శ్రీ దేవీ భాగవతం తృతీయస్కంధము - అధ్యాయము 33
త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము
జనమేజయు డిట్లనియెను: భగవానుడా! నీవు శ్రీదేవీ యాగ మొనరింపుమని వక్కాణించితివి. ఆ శ్రీదేవీ యెవరు? ఎట్లవతరించెను? ఎవరి వలన జన్మించెను? ఆమె స్వరూపమేమి? ఆమె యందలి గుణ విశేషము లెవ్వి? ఆ దేవి దివ్యాకృతి యెట్టిది? ఆ తల్లి యజ్ఞ మేవిధముగ జరుపవలయును? ఆ యాగ విధానమును సర్వజ్ఞుడవగు నీవు తేట పఱచుము. బ్రాహ్మణోత్తమా! ఈ విశ్వముయొక్క సృష్టి రహస్యము నీవెఱుంగుదువు. బ్రహ్మాండమన ఎట్టిది? దాని యుత్పత్తి ప్రకారమేమి? విస్తరించి చెప్పుము.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులుగలరనియు, వారు త్రిగుణమయులనియు, సృష్టిపాలన సంహారము లొనరింతురనియు నేను వింటిని. ఆ త్రిమూర్తులును స్వతంత్రులా? పరతంత్రులా? ఆ మహాత్ములను గుఱించి నాకు వినవేడుక యగుచున్నది. వారికి గూడ చావు సహజమా లేక వారు సచ్చిదానంద స్వరూపులా? వార లాధ్యాత్మికము అధిదైవికము అధి భౌతికము అను తాపత్రయము గలవారా? లేక దుఃఖరహితులా?
ఇంద్రాదులు మహాబలశాలురు గదా! వారిని కాలము కాటు వేయునా? లేదా? వారలెవరివలన నే తెఱగున ప్రాదుర్భవించిరి? అను సందియము నన్ను పీడించుచున్నది. వారికి సుఖ దుఃఖములు గలవా లేవా? వారు నిద్రాలస్యములకు వశులగుదురా కారా? వారి శరీరములు సప్తధాతుమయములా కావా? వారే యే దివ్యపదార్థములవలన గుణంద్రియముల వలన సృజింపబడిరి? వారి జీవితకాలమునకు ప్రమాణమెంత? మునివరా! ఆయా దేవతల నివాసస్థానములను వారి వారి మహావిభూతుల కథలను నాకు బోధపడునట్లు విప్పి చెప్పుము. ఇట్టి మహాత్ముల కథ లెన్నయినను నేను వినుటకు వెనుకాడను.
వ్యాసుడిట్లనియెను: 'ఓయి జనమేజయ మహారాజా! ఆ బ్రహ్మాదిదేవత లెవ్వరివలన సంభవించిరని నీవు ప్రశ్నించితివి. నీ ప్రశ్నకు సమాధానము కడు దుర్గమము. అది అంత తేలికైనదికాదు. నేను మున్ను నారదు నిదే ప్రశ్ననడిగితిని. దాని కతడు చోద్యమంది నాకు సమాధానించిన విధము నీకు వినిపింతును, ఏకాగ్రతతో నాలింపుము.

