పంచారామాలలో ఒకటైన క్షీరారామం - పాలకొల్లు
క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు వెలసిన పుణ్య క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో వుంది. దీనినే క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం అంటారు. ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దాలలో నిర్మించారు. ఈ దేవాలయ స్తంభంపైనున్న 13వ శతాబ్దపు శాసనం ప్రకారం, ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశె శూలాచార్య. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
ఆలయ ప్రశస్తి
ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీమహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతిదేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఋణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.
చరిత్ర
వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక 1157లో క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి 1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని 1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. 1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.
స్థలపురాణం
పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం.
రవాణాసౌకర్యం:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుండి నర్సాపూర్ లేదా భీమవరం వైపు వెళ్లే బస్సులు పాలకొల్లుకు అందుబాటులో ఉంటాయి.
రావులపాలెం దాటిన తర్వాత, నర్సాపూర్ వెళ్లే మార్గం నుండి సిద్ధాంతం మరియు మార్తేరు (మార్టేరు) మీదుగా పాలకొల్లుకు కేవలం 45 నిమిషాల ప్రయాణం.
రావులపాలెం మరియు వైజాగ్ మధ్య దూరం 230 కి.మీ మరియు రాజమండ్రి నుండి 70 కి.మీ.
కాకినాడ, యానం మరియు అమలాపురం మీదుగా రాజోలు. అక్కడ నుండి పాలకొల్లు.
కాకినాడ, యానం మరియు అమలాపురం మీదుగా రాజోలు. అక్కడ నుండి పాలకొల్లు.
కాకినాడ నుండి, రామచంద్రపురం మరియు రావులపాలెం మీదుగా కూడా పాలకొల్లు చేరుకోవచ్చు. గోదావరి నదిని దాటడానికి కేవలం రెండు వంతెనలు మాత్రమే ఉన్నాయి, ఒకటి యానం వద్ద, మరొకటి రావులపాలెం సమీపంలో.
రైలు మార్గం:
కోల్‌కతా వైపు నుండి వచ్చే రైళ్లు భీమవరం (జంక్షన్) మీదుగా పాలకొల్లు చేరచ్చు. నర్సాపూర్ వెళ్లే రైళ్లు కొన్ని ఆగుతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు నిర్ధారించుకోండి. పర్యాటకులు భీమవరంలో దిగి, పాలకొల్లు చేరుకోవడానికి ప్రైవేట్ వాహనంలో గానీ లేదా బస్సులో గానీ ప్రయాణించాలి. విశాఖపట్నం నుండి పాలకొల్లుకు బస్సులో ప్రయాణించడానికి మొత్తం 7 గంటల సమయం పడుతుంది. నర్సాపూర్ మరియు భీమవరం మధ్య పాలకొల్లు మీదుగా ప్రైవేట్ బస్సు రవాణా సౌకర్యం ఉంది.
ఆలయ సమయాలు ఉదయం 5.30 నుండి 11.30 వరకు మరియు సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.30 వరకు.
ఆలయ సమయాలు ఉదయం 5.30 నుండి 11.30 వరకు మరియు సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.30 వరకు.
ఇతర దేవాలయాలు:
భీమవరం, ద్రాక్షారామ, అన్నవరం, తలుపులమ్మ తల్లి, రాజమండ్రి, అంతర్వేది, ర్యాలి మరియు వాడపల్లి వంటి పాలకొల్లు చుట్టుపక్కల అదనపు దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో పర్యాటకులు బస చేసేందుకు వసతి సౌకర్యం అందుబాటులో ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నది. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.
No comments:
Post a Comment