Monday, April 6, 2026

Mahamrityunjaya Mantra - మహామృత్యుంజయ మంత్రం

మహా మృత్యుంజయ మంత్రం

మహామృత్యుంజయ మంత్రం భారతీయ పురాణాలలో అత్యంత ముఖ్యమైన మంత్రాలలో ఒకటి. శివునికి సంబంధించిన, ఈ మంత్రం అర్థం మరణాన్ని జయించడం. ఈ మంత్రం మార్కెండేయ మహర్షి ప్రబోధించారు. ఒకప్పుడు చంద్రుడు దక్షరాజు దక్షప్రజాపతి చేత శాపగ్రస్తుడై తన వైభవాన్ని కోల్పోతాడు. ఆ సమయంలో మార్కండేయ మహర్షి చంద్రుని కోసం ఈ మంత్రాన్ని దక్షుని కుమార్తె అయిన దాక్షాయిణి కి చెప్పగా సప్తఋషులు, దేవతలు మొదలగు వారు మంత్రాన్ని జపించగా చంద్రుడు తన పూర్వ వైభవాన్ని పొందుతాడు.

మరొక నమ్మకం ప్రకారం ఈ పవిత్ర మంత్రాన్ని శివుడు శుక్రాచార్యుల వారికి ఇచ్చాడు. అతను దానిని ఋషి దధీచికి బోధించాడు, అతడు దానిని క్షువ చక్రవర్తికి అందించాడు, అతని ద్వారా ఇది పవిత్రమైన శివ పురాణానికి చేరుకుంది.

శ్రీ శివ మహాపురాణం ప్రకారం, క్షువ మహారాజు (క్షువ చక్రవర్తి) ఏడు దీవులను పాలించిన గొప్ప చక్రవర్తి, శివ భక్తుడు. దధీచి మహర్షి వంశంలో జన్మించిన క్షువ మహారాజు, ఇంద్రుని ఆయుధంతో తన శక్తిని నిరూపించుకున్నట్లు పురాణ గాథలు తెలుపుతున్నాయి.

శివ పురాణంలోని కథల ప్రకారం క్షువ మహారాజు శివ భక్తితో గొప్ప శక్తిని సంపాదించారు. దధీచి మహామృత్యుంజయ మంత్రం ఈ చక్రవర్తికి బోధించాడు 

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనం 
। 
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్ 


ఇది ప్రాణాలను రక్షించే మంత్రం. భక్తితో, విశ్వాసంతో, చిత్తశుద్ధితో జపించాలి. దీనిని జపించడానికి ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో ప్రతికూలతను దూరం చేసే దైవిక శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయి.

వ్యాధులతో బాధపడుతున్న వారు వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలని పెద్దలు చెబుతారు. ఇది నొప్పిని తగ్గిస్తుంది. శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ప్రమాదాలు, ఆకస్మిక మరణం, దురదృష్టం లేదా అలాంటి ఏదైనా అనూహ్య ఘటనల నుంచి రక్షణ కలిగిస్తుంది.

ఈ పవిత్ర మంత్రం ఆరోగ్యం, సంపద, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. విభూతిని శరీరంపై పెట్టుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే హవనంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

ఆఫీసుకు వెళ్లే ముందు, మందులు వేసుకునే ముందు లేదా పడుకునే ముందు ఈ మంత్రాన్ని కనీసం తొమ్మిది సార్లు జపించాలి. మంచి ఆరోగ్యం, సంపద కోసం ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించండి. శివునిపై విశ్వాసం ఉంచడం వల్ల అన్ని కష్టాల నుండి ఖచ్చితంగా రక్షిస్తాడు.

No comments:

Post a Comment

Brahma "kidnapping" the cows and gopalas - బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట

బ్రహ్మ గోవత్సములను గోపబాలకులను నంతర్ధానంబుసేయుట గోపబాలురతో నేను వెళ్ళి దూడలను తీసుకొని వస్తానని పలికి కృష్ణుడు గోపబాలురతో అలా చెప్పి, దూడలను...