వెనుక నొకప్పుడు నాకు పావనగంగా తీరమున పరమశాంతుడు సర్వజ్ఞుడు వేదవిదుడునగు నారదమహర్షి కనబడెను. నేను ప్రమోదమంది యా ముని సన్నిధికేగి యతని పాదపద్మముల కెఱగి యతని యనుమతితో నొక వరాసనమున గూర్చుంటిని. ఆ గంగాతటమున చల్లని యిసుకతిన్నెలపై సుఖాసీనుడై యున్న నారదుని కుశలమడిగి విని నేనతనితో మరల నిట్లంటిని:
"మునీశ్వరా! ఈ విశాలవిశ్వమునకు మూలకర్త యెవ్వరు? ఈ బ్రహ్మాండ మే మహాశక్తివలన సముత్పన్నమైనది. ఈ సృష్టి నిత్యమా? అనిత్యమా? విధానము ననుసరించి తెలియబలుకుము. కర్తలేక కార్యము జరుగదు గదా! ఈ యింతటి బ్రహ్మాండము నొకడే నిర్మించెనా? లేక పల్వురు కలిసికట్టుగ చేసిరా? అను సందియము నా కెప్పుడును గల్గుచుండును. ఈ పలువిధములైన తర్కవితర్కములతో సందేహ సందోహములతో నే నీ విపుల సంసార సాగరములోన మునింగితిని. నన్నుద్ధరించి కడతేర్చుము.
కొందఱు మహాదేవుడు సద్యోజాతుడు రుద్రుడు తత్పురుషుడు మహేశ్వరుడునగు శివుడు ప్రళయోత్పత్తి లేనివాడు నగు శంకరుడు కారణకారణుడని వాక్రుత్తురు. ఆ హరుడు సోముడు రుద్రుడు శంభువు శంకరుడు త్రిగుణుడు సృష్టి స్థిత్యంతకారకుడు సంసారోత్తారకుడు శివుడు శివతరుడని వక్కాణించి పల్కుదురు.
మఱికొందఱు శ్రీహరి హృషీకేశుడు మాధవుడు పద్మనాభుడు సర్వశక్తియుక్తుడు విశ్వుడు సర్వభూతాత్ముడు పరమాత్ముడగు విష్ణుని నుతింతురు. ఆ విష్ణువు భుక్తిముక్తిప్రదుడు పరమశాంతుడు విశ్వతోముఖుడు సర్వవ్యాపకుడు సర్వాద్యుడు విశ్వశరణ్యుడనాదినిధనుడునని వారు సన్నుతింతురు.

ఇంక కొందఱు బ్రహ్మదేవుని విధాతగ లోకసృష్టి కారకునిగ సర్వవేత్తగ సర్వభూత ప్రవర్తకునిగ చతుర్ముఖునిగ సరేశునిగ కమలసంభవునిగ సత్యలోకవాసిగ సర్వలోక కర్తగా వచింతురు. ఇతరులు కొందఱు వేదవాదులు సర్వేశ్వరుడగు సూర్యుని విశ్వకర్తగ భావించి యతనిని సంధ్యలందు సమాహితమతితో సంస్తుతించి ధ్యానింతురు. వేరొక కొందరు దేవదేవుడు సహస్రాక్షుడు శతక్రతుడు సకలప్రభువగు నింద్రుని కర్తగ దలంచి యింద్రయాగ మొనరింతురు. వారా యింద్రుడు పురుహూతుడు యజ్ఞపతి సురపతి లోకపతి శచీపతి యాగభోక్త సోమపుడు సోమపాయి ప్రియుడు నని వచింతురు. ఇతరులు కొంద ఱగ్నిని యముని వరుణుని వాయుదేవుని సోముని ధనదుడగు కుబేరుని గణపతిని గొప్పగ భావింతురు. ఆ గణపతి హేరంబుడు గజవక్త్రుడు స్మరించినంతనే విఘ్నములు బాపి సిద్ధి చేకూర్చువాడు సర్వకార్యసాధకుడు కామదుడు కామగుడని సర్వభావమున సంభావించి పూజింతురు.
కొంద రాచార్యులు సర్వార్థప్రదాయిని ఆదిమాయ మహాశక్తి పురుషానువర్తిని-బ్రహ్మైక్యస్వరూప జననరక్షాలయకారిణి సర్వభూతదేవతల కడుపుపంటగ గన్నతల్లి - అనాదినిధన - పూర్ణ - సర్వలోకేశ్వరి - సగుణనిర్గుణ - శివస్వరూప సర్వప్రాణివ్యాప్త బ్రాహ్మి వైష్ణవి శాంకరి వాసవి వారుణి వారాహి నారసింహి శ్రీమహాలక్ష్మి అద్భుతరూప-వేదమాత ఏకవిద్యాస్వరూప తారిణి సర్వదుఃఖ నిహంత్రి తలచినంతనే కోర్కులు కురియు దేవి ముముక్షులకు ముక్తిదాయిని ఫలార్థులకు ఫలప్రదాయిని త్రిగుణాతితరూప గుణవిస్తారకారిక నిర్గుణ సగుణ అగు శ్రీదేవిని ఫలార్థులై ధ్యానింతురు.

కొంతమంది నిత్యము నిరంజనము నిరాకారము నిర్లేపము నిర్గుణము అరూపము శుద్ధబుద్ధముక్తయు ప్రజ్ఞానఘనమునగు బ్రహ్మమే సర్వకారణమని పలుకుదురు. ఆ బ్రహ్మమే వేదోపనిషత్తుల సారమని పరంజ్యోతి యని వచింతురు. ముని పుంగవులా బ్రహ్మతేజమునే సహస్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్రపాదుడు సహస్రకరుడు అగు పురుషోత్తమునిగ విశ్వసింతురు.
ఆ శ్రీమహావిష్ణునియొకే పాద మాకాశము అంతటను ప్రకాశించునది పరమము శాంతము విరజము విరాట్టునని మనీషులు వెల్లడింతురు. పూర్వవిదులు పురుషోత్తముడే విశ్వప్రభువని మనసార నమ్ముదురు. ఆ సర్వేశ్వరు డొక్కడేకాదని యనువారును గొందఱుగలరు. ఈ ప్రపంచ మూహింపరానిది. ఈ బ్రహ్మాండ మీశ్వరసృష్టి కాదు. ఇది అనీశ్వరమని వాదించువారును గొందఱు లేకపోలేదు. అదంతయు సన్మాత్రమే. ఇది అనీశ్వరము. ఇది సహజముగనే పరిణతి జెందుచుండును. పురుషుడకర్త. అన్నిటికి ప్రకృతియే కర్త్రియని యెలుగెత్తి చాటువారును గలరు.

ఈ విధముగ వివ్వసృష్టిని గూర్చి సాంఖ్యులు కాపిలులు మున్నగువారలు తమ భిన్నభిన్న భావములు వ్యక్తీకరింతురు. కావున నా కెంతకు నంతుపట్టని సందియము లిట్టి వెన్నియో కల్గుచుండును. నారదమునీంద్రా! సరియైన ధర్మాధర్మ వివక్ష చేయలేక నా చిత్తము శాంతిబాసి వికల్పములకు పాల్పడుచున్నది. ఇందేది ధర్మమో గుర్తించుటకు సాధ్యము గాకున్నది. ఎల్లదేవతలు సత్త్వగుణ సంపన్నులు సత్యధర్మనిష్ఠులునై యుందురు. ఇట్టి దేవతలే పాపాత్ములగు దానవుల చేతులలో బాధలు పడుచుందురు. ఇక ధర్మస్థితికి గతి యెక్కడిది? ధర్మపరులు సదాచారులు మా వంశజులగు పాండవులే పలువిధాల యిడుమలు పడిరి. ఓ మునీశ్వరా! ఇంక ధర్మమునకు తావెక్కడిది? కాన నిట్టి సంశయములతో నా మనస్సు నిరంతరముగ కలత జెందుచుండును. ఇట్టి నా చిత్తమందలి సంశయములను బాపుటకు నీవే కడు సమర్థుడవు. కాన మోహమను జలముతో కల్లోలితమగు సంసార సాగరమునందు మునుగుచు తేలుచున్న నన్ను నీ విజ్ఞాన నావచేత తరింపజేయుము.
అధ్యాయము 34 శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
అధ్యాయము 34 శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment