Saturday, August 29, 2026

Srikrishna Balabhadrulu Mruthulaina Tama Sahodarula Dechi Devakideviki Ganabaruchuta - శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట

ద్వారకలో అందరూ సుఖంగా కాలంగడుపుతున్నారు. నీళ్లల్లో మునిగి యమలోకం చేరిన గురుపుత్రుని తీసుకొని వచ్చిన వృత్తాంతమంతా జనులనుంచి దేవకీదేవి విని శ్రీబలరాములను పరిపరివిధాల స్తుతిస్తూ, కన్నుల కన్నీరు కారుస్తూ మొరపెట్టుకొంది.

దుర్మార్గులైన మురాసురుడు, కంసుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు మొదలైన మహా బలశాలులైన రాక్షసులను సంహరించి భూభారాన్ని తొలగించినవారు మీరే కదా! (అని దేవకి ప్రశంసించింది.)

జగత్తుకు సృష్టి స్థితి లయకారకులు మీరే! మీకు అవన్నీ లీలావినోదాలు. మిమ్మల్ని నమ్ముకున్నాను. దయచేసి నా కోరికతీర్చండి అని దేవకి ప్రార్ధించింది.

బలరామ, కృష్ణుల్ని అనేక విధాల నుతించి, “అయ్యా! మీరు మహానుభావులు. గతంలో చనిపోయి యమపురం చేరిన మీ గురుపుత్రుణ్ణి బతికించి, యమునివద్దనుండి తీసుకొనివచ్చి గురుదక్షిణగా గురువుకు సమర్పించారు. మహానుభావులారా! ఇదేవిధంగా కంసుడు చంపిన నా కుమారుల్ని కూడా సజీవులుగా తెచ్చియిచ్చి నా దుఃఖాన్ని పోగొట్టండి” - అని ప్రార్థించింది. ఆమె మెత్తని తియ్యని పలుకులు విని గౌరవపూర్వకంగా స్వీకరించి, మాయాప్రభావంతో సుతల(పాతాళ) లోకానికి వెళ్లారు.

సుతల లోకాధీశుడైన బలిచక్రవర్తి బలరామ, కృష్ణుల్ని కన్నులార చూశాడు. వారు కమలదళాలవంటి కన్నులు కలవారు. కార్యసమర్జులు. పచ్చని, నీలివర్ణాల దేహచ్చాయలు గలవారు. సమస్తలోకాల్లో కాంతిమంతులైనవారు. హలాన్ని చక్రాన్ని ధరించినవారు. భక్తులను పరిరక్షించేవారు. ఎప్పుడూ శుభాలతో ఒప్పేవారు. ఎల్లవేళల జయం పొందేవారు. జయశీలురు. అట్టివారు తనలోకానికి రాగా చూచాడు.

బలిచక్రవర్తి తన సన్నిహితులతో ఎదురుగా వెళ్లి బలరామ, కృష్ణులను ఆహ్వానించాడు. వారిపైగల భక్తివల్ల వారి రాకపట్ల కుతూహలుడై సాష్టాంగ దండప్రణామంచేసి బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి, వారికాళ్లుకడిగి, సమస్తలోకాల్లో పవిత్రాలైన ఆ జలాల్ని భక్తితో తలపై చల్లుకొన్నాడు.

బలిచక్రవర్తి తన లోకానికి వచ్చిన బలరామకృష్ణుల్ని స్వాగతించి, అర్చించాడు. విశ్వమే రూపమైన వారిని సంపెంగ, అగరు, చందన, ఏలాది ధూపాల్ని (వేసి), భువనాల్ని వెలిగించేవారికి బంగారు పాత్రలలో రత్నదీపాలు, కర్పూరదీపాలతో హారతిచ్చి, వేదాలచే తెలియబడే మహానుభావులకు పాయసాన్నఫలాదుల్ని నైవేద్యంగా ఇచ్చి, దేవతలకు శత్రువులైనవారికి నూత్న రత్నాభరణాల్ని నీల పీతాంబరాలు ధరించేవారికి మంచువంటి పలుచని, తెల్లని విశిష్టవస్త్రాల్ని కట్టబెట్టి, అహంకారరహితులైన, వారికి చందనాది లేపనాలు, పూలమాలల్ని (సమర్పించి)

వివిధపూజలుచేసి, ఉపాయన సమర్పణంకావించి, శ్రీకృష్ణుని కమలాలవంటి చరణాలను ఒత్తుతూ, ఆనందంతో ఉబికిన కన్నీరు కారుతుండగా, పులకించిన శరీరంతో రెండుచేతులు నుదుట జోడించి, నమస్కరిస్తూ ఇలా ప్రార్ధించాడు.

బుద్ధిమంతుడైన బలిచక్రవర్తి “ఓ కృష్ణా! భగవంతుడా! హరుడా! పరమాత్మా! ముకుందుడా! సమస్త భక్తరక్షకా! పురుషోత్తమా! మునులచే నమస్కారాలందుకొనేవాడా! రాక్షసాంతకా! సాంఖ్యస్వరూపా! నీలకేశా! చక్రధారీ! బ్రహ్మా! నీ కొరకు నమస్కారాలని” స్తుతించాడు.

