వావిలి లక్ష్మీవారము కథ
ఒక బ్రాహ్మణునకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలును కలరు. అతడు కుమార్తెలను పెండ్లి పేరంటములు గావించి యత్తవారింటికి పంపివేసెను. కడసారపు కూతురు మిక్కిలి దరిద్రము కలవారి కొడలౌటచేత తన్ను అన్నలు ఒక్కసారియైన పుట్టినింటికి తీసుకొని వెళ్లకపోవుటచేతను మిక్కిలి దుఃఖించుచుండెను.
ఇట్లుండగా నామె పుట్టింట కడసారి తమ్మునకు పెండ్లి తలపెట్టిరి. ఆ వివాహమునకు యీ కడసారపు చిన్నదానినితప్ప తక్కినవారిని తీసికొనివచ్చినాడు. పెండ్లిచేసికొనిరి. ఆ పెండ్లిలో తమ్ముడు పిలువకపోయినను, యా చిన్నదాని కొడుకులు తాతగారింటికి వచ్చి- "తాతా! పందిరివేయమా? చాపలు పరచమా?" అని యడుగగా నతడు తిట్టుచు మీరేమి చేయవద్దు పొమ్మని కసరి కొట్టెను. ఆ బ్రాహ్మణుని పెద్దకోడలు మాత్రము కడసారపు ఆడుబిడ్డ రాకుండుటకు విచారించుచు, ఆమె దరిద్రదేవతను తిట్టుచు, వంటబ్రాహ్మణులు బియ్యము కడుగుచుండగా నేను చాలకాలం క్రిందట వావిలిగౌరీదేవి నోముపట్టినాను, ఉద్యాపన మట్లేయన్నది, అని చెప్పి కడిగిన
బియ్యములోనుండి అడ్జెడు తవ్వెడు(2-1/2) తీసి యొకచేటలోపోసి కడగని బియ్యము యొక అడ్డెడు తవ్వెడు(2-1/2) గూడబోసి పైనొక పాతచేట మూతబెట్టి వావిలికొమ్మనుబెట్టి యందు రవికెలగుడ్డ దక్షిణ తాంబూలము నుంచి యాచిన్న యాడబిడ్డ యిల్లు తమ యింటి ప్రకనే యుండుటచేత, వాటిని గోడమీదనుండి ఆమెకు అందించెను. అవి పుచ్చుకొని యామె యింటిలో పెట్టుసరికి సిరిసంపదవచ్చెను. అటు తర్వాత ఆ చిన్నదానిని పుట్టింట అన్నగారి కుమార్తెకు వివాహముకాగా ఆమెను-"పెండ్లికి రావలసినని వచ్చిపిలిచిరి. ఆమె 'మేము బెండ్లినాడుదయముననే వచ్చెదమని చెప్పెను. ఆ యుదయమున సవారీమీద ఆమెను తమ యింటికి తీసికొనివచ్చి పీటమీద కూర్చుండబెట్టి పంచభక్ష్య పరమాన్నములును ఆమెకు వడ్డించిరి. అప్పుడామె తన యెడలి వస్తువులను. తీసి పీటమీదనుంచి "పుస్తెలారా! ఆరగింపుడు, పుస్తెలారా! ఆరగింపుడు", అని చెప్పి
పల్లకీ యెక్కి తన యింటికి వెళ్లిపోయెను. అప్పుడూరివారందరు "ఏమమ్మా! తిరిగి యింటికి వెళ్లుచున్నావని యడుగగా నా పుట్టింటివారు నన్నుచూచి పిలిచినారా లేదు. నా పాలటి మహాలక్ష్మీనిచూచి పిలిచినారు అని చెప్పెను వారందరు- "నీకింత భాగ్య మేలాగున వచ్చినద" ని యడుగగా-నేనేమి నోమును పట్టలేదు. నా పెద్ద వదిన గారు వావిలిగౌరి నోముపట్టి మొన్ననే యుద్యాపనము చేసిగొని యా వాయనము నాకిచ్చినది. నాకావాయన మందుకున్న ఫలమేగాని మరేమియులేదు" అని ఆమె చెప్పెను.
ఉద్యాపనము: కధచెప్పి యేడాది అక్షంతలు వేసికొని యేడాది అయిన తరువాత కొత్తచేటలో కడిగిన బియ్యము అడ్జెడు తవ్వెడు(2-1/2), కడగని బియ్యము అడ్జెడు తవ్వెడు (2-1/2) పోసి వావిలికొమ్మపెట్టి పాతచేట మూతవేసి రవికెలగుడ్డ దక్షిణతాంబూలముతో గోడమీద నుంచి ముత్తయిదువకు వాయనము అందియ్యవలెను.
Subscribe to:
Post Comments (Atom)
Shayana Ekadashi - Toli Ekadashi - Devashayani Ekadashi - శయన ఏకాదశి - తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి
శయన ఏకాదశి - తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి శయన ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment