ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కుమారులు కలరు. వారందరు దరిద్రము చేత బాధపడుచుండిరి. ఒకనాడు ఉదయమున శుక్రవార మహాలక్ష్మి వచ్చి ముందుగా వారి పెద్దకోడలి యింటికి వెళ్లెను. ఆమె ప్రొద్దున్నే లేచి పిల్లలకు అన్నం పెట్టి తానుకూడా దినుచుండెను. అది సంపద శుక్రవార మహాలక్ష్మీ చూచి "ఛీ! వీరింటికేల వచ్చినాన" ని గిరుక్కున తిరిగివెళ్లి రెండవకోడలింటికి వెళ్లగా ఆమె చూడగా పేడచేసుకొనుచుండెను. "ఛీ! ఛీ! దీనింటి కేల వచ్చినాన" ని తిరిగి వెళ్ళి మహాలక్ష్మి
మూడవ కోడలి యింటికివెళ్ళగా ఆమె పాత గుడ్డలు కుట్టుచు కూర్చుండెను "ఛీ! దీనియింటికేల వచ్చితిన" నని మహాలక్ష్మీ నాలుగవ కోడలి యింటికి వెళ్లగా ఆమె పాచివాకిట గుంటలో వడ్లు పోసుకొని దంపుచుండెను. అదిచూచి మహాలక్ష్మి "ఛీ! దీనింటికేల వచ్చినాన" ని అయిదవ కోడలి యింటికివెళ్ళగా ఆమె ప్రొద్దున్నే తలదువ్వుకొనుచు కూర్చుండెను. ఆ మహాలక్ష్మి "ఛీ! దీనింటి కేలవచ్చినాని ఆరవకోడలి యింటికి వెళ్లగా ఆమె పాచివాకిటిలో నలుగురి పిల్లలకు తలంటి తాను తలంటుకొనుచుండెను. అది చూచి మహాలక్ష్మీ "ఛీ! దీనింటి కేలవచ్చినాన" ని ఏడవకోడలి ఇంటికి
వెళ్లగా ఆమె ఇల్లు అలుక్కొని, వాకిట కళ్లాపునుజల్లి, స్నానం చేసి, పసుపురాసుకొని, బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మీ ఆరుగు మీద కూర్చుని. ఆ మహాలక్ష్మి ఎవరమ్మా! ఇలారండని ఏడవ కోడలిని పిలువగా "అమ్మా! నా మగడు యాయవారమునకు వెళ్లినాడు. మాకు కట్టుకొనుటకు ఒకటే బట్ట అందుచేత నాబట్ట ఆయనకిచ్చి నేను తలుపు వెనుక కూర్చున్నాన" ని చెప్పగా మహాలక్ష్మి "అయితే యేమి ఇలారావమ్మా! కట్టుకొనుటకు బట్టనేను యిచ్చెదన" ని చెప్పెను. అట్లు చెప్పి తన కట్టుబట్టలో సగము చంపి యామెకిచ్చి అమ్మా నాకు సోలడు బియ్యముపెట్టి అన్నము వండిపెట్టు మని చెప్పెను. అందుకాయిల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చువరకు నింటబియ్యముండవని చెప్పింది. అప్పుడామె ‘‘శుక్రవారపు మహాలక్ష్మీ మాయింటికి వచ్చినది ఆమెకు ఇవి కావలెనని వర్తకులతో చెప్పి తీసుకురా’’ అని చెప్పింది. ఆమె కోమటి యింటికివెళ్ళి తనయింటికి శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినదని తెలిపి, పప్పుబియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్ధాలు ఇవ్వమని కోరగా, అతడు వాటినన్నిటిని యిచ్చెను. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకల వాని యింటిదగ్గర తెలగపిండిని నూనెను కంచరి యింటిదగ్గరి పాత్ర సామగ్రిని, సాలెవాని యింటిదగ్గర బట్టలను తీసుకుని యింటికివెళ్ళి నాలుగు పిండివంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మీకి వడ్డించెను.
అప్పుడా బ్రాహ్మణుడు ఎడమూట పెడమూట వేసుకొని మోయలేకుండగా నింటికివచ్చెను. ఇంటికి రాగానే భార్య వానికి భోజనము పెట్టెను. భోజనముచేసి బ్రాహ్మణుడు అవి యన్నియు నెలాగున వచ్చినవని భార్యనడిగెను. ఆమె మనపాలిటి శుక్రవార మహాలక్ష్మీ వచ్చినది అని అందరిని అడిగిపట్టుకొని వచ్చినానని చెప్పెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మీ తానింక వెళ్ళెదనని చెప్పగా ఆమె ఆరాత్రి భోజనంచేసి వెళ్ళవలసినదని కోరెను. అందులకామె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళెదననెను. అప్పుడా బ్రాహ్మణి "అమ్మా! ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు? రేపటి దినమున వెళ్ళవచ్చు" అనెను. అందుకామె సమ్మతించి, నిదురపోయి కొంతరాత్రికి లేచి, తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళివచ్చెదనని చెప్పెను. అందుకా బ్రాహ్మణి "చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు ఆ మూల కూర్చొను" మనెను. మహాలక్ష్మీ అట్లే నాలుగు మూలలందును కూర్చొ ని, తెల్లవారువేళకు మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని, యిల్లు బాగు చేయుటకు చీపురును, చేటను బట్టి గది మూలలను చూచెను. నట్టింట అన్నిచోట్ల బంగారుకుప్పలుండెను. అందు కామె ఆశ్చర్యపడి మహాసంతోషముతో నా సంగతి భర్తతో చెప్పి పాలచేత కడిగి, బంగారు కాసులు పళ్లెములో పెట్టుకొని నా పాలిట శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినది కనుక యీ భాగ్యము కలిగెనని శుక్రవారపు నోము పట్టుటకు మనస్సులో సంకల్పించుకొనెను. ఆలాగునుకొని నట్టింట నాలుగు మూలలు అలికి ముగ్గుపెట్టి తలదువ్వి బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని పయిమీదనే నీళ్ళుపోసుకొని మహాలక్ష్మీని పెట్టి నోము నోచుకొని కథను చెప్పి అక్షింతలు వేసికొనెను.
ఉద్యాపనము :- ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీని కొలిచి, ఒంటిపూట భోజనం చేయ వలెను. అట్లు అయిదేండ్లయిన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండ్రకు తలంటి నీళ్ళుపోసి భోజనం పెట్టి ఐదు రవికె గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవ లెను.

No comments:
Post a Comment