గార్థభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుండు వధించుట
ఓ బలరామకృష్ణులార! ఇక్కడికి చాలదూరంగా, ఒక పెద్దతాటితోపు ఉంది. ఆ చెట్లనుండి పండిన పండ్లు గుట్టలు గుట్టలుగా రాలుతూ ఉంటాయి. అందులో ధేనుకుడనే పేరుగల రాక్షసుడు ఉంటున్నాడు. వానిమూలంగా ఎంత ధైర్యవంతులయినా సరే, ఆ తాటితోపులో అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటారు.
ధేనునుకుడనే పేరుగల ఆ రాకాసి మహాపరాక్రమం కలవాడు, గాడిదరూపంతో ఉన్నవాడు, తనతో సమాన బలంగల తన దాయాదులతో కలిసి, ఆ వనంలో ప్రవేశించినవారిని పట్టుకొని తింటూ ఉంటాడు. అక్కడ కొత్తగా పండినవి, మంచివాసన కలవి అయిన తాటిపండ్లు రాసులు రాసులుగా ఉన్నాయి. ఇంకా వినండి.
ఆ పండ్లవాసన మా ముక్కు పుటాలగుండా మా మనస్సులలోకి ప్రవేశించి, వాటిని తినాలనే కోరిక పుట్టించి, క్షోభ కలిగించి, మా మనస్సుల్ని ఆ పండ్లవద్దకు లాగుకొని పోయింది. కావున ఏలాగైనా సరే! ఆ పండ్లు తినే అవకాశం మాకు కలిగించండి. అమితబలం కల మీకు ఆ రాక్షసులు ఒక లెక్కలోనివారా? (కారు కదా!)
ఈ విధంగా చెప్పిన స్నేహితుని మాటలు మన్నించి, శ్రద్ధగా విని, అంగీకార సూచకంగా నవ్వి, ఆ బలరామకృష్ణులు స్నేహితులతో కలిసి, ఎత్తైన తాటిచెట్లుగల ఆ తోపులో ప్రవేశించి
బలరాముడు మదగజంలాగ తన భుజబలంతో, ఆ తాటిచెట్లను అటూ ఇటూ వేగంగా ఊపి ఊపి, తాటిపండ్లను నేలమీద రాలగొట్టాడు.
అప్పుడు తాటిపండ్లు రాలగొట్టడంచేత కలిగిన చప్పుడు విని, ఉలికిపడి అసహనంతో ధేనుకాసురుడు శత్రువులను అణచివెయ్యాలనే కుతూహలంతో,
ఆ ధేనుకాసురుడు వడివడిగా అడుగులు వేయడంచేత, ఆ బరువుకు తాటిచెట్లతో కూడిన ఆ నేలంతా కంపించిపోయింది. కోపంతో పండ్లు కొరుకుతున్నాడు. కత్తిరించిన చెవులు నిక్కబొడుచుకొన్నాయి. తోక భయంకరంగా అటూ ఇటూ అల్లాడుతోంది. గర్వంతో చెలరేగిపోయాడు. గొల్లవారు అదిరిపోయేట్టుగా వెనుకకు దిరిగి, వెనుకకాళ్లతో బలరాముణ్ణి గుండె మీద తన్నాడు. (వెనుక కాళ్లతో తన్నడం గాడిద నైజం)
పిమ్మట ఆ ధేనుకాసురుడు బలరాముణ్జి కరవాలని ప్రయత్నించి, వీలు కాకపోవడంవల్ల, అతణ్ణి కోపంతో చుర చుర చూస్తూ తన్నబోయాడు. కానీ వానికి శక్తి చాల్లేదు. ఇటూ అటూ వట్టినేలను తన్నాడు. ఆ తాపులు బలరామునికి తగలలేదు.
అటుపిమ్మట బలరాముడు కోపావేశంతో ఆ ధేనుకాసురుని నాలుగుకాళ్లు ఒంటిచేతితో పట్టుకొని, గిరగిర త్రిప్పి, నేలకేసి కొట్టి, చంపి
బలరాముడు ఆ ధేనుకాసురుని కళేబరాన్ని ఒక తాటిచెట్టు కొనమీద పడేవిధంగా విసరగా, దాని దెబ్బకు ఆ తాటిచెట్టు విరిగి, మరొక తాటిచెట్టుకొనమీద పడింది. అది విరిగి మరో తాటిచెట్టు కొనమీద పడింది. ఈ విధంగా ఒకదాని మీద మరొకటి పడి, విరిగి, సుడిగాలి తాకిడికి కూలే విధంగా, ఆ తోపులోని తాటిచెట్లన్నీ కూలిపోయాయి.
పడుగు పేకగా అల్లుకొన్న దారాలనుండి బట్ట పుడుతోంది. అలాగే ఈ ప్రపంచమంతా విష్ణువునుండే పుడుతోంది. లోకనాయకుడైన మహావిష్ణువు యొక్క అంశ అయిన బలరాముడు, ఒక సామాన్యుడైన రాక్షసుణ్ణి సంహరించడంలో వింత ఏమీ లేదు. వాణ్ణి చంపడం చూచిన వానిబంధువులంతా గాడిదలుగా మారి
(బలరాముడు ఆదిశేషుని అవతారం. శ్రీకృష్ణుడు శ్రీమహావిష్ణువు అవతారం. విష్ణువుయొక్క అంశయే శేషుడు. కావున ఇక్కడ బలరాముణ్జి జగదీశునిగా చెప్పడంలో విరోధం లేదు.)
ఓ పరీక్షిన్మహారాజా! గాడిదలుగా మారిన ఆ ధేనుకాసురుని భటులంతా బలరామకృష్ణుల మీద కలియబడ్డారు. దానితో వారు బలంగల ఆ గాడిదల వెనుకకాళ్లు పట్టుకొని, తాటిచెట్ల కొనలమీదకు విసిరికొట్టి చంపారు.
అప్పుడు జరిగిన యుద్ధంలో తాటిచెట్టు, రాక్షసుల శరీరాలు ఖండఖండాలుగా తెగి, నేలమీద వరుసగా పడ్దాయి. వాటితోగూడిన యుద్ధభూమి వరుస మబ్బులతోగూడిన ఆకాశంలా కనిపించింది.
అపుడు ధేనుకాసురుణ్ణి సంహరించినవాడూ, భక్తులు కోరిన కోరికలు తీర్చడంలో కామధేనువూ అయిన బలరాముడు వారికి లభించడంచేత ఆ గొల్లలు ఆ తోపులోని తాటిపళ్లను తిన్నారు. ఆవులు తనివితీరా అక్కడ ఉన్న పచ్చగడ్డిని మేశాయి.
అప్పుడు దేవతలు పుష్పవృష్టి కురిపించి, భేరీలు మ్రోగించారు. గొల్లలంతా గొంతెత్తి తన కీర్తిని గానం చేస్తూండగా, శ్రీకృష్ణుడు అన్న బలరామునితో కలిసి, ఆవుల మందలను తోలుకొని, గొల్లపల్లెకు వెళ్లాడు. అప్పుడు
ఆవులకాళ్లచేత పైకి లేచినదుమ్ముతో కూడిన జుట్టుమీద నెమలిపింఛం కలవాడు, చిరునవ్వుతో కూడిన చల్లని చూపులుగల మొగం కలవాడు. అప్పుడే పూసిన పూలతో కట్టిన దండలు ఒంటినిండా ధరించినవాడు, గొల్లవారు సంతోషించేలా పిల్లనగ్రోవి ఊదేవాడు, అయిన శ్రీకృష్ణుణ్ణి అప్పుడు గోపకులు కన్నుల పండువుగా చూశారు.
గోపికలందరు శ్రీకృష్ణునిముఖం అనే కమలంలో ఉన్న సౌందర్యం అనే మకరందాన్ని తమ కన్నులనే తుమ్మెదలతో తనివితీరా త్రాగి, పగటివేళ శ్రీకృష్ణునితోడి ఎడబాటువల్ల కలిగినతాపాన్ని పోగొట్టుకొన్నారు. (శ్రీకృష్ణుడు ఆవుల మందలతో పగటివేళ మెపడానికి అడవికి వెళ్లినందువల్ల వ్రేపల్లెలో ఉన్న గోపికలకు శ్రీకృష్ణునితో వియోగం కలిగింది. ఇప్పుడు అతణ్ణి తనివితీరా చూచి ఆ బాధను పోగొట్టుకొన్నారు. )
ఈ విధంగా గోపికలంతా ఆదరంతో తనను చూస్తూ ఉండగా, ఆటలలో మేటి అయిన శ్రీకృష్ణుడు వారి చూపులలోని సిగ్గు నవ్వు వినయం అనే భావాలను వీక్షిస్తూ వ్రేపల్లెలో ప్రవేశించాడు. అపుడు రోహిణీ యశోదలు తమ కొడుకులయిన బలరామకృష్ణులందు పత్రప్రేమ అతిశయించగా, తమకు నచ్చిన రీతిలో వారికి దీవెనలిచ్చారు. తల్లులు చేసిన ఉపచారాలను బలరామకృష్ణులు స్వీకరించారు. నలుగులు పెట్టించుకొన్నారు. స్నానం చేశారు. పరిమళాలు వెదజల్లే పూలదండలు అలంకరించుకొన్నారు. అందమైన బట్టలు కట్టుకొన్నారు. తీపి, పులుపు మొదలయిన ఆరురుచులతో కూడిన భక్ష్య - లేహ్య - చోప్య - పానీయాలనే నాలుగు విధాలయిన ఆహారాలు ఆరగించారు. ఎగుడుదిగుళ్లు లేక మెత్తగా అమర్చిన పాన్పులమీద హాయిగా పవ్వళించారు. దినచర్య ఈ విధంగా నడుస్తూ ఉన్న కాలంలో
శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
పంచాంగం
Subscribe to:
Post Comments (Atom)
Lord Krishna performing Kaliyamardana - శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట
శ్రీకృష్ణుడు కాాళియమర్దనము గావించుట ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ఒక్క బలరాముడు తప్ప, శ్రీకృష్ణుడు మిగిలిన గొల్లపిల్లలు అందరు తన వెన్నంటి రాగా,...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment