Thursday, August 20, 2026

Sharadratri Gana Monarchu Krishnu Sannidhiki Gopikalu Vacchuta - శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట

ఈ విధంగా ఉదయించి కొత్త కుంకుమతో అలదిన శ్రీలక్షీముఖమండలంలాగా పరిపూర్ణమైన చంద్రమండలాన్ని గోపికలు దర్శించారు. కమలనేత్రుడైన శ్రీకృష్ణుడు యమునాతీరవనంలో లోకసమ్మోహనంగా ఒక పాట పాడాడు. 

ఆ గానం విన్న గోపికలు తదేక మనస్కలయ్యారు. తత్తరపడుతున్న గోపికలకు పనులు చేయడానికి చేతులాడ లేదు. గోవులవద్దకు దూడలను విడువలేదు. విడిచినా పాలుపిదుకలేదు. పాలుపిదికినా కాచలేదు. కాచినా కాగినపాలు దించలేదు. దించినా పాలు పిల్లలకు పోయ లేదు. పోసినా భర్తలకు సపర్యలు చేయ లేదు. చేసినా భోజనాలు చేయ లేదు. చేసినా పూలు కొప్పుల్లో ముడువలేదు. ముడిచినా వస్త్రాలు ఆభరణాలు ధరించ లేదు. ధరించినా, ఇండ్లలో నిలువ లేదు. నిలిచినా పాయసాలు వండ లేదు. 

ఉన్నచోట ఉండడం లేదు. కాటుకలు సరిగా పెట్టుకోలేదు. కురులు చక్కగా దువ్వుకోలేదు. స్తనాలమీద గంధాలు పూసుకోలేదు. జారినపయ్యెదలు కప్పుకోలేదు. చెలులకు చెప్పలేదు. అన్నదమ్ములు, భర్తలు, మామలు, మరదులు, బిడ్దలు అడ్డంవచ్చి అడ్డుకొంటున్నా లెక్కచేయకుండా చలించి పోతూ మన్మథుని పూలబాణాలజల్లుకు తల్లడిల్లారు.

దీనులయ్యారు. మేఘాలవరుసనుండి వెలువడి ఉల్లసిల్లే మెరుపుతీగలలాగా మందగమనలైన గోపికలు వడివడి నడకలతో మందనుండి బయటపడి శ్రీకృష్ణ సందర్భనానికి వెళ్ళారు. అప్పుడు

కొందరు గోపికలు తమ ఇంటివారినిర్బంధంవల్ల ఇండ్లు విడిచి బయటకు రాలేక శ్రీకృష్ణుని విరహంవల్ల తపిస్తూ, మనస్సులలోనే జారుడని భావిస్తూ కూడా శ్రీ కృష్ణుణ్ణి తమకౌగిళ్ళలో నింపుకున్నారు. పరవశించి, బంధవిమోచనలై త్రిగుణాత్మకాలైన దేహాలు విడిచి ముక్తి పొందారు.

(గోపికల భౌతికదేహాలు అలాగే ఉన్నా వారి గుణాధారదేహాలు విడిచిపెట్టినందువల్ల భర్త, బిడ్డలు మొదలైనవారి సంబంధాలు వదిలి ముక్తలయ్యారు అని భావం.)

ఇలా శుకుడు చెప్పగా పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

ఆ మాటవిని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు. ఓ శుకమహర్షీ! ఆ గోపస్త్రీలు కృష్ణుణ్ణి కేవలం తమ జారునిగా భావించారే కానీ, మహిమాన్వితుడైన పరబ్రహ్మం అని భావించలేదు కదా! అలాంటి గోపికలు త్రిగుణమయమైన శరీరాలను ఎలా వదిలి ముక్తిపొందారో తెలపండి.

ఇలా పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా అన్నాడు.

రాజశ్రేష్ఠా! ఇంతకుముందే నేను నీకు చెప్పి ఉన్నాను - విష్ణువుకు విరోధి, మూర్ఖుడు అయిన శిశుపాలుడే ముక్తిపదవిని పొందగలిగాడని. మరి నారాయణునికి ప్రేయసులైనవారు పొందరాని పదవి ఏదైనా ఉందా? 

పాపరహితుడు, తరగని శక్తిగలవాడు, వాక్కుకు మనస్సుకు గోచరించనివాడు, త్రిగుణాతీతుడు అయిన శ్రీకృష్ణుని స్వరూపం భక్తజనానికి ముక్తిదాయిని అనడంలో సందేహం లేదు. ఇది సత్యం.

(ఎవరివద్దనైనా విరోధంతో పొందగలిగిన దానికంటే, ప్రేమతో అధికంగా సంపాదించుకోగలగడం లోకసహజం. ఆ లోకసహజమైన అంశాన్ని శ్రీకృష్ణునికి ఆపాదించి, హరికి సంబంధించిన నిత్యసత్యాన్ని కవి ఆవిష్కరించాడు. చక్రికి పగవాడై ముక్తిపొందినవాడు శిశుపాలుడు. ప్రేమతో ముక్తి పొందినవారు గోపికలు.)

బంధుత్వంతోనైనా, విరోధంతోనైనా, ప్రేమతోనైనా, చింతతోనైనా, ప్రాణభయంతోనైనా భక్తితోనైనా హరిధ్యానపరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు.

కాబట్టి, పురుషోత్తముడు, పుట్టుకలేనివాడు, యోగీశ్వరేశ్వరుడు అయిన శ్రీహరిని స్పృశించినంతమాత్రాన అచేతనాలైన కొండలు, చెట్లు వంటివికూడా ముక్తిని పొందగలవు. ఈ విధంగా

అధికుడూ శుభగుణాలు కలవాడూ, చతురుడూ అయిన శ్రీకృష్ణుడు మహిమగలిగిన తన తీయని పాట శబ్దం విని వచ్చిన గోపస్త్రీలను చూచి, తన మాటల నేర్పు తేటపడగా ఇలా పలికాడు.

ఓ లతాంగులారా! మీకు కుశలమా? మీ మందకు భయం లేదుగదా! సింహాలు, పులులు, ఏనుగుమున్నగు క్రూరజంతువులు తిరుగుతూ ఉంటాయి. దూరప్రయాణాలు మీరు రావచ్చునా? ఇక్కడ తిరగవచ్చునా? చాలుచాలు! మీ గోకులానికి సంతృప్తితో మరలి వెళ్లండి.

(అతిథులు వస్తూనే 'క్షేమం' అడగడం మనసంప్రదాయం. ఆ సంప్రదాయాన్నే కృష్ణుని నోటివెంట పలికించడంవల్ల అందరూ అలాంటి మర్యాదను పాటించాలి అని ధ్వని.)

మీరు వెళ్లినజాడ తెలియక విచారంతో మీ తల్లిదండ్రులూ, భర్తలూ, మరదులూ, కొడుకులూ, కులపెద్దలూ, తోబుట్టువులూ, బంధువులూ మీరు హద్దుమీరి ప్రవర్తించి వెళ్లిపోయారని వ్రేపల్లెలో ఎక్కడెక్కడ వెదకుతున్నారో? ఏమోగదా! ఇలాంటి సాహసప్రయత్నాలు మీకు తగినవికావు.

కుటుంబమర్యాదను బూడిదలో కలిపి, భర్తలను సిగ్గుపడేటట్లు చేసి, అత్తమామలను పరితాపానికి గురిచేసి, సోదరుల మర్యాదను పోగొట్టి, తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేసి, చుట్టాలకు అసహ్యం కలిగిస్తూ, సత్కులంలో జన్మించిన స్త్రీలు మారుమగలమీది కోర్కెలతో హద్దుమీరి రావచ్చా? అలావస్తే లోకులు ఆ ప్రవర్తనను చూచి, మెచ్చుకుంటారా?

సాధ్వి అయిన స్త్రీకి జారునితోడి సంగమం కోరదగిందికాదు. ఎందుకంటే భర్తకు తెలిస్తే ప్రాణంతీసేందుకు తెగిస్తాడు. రాజుకు తెలిస్తే దండిస్తాడు. మామకు తెలిస్తే కాపురం చెడుతుంది. తలారికి తెలిస్తే నిర్బంధిస్తాడు. తలిదండ్రులకు తెలిస్తే సంఘంలో తలెత్తుకోలేరు. తోడికోడలుకు తెలిస్తే ఎత్తిపొడుస్తుంది. కొడుకులకు తెలిస్తే అసహ్వించుకొంటారు. బంధువులకు తెలిస్తే వెలివేస్తారు. ఇరుగు పొరుగువారికి, ఇతరజనులకు తెలిస్తే చులకనగా చూస్తారు. జారిణి అయిన స్త్రీకి ఇటు ఇహంలోకాని, అటు పరంలోకాని సుఖం లేదు. కీర్తి లేదు. ఆనందమూ లేదు. అందువల్ల సాధ్వి అయినస్త్రీ విటుణ్ణి చేరడానికి వెళ్ళడం సరికాదు.

తన భర్తయొక్క ప్రవర్తన బాగాలేకున్నా అతడు శక్తిహీనుడైనా, అందంలేనివాడైనా, మందబుద్ధి అయినా, రోగి అయినా, అతణ్ణి వదిలివేయడం సాధ్వికి మర్యాద కాదు.

ఓ అమాయకపు గోపికలారా! ఇది యమునా నదీ జలాలతో ప్రోదిచేయబడిన చిగుళ్లు, పూలు, ఆకులతో విరాజిల్లే బృందావనం. మీ మనస్సులు హద్దుల్ని అతిక్రమించాయేమో! గోకులానికి మరలిపొండి. వెళ్లి ఏడుస్తున్న పిల్లలకు పాలు పోయండి. గోవులవద్ద పాలుతాగడానికి దూడలను విడవండి. ఒప్పిదం అయ్యేవిధంగా మీమీ భర్తలకు పరిచర్యలు చేయండి.

ఓ కాంతలారా! నన్నుకోరి ఇక్కడికి వచ్చారు. మీకే కొరతా లేదు. శుభాలు కలుగుతాయి. సృష్టిలోని సమస్తప్రాణులు నాకు ప్రియమైనవే (అలాగే మీరుకూడా నాకు ప్రియమైనవారే) ఐనా, మీరు ఇక్కడ ఉండడం భావ్యం కాదు. స్త్రీలు భర్తలకు పరిచర్యలు చేయడమే ప్రాచీనకాలంనుండి విధించబడిన ధర్మం. ఆమాట పెద్దలు సర్వత్ర చెపుతూనే ఉంటారు. 

