శ్రీ కృష్ణుని మహిమను గుర్తించి, అతణ్ణి సర్వేశ్వరుడుగా దర్శించి, చేతులు జోడించి నమస్కరిస్తూ బ్రహ్మ ఇలా స్తోత్రం చేస్తున్నాడు.
ఓ పద్మాక్షా! నీవు మెరుపుతీగతోకూడిన నీలమేఘంవంటి శరీరం కలవాడవు. మెరుస్తున్న ఉత్తరీయం కలవాడవు, చేతిలో మృదువైన చల్ది ముద్ద, బెత్తం, బూరకొమ్ము, పిల్లనగ్రోవి, లాంఛనాలతో ప్రకాశించే వాడవు. గురివెంద గింజలతో చేసిన కర్ణాభరణాలతో, శిరస్సు చుట్టూ నెమలి పింఛంతో కూడినవాడవు. అడవిపూలమాలతో అలంకరించిన కంఠంతో, పద్మంలా మెత్తని పాదాలతో ఒప్పేవాడివి. దయపొంగి ప్రవహించేలా కడకన్నులతో చూచేవాడివి, గొల్లపిల్లవాడిలా ఒప్పేవాడివి, సృష్టి చేయడం కోసం నీ నాభికమలంలో నన్ను పుట్టించినవాడివి, అట్టి నిన్ను నమస్కరించి సేవిస్తాను.
ఓ పరమాత్మా! నన్ను మన్నించావు. నీ వాళ్లైన గోపాలురకు ఎంతో ఆనందం కలిగించావు. అట్టి ఈ చిన్నికృష్ణుని రూపం నా మనస్సులో ఆలోచించడానికి కూడా సాధ్యం కావడం లేదు. ప్రకాశవంతమైన నీ విరాడ్రూపం తెలియడానికి ఎవడు సమర్థుడు? కేవల మోక్షదాయకమై, పరమాత్మకు సంబంధించిన విజ్ఞానంతో తెలియదగినట్టి పరబ్రహ్మ స్వరూపమైన నీ విభవంయొక్క తీరు ఎటువంటిదో!
ఓ దేవా! నీకు పరాజయం లేదు. అయినా ఎవరైతే తమ స్థానమందున్న వారై సత్పురుషులచే గానంచేయబడి, తమ చెవిన పడిన నీ గాథను మనోవాక్కాయాలతో సత్కరిస్తూ జీవిస్తారో వారు బహుశః నిన్ను జయిస్తారు, నిన్ను పొందుతారు. నీ అనుగ్రహమే నిన్ను తెలుసుకొనే మార్గం. వాళ్ళకది తెలియదు. అట్టి నీ అనుగ్రహం కలిగినప్పుడు ఏమీ తెలియని వాళ్లుకూడా ఎవరిచేతా జయింపబడని నిన్ను జయిస్తారు. అంటే వారికి నీవు అధీనుడవవుతావు.
భక్తి మార్గంలో భగవంతుణ్ణి సేవించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. అంతే కాని కేవలం జ్ఞానం పొందడానికే తపస్సు చేయడం నిరుపయోగం. అది ఎలాంటిదంటే బియ్యంపైన ఉండే పొల్లు అనబడే ఊక ఎంత ఉన్నా సరే దానివల్ల రాబడి ఉంటుందా, ప్రయోజనం ఉంటుందా! (ఉండదు.)
ఓ ప్రభూ! నీ స్వరూపాన్ని తత్త్వాన్ని తెలుసుకొన గోరే సజ్జనులు మొదట తమ కోరికలన్నింటినీ నీయందే అర్పించి, తాము చేసిన సత్కర్మలచే లభించిన భక్తివల్ల నీకు సంబంధించిన పవిత్ర గాథలను వింటూ, నీ వుండే నీ ప్రధాన స్థానాన్ని చేరుకో గలిగారు.
