శ్రీదేవి ప్రాదుర్భవించి సుదర్శనుని గాపాడుట
బాదరాయణి యిట్లనియెను: ఆ విధముగ సుబాహు వల్లునకు యథావిధముగ పలువిధములైన భోజ్యపదార్థములను సమకూర్చి ఆరు దినముల వరకు భక్తి పూర్వకముగ భుజింపచేసెను. అట్లు అమిత ద్యుతియగు సుబాహువు వివాహ కార్యములు జరిపించి యల్లునకు బహుమానము లొసంగి మంత్రులతో మంత్రాలోచన మొనరించుచు రాజులెల్లరు నలుత్రోవలు కాచుకొని యున్న విషయమును దూతల వలన విని దుఃఖమున విమనస్కుడయ్యెను. అపుడు సుదర్శనుడు సుబాహునితో "మమ్ము వేగమే సాగనంపుము. మేము నిశ్శంకముగా నేగుదుము. మేము పవిత్ర భారద్వాజాశ్రమ మేగి యచట నన్ని విధముల నిశ్చింతతతో నివసింపగలము'' అని పలికెను. సుబాహు వల్లుని భావ మెఱింగి విపులధనరాసు లొసంగి వారిని సాగనంపెను.
సుదర్శనుడును త్వరితగతిని బయలుదేరెను. సుబాహువు పెద్ద సైన్యము సాహాయ్యముగా నతని వెనుక వచ్చుచుండెను. సుదర్శనుడు వెఱపు జెందక మార్గమున ముందునకు సాగుచుండెను. రథములు వెంటరాగా భార్య తోడుగాగా ఆ రఘుకులజుడు నరదంబెక్కి పోవుచు రాజుల సేనలను నొక్కసారి కలయజూచెను. సుబాహువు వైరి రాజులను గని చింతాక్రాంతుడయ్యెను. కాని సుదర్శనుడు విధి పూర్వకముగ నా జగదేక మాతను శరణుబొందెను.
అట్లు సుదర్శనుడు పరమము నేకాక్షరము నైన కామరాజమంత్రమును నిర్విరామముగ జపించుచు నూతన వధువు తోడ విగతశోకుడై యొప్పెసగుచుండెను. వెంటనే రాజులెల్లరు పెల్లుగ కోలాహలము చేసి లేచి సైన్యసమేతులై కన్నియను హరింప నెంచిరి. కాశీరాజు వైరి రాజులగను గని వారి నంత మొందింప బూనుకొనెను. కాని సుదర్శనుడతనిని గట్టిగ వారించెను. సుబాహువును మరి ఇతర రాజులును పరస్పరము జయకాంక్షలతో భేరీశంఖము లానక దుందుభులు మ్రోగించిరి. శత్రుజిత్తు సమరసన్నుద్ధుడై నిలుచుండెను. యుధాజిత్తతనికి సాయమొనర్ప సంసిద్ధుడయ్యెను. అందు కొందఱు సేనలను పరికించుచుండిరి. అంతలో యుధాజిత్తు సుదర్శనునిముందేగి నిలుచుండెను. యుధాజిత్తు వెంట శత్రుజిత్తు గూడ తన యన్నను చంప వచ్చెను. అన్నదమ్ము లిరువురును కోపమున పరస్పర బాణఘాతములతో మూర్ఛితులగు చుండిరి. అట్లు వారికి బాణయుద్ధము సాగుచుండగ సుబాహువు తన సేనలను పురికొలిపి కూడదీసికొని తన యల్లునకు సాయమొనర్ప సంసిద్ధుడయ్యెను. ఇట్టు లచ్చెరువుగదుర దారుణ సంగ్రామము సాగుచుండెను.

అంతలో నెక్కడినుండియో వేవేగమే నానా యుధధారిణి వరభూషణభూషిత సంహవాహనాసీనయగు దేవి భగవతి ప్రత్యక్షమయ్యెను. దివ్య మాల్యాంబరములు మందార సుమమాలికలు దాల్చి ఆ తల్లి విరాజిల్లుచుండెను. ఆ లోకమాతను గాంచి యెల్లరాజులును విస్మయచకితులైరి.
ఈ సింహాసనారూఢ యెవ్వరు? ఎక్కడినుండి యేతెంచినది? అని రాజులు తలపోయుచుండిరి. అపుడు సుదర్శనుడాజగదంబను సందర్శించి సుబాహువుతో నిట్లు పలికెను. "ఓ రాజా! అనురాగమయి యగు తల్లిని దర్శింపుము. ఆ తల్లి మనకు తన దివ్యదర్శనభాగ్య మొసంగ నేతెంచినది. నన్ననుగ్రహింప నా తల్లి దయామృతము చింద నవతరించి నేనిపుడు నిర్భయులలోన నిర్భయుడనైతి'ననెను." వారిరువురు రా భగవతి యగు వరాననను నేత్ర పర్వముగ నవలోకించిరి. వారా దేవి దివ్యదర్శనమునకు హృదయములుప్పొంగ దండవత్ ప్రణామము లాచరించిరి. ఆ సింహగర్జనమున కేనుగుల గుంపులు భయకంపితములై చెల్లాచెదరయ్యెను. దెసలు కంపించెను. పెనుగాలులు వీచెను.

అపుడు సుదర్శనుడు తన సేనాపతి కిట్లనెను. "నీ విపుడు దుష్టచేతస్కులును కుపితులును నైన రాజు లెచట గలరో యేమి చేతురో తెలిసికొనుటకు బయలుదేరుము. నీవీ మహరాజులుండు త్రోవలందు నిర్భయముగ నరుగవచ్చును. మన కా భగవతి తోడునీడయై కరుణ జూపును. మనము ఆమెను స్మరించినంతనే ఈ మహాదేవి మనల గాపాడ నేగుదెంచినది" అను మాటలు విని సేనాపతి బయలుదేరెను.
యధాజిత్తు రోషాతిరేకమున రాజుల కిట్లనియెను: "మీరు భయకంపితులగుదురేల? ఆ సుదర్శనుని నతని భార్యతో గూడ నంతమొందింపుడు. బలాధికులమైన మనలనవమానించి బలహీనుడైన యితడు జంకుగొంకుతలు లేక కన్నియను గొనిపోవుచున్నాడు. ఈ సింహముపై నున్న యొక కామినిని గని యేల భీతిల్లుదురు! ఈమె నుపేక్షింప దగదు. మనము కలిసికట్టుగ నీమెను చంపుదము. ఈమెను చంపి సుభూషిత యగు ఈ కన్యకను గ్రహింతము. సింహము చేతిలోని వస్తువును నక్క గ్రహించలేనట్లు మనకు తగిన కన్యకను గ్రహించుట కితడు తగినవాడు గాడు.''
అని యుధాజిత్తు కోపోద్రిక్తుడై పలికి శత్రుజిత్తుని సేన వెంట రాగా పోరుసలుప పూనుకొనెను. పిదప వారు లోహకార నిర్మితములై సానపెట్టబడిన వాడి ములుకులు సంధించి ఎక్కుపెట్టిన ధనువు నాకర్ణాంతము లాగి సుదర్శనునిపై నేసిరి. ఆ దుష్టబుద్ధి సుదర్శునునిపై బాణప్రహారము చేయగ సుదర్శనుడు నతనిని తీవ్ర బాణములతో క్షణములో నేల పడగొట్టెను. ఇట్లు పోరుసాగుచుండగ దుర్గాదేవి యగు చండిక తీవ్రకోపమున యుధాజిత్తుపై దారుణ శరములు ప్రయోగించెను. జగదంబిక యగు శివాదేవి నానా రూపములు దాల్చి నానా శస్త్రాస్త్రములతో సమరము సాగించెను. అంత శత్రుజిత్ యుధాజిత్తులు నిహతులై రథము నుండి నేల గూలిరి. వెంటనే జయ జయ దుర్గాదేవీ! యను హర్ష నినాదములు మిన్ను ముట్టెను. వారిరువుర చావు గని రాజులు విస్మయావిష్టులైరి. అట్లు రణమున తమ వైరులు నిహతులు గాగా సుభాహువు దుర్గతినాశని యగు దుర్గను పరమప్రతీతితో నీవిధముగ సంస్తుతించెను:
"జగద్ధాత్రీ శివా దుర్గా కామదా భగవతి యగు శ్రీదేవికి నేను ప్రణమిల్లుచున్నాను. శ్రీవిద్య శివ శాంత మోక్షద విశ్వవ్యాపిని యగు జగదేకమాత కంజలి ఘటించుచున్నాను. పరమశక్తివగు విశ్వమాతా ! దివ్యదేవీ! ఈ నా యల్పబుద్ధితో సుగుణ నిర్గుణములలోన నీ మార్గమేదియో యెఱుగలేకున్నాను. నీవు భక్తార్తిభంజనివి. నీ దివ్య సత్ప్రభావమును వినుతింప నేనెవ్వడను? ఓ దేవీ! నీవే వాగ్దేవతవు. సర్వజంతువులకు సర్వగతివి - సద్బుద్ధివి - మతివి నీవే. సకల మనోనియంత్రివి నీవే. నిన్ను సర్వాత్మత్వభావముతో నిత్యము నుతించుట కెటు సాధ్యపడును తల్లీ? అమ్మా! హరిహర బ్రహ్మలును సురవరులును నిన్ను విడువక సంస్తుతించుచున్నను నపారసుగుణవారాశివగు నీపారమెఱుగజాలకున్నారు. విషయగుణబద్ధుడను భిన్నమతిని నగు నేను నీ దివ్యసచ్చరితప్రభావ మెట్లెఱుంగగలను? ఈ చపలచిత్త మొకమట్టుకు నీ సచ్చరిత్రను నీ సత్సాంగత్యమును బడయ నేరదు. నీ సత్కథాప్రసంగముల మహిమవలన నవశ్యము చిత్తశుద్ధి యేర్పడును గదా! నా యల్లుని సత్సంగతి వలన నాకు నీ యద్భుత దివ్యసందర్శన భాగ్యమబ్బెను. దేనిని హరిహర బ్రహ్మలును దేవేంద్రాదిసురలును మునులును తత్త్వార్థ విదులును పరికాంక్షింతురో యట్టి నీ సుదర్లభ దివ్యసందర్శనము శమదమసమాధులు లేకయే నేడు నాకు తెలికగ లభ్యమైనది.
అంబా! మందమతి నగు నేనేడ? అద్వితీయమైన భవభేషజమగు నీ దయామృతవీక్షణము లేడ? భవానీ! దీన భక్తపరాధీనా! నీవు నీ పరమభక్తుల యైకాంతిక ప్రేమభక్తిని గని వారిపై దయామృతము గురిపింతువు. అమర పూజిత పాదపద్మవు నీవు. ఓ పరాదేవీ! నీ యద్భుత మహనీయత నెంతని వర్ణింతును? సుదర్శనుని విషమసంకటస్థితినుండి సముద్ధరించినదానవు. నీ వలన శత్రులు తుదముట్టిరి. భక్తానుకంపనశీల వగు నీ చరిత్రము పరమపవిత్రము. ఈ స్థాపరజంగమాత్మకమైన విశ్వప్రపంచములకు నీవు సర్వాధికారిణివి. పాలనకర్త్రివి. కనుకనే శత్రుల మూకలను చెండాడి ధ్రువసంధి కొడుకును దయతో బ్రోచితివి. ఇందాశ్చర్య మేమున్నది? నీ సేవాతత్పరులగు నీ భక్తుల కీరితి నీ మూలమున విస్తరిల్లినది. ఇట్లు నీవే నీ మహితచరితను రచించితివి. అట్లు కానిచో ననవద్య శీలుడగు సుదర్శనుడు శత్రులను గెలిచి కుశలమున నా సుతను చేపట్టుట సాధ్య మయ్యెడిదా? పాపపుణ్యరహితవు. సుగుణ నిర్గుణ స్వరూపవు. నీవు పరమ భక్తుల చేత నిచ్చట దివ్యమధురగానమున స్తుతి చేయబడుచుందువు. ఓ త్రిభువనేశ్వరీ! నీ సందర్శనమున నేను ధన్యజీవనుడనైతిని. నిన్ను భజించుటకు తగిన సద్బీజమంత్రము నేనెఱుగను. ఐనను నీ మహిమ నేడు విశ్వవిఖ్యాతి నందినది.

ఇట్లు రాజు నుతింపగ పరాశక్తి ప్రసన్నయై రాజు నేదేని వరము గోరుకొను మనెను అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.
అధ్యాయము 56 శ్రీదేవి కాశిలో నివసించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
పంచాంగం
అధ్యాయము 56 శ్రీదేవి కాశిలో నివసించుట
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
No comments:
Post a Comment