(నాకు సర్వప్రాణులూ ప్రియమైనవి అని చెప్పింది మహావిష్ణువే. బాలుడైన శ్రీకృష్ణుడు కాదు. సర్వప్రాణులలో గోపికలూ చేరతారు. వారికి సనాతనధర్మం గుర్తుచేయడం లోకకల్యాణంకోసమే.)

మానవతులారా! నన్ను గూర్చి ధ్యానించడం, నన్నుగురించి వినడం, నన్ను దర్శించడం, నన్ను గురించి పాడడం(అనేవాటిద్వారా) నాపై మనసుపెడితే చాలు మీరు ధన్యత్వం కలిగినవారవుతారు. మీ ఇండ్లకు మరలి వెళ్లండి.

బృందావనంలో వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణపరమాత్మ వద్దకు విచ్చేసిన గోపకాంతలకు సరైన మార్గనిర్దేశనం చేయగా వారు విని
(అని శ్రీకృష్ణుడు చెప్పగావిని).

విరహాగ్నిశిఖలతో కలిసి వెడలిన నిట్టూర్పులు సోకి వారిపెదవులు ఎండిపోయాయి. కన్నులనుంచి స్రవించే కాటుక కన్నీరు అలంకారంగా వారు స్తనాలమీద అలదుకొన్న కుంకుమ చెదరిపోయే విధంగా ప్రవహించింది. (విచారంతోవారు) చెక్కులమీద చేర్చిన చేతులవేడివల్ల వారివదనపద్మాలఅందం కందిపోయింది. ఎడతెరపిలేకుండా తాకుతున్న మన్మథబాణాలకు గోపికల ధైర్యం చెదరి పోయింది. మిక్కుటమైన శోకంవల్ల మాటలు తడబడ్డాయి. తమకు ప్రియమైన పలుకులు పలకని ప్రియుడైన శ్రీకృష్ణుణ్ణి చూచి వారు భయపడి, పాదాలతో నేలమీద రాస్తూ చింతలో మునిగిపోయారు.

ఇలా (గోపికలు) పలికారు.

అయ్యో! శ్రీకృష్ణా! నిన్ను నమ్ముకొన్నాం. నిన్ను క్రూరుడనలేము. మా ఇండ్లలోని పనులన్నిటిని వదిలివేసి, పద్మాలవంటి నీ పాదాలు పూజించడానికి తప్పించుకొని వచ్చాము. నీవు పరమేశ్వరుడివి. సంపన్నుడివి. ముక్తిమీద ఆసక్తి కలవారిని కాపాడినట్లు మమ్ములను కూడా కాపాడు! భ్రమకు గురైన కాంతలను వదలడం నీకు తగదు.

(గోపికల మాటల్లో మోక్షాసక్తి ధ్వనిస్తున్నది. శృంగారాసక్తికాదు.)

ధర్మజ్ఞుడవైన శ్రీకృష్ణా! భర్తలను, బిడ్డలను, బంధువులను అనువర్తించడమే సాధ్వీమణులకు ధర్మం అన్నావు. ధర్మవేత్తవైన నీవే ఆలోచించు. భర్త, పుత్రుడు మొదలైన బంధువులపేర్లు ధరించిన వాడివై ప్రకాశించే నీయందు దేహధారిణులైన స్త్రీలు పతిపుత్రాదులపట్ల తమకుగల కోరికలు తీర్చుకోవడం అన్యాయమంటావా?

(శ్రీహరే అన్నిప్రాణులకు పతి, పుత్రుడు, గురుడు, బంధువు అయినప్పుడు తాము ఆయాసంబంధాలు ఆపాదించుకొని స్వామివారిని అనువర్తించడం అన్యాయం కాదని గోపభామినులు తమచర్యను సమర్థించుకొన్నారు.)

శాస్త్రనిపుణులైనవారు అంతర్యామివైన నీయందే ఆసక్తి కలిగి ఉంటారు. నీవు ఎడతెగని ప్రేమను కలిగించేవాడివి. కాబట్టి దుఃఖం కలిగించే భర్త పిల్లలు మొదలైన వారిని ఎందుకు మాకు చూపుతావు? మా మహనీయ జీవితాశలు నీచుట్టె అల్లుకొని ఉన్నాయి. వాటిని ఎందుకు తుంచివేస్తావు? మా పరితాపం పోగొట్టు స్వామీ!

(ముగ్ధలైన గోపికలు భగవంతుని మీది ఆసక్తి బ్రహ్మానంద జనకమని తెలుసుకొన్నారు. ఎవరిద్వారా అంటే నేర్పరుల ద్వారా! అందువల్ల సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా కలిగించే పతి పుత్రాదిక సంబంధం వ్యర్థం అంటున్నారు. వారి జీవితాశలు స్వామిచుట్టే అల్లుకొని ఉన్నాయి. తీగెను చెట్టునుండి విడదీస్తే తునిగి తీగే వాడిపోతుంది. అలాగే తమ జీవితాశలు అనే తీగెలు తెగిపోతే బతకలేము అన్నారు.)

కృష్ణా! నీ పాదపద్మాలను ప్రీతితో చేరడానికి తప్ప తిరిగి వెళ్లడానికి మాకు కాళ్లు రావు. నీ కరకమలాలను స్పృశించడానికి తప్ప ఇతరపనులకు మాచేతులు పూనుకోవు. నీ మాటల అమృతప్రవాహాన్ని ఆస్వాదించడానికి తప్ప మా చెవులు ఇతరాలైన మాటలను వినవు. 

నీ అందమైన రూపాన్ని సంపూర్ణంగా చూడడానికే కాని మా కనులు ఇతరాలను చూడవు. మా నాలుకలు నిన్ను గురించి పలుకుతాయే కాని ఇతరాలైన మాటలు పలుకవు. నీవు 'మిమ్ములను ఒల్లను' అని పలకడానికి సందేహించడం లేదు. మామనసులను మరిపించుకొని దొంగిలించావు. ఇప్పుడు ఏమి చేయగలం?

(ప్రాణుల జ్ఞానేంద్రియాలు ఇహలోక సంబంధి పనులు మానివేసి, పరలోక సంబంధి పనులవైపు మళ్లితే ముక్తికి దగ్గరైనట్లే.)

శ్రీమహాలక్ష్మి తన తొడలమీద స్వామివారి పాదాలుంచుకొని ఒత్తుతూ ఉంటుంది. స్వామివారి పాదపద్మాలు పవిత్రమైన గుర్తులను చేస్తూ ఉంటాయి. మా తపస్సంపదతో నీ వద్దకు ఎట్లో చేరగలిగాము. మేము నిన్ను వదలి మరలివెళ్లలేము. మా భర్తల మాటలను ఇష్టపడము. పద్మసువాసనలు మరిగిన తుమ్మెదలు ఇతరకుసుమాలవద్దకు వెళ్లడానికి ఇష్ట పడతాయా? (పడవు).

(గోపికలు స్వామివారి చెంతకు చేరడంలో వారి 'తపము సంపద' కారణమని భావిస్తున్నారు. గోపికలు త్రేతాయుగంలో ఋషులు. శ్రీరాముని అందాన్ని వలచారు. శ్రీకృష్ణావతారంలో గోపికలుగా పుట్టి, మీ కోరికను తీర్చుకో వచ్చునన్నాడు - శ్రీరాముడు. అప్పటి ఆ ఋషుల తపస్సంపదే ఇప్పటి గోపికల తపోస్సంపదగా చెప్పబడింది.)

ఓ కృష్ణా! లక్ష్మీదేవి నీ విశాల వక్షస్థ్సలం పైన, తులసీతో కలసి ఉండడానికి ఓ స్వామీ! నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ, నీ పాదకమలాల పుప్పొడిని కోరుకుంటూ ఉంటుంది గదా!

(తులసి లక్ష్మీదేవి స్వరూపమే. సరస్వతీదేవి శాపంవల్ల లక్ష్మీదేవి తులసిగా మాధవీ ధర్మధ్వజులకు కుమార్తెగా జన్మిస్తుంది. శంఖచూడుని రూపంలో విష్ణువు ఈమెను వివాహమాడతాడు (బ్రహ్మవైవర్తపురాణం))

ఓ పురుషభూషణా! మా అత్తలూ, మామలూ చింతిస్తుండగా, నిందకు భయపడకుండా, మా భర్తలను దుఃఖాలపాలుచేసి, కుటుంబమర్యాదలు మంటగలిపి, నీ నవ్వులకు, మెత్తనిపలుకులుకు ఇష్టపడి, మన్మథుడు పట్టుదలతో బాధించగా మేము వచ్చాము. ఏ ఇతరసంబంధాలూ మాకు వద్దు. మీ పరిచర్యలు చేసే అవకాశం ఇచ్చి రక్షించుము.

పూర్వం స్త్రీలు భర్తల్ని ప్రేమించలేదా? భర్తలు వారిని ఆదరంతో తృప్తిపరచలేదా? అనురాగాలు మాకు మాత్రమే పుట్టినవా? నీ మాటలు మగవారికి తగినవేనా? (తగినవికావు) ఓ పుణ్యాత్మకా! మమ్మల్ని కౌగిలించు. నీకు పుణ్యం ఉంటుంది.

కృష్ణా! నీ చెక్కిళ్లు చెవికుండలాల ప్రకాశంతో ఒప్పారుతున్నాయి. నీ నుదురు ముసురుకొన్న ముంగురులతో అందంగా ఉంది. నీ చిగురుమోవి అమృతం చిందుతూ ఉంది. నీ చూపులు మనోజ్ఞమైన చిరునవ్వుతో సొంపారుతున్నాయి. ఇలాంటి నీ వదనం చూస్తూ - మేం నిలువగలమా? మన్మథుడు తన చెరకువింటినుండి వదిలిన బాణాలకు దాసులమైపోయాం. మమ్మల్ని రక్షించు.

ప్రభూ! మా చెంతకు చేరి నీ అధరామృతధారలను మా చిగురు పెదవులపైన చిలికించు. నీ విశాలమైన రమ్యతరమైన నిర్మలమైన ఎదను మా చను మొగ్గలపైన గదించు. నీ రమణీయ హస్తపద్మాలను మా కేశపాశంపైన చేర్చు. నీ దయార్ద్రమైన చూపులను మా నెమ్మొగాలమీద ప్రసరింపజేయి. నీ నవీనమైన, ఆదరణీయమైన సల్లాపంతో మా చెవులను కప్పివేయి. (అలా చేయకపోతే) మేం ఎలా జీవించగలం? ఎక్కడికి వెళ్లగలం? స్త్రీల మొరలు విన నర్హం కావా?

ప్రాణేశ్వరా! నీ పాదాలమీద ఒట్టువేసి చెపుతున్నాము. నీ చూపులు, నీ నవ్వులు, నీ పాటలవల్ల పుట్టి పేట్రేగిన మన్మథాగ్నులను నీ చిగురుమోవినుండి స్రవించే అమృతధారలతో చల్లార్చు. అలా చల్లార్చకపోతే నీ ఎడబాటు మంటల్లో భస్మమైపోయి నిన్నే తలచుకుంటూ నీ పాదద్వయాన్నే చేరతాము.

మిక్కిలి ప్రకాశించే నిన్ను చూచినా, నీ సంగీతం విన్నా - చెట్టూ, మృగాలూ, పక్షులూ, ఆవుల గుంపులూ కరగి పులకించి పోతాయి. మరి అబలలు అయిన స్త్రీలు నిన్ను చూచి, నీ గానం విని ద్రవించిపోరా?

ఓ యశోదాకుమారా! మానినులధైర్యహారా! నీ మధురమైన మాటలు అనే జడివాన కురియకుంటే ఈ మన్మథాగ్నిని ఎలా చల్లార్చగలం? నీ చూపు అనే నావ లేకుంటే ఈ మన్మథసాగరాన్ని ఎలా దాటగలం? నీ చిరునవ్వు అనే వెన్నెల లేకుంటే ఈ కామాంధకారాన్ని ఎలా పారదోలగలం? నీ నవాధరామృతం చిలుకకుంటే ఈ మదనజ్వరాన్ని ఎలా పోగొట్టుకోగలం? నీవు కరుణించి కౌగిలించుకొనకుంటే మా బతుకు ఎలా సాగించగలం? మాగతి ఏమిటి? దయలేనివాడైన మన్మథుడు మమ్ములను బతకనిస్తాడా?

ఓ పద్మనేత్రా! దేవతలను శ్రీహరి రక్షించినట్లు - మేము మూర్చపోకుండా నీ అభయహస్తాన్ని మా హృదయాలమీదా, మాశిరస్సులమీదా ఉంచు.

బాలకృష్ణా! దయానిధీ! తరుణులను దట్టమైన నీ విరహాగ్నికీలలు తలమునుకలుగా బాధించగా (దయతో) పలుకరించవు, చూడవు, నువ్వు ఎంత క్రూరుడివో గదా!

ఈ విధంగా పుష్పబాణుని బాణపరంపరలకు సొమ్మసిల్లి ఓపికలు లేకుండా పలికిన గోపికల దీనమైన పలుకులు విని, నవ్వి, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆత్మలో క్రీడించువాడై గోపికలతో రమించాడు. అప్పుడు

కృష్ణుడు తన కరుణాకటాక్ష వీక్షణాలతోను; చీరచెరుగులను, కేశపాశాలను లాగడంతోను; మొలనూళ్లు, చేతులు, భుజాలు, కుచాల స్పర్శలతోను; గోటిగిచ్చుల గుర్తులతోను; పరిహాసవాక్కులు, కౌగిళ్లతోను మన్మథుణ్ణి తిరస్కరిస్తూ గోపికలను రతిక్రీడలతో పరవశింపజేశాడు.

వికసించిన ముఖాలు గలిగిన గోపకాంతలు సంప్రీతితో తనను భజించగా, శ్రీకృష్ణుడు చిరునవ్వు వెన్నెలతో చుక్కల మధ్య విలసిల్లే నిండుచంద్రునివలె భాసిల్లాడు.

గోపికలు తననుగురించి పాటలు పాడుతుండగా, ప్రీతితో నర్తిస్తూ, వందలకొలదీ గోపికలు తనను కొలువగా మెడలోని వైజయంతిమాలతో పద్మనేత్రుడైన కృష్ణుడు బృందావనానికి అలంకారమయ్యాడు.

పరమేశ్వరుడై ఎవరికీ చిక్కకుండా, ఎదుటివారిని చిక్కులపాలు జేసే మాయలమారి అయిన కృష్ణునికి చిక్కి గోపయువతులు ధన్యురాండ్రై, మన్మథకేళిలో పరవశించిపోయారు. అలా ఉండగా కల్యాణగుణశాలి అయిన కృష్ణప్రభువు గోపికల కామోత్కంఠతను ఉపశమింపజేయడానికి, ఆ తర్వాత ఆదరంగా దగ్గరికి తీసుకోడానికి అనువుగా అపుడు అదృశ్యమయ్యాడు.

ఇలా కృష్ణుడు అద్భశ్యుడై వెళ్లిపోగా, మగ ఏనుగును కానక తిరిగే ఆడు ఏనుగుల మందలాగా, తమ హృదయాలు తల్లడిల్లిపోగా, గోపకాంతలు శ్రీకృష్ణుని నడక, నవ్వు, విలాసం, దృష్టి విహారం, పలుకు, నేర్పు, అనురాగాల స్మృతిలో తమ మనసులు పోగొట్టుకున్నారు. వివిధ చేష్టలకు పాల్పడి, తన్మయత్వంతో "నేను కృష్ణుణ్ణి” అని ఒకరు అంటే 'కాదు! నేనే కృష్ణుణ్ణి' అని మరొకరు వాదులాడుకుంటూ, కృష్ణునిగుణాలు వారిలో ఆవేశించగా తిరుగుతూ -

ఓ పరీక్షిన్మహారాజు! చరాచరాలైన సమస్తభూతాల లోపలా, వెలుపలా విలసిల్లే వాసుదేవుణ్ణి గోపకాంతలు యమునాతీరవన మధ్య ప్రాంతాలలో ప్రేమతో పాడుతూ వెదకడానికి వెళ్లారు.

ఓ పున్నాగ వృక్షమా! పురుష శ్రేష్ఠుల నమస్మారాలందుకొనే వాణ్ణి చూశావా? ఓ బొట్టుగచెట్టా! నొసట తిలకం ధరించేవానిని దర్శించావా? ఓ కర్పూర వృక్షమా! మహాబలంతో విలసిల్లే వాణ్ణి చూడలేదా? ఓ మంకెన వృక్షమా! బంధవులకు మిత్రుడైన వాణ్ణి చూశావా? ఓ వెలగమానూ! మన్మథ రూపుణ్ణి సందర్శించలేదా? ఓ వెదురు వృక్షమా! వేణుధరుణ్జి చూడలేదా? 

చందనవ్ఫక్షమా! చందనంలాగా చల్లనైనవాణ్ణి సందర్శించలేదా? ఓ మొల్లతీగా! మొల్లమొగ్గల్లాంటి దంతాలుగలవాణ్ణి కాంచలేదా? ఓ దేవదారువృక్షమా! దేవేంద్రవైెభవంతో విలసిల్లేవాణ్ణి కనలేదా? ఓ రేగుచెట్టూ! భూమండలానికి అధీశుడైనవాణ్ణి ఆలోకించలేదా? ఓ ప్రేంకణవృక్షమా! ప్రియవిహారంతో విరాజిల్లేవాణ్ణి చూడలేదా? -అంటూ పద్మముఖులైన గోపస్త్రీలు కృష్ణుణ్ణి వెదికారు.

ఇంకనూ...

ఓ మల్లియలారా! నీలమేఘశ్యాముడు, కమలనేత్రుడు, దయారసం చిలికించేవాడు, సిగపైన వ్యాపించిన నెమలిపింఛం గలవాడు, చిరునవ్వు చిందించే సుందరవదనుడు అయిన ఒక కుర్రవాడు గోపికల మానధనం దోచి తెచ్చాడు. మీ పొదల మాటున లేడుగదమ్మా! చెప్పండి.

ఓ లవంగతరువులారా! మాదీఫలవృక్షాల్లారా! నారింజవృక్షాల్లారా! దర్శించిన మాత్రాన్న మన్మథుణ్ణి అయినా చిత్తానికి ఇంపుగలిగించి పరవశింపజేసేవాడు, సిరికి నివాసమైన వక్షంవాడు, తీయనైన వేణునాదంతో విలసిల్లేవాడు అయిన శ్రీకృష్ణుడు మమ్మల్ని మన్మథుని పూలబాణాలకు అప్పగించి, మీ వద్దకు రాలేదు గదా! ఒకవేళ వచ్చి ఉంటే దయతో చూపండి!

మనోజ్ఞాలూ, గొప్పవీ అయిన కొడిసె వృక్షాల్లారా! రమణుల పాలిటి మన్మథుడైన లక్ష్మీశుణ్ణి చూడలేదా? సుందరమైన, సుదీర్ఘమైన మద్దివృక్షాల్లారా! సుందరుడూ, ఉదారుడూ, వత్సరాక్షసుణ్ణి సంహరించినవాడు అయిన హరిని కాంచలేదా? సమున్నతాలై ఒప్పిదమైన కంకేళీ వృుక్షాల్లారా! సుందరాలు, దీరాలెన కొమ్మలతో కూడిన జంట మదిచెట్లను పడగొటిన కృష్ణుణ్ణి చూడలేదా? 

నూతనమైన, ఒప్పిదమైన సంపెంగలారా! మహిమతో ప్రకాశిస్తూ దుఃఖరహితుడై విలసిల్లుతున్న కమలనేత్రుణ్ణి దర్శించలేదా? ఎఱ్ఱగోరింట చెట్టులారా! నవ్యమై, అందంగా ఉన్న బంగారు కిరీటధారి అయిన నందనందనుణ్ణి బృందావనమధ్యంలో సందర్శించలేదా? ఓ సుందరమైన అడవిమొల్లలారా! అందమైన నెల్లి చెట్టుల్లారా! బృందావనంలోని ఎర్రగోరింట పొదల్లో తిరిగే శ్రీకృష్ణుని చూడలేదా? (చూచి ఉంటే దయతో చెప్పండి? అనీ భావం)

అదిగో! నందుని తనయుడైన కృష్ణుడు ఉన్నట్లుండి అదృశ్యమయ్యాడు. ఓ కలిగొట్టు వృక్షాలారా! పట్టుకొనండమ్మా! 'కృష్ణా! విలాసవతులైన గోపకాంతలను ఎందుకు వదిలివేశావు' అని ఓ బుడమ తీగెలారా! అతణ్ణి అడగండి. ఓ మామిడి గుబురులారా! కమలాక్షుడు ఇక్కడికి వచ్చి దాగుకోలేదు గదా! చూడండమ్మా! ఓ పూలగురివెంద లతలారా! తరుణులపాలిటి మన్మథుడైన కృష్ణునికి మారాక చెప్పి మమ్మల్ని బతికించండమ్మా! జాజిలతలారా! కులకాంతులను వదిలివెళ్లడం హరికి నీతిగాదని దిక్కుల్లో చాటండమ్మా! ఓ అరటి చెట్టుల్లారా! మీరు వెళ్లి నెమలిపింఛం శిఖలో ధరించిన పద్మనేత్రుణ్ణి కదలించుకొని తెచ్చి దయతో మాకు చూపండమ్మా!

ఓ తులసీ! శ్రీహరిపాదాలకు ప్రియమైనదానివై, హరినిన్ను సమాదరించగా, నీవు శుభాలు అందుకొంటున్నావు. కృష్ణుడు నీ వైపు రాలేదుగదా? కృష్ణునిజాడ తెలిపి శుభాలు అందించవమ్మా!

పొగడలారా! పొగడదగిన పురుషోత్తముడైన కృష్ణుణ్ణి చూడలేదా; ఓ ఎర్రకిత్తలి చెట్టులారా! సాటిలేనిక్తీర్తిగల కృష్ణప్రభును చూపండి; మొల్లలారా! సర్వవ్యాపితకీర్తిగలవాడైన కృష్ణుడు ఎక్కడున్నాడు? ఓ మోదుగుచెట్టులారా! శుకునిచే స్తుతించబడిన వనమాలి ఏడీ? చెప్పండి.

ఓ ఆడుజింకా! (హరిణీ) తరుణులు తమస్తనాలపై అలదుకొన్నకుంకుమ పూతలు అంటుకొని హరికంఠంలోని పుష్పమాలికా పరిమళం సర్వత్ర వ్యాపించగా- అలాంటి గోపాలుణ్జి చూచినట్లు నీ చూపులు తలపిస్తున్నాయి. శ్రీకృష్ణుని జాడ తెలుపు. నీకు పుణ్యముంటుంది.

ఓ భూదేవీ! వరాహావతారం దాల్చినప్పుడు నిన్ను కౌగిట్లో చేర్చుకొన్నాడు. వామనావతారమెత్తి త్రివిక్రమస్వరూపుడై పాదాలతో నిన్ను కొలిచాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడై నీమీద పాదాలగుర్తులుంచాడు! పూర్వజన్మలో ఏమి నోములు నోచావోగదా!

ఇలా అంటూ గోపకాంతలు మన్మథుని ప్రేరణతో వెర్రెత్తినట్లు ప్రవర్తిస్తూ, కృష్ణతాదాత్మ్యాన్ని పొంది, ఆయన లీలలను అనుకరిస్తూ

గోపికల్లో ఒక రమణి పూతనవలె ప్రవర్తించగా, కృష్ణునివలె అభినయిస్తున్న ఒక సుందరి పాలు తాగినట్లు నటించింది. ఒక గోపిక తనను శిశువుగా భావించుకొని పాలకు రోదిస్తూ, శకటాసురుడులాగా నటించే మరొక సుందరిని కాలితో తన్నింది. ఒక అందగత్తె తృణావర్తుడులాగా నర్తిస్తూ, నేను కృష్ణుణ్ణి అనే మరొకగోపకాంతను పైకి ఎగరవేసుక పోయింది.

ఒక గోపకాంత నేను బకాసురుణ్ణి అని విజ్బంభించగా, నేను వాసుదేవుణ్ణి అంటూ మరొకగోపిక ఆమెను పరాభవించింది. ఇద్దరు తరుణులు రామకృష్ణులుగా నటించగా, మరికొందరు గోపకులు, దూడలు అయ్యారు. 'మేము పసులము' అంటూ పలుకుతున్న సుందరులను 'నేను అసురవైరిని' అని మరొక గోపిక పిలిచింది.

(ఇక్కడ కృష్ణతాదాత్మ్యంతో గోపకాంతలు కృష్ణలీలలను అభినయించే దృశ్యం మనోహరం.)

ప్రఖ్యాతచరిత్రుడవైన ఓ పరీక్షిన్మహారాజు! ఒక గోపకాంత హరియై విశ్వమంతా నా ఉదరంలోనే ఉంది చూడు అంటూ యశోదమ్మలా నటించే మరో గోపకాంతకు నోరు విప్పి చూపింది.

ఒక గోపకాంత వెన్నలు దొంగిలించి తినే కృష్ణుణ్ణి నేను అని చెప్పింది. వెంటనే వేరొక గోపిక తాను యశోదనంటూ చేతితో సైగలుచేస్తూ పూలదండతో (కృష్ణునివలె నటించే) ఆమెను కట్టివేసింది.

నరేంద్రా! “ఇది కాళియసర్పం. వీరు అతనిభార్యలు. నాకు వందనాలు చేస్తున్నారు. నేను గోపకుమారుడనైన కృష్ణుణ్ణి” అంటూ ఒక గోపకాంత కృష్ణునివలె విలాసంగా నర్తించింది.

ఓ రాజా! ఒక గోపకాంత కొందరు గోపతరుణులను చూపి “వీరు గోపాలకులు. ఇదిగో ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు. నేను శ్రీకృష్ణుణ్ణి. గోవర్ధనగిరి నెత్తి మిమ్మల్ని రక్షిస్తాను” అంటూ తన కెంగేలితో చీరచెరగు ఎత్తి పట్టుకొంది.

నరేంద్రా! ఒక గోపకాంత "నేను శ్రీకృష్ణుణ్ణి! మీరు గోపాలకులు. దావాగ్ని వస్తూ ఉంది. అటు చూడకండి. నేను దాన్ని నివారిస్తాను” అంటూ వట్టి బయలునే మింగింది.

ఇలా గోపసుందరులు పరవశంతో బృందావనంలో ఉండే చెట్లు, తీగెలు మొదలైనవాటిల్ని హరినిగురించి అడుగుతూ, సంచరించడానికి వీలుకాని అడవిదారుల్లో తిరుగుతున్నారు. అలా తిరిగేటప్పుడు శ్రీకృష్ణుని శుభలక్షణ లక్షితాలయిన పాదాల తీరును(అడుగుల ముద్రలద్వారా) గమనించారు. ఆ పాదాలు పద్మం, ధ్వజం, నాగలి, వజ్రం, కలశం, అంకుశం మొదలైన శుభలక్షణాలు కలిగినవి. వాటిల్ని గురించి చెప్పుకొంటూ తమ మనస్సులలో ఇలా భావించారు.

(పద్మం, ధ్వజం, నాగలి, కులిశం, అంకుశం మొదలైన చిహ్నాలు పాదాలలో ఉండడం ఉత్తమపురుషలక్షణం.)

ఇక్కడ ఒక సుందరికోసం కృష్ణుడు పూలుకోసినాడు కాబోలు - మునివేళ్లుమాత్రమే నేలపై మోపినాడు, ఇక్కడ ప్రీతితో కలికి నెత్తుకొని ముందుకు వెళ్లాడు కాబోలు - ఈ పచ్చికమైదానంపై ఆమెఅడుగులు అగుపించడంలేదు. ఇక్కడ ఒక మదవతి కొప్పు సవరించి చక్కదిద్దాడు కాబోలు - ఇద్దరూ కూర్చున్న ప్రదేశం సుందరంగా ఉంది. 

ఇక్కడ ఒక సుందరికి కమ్మోవి ఇచ్చాడు కాబోలు - ఆమె నిక్కినతీరు తేటతెల్లం అవుతూ ఉంది. ఒక కుందరదనతో ఇక్కడ ఈ కొలనునీటిలో దిగాడు కాబోలు - నీటినుండి వెలువడిన తావులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కొమరాలిని మన్మథక్రీడలో తనియించాడు కాబోలు - ఇద్దరూ అనగి పెనగిన చిహ్నాలు అందగా విలసిల్లుతున్నాయి.

అంతే కాకుండా...

ఇక్కడ నందనందనుడు ఒక తరుణి చేయిపట్టుకొని నడిచాడు కాబోలు నాలుగుపాదాలున్నాయి. ఒక అందగత్తెతో ఇక్కడ ఒదిగాడు కాబోలు, పురుషునిజాడలో స్త్రీజాడ కనిపిస్తూ ఉంది. ఒక యువతి వందనం చేయగా ఇక్కడ ఒడిసి పట్టుకున్నాడు కాబోలు ఇక్కడ ఎదురెదురుగా పాదాల గుర్తులు ఏర్పాడ్డాయి. ఒక సుందరి వెంటబడగా నిలువకుండా వెళ్ళిపోయాడు కాబోలు కృష్ణునిఅడుగుల మీద ఆ అందగత్తె అడుగులు అమరి ఉన్నాయి. ఇరువైపులా ఇద్దరుతరుణులు రాగా తిరిగాడు కాబోలు ఇక్కడ ఆరుఅడుగుల గుర్తులున్నాయి.

ఓ చంద్రముఖీ! ఈ పాదాలే సనకసనందనాదిమునీశ్వరుల ధ్యానమార్గంలో వెలుగుతూ ఉండేవి; ఓ యువతీ! ఈ పాదాలే వేదాలనే కాంతల పాపట్లలో విరాజిల్లేవి ఓ మత్తగజయానా! ఈ పాదపద్మాలే క్షీరసాగరకన్య అయిన లక్ష్మీదేవికి ఆధారాలు. 

ఓ కలువకంటీ! ఈ అందమైన పాదాలే ముక్తికాంతమనస్సుకు సమ్మోహనకరాలు. ఓ సుందరీ! ఈ పాదాల ధూళియే బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు నడితలపై ధరించెవి. అంటూ కొందరు యువతులు కృష్ణుడు వెళ్లిన దారిని గుర్తించికూడా అతణ్ణి కనుగొనలేకపోయారు.

ఆ సమయంలో నాథులు తమకాంతలకు లొంగిపోయి పొందే దీనత్వాన్నీ, తరుణులు చూపే క్రూరత్వాన్నీ తెలపడానికి కృష్ణుడు ఒక సుందరితో కలిసిమెలసి విహరించాడు. అంతలో ఆ సుందరి తక్కిన యువతులందరినీ వదిలి నాథుడు తన, వద్దనే ఉన్నాడని విర్రవీగింది. 

ఆ గర్వంతోనే ఆమె “ఓ కమలనేత్రా! ఇక నడచి రాలేకున్నాను. నన్ను నీ భుజంపైన ఎక్కించుకో!” అని పలికింది. ఆ మాట అన్నవెంటనే కృష్ణుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ వనిత పరితాపం పొంది "ఓ కృష్ణా! వల్లభా! ప్రాణేశ్వరా! ఎక్కడికి వెళ్లావు! నీకు పాదదాసినవుతాను నిలు నిలు” అంటూ పలవరించింది. అపుడు కొందరు యువతులు ఆ తరుణిని చూచి, మగనిచేత మన్ననలు పొంది, దర్పించి, ఈ పద్మనేత్ర ఇప్పుడు ఇటువంటి కష్టాలకు లోనయింది” అని విస్మయం పొందారు.

ఇంకా, ఓ పరీక్షిన్మహారాజా! గోపకాంతల వింత చేష్టలనుగురించి ఇంకా విను. ఈ పొదరింటిలో ఇందాక కృష్ణుడు నాతో మన్మథక్రీడసలిపాడు. ఈ చాటుప్రదేశంలో ఇంతవరకూ వల్లభుడు నన్ను గాఢంగా హత్తుకున్నాడు. ఈ చెట్టునీడలోనే ఇందాక సౌభాగ్యవంతుడు శృంగారచేష్టలతో నా సిగ్గును హరించాడు. 

ఈ పూలతీగవద్దనే ఇందాక మనోహరుడు నన్ను సమీపించి అధరామృతం ఆస్వాదించాడు. ఈ పూలతిన్నెమీద ఇందాక రమణుడు నా కొప్పులో పూలదండలను అలంకరించాడు అంటూ కొందరు యువతులు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు సలిపిన శృంగారచేష్టలను కొనియాడారు.

ఈ విధంగా లతాంగులైన గోపికలు బృందావనంలో పరమాత్ముడైన శ్రీకృష్ణునికి వెదకి వెదకి దర్శించలేకపోయారు. ఆ విభుని గుణాల్ని చేష్టల్ని వర్ణిస్తూ, గానంచేస్తూ మనోవాక్కర్మలను ఆ లక్ష్మీశునిపైన్నే చేర్చ, తమతమ ఇండ్లకు వెళ్లాలనే కోర్కెలను వదలి, ఆ యమునాతీరంలోని ఇసుక తిన్నెలమీదికి త్వరత్వరగా వెళ్లారు.

అలా యమునా తీరంలోని ఇసుకతిన్నెల మీదికి వెళ్లిన గోపయువతులు, కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా పలికారు.

గోపికాగీతలు

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Bringing nanda from Varuna Nagaram by Lord Krishna - శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట

నందగోపుడు ఏకాదశినాడు ఉపవాసవ్రతం చేసి, శ్రీహరిపూజచేసి, రాక్షసులు సంచరించేవేళ అని తెలియక, వేకువజాము కాకముందే ద్వాదశీస్నానం చేయడానికి యమునానదినీటిలో ప్రవేశించాడు. అప్పుడు వరుణునిదూత నందుణ్ణి వరుణనగరానికి కొనిపోయాడు. తక్కిన గోపకులు నందగోపుడు కనబడనందున కలతచెంది, బలరామకృష్ణులను పేర్లతో పిలుస్తూ శబ్దాలు చేశారు. ఈశ్వరుడైన కృష్ణుడు తన తండ్రిని మోసంతో వరుణదూత తీసుకొనిపోయి వరుణుని దగ్గర చేర్చడం తెలుసుకొని, వెంటనే వరుణుని నగరానికి వెళ్ళాడు.

(సాయంసంధ్యలు పొద్దుకుంకే సమయాన్ని 'అసురసంధ్య' అంటారు. అలాగే వేకువజాముకు ముందు అసురులు సంచరించే వేళ అంటారు. ఆ సమయాల్లో ఏ శుభకార్యమూ చేయరు.)

ఇలా వచ్చిన శ్రీకృష్ణునిచూచి వడివడిగా శ్రీకృష్ణుణ్ణి పూజించి వినమ్రుడై, ఓ దేవా! నా యింటికి విచ్చేశావు అని ఆప్యాయంగా పలికాడు.

మాధవా! ఎన్నడూ, ఎవరూ పొందశక్యంగాని పెనుత్రోవలో ఏ విభుని పాదపద్మాలను ఆసక్తితో ధ్యానించేవారు నడుస్తారో, అలాంటి భక్తులకు సంతోషం ప్రసాదించే స్వామివి నీవు. నీవు రావడంవల్ల నా మనసు పరమానందంతో నిండి పోయింది. నా కోరికలు ఫలించాయి. నీ సేవలో నా శరీరం పావనమైంది.

(ఆనందం పొందేవి రెండు. అటు శరీరం ఇటు మనసు. ఇవి రెండూ సంతోషం పొందాయి అంటే వరుణుడు స్వామిదర్శనంతో ధన్యుడయినట్లే!)

ఈ జగాలన్నిటినీ కప్పినమాయ ఏ పరమేశుడవైన నిన్ను కప్పలేక నీకు దాస్యం చేస్తూ ఉంటుందో, అలాంటి మహాత్మా! సుజనులను రక్షించేవాడివి, దేదీప్యమానశుభమూర్తివి, సుజన రక్షకుండవు, తపస్సే ధనంగా గలిగినవారికి చక్రవర్తివి అయిన నీకు నా శరీరతాపం తొలగించుకోవడానికి వందనాలు సమర్పిస్తున్నాను.

ఓ జనక వత్సలా! నిర్మల భక్తవత్సలా! ఈ నా భటుడు కొంతైనా మనసులో వివేకంలేనివాడై, నీ తండ్రిని వరుణలోకానికి తీసుకొని వచ్చాడు. నీ తండ్రిని దయతో తీసుకొని పొమ్ము! వీడు చేసినద్రోహాన్ని మరచిపొండి! నన్నూ ఈ భటుణ్ణి మన్నించండి. నీ క్షమాగుణంవల్లనే నేను బతికిపోతాను.

ఇలా పలుకుతూ ఉన్న వరుణుణ్ణి శ్రీకృష్ణుడు కరుణించాడు. ఆయన తనతండ్రి అయిన నందుణ్ణి తోడుకొని గోకులానికి తిరిగివచ్చాడు. అప్పుడు నందరాజు కృష్ణుడు తనను వరుణపురంనుండి విడిపించుకొని తీసుకొనివచ్చిన విషయాన్ని సమగ్రంగా బంధువులకు వర్ణించి చెప్పాడు. బంధువులు శ్రీకృష్ణుణి సాక్షాత్తూ పరమాత్ముడు అని భావించారు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు కూడా తన బంధువుల భావాన్ని గ్రహించాడు. వారి కోరికను నెరవేర్చడానికి యమునానదిలో ఓ మడుగైన బ్రహ్మకుండంలో ముంచెతాడు.

ప్రకృతి సంబంధమైన కామకర్మలలో పరవశం పొందుతూ, ఉత్తమ అధమ స్థితులకు లోనవుతూ, భ్రాంతిలో జీవిస్తున్న ఈ జనం ఇహలోకంలో అసాధారణమైన నా నిజస్థితి విశేషాలను తెలుసుకోలేకుండా ఉన్నారు - అని కృష్ణుడు తలంచాడు.

అని ఇలా ఆలోచించినవాడైన శ్రీకృష్ణుడు దయాస్వభావంగలవాడై వ్రేపల్లెవాసులకు మాయకులో పడనిదీ, తేజోరూపమైందీ, నిరూపించవీలుగానిదీ, సత్యమైందీ, జ్ఞానస్వరూపమైందీ, ఆనందమయమైందీ, అంతటానిండినదీ, పాపరహితులు గణాతీతస్థితిని పొందిన తరువాత పొందేదీ, స్వామివారికీ ఆత్మీయమైందిగా ఉండేది అయిన శాశ్వతమైన తన లోకాన్ని చూపించాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు - ముందు అక్రూరుడు పొందిన పుణ్యలోకాన్ని పూర్తిగా చూపి, బ్రహ్మలోకాన్ని గూడా నందాదులకు కనిపింపజేశాడు. వారు ఆనందించి ఆశ్చర్యపడుతూ పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణమూర్తిని స్తోత్రం చేస్తూ పూజించారు. ఆ తర్వాత

ఆ సమయంలో శరదృతువు వచ్చింది. శరద్రాత్రులు కలువలకు మేలుగలిగే సమయాలుగా, మన్మథుడికి యుద్ధస్థానాలుగా, విరహాలకు తలలు వాల్చిన వేళలుగా, చక్రవాకపక్షులకు రతిసమయాలుగా, యువతులు విషయాలలో చిక్కుకొనే వేళలుగా, శరత్‌చంద్రుని దట్టమైన వెన్నెలలో దిక్కులు ప్రకాశించేవిగా, జారులకు దుర్దశలుగా అయ్యాయి.

శరదృతువులోని పున్నమిరాత్రి నిండుచంద్రుడు కలిగిందై ఆ మన్మథశాస్త్రానికి వ్యాఖ్యానంగా, కలువపూలకు వికాసం ఇచ్చేదిగా, మన్మథుని విజృంభణం కలిగిందిగా, జారుల నిబ్బరాన్ని పోగొట్టెదిగా, భయపడిన చక్రవాకాలు కలిగిందిగా, అందరికీ ప్రీతిని గలిగించేదిగా వచ్చింది.

ఓ పరీక్షిన్మహారాజా! భర్త తన భార్యముఖంమీద కుంకుమపూత పూసినట్లుగా చంద్రుడు తన ఉదయవేళలోని ఒప్పిదమైన కిరణాల ఎరుపుదనంతో తూర్పుదిక్కు అనే స్త్రీ యొక్క ముఖాన్ని రంజింపజేశాడు.

ఆ సమయంలో మన్మథుడు విటులసేనపైన దండెత్తడానికి సిద్ధంచేసుకొన్న గుడారం మీద మెరిసే బంగారుకలశమో అన్నట్లుగా నునుపై - ఆ మన్మథుడు కాముకులయొక్క ధైర్యం అనే తీగను తెగగొట్టడానికి ఎత్తిన విష్ణుచక్రమో అన్నట్లుగా గుండ్రనిదై - ఆ మదనుడు బాటసారుల ప్రణయకోపాలను కాల్చడానికి ప్రోగుచేసిన నిప్పుల కుప్పో అన్నట్లుగా ఎర్రనిదై - ఆ పంచబాణుడు విరహిణులు అనే మృగాలను వేటాడడానికి తనవెంట తెచ్చుకొన్న మోహపుదీపమో అన్నట్లుగా కాంతిగలదై, చకోరాలు సంతసించగా, ఆకాశమండలంలో, ఉదయ పర్వతం చెంత పున్నమినాటి చంద్రబింబం ఉదయించింది.

శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Wednesday, August 19, 2026

Sridevibagavatham - Phalashruthi - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి

శౌనకాది మహామునులారా! మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది. ఆదిలో ఈ దేవీభాగవతం సాక్షాత్తూ జగదంబికా ముఖపద్మంనుంచి అర్ధశ్లోకాత్మకంగా ఆవిర్భవించింది. 

వేదసారంగా వటపత్రశాయికి ఉపదేశించింది. అటుపైని దాన్ని శతకోటి గ్రంథంగా విస్తరించాడు బ్రహ్మదేవుడు. దాని సారమంతా ఒకచోటికి చేర్చి పద్దెనిమిదివేల శ్లోకాలూ పన్నెండు స్కంధాలుగా సంగ్రహపరచి శుకుడికోసమని వ్యాసుడు ఉపదేశించాడు. 

ఇదీ దీని చరిత్ర. అలనాటి ఆ శతకోటి విస్తర దేవీమహాభాగవతం నేటికీ దేవలోకాన బహుళప్రచారంలో ఉంది.

మహామునులారా! ఈ దేవీభాగవతంతో సాటివచ్చే మరొక పవిత్రగ్రంథం ఈ సృష్టిలోనే లేదు. ఇది సర్వపాపవినాశకం. ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధఫలం దక్కుతుందంటే అది స్తవం కాని వాస్తవం. పౌరాణికుణ్ణి ఆహ్వానించి వస్త్రాద్యాభరణాలతో అర్చించి సంతుష్టిపరచి వ్యాసుడిగా సంభావించి అతడి నోటినుంచి ఏకాగ్రచిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవారూ నిజహస్తాలతో లిఖించినవారూ పఠించినవారూ లిఖింపజేసినవారూ సర్వకిల్బిషవిముక్తులై సుఖశాంతులతో భోగభాగ్యాలతో సకలసమృద్దులతో నిండు నూరేళ్ళు జీవించి కట్టకడపట మణిద్వీపం చేరుకుంటారు. 
తరతరాలనూ తరింపజేస్తారు. 

పురాణ శ్రవణం పూర్తయ్యాక ప్రౌష్టపదీ పూర్ణిమనాడు పౌరాణికుణ్ణి సత్కరించాలి. బంగారంతో సింహప్రతిమ తయారుచేయించి ఇవ్వాలి. దక్షిణగా కపిలగోవును(పాడిఆవును) దూడతోసహా సమర్పించాలి. బంగారు గొలుసుతో అలంకరించి మరీ ఇవ్వాలి. అధ్యాయసంఖ్యకు సమానంగా బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యాలి. 

అంతేసంఖ్యలో సువాసినుల్నీ కుమారీముణుల్నీ వటువుల్నీ అర్చించాలి. దేవీబుద్దితో వీరిని వస్త్రాభరణ పుష్పమాలికలతో పూజించాలి. పాయసాన్నాలు పెట్టాలి. ఈ పురాణగ్రంథాన్ని ఎవరికి దానం చేసినా భూదానఫలం దక్కుతుంది. ఇహలోకంలో సుఖంగా జీవించి అంతంలో దేవీపట్టణం చేరుకుంటారు. 

నిత్యమూ దేవీభాగవతాన్ని. పఠించేవారికీ వినేవారికీ ఎప్పుడూ ఎక్కడా అసాధ్యమంటూ ఎదీ ఉండదు. పరాజయం అనే మాటకూడా వినిపించదు. అపుత్రకులకు సంతానప్రాప్తి, నిర్ధనులకు ధనలాభం, విద్యార్థులకు విద్యాలబ్దితోపాటు కీర్తి - కలుగుతాయి. 

వంధ్యగానీ కాకవంధ్యగానీ మృతవంధ్యగానీ వింటే ఆ దోషాలు తొలగిపోతాయి. ఇంటిలో నిత్యమూ ఈ గ్రంథాన్ని పూజిస్తే చాలు లక్ష్మీదేవి ఇక ఆ ఇంటిని విడిచి పెట్టదు. బేతాళ డాకినీ రాక్షసాదులు అటువైపు తొంగిచూడటానికి సైతం భయపడతారు. జ్వరంతో బాధపడేవారిని స్పృశించి ఈ పురాణాన్ని మండలంరోజులు పఠిస్తే జ్వరముపశమిస్తుంది. 

నూరుసార్లు పఠిస్తే క్షయరోగం నశిస్తుంది. ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యాసమయంలో పారాయణచేసిన వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. శరన్నవరాత్రుల్తా పఠిస్తే జగదంబిక సంతోషించి కోరినదానికన్నా వెయ్యి రెట్టుగా వరాలు కురిపిస్తుంది.

శైవులు పఠిస్తే పార్వతి, వైష్ణవులు పారాయణచేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తారు. సౌరమతంవారూ గాణపత్యులూ ఎవరు పఠించినా వారి ఇష్టదేవత ఆనందిస్తుంది. వైదికులు గాయత్రీదేవి ప్రీతికోసం తప్పకుండా దీన్ని పఠించాలి. ఎవరు ఏ ఉపాసన చేసినా అది శక్తి ఊపాసనమే అవుతుంది. 

కనక ఆ శక్తి సంతుష్టికోసం ఈ భాగవతాన్ని పారాయణ చెయ్యవలసిందే. చదువురానివారూ చదవలేనివారూ చదవరానివారూ పురాణశ్రవణం చేస్తే చాలు. వారికీ అంతపుణ్యమూ లభిస్తుంది. ఇది నిర్ణయం. ఇది నిశ్చయం. ఇది నిస్సందేహం. 

శౌనకాది మహామునులారా! ఊరికే వెయ్యిమాటలు ఎందుకుగాని సారాంశమేమిటంటే - ఇది వేదసారం. వేదపఠన సదృశం. వేదశ్రవణ సమానం. సచ్చిదానందరూప గాయత్రీప్రతిపాదిత హ్రీమయి ఆ మహాదేవి మనకు సద్బుద్దివైభవాన్ని ప్రసాదించుగాక!

సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితామ్‌ ।
నమామి హ్రీమ్మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్‌ ॥

సూతమహర్షి కన్నులు ముకుళించి దేవిని ధ్యానిన్తూ నమస్కరించాడు. నైమిశారణ్యవాసులు శౌనకాది మహామునులు ఆనంద పారవశ్యంనుంచి మెల్లగా తేరుకున్నారు.

సూతమహర్షిని శ్రద్ధాభక్తులతో ఘనంగా సత్కరించారు. అందరూ ప్రసన్న హృదయులయ్యారు. దేవీపాదాంబుజార్బకులయ్యారు. ఈ పురాణ శ్రవణ ప్రభావంతో అందరూ పరనిర్వృతిని (బ్రహ్మానందాన్ని) పాందారు. అడ్డదిడ్డంగా ఏవేవో ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టామో శ్రమపెట్టామో క్షమించమంటూ సూతుణ్ణి బతిమాలుకున్నారు. లెంపలు వేసుకుంటూ మళ్ళీమళ్ళీ నమస్కరించారు. 

సంసారసముద్రాన్ని దాటించేందుకు మాపాలిటి నావవు నువ్వేనని మ్రొక్కారు. 

అంబాచరణకమలభృంగాయమాణుడు సూతుడు సంతోషించి. అందరినీ ఆశీర్వదించి పునరాగమనాయ చ అని వీడ్కోలు తీసుకుని బయలుదేరాడు.

శ్రీదేవీభాగవతం సంపూర్ణం






Janamejayudiki Manashanthi - జనమేజయుడికి మనశ్శాంతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - జనమేజయుడికి మనశ్శాంతి

జనమేజయా! నారదుడికి నారాయణమహర్షి చెప్పినదంతా నీకు నేను చెప్పాను. నువ్వు ఆడిగినదంతా వివరించాను. మహాద్భుతమైన ఈ మహాదేవీ పురాణాన్ని విన్నవారందరూ కృతకృత్యులవుతారు. దేవికి అత్యంతప్రియతములవుతారు. 

కనక నువ్వుకూడా దేవియజ్ఞం చెయ్యి. నీ పూర్వీకులను ఉద్ధరించు. నీ తండ్రిపొందిన దుర్గతికి అసలే ఖిన్నుడవై ఉన్నావు కనక దేవీయజ్ఞం నిర్వహించి పరీక్షిత్తుకు ఉత్తమగతులు కల్పించు. మహాదేవీమంత్రం నీకు ఉపదేశిస్తాను. గ్రహించు. విధివిధానంగా జపిస్తే జన్మ సఫలమవుతుంది. -' అన్నాడు వ్యాసభగవానుడు.

శౌనకాది మహామునులారా! ఈ మాటవిన్న జనమేజయుడు సంబరపడి పరిశుద్ధుడై ఆ మునీశ్వరుణ్ణి ప్రార్థించి దేవీప్రణవసంజ్ఞకమైన మహామంత్రాన్ని దీక్షావిధితో ఉపదేశం పొందాడు. 

నవరాత్రి సమయంలో ధౌమ్యాదిమహర్షులను ఆహ్వానించి దేనికీ లోభించకుండా మహాదేవీ యజ్ఞం నిర్వహించాడు, బ్రాహ్మణులను రావించి ఈ దేవీభాగవత పురాణ పారాయణ జరిపించాడు. 

సువాసినీ పూజలూ కుమారీపూజలూ బ్రహ్మచారిపూజలూ అసంఖ్యాకంగా చేశాడు. బ్రాహ్మణులకు అన్నసంతర్పణ జరిపాడు. దీనులకూ అనాథులకూ పుష్కలంగా ధన కనక వస్త్రాదులను కానుకలుగా సమర్పించాడు. యజ్ఞం ముగిసింది. 

జనమేజయుడు సంస్థానంలో కొలువుతీరాడు. ఆకాశంనుంచి నారదుడు ఆవతరించాడు. మహతి మోగించుకుంటూ వచ్చాడు. ప్రకాశిస్తున్న అగ్నిశిఖలాగా ఉన్నాడు. నారదుణ్ణి చూడటంతోనే మహారాజు హడావిడిగా అభ్యుత్థానం చేశాడు. స్వాగతంపలికి ఆర్ఘ్యపాద్యాలిచ్చి సముచితాసనం మీద కూర్చోబెట్టాడు. కుశలప్రశ్నలు అయ్యాయి.

మహర్షీ! నీ రాకతో ధన్యుణ్ణి అయ్యాను. సనాథుణ్ణి అయ్యాను. ఆజ్ఞాపించు - ఏమి చెయ్యమంటావో! 

మహారాజా! ఇవ్వేళ దేవలోకంలో ఒక వింత చూశాను. ఆశ్చర్యంనుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్ము, ఆ విశేషం నీకు చెప్పి వెడదామనిపించి వచ్చాను. దుర్గతిని పాందిన నీతండ్రి ఇవ్వేళ దివ్యరూపం ధరించి స్వర్గంలో కనిపించాడు. దేవతలూ అప్సరసలూ అతణ్ణి స్తుతిస్తున్నారు. 

దివ్యవిమానం అధిరోహించాడు. మణిద్వీపానికి తరలివెళ్ళాడు. ఇదంతా దేవీభాగవతశ్రవణంవల్ల కలిగిన పుణ్యఫలం. నువ్వు నిర్వహించిన మహాదేవీయజ్ఞానికి వెంటనే దక్కిన పుణ్యం. నీతండ్రి దుర్గతినుంచి విముక్తుడై సుగతిని పొందాడు. 

ఇలా కన్నతండ్రికి సద్గతి కల్పించి కృతకృత్యుడవయ్యావు. నువ్వు ధన్యుడవు. నిజంగా నీ జీవితం సఫలం. తండ్రిని నరకంనుంచి ఉద్ధరించావంటే నువ్వు కులభూషణుడివి. ఇవ్వేళ దేవలోకంలో నీకీర్తి మారుమ్రోగిపోతోంది. సంతోషం పట్టలేక ఈ శుభవార్త నీకు చెబుదామనీ, నువ్వూ ఆనందిస్తావనీ వచ్చాను.

నారదుడి మాటలు వింటూంటే జనమేజయుడికి తనువు పులకించింది. కన్నుల్లో ఆనందబాష్పాలు తాండవించాయి. ఆపుకోలేక వ్యాసభగవానుడి పాదాలమీద సాష్టాంగపడ్డాడు. 

మహానుభావా! ఇది ఆంతా నీ అనుగ్రహమే. నన్ను కృతార్థుణ్ణి చేశావు. నమస్కరించడం తప్ప నేను చెయ్యగలిగివ ప్రత్యుపకారం ఏదీ లేదు. ఇలాగే ఎల్లవేళలా నన్ను అనుగ్రహించు. 

జీరవోయిన గొంతుతో ఇలా పరవశించి పలుకుతున్న జనమేజయుణ్ణి మనసారా ఆశీర్వదించి తల నిమిరాడు వ్యాసుడు. రాజా! అన్ని బంధనాలనూ తెగతెంపులు చేనుకుని దేవీపాదపద్మాలను నిరంతరం సేవించు. ధ్యానించు. ఉపాసించు. 

దేవీభాగవతాన్ని రోజూ పారాయణగా పఠించు. అంబాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో చెయ్యి. చేయించు. నీకు మోక్షం అనాయాసంగా లభిస్తుంది. భవబంధనాలు తమంతట తామే తెగిపోతాయి. హరి-హరుల పురాణాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కలిపివా ఈ దేవీ భాగవత మహిమలో. పదహారవవంతుకైనా సాటిరావు. ఇది నిజం. ఇది అఖిలవురాణసారం. అఖిలవేదసారం.

మూలప్రకృతిని ప్రతిపాదించేది కనక ఇదొక్కటే నిజమైన పురాణం. మిగిలినవన్నీ నామమాత్రపురాణాలు. దీన్ని చదివితే వేదపఠనఫలం దక్కుతుంది. కనక ఇదొక్కటే పండితులకూ పామరులకూ జ్ఞానులకూ యోగులకూ ముముక్షువులకూ - అందరకూ అవశ్యపఠనీయం. మరచిపోకుసుమా! ఇక మరి నేను వెళ్ళివస్తా. 

నీకు శుభమగుగాక! - అని పలికి వ్యాసుడు నిర్మమంగా నిష్క్రమించాడు. నారదుడూ దీవించి వెళ్ళిపోయాడు. ధౌమ్యాది మహర్షులు సెలవు తీసుకున్నారు.

అందరూ తమ తమ ప్రదేశాల్లో ప్రాంతాల్లో దేవీభాగవత ప్రశంసలు చేశారు. పారాయణలు జరిపారు. జనమేజయుడు రోజూ పఠిస్తూ పఠింపజేసి వింటూ సంతుష్టుడై రాజ్యపరిపాలన ధర్మబద్ధంగా సాగించాడు.

శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి





Chintamani Gruham - Srimatha - చింతామణి గృహం - శ్రీమాత

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - చింతామణి గృహం - శ్రీమాత

జనమేజయా! అదే దేవీసదనం. వేయిస్తంభాల మండపాలు నాలుగు ఉంటాయి. శృంగారమండపం - ముక్తిమండపం - జ్ఞానమండపం - ఏకాంతమండపం అని వరసగా వాటిపేర్లు. 

ఆనేక వితాన సంయుక్తాలు(మేల్కట్టులు). అనేక ధూప పరిధూపితాలు. కాంతిలో కోటిసూర్యసమానాలు. ఆ శుభమండ పాలకు చుట్టూ కాశ్మీరవనం. మల్లికావనం. కుందవనం. వాటిలో అసంఖ్యాక కస్తూరిమృగాలు మృగమదాన్ని స్రవిస్తూ ఉంటాయి. 

ఆక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణం. దానికి రత్ననిర్మిత సోపానపంక్తి. అందులో మహాపద్మవనం. పద్మాల పై ముసురుకొనే గండుతుమ్మెదలు. వాటి ఝంకారాలు. హంసకారండవాది జలపక్షి బృందాలు. వాటి కలకూజితాలు. దిక్తటాలకు వ్యాపించే సుమధుర పద్మపరిమళం. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా ఘుమఘుమలాడుతూ ఉంటుంది.

శృంగారమండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూంటుంది. ముక్తిమండపంలో తపస్వులకూ దేవీ ఆరాధన తత్పరులకూ యోగులకూ ముక్తి ప్రసాదిస్తూంటుంది. మూడవ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తుంటుంది. నాల్గవ ఏకాంత మండపంలో మంత్రిణులతో కలిసి నిత్యమూ జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూంటుంది.

జనమేజయా! చింతామణి గృహంలో పది సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తితత్త్వాలు పదీ - పది సోపానాలు. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నల్గురూ దానికి ఖురాలు(కోళ్ళు). ఫలకమేమో సదాశివుడు. దానిమీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లు తుంటాడు. మహాదేవియే విలాసార్థం ద్విధాభూత(రెండుగా) అయ్యిందని తెలునుగదా! 

సృష్టికి ఆదిలో ఇతడే తదర్ధాంగ మహేశ్వరుడు. కందర్ప దర్పనాశకుడు. కోటి కందర్ప సుందరుడు. పంచవక్త్రుడు. త్రినేత్రుడు. మణిభూషణ భూషితుడు. పరశు - హరిణ - వరద - అభయహస్తుడు. పదహారేళ్ళ పడుచువాడు. మహాసర్వేశ్వరుడు. కోటి సూర్యప్రతీకాశుడు. కోటిచంద్ర సుశీతలుడు. శుద్ధస్పటిక సంకాశుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి.

నవవిధ రత్నాలు పొదిగిన కాంచీదామం(వడ్డాణం). మేలిమిబంగారంలో వైదూర్యాలు తాపించిన అంగదాలు. శ్రీచక్రరూపంలో ఉండే తాటంకాలు. వాటి తళతళలతో మెరిసిపోతున్న ముఖపద్మం. అర్జచంద్రరేఖను జయించే నెన్నొసలు. దొండపండుల్లాంటి పెదవులు. కస్తూరీకుంకుమతిలకాలు దిద్దుకున్న ఫాలభాగం. శిరస్సున సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి. ఉదయభానుబింబంలాంటి నాసాభరణం(ముక్కుపుడక). మేలిముత్యాలు వేలాడుతున్న చింతాకపతకం. చందనం కర్పూరం కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్తనమండలం.

విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూంటుంది. శంఖంలాంటి మెడ. దానిమ్మగింజల్లాంటి పలువరుస. అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు. మదించిన తుమ్మెదలు(వంటి) కదలాడుతున్న ముంగురులతో మురువైన ముఖపద్మం.

ఏనాడూ క్షీణించని - మచ్చలేని చందమామలాంటి ముఖం. జాహ్నవీజలావర్తం(నీటిసుడి) వంటి పొక్కిలి. మాణిక్య శకలాలు పొదిగిన ఉంగరాలు అన్నివేళ్ళకూ. పద్మపత్రాలలాగా ముచ్చటైన మూడుకన్నులు. పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరీశరీర కాంతికి సాటిరావచ్చు.

చేతులకు రత్నకంకణాలు. వాటికి రత్నకింకిణులు(చిరుమువ్వలు). మెడలో ముత్యాలదండలు. మణిహారాలు. వాటికి అందాల పతకాలు. రత్నాంగుళీయకాల కాంతులతో రత్నకంకణాల ప్రభలతో ధగధగలాడుతున్న చేతులు. 

అమ్మవారు ధరించిన కంచెలకు (రవిక) రత్నాల బుటాలు. మల్లికా పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాశం. అందులో తురిమిన మళల్లెచెండ్లు. వాటికోసం మూగుతున్న తేటిపిండ్లు (తుమ్మెదగుంపులు).

సువృత్త నిబిడోత్తుంగ కుచభారాలస - ఆ శివ. పాశాంకుశవరదాభయ హస్తచతుష్టయవిరాజిత - ఆ సురపూజిత. సర్వశృంగారవేషాఢ్య. సుకుమారాంగవల్లరి. సౌందర్యధారాసర్వస్వ. అనిర్వ్యాజ కరుణామయి. నిజసల్లాపమాధుర్య తిరస్కృతకచ్చపి, కోటీందు కోటీనకాంతిమయి. సఖీజన - దాసీజన - దేవాంగనా - దేవతాబ్బంద పరివేష్టిత.

ఇచ్చా జ్ఞానక్రియా శక్తిత్రయ సమన్విత. లజ్జ - తుష్టి - పుష్టి - కీర్తి - కాంతి - క్షమ - దయ - బుద్ధి - మేధ - స్మృతి - లక్ష్మి - వీరు అక్కడుండే దేవాంగనలు. జయ - విజయ - అజిత - అపరాభిత - నిత్య - విలాసిని - దోగ్ద్రి - అఘోర - మంగళ - ఈ తొమ్మిదిమంది పీఠశక్తులూ పరాంబికను సేవిస్తుంటారు.

పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ - పద్మనిధులు రెండు ఉంటాయి. వాటినుంచి నవరత్నవాహిని కాంచనవాహిని సప్తధాతువాహిని అనే నదులు వెలువడుతుంటాయి. ఇవి సుధాసముద్రంవరకూ ప్రవహించి అందులో లీనమవుతాయి.

భువనేశ్వరీదేవి తన వామాంకభాగాన విరాజిల్లుతోంది. కాబట్టే మహేశుడికి సర్వేశత్వం సిద్ధిస్తోంది. జనమేజయా! ఆ చింతామణిగృహం సహస్రయోజన విస్తీర్ణం. దీనికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూంటుంది. 

మహాప్రళయంలోగాని పునస్సృష్టిలోగానీ అవసరాన్నిబట్టి ఇది సంకోచ - వికాసాలు (పటవత్‌) నిత్యం పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తోంది కనక శాలలన్నింటిలోకీ ఈ చింతామణి గృహమే కాంతిపరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ - నాగ - మనుష్యజాతుల దేవీ ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే.

దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికీ దేవీ నిరంతరార్చన తత్పరులకూ గమ్యం ఇదే. ఇక్కడ దేవి మహోత్సవస్వరూపిణి. ఘృత - దుగ్ధ - దధి - మధుకుల్యలేకాక ద్రాక్షారస - జంబూరస - ఆమ్రరస - ఇక్షురస జీవనదులు వేలసంఖ్యలో ప్రవహిస్తుంటాయక్కడ. కోరుకున్న ఫలాలను ఇచ్చే (కోరికలను ఫలింపజేసే) వృక్షాలూ వాపీకూపతటాకాలూ కోకొల్లలు. 

అన్నీ ఇష్టపాన ఫలప్రదాలే. ఏదీ తక్కువది కాదు. అక్కడ నివసించేవారికి రోగాలుగానీ జుట్టునెరిసే ముసలితనంగానీ ఏనాటికీ రావు. చింతలులేని కామక్రోధమాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యౌవనులే. స్త్రీ సహితులే. సహస్రాదిత్య వర్చసులే. శ్రీభువనేశ్వరిని సతతమూ భజిస్తూ ఉంటారు. 

వారిలో కొందరు సాలోక్యం పొందితే, కొందరు సామీప్యాన్నీ, కొందరు సారూప్యాన్నీ, కొందరు సాన్నిధ్యాన్నీ పొందుతున్నారు. ప్రతిబ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తుంటారు. సప్తకోటి మహామంత్రాలూ సకలమహావిద్యలూ రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను ఆ శివను ఆ కారణ బ్రహ్మరూపను ఆ మాయాశబల విగ్రహను నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి.

మహారాజా! మహత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయం. కోటి సూర్యచంద్రులుగానీ కోటి మెరుపులుగానీ, కోటి ఆగ్నులుగానీ దాని కాంతిలో కోట్యంశంలో కోట్యంశానికైనా సాటిరావు.

ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాశం. ఒక్కొక్కసారి మరకతచ్చవిమంతం. ఒక్కొక్కసారి విద్యుద్భాను సమచ్చాయం. ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండననిభం. ఒక్కొక్కసారి విద్యుక్కోటి మహాధారాసారకాంతితతం. ఒక్కొక్కసారి సిందూరనీలేంద్రం. ఒక్కొక్కసారి మాణిక్య సదృశచ్చని. 

హీరసార మహాగర్భ ధగద్ధగితదిక్తటం.. దావానలసమం. తప్తకాంచనసన్నిభం. చంద్రకాంతమణి కాంతితుల్యం. సూర్యోద్గారసమం. దాని శృంగాలూ ప్రాకారగోపురాలూ(బురుజులు) రత్నమయాలు. అక్కడి చెట్లకు రత్నపత్రాలు, రత్నఫలాలు. నర్తించే మయూరాలు. మణితధ్వనులు చేసే పావురాలు. కాకలీస్వరాలు వినిపించే కోకిలలు. శుకాలాపాలు - మారుమ్రోగుతుంటాయి. 

తేటనీటితో నిండిన సరోవరాలు. వాటిలో వికసించే రత్నపంకజాలు. శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు. మందమారుతానికి కదలాడుతున్న చెట్లు - ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేద్రియతర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు నిండిన ఆకాశం. రత్నకాంతులతో ధగధగలాడుతున్న దిగంతాలు. వృక్షలతాకుసుమగంధ పరిపూరితం. ధూపధూపితం. 

రాజా! ఇదీ మహోజ్ఞ్యలమణిద్వీపం. అక్కడున్న మందిరాలలోని నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీలనుంచి(సోరణగండ్లు) వెలువడుతున్న కాంతిపుంజాలతో దశదిశలనూ సమ్మోహపరుస్తూంటుంది.

అది ఐశ్వర్యానికి పరకోటి. శృంగారానికి పరాకాష్ఠ. సర్వజ్ఞతకు పరమావధి. తేజస్సుకి పరసీమ. పరాక్రమానికి చివరిమాట. సర్వోత్తమగుణానికి తుదిపలుకు. దయాగుణానికి చివరిపలుకు. బ్రహ్మలోకాంతంవరకూ ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూంటాయి. అది ఆనందానుభవానికి చివరిమెట్టు..

జనమేజయా! ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరంస్థానం. సర్వలోకోత్తమోత్తమం. దీన్ని స్మరిస్తేచాలు పాపాలు నశిస్తాయి. అవసాన సమయంలో గుర్తు చేసుకోగలిగినవారు అక్కడికే చేరుకుంటారు.

ఈ అయిదు అధ్యాయాలనూ సమాహిత చిత్తంతో నిత్యమూ పఠించేవారికి భూతప్రేతపిశాచాది బాధలు ఉండనే ఉండవు. నూతన గృహనిర్మాణ సమయంలో వాస్తుయజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చెయ్యాలి. సకల శుభాలూ కలుగుతాయి. 

జనమేజయుడికి మనశ్శాంతి





Panchabhuta, Aamnaya Devibrndam - పంచభూత, ఆమ్నాయ దేవీబృందం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - పంచభూత, ఆమ్నాయ దేవీబృందం

మరకతసాలం దాటాక ప్రవాళప్రాకారం. దశయోజన సమున్నతం. కుంకుమారుణవర్ణం. కక్ష్యలో అన్ని ఇలాగే ప్రవాళమయాలు. ఇక్కడ పంచభూతాల స్వామినులుంటారు. 

హృల్లేఖ - గగన - రక్త - కరాళిక - మహోచ్చుష్మ అని వీరి పేరు. పంచభూతసమప్రభలు. పాశాంకుశవరదాభయహస్తలు . అమితభూషణలు. దేవిసమానవేషాఢ్యలు. నవయౌవనగర్వితలు.

ప్రవాళసాలం గడిచాక నవరత్నప్రాకారం. ఇది మహాప్రాకారం. బహు యోజనోన్నతం. కక్ష్యలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయదేవీబృందం ఉంటుంది.

మహాదేవి అవతారాలన్నీ ఉండేది ఇక్కడే. మహావిద్యామహాభేదాలూ ఉంటాయి. నిజావరణదేవీ బృందంతో నిజభూషణవాహన సహితలై సర్వదేవీ సమూహమూ కోటిసూర్యప్రభలు విరజిమ్ముతూంటుంది. సప్తకోటిమహామంత్రాల అధిష్ఠాన దేవతానీకమూ ఉండేది ఇక్కడే.

నవరత్నసాలం దాటివెడితే చింతామణిగృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేలసంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత - చంద్రకాంత - విద్యుత్కాంతమణి నిర్మితాలు. 

వీటికాంతుల తళత్తళలలో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువూ ఒకపట్టాన కంటికి కనిపించదు.

చింతామణి గృహం - శ్రీమాత





Shatkona Padmam - షట్కోణ పద్మం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - షట్కోణ పద్మం

ముక్తాప్రాకారం దాటాక మరకతప్రాకారం. ఈ సాలమూ దశయోజనోన్నతమే. నానా సౌభాగ్యసంయుక్తం. నానాభోగసమన్వితం. కక్ష్యలో మధ్యభూమీ సదనాలూ సమస్తమూ మరకతమయమే.

ఇక్కడ షట్కోణపద్మం ఉంది. పూర్వకోణంలో గాయత్రీసహితుడై చతుర్ముఖుడు కుండికా - అక్షమాలా - అభయహస్త - దండాయుధధరుడై నివసిస్తుంటాడు. గాయత్రీదేవికూడా అలాగే ధరించి ఉంటుంది. గాయత్రీచతుర్ముఖుల సర్వరూపాలూ ఇక్కడే ఉంటాయి. నాలుగు వేదాలూ సకలశాస్త్రాలూ వ్యాహృతులూ స్మృతులూ పురాణాలూ మూర్తిధరించి సేవిస్తుంటాయి. 

నైరృతికోణంలో శంఖ చక్ర గదా పద్మాలు ధరించి సావిత్రీవిష్ణుమూర్తులుంటారు. వీరి సకలరూపాలూ ఇక్కడే ఉంటాయి. 

వాయుకోణంలో పరశు - అక్షమాలా - వరదాభయదహస్తాలతో సరస్వతీమహారుద్రులుంటారు. వీరి రూపభేదాలూ ఇక్కడే ఉంటాయి. అరవైనాలుగు ఆగమాలు అన్నీ రూపుదాల్చి సేవిస్తుంటాయి. 

ఆగ్నేయకోణంలో రత్నకుంభ - మణికరండాలు ధరించి మహాలక్ష్మీ కుబేరులుంటారు. 

వారుణ మహాకోణంలో(పశ్చిమం) పాశ - అంకుశ - ధనుర్పాణధరులై రతిమన్మథులుంటారు. వివిధ శృంగారభేదాలు మూర్తిధరించి సేవిస్తుంటాయి. 

ఈశాన్యకోణంలో పాశాంకుశధరులై పుష్టివిఘ్నేశ్వరులుంటారు. గణేశవిభూతులన్నీ ఇక్కడే ఉంటాయి.

జనమేజయా! ప్రతిబ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమష్టిరూపాలు వీరందరూ. జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు.

పంచభూత, ఆమ్నాయ దేవీబృందం





sri krishnundu kesivyomasurula samharinchuta - శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట అని చెప్పి రథమెక్కి అక్రూరుడు వెల్లిపోయాడు. కంసుడుకూడా స...