(సూర్యుడు గాని, చంద్రుడుగాని, అగ్నిగాని ఏ స్థానాన్ని ప్రకాశింపజేయలేరో, దేన్ని పొందితే జీవులు మరల తిరిగి రారో, అదే నాయొక్క శ్రేష్ఠమైన స్థానం, అని భగవద్గీత పురుషోత్తమప్రాప్తియోగంలో (15 అధ్యా. 6 శ్లో) గీతాచార్యుడు వివరించాడు. అదే పరమపురుషుని మొదలిటెంకి. అనన్య భక్తితో సేవించిన భక్తులు ఆ స్థానాన్ని పొందుతారు.)
ఓ స్వామీ! నీ త్రిగుణరహితమైన సచ్చిదానందపరబ్రహ్మస్వరూపాన్ని, వికారాలు లేకుండా, ఒకే రీతిగా ఉండి, విషయానుభవం లేక, స్వరూపానుసంధానవృత్తిరూపంగా, అఖండాకారమై, సర్వోత్కృష్టమై అపరోక్షంగా ఒప్పే అనుభవ జ్ఞానం కలిగినదై, బాహ్యమార్గాలలో వ్యాపించక, స్థిరంగా రాగద్వేషాలు లేని ఇంద్రియాలచేత అతి కష్టంగా తెలుసుకోవచ్చుగాని, త్రిగుణాత్మక, సత్త్వరజస్తమోరూప త్రిగుణ విలాసాత్మకమైన స్థావర జంగమాది ప్రపంచ స్వరూపాన్ని నీవు వహించినప్పుడు నీ గుణాలు హద్దులేనివిగా కనబడతాయి. కాబట్టి నీ స్వరూప స్వభావాలు తెలుసుకోవడం దుర్లభం.
ఇంతటివాడు, అంతటివాడు, అని లెక్కింపరాని మహిమగల ఓ శ్రీకృష్ణా! పండితులు, జ్ఞానులు ఎంతో కష్టపడైనా నక్షత్రాల, మంచు తుంపరల, నేలమీది దుమ్మురేణువుల సంఖ్యనైనా లెక్కింపగలరు గాని, భూభారాన్ని అణచి వేయడానికి సమర్థుడవగు నీ అనంత కల్యాణగుణాలనుమాత్రం లెక్కపెట్ట సమర్థులు కారు.
ఓ స్వామీ! ఆ శ్రీహరికెప్పుడు నాయందు దయకల్గుతుందో, నేనెప్పుడు ఆ స్వామిని దర్శించగలుగుతానో, అంటూ భక్తవరేణ్యుడు తన వ్యాపారాలన్నింటినీ నీయందే చేర్చి, తన పూర్వ ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలన్నింటినీ మొదలంటు నశింపజేస్తూ నీ దయకు పాత్రుడ్రై, మనోవాకాయకర్మలతో నీ సేవను ఏమరకుండా ఉన్న విజ్ఞానవంతుడైన వాడే పరమపద అధినాథునికి సంబంధించిన మోక్షలక్ష్మిని పొందగలడు. అటువంటివాడు తప్ప ఇతరులు మోక్షలక్ష్మిని పొందటం శక్యం కాదు.
యోగీశ్వరుల, పాటలతో, స్తుతి వాక్కులతో స్తుతింపబడే ఓ స్వామీ! ఎవరు కపటంగా ప్రవర్తిస్తారో వాళ్ళను నీ మాయలో పడేలా చేసే నేర్పరివి - నీవు. అటువంటి నిన్ను నేను నా మాయతో కలత పెట్టి, నీ మాహాత్యం ఎంతటిదో చూద్దామంటూ చేయరాని నేరం చేశాను. ఏ కార్చిచ్చు నుండి పుట్టిన చిన్న అగ్నిజ్వాల ఆ కార్చిచ్చును మించేలా ప్రకాశింప గలదా! నీ మహిమ కార్చిచ్చు ప్రకాశం అంతటిది. నా మాయ అందులో పుట్టిన ఓ చిన్న అగ్నికీల వంటిది. కాబట్టి ప్రభూ! నా పట్ల దయచూపి, నన్ను కాపాడు.
ఓ సర్వాత్మకా! నీ వల్ల ఏర్పడే సత్త్వరజస్తమోగుణాలలో ఒకటైన రజోగుణంనుండి పుట్టినవాడిని. విజ్ఞానం ఏమీ లేనివాడను. ఇట్టి వాడనైన నేను ప్రభువునంటూ వెర్రి అహంకారంతో గర్వించి, దానివల్ల గుడ్డివాడనైనాను. నన్ను దయతో అనుగ్రహించు. అవ్యక్తం, మహత్తు, అహంకారం, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అనే ఈ ఎనిమిది ఆవరణాలచేత నిండిన బ్రహ్మాండభాండంలో, ఏడుజేనలశరీరంతో కూడివున్న నేనెక్కడ? ఎవరికీ లెక్కింప అలవికానన్ని ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యం ఒకదానివెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకుపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీ వెక్కడ? నేనెక్కడ? ఎక్కడిక్కడి పోలిక?
ఓ ప్రభూ! లోకంలో తల్లి తన గర్భంలోని శిశువు కాలితో తంతూ ఉంటే కోపంతో మండిపడి, ఆ బిడ్డను కొడుతుందా? కొట్టనే కొట్టదు. స్థుల, సూక్ష్మరూపాలై, కార్య, కారణ సంబంధంతో అణగి ఉండే ఈ సకల ప్రపంచం నీ కడుపులో ఉన్నదే కదా! అటువంటప్పుడు ఆ నీ కడుపులో ఉన్న నేను నీ బిడ్డడినే! తన్నిన పిల్లవాడిని తల్లి ఎలాగైతే కోపగించి దండించదో, అలాగే తప్పుచేసిన నన్ను నీ పిల్లవాణ్ణి కాబట్టి దండింపతగదు.
మహాప్రళయ సమయంలో ఆ సముద్రజలం నడుమ నిద్రిస్తూ ఉన్న నారాయణునిబొడ్దుతామర నుండి బ్రహ్మదేవుడు పుట్టినాడు అనే మాట సత్యం. నేను పుట్టినప్పుడే నాతోపాటు నా ఓటమికూడా పుట్టింది.
ఓ కమలనేత్రా! నీవు త్రిమూర్తులకు మూలపురుషుడవైన ఆదినారాయణుడవు. జలానికి, నరసముదాయానికి 'నారము' అని పేరు. నారములలో నీవు ఉండడంవల్ల, నీయందు అవి ఉండడంవల్ల నీకు నారాయణుడనే పేరు ఏర్పడింది. సమస్త ప్రాణకోటికీ సాక్షీభూతుడవు. సర్వానికి ప్రభుడవు. సముద్రంలో మఱ్ఱాకుపై నిద్రించే నారాయణుడవు. అదే నీ నిజరూపం అనడానికి వీలులేదు. నేను పూర్వం తామరతూడుద్వారా నడచి, ఎంతో ప్రయత్నంతో వంద సంవత్సరాలు వెదికాను. కానీ నిన్ను చూడలేక పోయాను. ఒకచోట ఉండే వాడవుకావు. అనేక రూపకాంతులతో ప్రకాశిస్తూఉంటావు. జగత్తులో నీ వుంటావు. నీలో జగాలుంటాయి. ఇది చాలా ఆశ్చర్యం. నీ మాయవల్ల ఎలాగైనా అవగలవు, ఉండగలవు.
ఓ ప్రభూ! బయట ప్రత్యక్షంగా కనబడే ఈ జగత్తంతా నీ మాయకాక నిజమే అయినట్లయితే యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూచింది? చూచిందే అనుకో, మళ్లీ ఏనాడైనా అది అలా చూడగలిగిందా? నీ కడగంటి చూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలా ఉంటుంది, నీ బయటా ఉంటుంది. అలా కాకుంటే ఆ రెండిటికంటే వేరైందవుతుంది.
ప్రభూ! మొదట ఒక్కడుగానే ఉన్నావు. గోపబాలురలో, దూడలలో వెలుగొందావు. అనంతరం, అందరిచేతా నమస్కారాలు స్వీకరిస్తున్న నాలుగుభుజాల విష్ణువురూపాల్లో కనిపించావు. ఆపై బ్రహ్మాండాలన్నీ చూపించావు. అలా ఇష్టం లేక మళ్ళీ ఈ కృష్ణుడుగా ఒక్కడవై కనిపిస్తున్నావు. ఇన్నాళ్ళకు ఈ రకమైన నీ లీలావిశేషాలన్నీ చూశాను కదా!
స్వామీ! నీవు ప్రకృతితో కూడిన మాయతో కలిసి లోకాన్ని సృష్టించడంలో నా వలె, రక్షించడంలో విష్ణువైన నీ వలె, లయం చేయడంలో శివునివలె నిన్ను తెలియని ఆ అజ్ఞానులకు కనబడతావు.
నీవు దుర్మార్గులను శిక్షించడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ, జలచరాలుగా, మృగాలుగా, బ్రాహ్మణులుగా, సాధారణమానవులుగా ఎన్నో అవతారాలు ధరించావు. నీ మార్గాలు ఈ విధంగా ఉంటాయని ఊహించడం సాధ్యం కాదు. నీ వలెనే నీ మార్గాలుకూడా అంతం లేనివి.
దేవ దేవా! యోగమాయచే లోకాన్ని అజ్ఞాన ఆవరణం అనే చీకటిలో ముంచి నిద్రిస్తూ ఉంటావు. ఓ పరబ్రహ్మరూపా! యోగులలో శ్రేష్ఠుడా! నీ లీలలు ఎలా ఉంటాయి! ఎన్ని? వాటిపరిమాణమెంత? ఏ సమయాలలో, ఎక్కడ ప్రదర్శిస్తావో అనే విషయాలు ఎవరికి తెలుసు? (ఎవరికీ తెలియదు.)
స్వామీ! నీ అసలు రూపం ఇదే అనడానికి వీలు కాదు. ఈ జగత్తంతా కలవంటిది. ఎన్నోరకాల దుఃఖాలతో నిండి ఉంటుంది. అజ్ఞానంలో మునిగి ఉంటుంది. నీ వైతే నిత్య స్వరూపుడవై, అంతం లేనివాడవై వర్తిస్తూ, ప్రకృతి రూపమాయవల్ల పుట్టినట్లు, జీవిస్తున్నట్లు, నశిస్తున్నట్లు ఉంటావు. నీవు ఒక్కడివే ఇతర ఉపాధులు లేనివాడవు. అంతటికీ ఆద్యుడవూ నీవే. నీవు మృతిలేనివాడవు, శాశ్వతుడవు, నీకు సాటియైన రెండవవాడు లేని అద్వయుడవు, స్వయం ప్రకాశకుడవు, ప్రాచీనులలో ప్రాచీనుడవైన మొట్టమొదటి పురుషుడవు, సంపూర్ణమైన సుఖానికి అనంత ఆనందానికి నిధివి, నిత్య సత్య స్వరూపుడవు, ఇటువంటి నిన్ను ఇట్టి వాడని ఊహించడం శక్యమా! శక్యంకాదు.
దేవా! సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడవై ఉన్నావు. ఎవరైతే గురువు అనే సూర్యునినుండి వేదాంతజ్ఞానమనే దివ్యనేత్రాన్ని సంపాదించి నిన్ను తన ఆత్మ స్వరూపునిగా దర్శిస్తారో వారు సంసారమనే మిథ్యాసముద్రాన్ని తరించిన వారవుతారు. మానవుడు తన స్వరూపాన్ని యథాతథంగా తెలియక పోవడంచేతనే తాడునందు పాము కనబడినట్లుగా, ఈ ప్రపంచమంతా ఉన్నట్లు కనపడుతుంది. జ్ఞానం పొందినవానికి తాడునందు పాము అనే భావం పోయినట్లే ఆత్మ పరమాత్మల ఐక్యం తెలుస్తుంది. సంసారబంధం, మోక్షం, అనేవి రెండూ ప్రసిద్దాలే కాని అవి అజ్ఞానంవల్ల కలిగిన నామాలుమాత్రమే! ఆత్మ నిత్యజ్ఞానస్వరూపమే, రెండవది లేనిది, ప్రకృతికి అతీతమైంది అనే ఆలోచనతో ఆత్మతత్త్వాన్ని విచారిస్తే పరిశీలిస్తే సూర్యునియందు రాత్రింబవళ్ళు లేనట్లే, ఈ బంధమోక్షాలు వేరుగా లేనే లేవు. అజ్ఞానులైన జనులు ఆత్మరూపుడవగు నిన్ను ఇతరునిగాను, ఆత్మకాని దేహాదులను అత్మగాను తలచి, ఆత్మరూపుడవగు నిన్ను తమకంటే బయటే వెదకుతూ ఉంటారు. వారిఅజ్ఞానం ఎంతటిదో కదా! విజ్ఞానులు తమ తమ దేహాలలోనే సచ్చిదానందస్వరూపుడవైన నిన్ను వెదకి తెలుసుకొని నిరతిశయానందంలో ఓలలాడుతూ ఉంటారు. కాబట్టి
ఓ ప్రభూ! నీ మహామహిమను ఊహించాలంటే, నీ పాదములనుండి అనుగ్రహించబడిన ధూళికణంవలనమాత్రమే సాధ్యం కాని, లేకపోతే ఎవరికి సాధ్యం? నీ వారుగా జీవించగల ధన్యులలో నేను ఒకడనుగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈశ్వరా! ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు.
దయాసముద్రుడవైన ఓ స్వామీ! శతాధికయజ్ఞాలలోని హవిర్భాగంతో నిండినకదుపు నీది. అట్టి నీవు ఇలా దూడలుగా, గోపబాలకులుగా రూపొంది, గోపస్త్రీల స్తన్యాన్ని పానంచేస్తూ, చొక్కుతూ, ఆడుతూ, ఉల్లాసంగా తిరుగుతూ ఉంటే, ఆ దూడలకూ, బాలురకూ తల్లులైన ఆ గోపవనితల ధన్యత ఇట్టిదని చెప్పడానికి నేను సమర్థుడనా స్వామీ! (సమర్థుడను కాను.)
సర్వవ్యాపకమై, అనాదిలై, ఆనందస్వరూపం అయిన, పరబ్రహ్మస్వరూపుడు చెలికాడుగా పొందిన, నందగోపకులంలో నివసించే ఈ గొల్లవారి అదృష్టం ఆలోచిస్తే ఎంత అరుదో కదా!
పద్మాక్షా! భక్తవరదా! సర్వేశా! పురుషోత్తమా! ఓ స్వామీ! చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు, వాక్కు, హస్తం, పాదం, గుదం, గుహం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే పదమూడింద్రియాలకూ వరుసగా దిక్కులు, గాలి, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు, అగ్ని, దేవేంద్రుడు, విష్ణువు, మృత్యువు, ప్రజాపతి, చంద్రుడు, చతుర్ముఖబ్రహ్మ, రుద్రుడు అనే పదముగ్గురమూ ఇంద్రియ అధిష్టాన దేవతలము. మేమందరం ఇంద్రియాలనే పానపాత్రలద్వారా నీ పాదకమలం నుండి స్రవించే తేనెను అమృతం తాగినట్లు తాగి, ఒక్కొక్కరం ఒక్కొక్క ఇంద్రియాభిమానులమయినా, ఎంతో ధన్యత పొందిన వారమయ్యాము. అటువంటిది తమ సర్వేంద్రియవ్యాపారాలన్నిటినీ నీమీదే ఉంచి తిరిగే ఈ గొల్లపల్లెలోని గోపాలుర, గోపవనితల గొప్పదైన, ప్రత్యేకతతో నిండిన అదృష్టంగా ఉన్న కలిమిని విచారించి స్తుతించడం ఎవ్వరికీ శక్యంగాదు.
చతుర్వేదాలు సైతం దర్శింపలేని నీ రూపాన్ని ఈ భూలోకంలో, ఈ అడవిలో, గోకులంలో, కృష్ణా! కృష్ణా! అంటూ సంభాషణలు మొదలు సర్వ వ్యాపారాలనూ నీయందే సమర్పించిన ఈ గోపబాలురలో ఏ ఒక్కడి పాదాలకంటిన ధూళి అణువులు నా శరీరాన్ని ముట్టినా చాలును. ఆ బాలురవంటి అదృష్టం లేనప్పుడు ఎందుకు నాకీ బ్రహ్మ పదవి?
శరణాగత సంరక్షకా! కృష్ణా! నీకు కీడు తలపెట్ట వచ్చిన పూతన మొదలగు దుష్టరాక్షసులకు నీదైన పరమపదాన్ని ప్రసాదించావు. అటువంటిది పూతనలా వంచించే స్వభావం లేకుండా, తమ గృహ, దార, పుత్ర గోవులతోడి సర్వసంపదలను నీకు అర్పించి తమ ప్రాణాలనుసైతం నీ వశంలో ఉంచినట్టి ఈ గొల్లవారికి ఎంతటి ఉత్తమస్థానా న్నిస్తావో అని సంశయం కలుగుతోంది.
ఓ పుండరీకాక్షా! భక్తితో నిన్నెంతకాలం స్మరించకుండా కేవలం దేహేంద్రియాభిమానంతో ఎవరుంటారో వారిదేహం చెరసాలే! మోహం ఇనుపసంకెలే! రాగద్వేషాదులు శత్రువ్యూహాలే అవుతాయి.
విశ్వాత్మకుడా! నీ కంటూ నిజంగా ఓ ప్రపంచం అనేది లేదు. నీవు అప్రపంచకుడవు. అయినా నిన్ను భక్తితో సేవించే వారికి ఆనందం అందించాలనుకొని నానావిధలీలలతో ప్రపంచాన్ని సృష్టించి నడిపిస్తుంటావు.
కల్యాణగుణరత్నాకరా! ఇన్ని మాటలు అవసరం లేదు. నీ స్వరూపస్వభావాలను జ్ఞానులైన బ్రహ్మవెత్తలే తెలుసుకొంటారు. అంతే కాని తెలుసుకోవడానికి కేవలం మనస్సు, వాక్కులుమాత్రం చాలవు.
సకలలోకేశా! అన్నీ తెలిసినవాడివి. సమస్తవిషయాలను దర్శించేవాడివి నీవే! లోకానికంతటికీ ప్రభుడవు నీవే! అపరాధినైన నన్ను దయచూడు. నేనింక వెళ్ళివస్తాను.
కృష్ణా! నీవు జయశీలుడివి. రాక్షస సంహారకుడివి. వృశ్ణికులమనే పద్మానికి సూర్యునివంటివాడివి. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులనే సముద్రానికి చంద్రునివంటివాడవు. వేదధర్మానికి విరుద్ధమైన కార్యాలు ఆచరించే పాషండుల ఇళ్ళకు కార్చిచ్చువంటివాడివి.
ఓ కృష్ణమూర్తి! ఈ కల్పపర్యంతం నీకు నమస్కరిస్తూనే ఉంటాను అని స్తుతించి, మూడుసార్లు ప్రదక్షిణంచేసి, పాదాలకు మొక్కి సెలవు తీసుకొని బ్రహ్మ తన లోకానికి వెల్లిపోయాడు. బ్రహ్మను అలా గౌరవించిన కృష్ణుడు పూర్వం తమ బాగు చెడి మరలి వచ్చిన దూడలను బాలగోపాలకులను గ్రహించి, వాళ్ళందరీనీ యిసుకదిబ్బదగ్గరకు చేర్చాడు. ఈ విధంగా

గోపబాలురులకు బ్రహ్మ మాయ తొలగుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
No comments:
Post a Comment