శ్రీ త్రిభువనేశ్వరీదేవీ ప్రాభవము
వ్యాసభట్టారకు డిట్లనియె : కురుసత్తమా! నీవు నన్నడిగిన ప్రశ్నమునే నేను తొల్లి నారదమహర్షి నడిగితిని. అతడు నాకిట్లు సమాధానము చెప్పెను:
"వ్యాసమునీ! నీ కేమని తెల్పుదును? ఒకప్పుడు నా మదిలో నేనుగూడ నీకు గల్గిన తీరని బాధనే పడితిని. అంతట నేనును మహాతేజస్వియు నా తండ్రియు నగు బ్రహ్మకడకేగి అతనిని నీ వడిగినటులే ఇట్లు ప్రశ్నించితిని - విభూ! ఈ బ్రహ్మాండమంతయు నెవరి మహాశక్తివలన సముత్పన్నమైనది? ఇదంతయు నీవే సృజించితివా? కాక విష్ణువు నిర్మించెనా? కానిచో రుద్రుడు కల్పించెనా? నా కారాధనీయుడగు సర్వశ్రేష్ఠ ప్రభువెవరు? నిక్కముగ వచియింపుము. నేను దుఃఖపూరితమైన యీ యసత్యసంసారమున మునిగిపోవుచున్నాను. కనుక నా యీ సందేహము తీర్చి యంతయు నున్న దున్నట్లు యాథార్థ్యము దెలుపుము. ఈ సందియము నా చిత్తమందు గూడుకట్టుకొని యున్నది. దీనివలన నా యెడదకు శాంతి లభించుటలేదు. ఏ దేవతలమీదకు - తీర్థములమీదకుగాని యితర సాధనములపైకిగాని నా మనస్సు పోవుటలేదు. నే నీ పరమతత్త్వ మెఱుగనంతవఱకు నా మదికి శాంతి చేకూరదు. నా మది పలుతావులలో చిక్కుకొని దేనియందును నిలుకడ చెందుటలేదు. నా కా సర్వేశ్వరు డెవరో తెలియుటలేదు. కనుక నే నెవరినని స్మరింతును - స్తుతింతును - యజింతును - అర్చింతును - శరణందుదును? సత్యవతీసుతా! నేనిట్టి కఠినమైన ప్రశ్న వేయగా లోకపితామహుడగు బ్రహ్మ నాకిట్లు ప్రతివచన మొసంగెను"
"వత్సా! నీ కెట్లు దెల్పుదును? నీ వడిగిన ప్రశ్నము కడు దుస్తరమైనది. ఆ విష్ణువు సైతము దీని కిదమిత్థమని సమాధాన మీయజాలడు. విరాగి నిష్కామి విమత్సరుడు స్వాత్మవంతుడునైనవాడే కాని ఈ జగములందు రాగి కామియైన వాడెవ్వడును దీని సమాధాన మెరుగజాలడు. పూర్వ మీ స్థావరజంగమాత్మకమైన సృష్టియంతయు నశించి జలమయమయ్యెను. అంత పంచభూతములు తన్మాత్రలు గల్గినవి. నేనొక కమలమునుండి యుద్భవించితిని. అపుడు నాకు సూర్యుడు కాని చంద్రుడు కాని యొక చెట్టుగాని గుట్టకాని యేమియు కనిపించలేదు. ఆ తమ్మిదుద్దులో నుండి నే నీ రీతిగ నాలోచనలో మునిగితిని, ఈ మహాసాగరజలమందు నే నెవరివలన జన్మించితిని. నాకు కర్త భర్త యుగాంతమందలి సంహర్త యెవరు? ఈ విశాల జలరాశి కాధారమైన భూమియు గనిపించుట లేదు. ఈ మహాపద్మ మెట్లు పుట్టినదో తెలియుటలేదు. నే నిపుడీ కమలము మూలముగందును. అక్కడ ఈ యంతులేని నీటికి మూలమైన భూమి నిస్సందేహముగ గోచరించును. అట్లు తలచి నేను పద్మమునుండి లోనికి దిగి యంతుదెలియని నీటిలోపల వేయేండ్లు వెదకితిని. కాని, నేను భూమిపొడ గాంచలేదు. అంతలో గగనసీమనుండి తప-తపయను నశరీరవాణి నా చెవుల బడెను. అపుడు నేను పద్మమందొక వేయేండ్లు తప మాచరించితిని. పిమ్మట సృష్టి సల్పుమని శబ్దము నా చెవుల బడెను. అది విని నేను మూఢుడనై, యెవని సృష్టింతును? ఏమి చేతునని యాలోచనలలో పడితిని. అపుడు మధుకైటభులను ఘోర రాక్షసులు నాకు కనిపించిరి. వారు నాతో బోరుటకు వచ్చిరని తెలిసికొని నేను భయపడితిని. నేనపుడా కమలనాళము ద్వారమున నీటిలో నడిమికి వచ్చితిని. అచ్చట నొక పరమాద్భుతశక్తిగల దివ్యపురుషుడు నాకు గనిపించెను.
ఆ పురుషోత్తముడు నిర్మల నీలమేఘశ్యామలుడు - సుందరకోమలాంగుడు - పీతాంబరుడు - వనవనమాలికాలంకృతుడు - జగన్నాథుడు. శ్రీ శంఖము-చక్రము-గద-పద్మములతో శోభిల్లు చతుర్భుజుడు. పాపఱని పాన్పున పవ్వళించిన స్వామి. ఇట్టి శ్రీవిష్ణువు నాకు దర్శనభాగ్య మొసంగెను. ఆ మహాత్భుడు యోగనిద్రలో నిశ్చలముగ పరుండియుండెను. అట్లు శేషతల్పముపై శయనించిన యచ్యుతుని నేను కనులకరవుదీర గాంచితిని. నారదా! నే నిపుడేమి చేయవలయునా యను చింత నా కపుడు గల్గినది. నే నపుడు నిద్రా దేవతను స్మరించితిని. అంత నా శివస్వరూప యగు దేవి విష్ణుని శరీరము వదలి లేచి యంతరిక్షమున కెగసెను. ఆ దేవి విశ్వభూషణ కాంతులతో మేని కాంతులు గలియుటచే దివ్యసుందరియై యొప్పారినది. అట్లు నిద్రాదేవి హరి తనువునుండి నింగిపై వెలుగొందినంతనే జనార్దనుడు నిద్దుర చాలించి మేలుకొనెను. అపు డాపరమాత్ముడు మధుకైటభులతో నైదువేలేండ్లు పోరెను. తుదకా యిర్వురు రక్కసులు హరి చేతిలో తుదముట్టిరి. ఆ హరియొక్క విపులమైన తొడలపై వారీల్గిరి. పిమ్మట మే మిరువుర మున్నతావునకు శివు డేగుదెంచెను. అంతలో నా సుమనోహారిణి దివ్యదేవి మా మువ్వురకు తన దివ్యదర్శనభాగ్య మొసంగినది. ఆమెను మేము సంస్తుతింప దొడగితిమి. అందుల కా పరమశక్తి మా యెడల సుప్రసన్నయైనది. ఆ దేవి తన ద్వికటాక్షవీక్షణములతో మమ్ము తరింపజేయుచు నిట్లు పలికెను: 'ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీరు మీ మీ కార్యములు నెరవేర్చుడు. ఇంక మీరు మీ మీ నివాసము లేర్పరచుకొని నిశ్చింతగ చతురతతతో సృష్టి స్థితి సంహారము లొనరింపుడు. మీరు మీ మీ దివ్యవిభూతులతో నేర్పుమీర ప్రజలను నాల్గువిధములుగ సృజింపుడు, అను దేవియొక్క చల్లని సుకము గల్గించు నమృతము లొలుకు పలుకులు వింటిమి.
మేమా దేవి కిట్లంటిమి: 'ఓ తల్లీ! మే మశక్తులము. ప్రజాసృష్టి యెట్లొనర్పగలము? ఇదంతయును నీటిమయమే గదా! నేల కంటికే కనబడుటలేదు. ఇచట మాకు భూతములు తన్మాత్రలు నింద్రియగుణము లేవియు గనబడుటలేదు.' ఈ మా మాటలు విని యాదేవి చల్లని నవ్వులు చిందుమొగముతో తేజరిల్లెను. అంతలో నాకాశమునుండి యొక దివ్య విమానము మా ముందునకు వచ్చెను. అపుడు 'త్రిమూర్తులారా! మీరు నిర్భయముగ దీనిలోని కెక్కుడు. మీ కత్యద్భుతమైన దృశ్యము జూపింతును.' అని దేవి మాతో బలికెను. మే మా దేవి వాక్కులు విని యొప్పుకొని కింకిణీ ఝళంఝళలతో రవళించుచు ముత్యాలహారాలతో నలరుచు దేవేంద్రభవనమువలెనున్న విమాన మెక్కి కూర్చుంటిమి. జితేంద్రియులమగు మేము సుఖాసీనులమగుటగాంచి దేవి స్వశక్తితో విమానము నాకాశవీథిలో నడిపింపసాగెను.
అధ్యాయము 35 త్రిమూర్తులు త్రిమూర్తులను గని విస్మయమందుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం

No comments:
Post a Comment