Friday, January 2, 2026

Ganeshuni Nomu Katha - గణేశుని నోము కథ

గణేశుని నోము కథ

ఒక బ్రాహ్మణుని భార్య గణేశుని నోముపట్టి ఉల్లంఘనచేసెను. గణేశుడామెకు నోముపట్టుట చెత సిరిసంపదలిచ్చి, ఉల్లంఘనముచేయుట వల్ల మితిలేని శోకము పెట్టెను. అందుచేత ప్రతిరోజూ కొడుకులకు కూతుండ్రకు వండిపెట్టిన తరువాత ఆమె యొకచోట కూర్చుండి ఎడ్చుచుండెను. ఊరివారందరు కూతలువేయగా వినక అడవిలోకిపోయి అక్కడ ఏడుపు మొదలుపెట్టెను. అట్లు ఏడ్చుచుండగా నొకనాడు పార్వతీపరమేశ్వర్లు భూమిపాలించుటకై వచ్చుచు ఆమెను జూచి "ఏమమ్మా! ఈలాగున నేడ్చుచున్నావ" ని యడిగిరి. అందుకామె- "మీరేమి ఆర్చేవారా! తీర్చేవారా! మీ దారిని మీరు వెళ్ళండ" ని చెప్పగా అలాకాదు, ఆ
ర్చేవారము మేమే, తీర్చేవారము మేమే, 
చెప్పవలసినదని మరల నడిగిరి. మీ దయవలన నాకు అన్ని సిరిసంపదలున్నవి, ఏమి కారణముచేతనో ఈలాగు యేడవవలెనని బుద్దిపుట్టుచుండునని ఆమె చెప్పెను.

అప్పుడు పార్వతీ పరమేశ్వరులిట్లనిరి- "ఓ కాంతా! నీవు పారెడు పామును పట్టుకొని పోయి పట్టిమంచము మీద వేయుము. అది నీకొడుకును కరచును. అప్పుడు అయ్యో! నా కొడుకులు పాము కరచినదని యెడ్వమనిరి. ఆమె ఆలాగే యని పామును పట్టుకొని వెళ్ళి పెద్దకొడుకు మంచముమిద పడవేసెను. పెద్దకొడుకు ఇంటికివచ్చి మంచము వైపునకు చూడగా అందు బంగారు గోవతాడు కనబడెను. అతడు తల్లిని పిలిచి అదేమని అడుగగా అయ్యో దానివల్ల యేడ్చుటకు వీలుకలిగినది కాదని యా రాత్రి మరల యే
డ్చుచు కూర్చుండెను. ఆ సమయమున తిరిగిపార్వతీ పరమేశ్వరులు
ప్రత్యక్షమై యింకను యెందుకు యేడ్చుచున్నావని యడిగిరి. మీరు చెప్పినట్లు చేసినాను ఆ పాము నాకొడుకును కరువలేదు. అందుచేత మళ్లీయేడ్చుచున్నానని యామెచెప్పగా, పార్వతీ పరమేశ్వరులు తేలును పట్టుకు వెళ్లి నీకూతురు మెట్టు పెట్టుకునే కుంకుమభరిణిలో వేయుము. అది కుట్టుచు అప్పుడు యే
డ్చుదవుగానని చెప్పిరి. అప్పుడామె తేలును పట్టుకొని వెళ్ళి కుంకుభరిణెలో వేయగా మరునాటి యుదయమున నా బరిణెను తీసి బొట్టు పెట్టుకొనుటకు అందులో చేయిబెట్టగా అందులో నాచేర్చుక్క బొట్టు కనబడెను. ఆమెతల్లిని బిలిచి "ఇందులో నా చేర్చుక్క బొట్టుపడివేసినా వేముని" యడిగెను. "అయ్యో! యిది కుట్టినది కాదని యా రాత్రి యడవికిబోయి మరల నెడ్చుచున్న యామెకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై యేమి యింకను యేడ్చెదమనియడిగిరి. "అయ్యో! తేలు నాకూతురును కుట్టలేదు. అందుచేత వచ్చి యేడ్చుచున్నాననని" చెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు  "అమ్మా నివు పెంచిన పిల్లియున్నది దానిని చంపి వడిలో నుంచుకొని యేడ్చు అనగా, తదుపరి రోజు ఇంటివ్చుం వెళ్లి పిల్లిని చంపి వడిలో నుంచుకొని యేడ్చుచుండగా నూరివారందరు వచ్చి-యిదేమమ్మా! అని యడిగిరి. "అయ్యో! నా పెంపుడు పిల్లి చచ్చిపోయినదని మరింత యేడవగా ఆమె కంటినీళ్ళుపడి బంగారు పిల్లి అయి వడిలోనుండి క్రిందికి దుమికి పోయెను. 

అప్పుడు పార్వతి పరమేశ్వరులు వచ్చి "ఓ కాంతా! నీవు గణేశుని నోముపట్టి ఉల్లంఘనము చేయుటచేత విచారించు చున్నావు. కాబట్టి ఈ నోముపట్టి యేడాది అక్షింతలు వేసికొని ఉద్యాపనచేసిన యెడల నీయేడ్పు పోవునని చెప్పిరి.

ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ ప్రకారము నోచుకొని దుఃఖమువిడిచి భూలోకమున చిరకాలము సిరిసంపదలతో సుఖపడెను.

ఉద్యాపనము :- సోలెడు గిద్దడు నూనెక్రొత్త మూకుటిలోపోసి వత్తివేసి దిపము పెట్టి స్వయంపాకము, ఒక దక్షిణ తో శివుని ఆలయమున పూజచెసికొని  నందిదగ్గర ఆ దీపము  పెట్టవలయును. ఒక 
సత్బ్రహ్మణునికి దానము ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదము పొందవలెను. 

No comments:

Post a Comment

Shayana Ekadashi - Toli Ekadashi - Devashayani Ekadashi - శయన ఏకాదశి - తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి

శయన ఏకాదశి - తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి శయన ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి ...