్న అజామిళునికి వికృతముఖాలతో, మిడిగుడ్లతో, వికారమైన చెక్కిళ్లతో, ఒంటినిండా నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో, సకల జీవులను పీడించి ప్రాణాలను హరించగల అనువైన యమపాశాలు ధరించిన యమకింకరుల దర్శనంతో అవయవపటుత్వం కోల్పోయి, చలిస్తున్న ప్రాణాలు కలవాడై కదలిక లేనివాడై

తన చివరి దశలో దూరంగా ఆడుకుంటున్న తనకు అత్యంత ఇష్ఠుడైన ఆఖరి కుమారుడిని చూడాలనిపించి నారాయణ అని మూడుసార్లు పిలిచాడు.

ఆ అజామిళుడు తన మరణకాలంలో శ్రీమహావిష్ణువును నారాయణా అని స్మరించాడు. ఆ స్మరణను విన్న విష్ణుదూతలు త్వరితగతితో వచ్చి, పరుషంగా మాట్లాడేవారు, భయంకరరూపాలు కలిగినవారు, అత్యధికకోపంకలవారు అయిన యమకింకరులను అడ్డగించారు.

('యం యం వా
పి స్మరన్‌ భావం త్యజత్యంతే కలేబరమ్‌ తం తమేవైతి కౌంతేయ! సదా తద్భావభావితః' (భగవద్గీత, అష్టమ, 6) అనే గీతావాక్యాన్ని అనుసరించి ప్రాణోత్క్రమణ సమయంలో నారాయణ స్మరణం చేసిన మాత్రంచే ఎవరికైనా పాపాలు నశించి విష్ణుదూతల దర్శనమౌతుంది.)

పతితుడైన అజామిళునిశరీరంనుండి అతనిజీవాన్ని యమకింకరులు తీసుకుపోతుంటే విష్ణుదూతలు వారిని బలంతో గెంటివేశారు.

విష్ణుదూత యమదూతల సంవాదము

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...