పైవిధంగా భగవంతునిలీలలు నామగ్రహణరూపమున పొగడి ఇంకా ఇలా అన్నాడు.

శ్రీకృష్ణా! కేవలం సాత్వికులు మాత్రం దర్శించగలిగే నిన్ను రజస్తమోగుణులైన వారు చూడలేరు. పద్మాక్షా! నీ పవిత్ర చరిత్రలు మునులు దర్శించి గానం చేస్తున్నారు. శివబ్రహ్మేంద్రాది దేవతా ప్రముఖులు మిమ్ము నమస్కరించుటచే వారి శిరోరత్నాలచే నీ పాదపీఠం ప్రకాశిస్తోంది. నీ దర్శనంచే జన్మబంధాలు తొలగిపోతాయి.

యోగిశ్రేష్ఠులుసైతం నీ మాయలో చిక్కుకొని నీ తత్త్వాన్ని తెలుసుకోలేరు. మా వంటి తామసులు, అహంకారులు నిన్ను ఎలా తెలుసుకోగలరు? మాకు చక్కని జ్ఞానం, చక్కటి వివేకం ఇచ్చి నిన్ను చేరే ముక్తి మార్గం చూపి, ఈ సంసారకూపం నుండి ఉద్ధరించి నీ దగ్గరకు చేర్చుకోవయ్యా!

(మాయ : “మునుపులేనిది, ముందు ఉండబోనిది - ఈ రెంటి నడుమ కొంతకాలంపాటు వ్యవహారగోచరమయినది మాయ. ఎప్పుడూ ఒకే విధంగా ఉండక మారుతుండటం దీని స్వభావం. ఏది సత్తుకాదో, అసత్తును కాదో అది మాయ. కావున, ఈ ప్రపంచం మాయ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏది మార్పు చెందుతుందో, ఏది ఎల్లకాలమూ ఉండదో, ఏది నశిస్తుందో అది మాయామయం. దీనికి విరుద్ధంగా మార్పుచెందక, నశింపక, ఎల్లకాలం ఉండేది ఆత్మ!)

శత్రువులుగా ఉండి చైద్యుడు మొ॥వారు, ప్రేమతో గోపికాస్త్రీలు, భక్తితో పాండవయాదవాదులు నిరంతరం మనస్సులో మీ రూపగుణాదుల్ని ధ్యానిస్తూ మోక్షం పొందుతున్నారు. మహాజ్ఞానులైనాకూడా దేవతలు నీ ధ్యానం లేక కైవల్యపదం అందుకోలేకపోతున్నారు.

(నిరంతరం క్రోధంతో పగవారైన శిశుపాలాదులు స్మరించడంవల్ల వారికి ముక్తి. భగవద్ధ్యానం నిరంతరం చేయనివాడు వివేకి, విద్వాంసుడైనా వానికి కైవల్యం దూరమే.

పద పద్మమన్నచోట ధ్యానకేంద్రమని, భవత్పదమన్నచోట విష్ణుపదం అనగా ఆకాశమని పదశబ్దానికి అర్ధద్వయం భిన్నంగా మహాకవి నిక్షేపించినాడు. చిదాకారుడుకాబట్టి ధ్యానంవలనేగాని గ్రంథాలవలన దొరకడని సారాంశం.)

శ్రద్ధచేత నిన్ను సేవించే వాడెవ్వడైనా భవబంధాలనుండి విముక్తి పొందుతాడు. యోగీశ్వరుడవైన నీవు నీచే పాలింపబడేవారమైన మమ్ము పాపరహితులుగా అనుగ్రహింపుమని ప్రార్థించి, ఇంకా ఇలా అన్నాడు.

నిన్ను తనివిదీరా చూచాను. సంసారబంధమనే సముద్రాన్ని దాట గల్గాను. మోక్షనిధిని చూచాను. నీదయా దృష్టులు నాపై ప్రసరింపగా చూశాను. బ్రహ్మ మహేశ్వరులు కూడా చూడలేని నా పాపాల్ని పోగొట్టావు. అట్టి నీవు, నా యింటికి వచ్చి నన్ను కృతార్జుణ్ణి చేశావు.

స్వామీ! నేను మీ దాసుణ్ణి. మీరు ఏది చెపితే అది చేస్తాను. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని చేతులు జోడించి ప్రార్ధించగా కృష్ణుడు బలి వినయానికి సంతోషించి ఇలా అన్నాడు.

ఓ బలిరాజా! పూర్వం కృతయుగంలో మరీచికి వర్ష అనే భార్యవలన ఆరుగురు కుమారులు పుట్టారు. బ్రహ్మ ఒక రోజు తన కూతురినే కామించి రమించగా చూచి పరిహసించారు. బ్రహ్మ అందుకు కోపించి రాక్షసులుగా పుట్టుడని శపించాడు. శాపవశాత్తు వారు హిరణ్యకశ్యపునికి కొడుకులుగా పుట్టారు. దేవతల కోరికమేరకు యోగమాయాదేవి ఈ ఆరుగురుని దేవకీదేవి గర్భాన ఉంచగా

(కంస నిర్యాణంలో యోగమాయ పాత్ర పెద్దది. వీరార్గురితో బాటు తానూ దేవకీ గర్భాన జన్మించి, జన్మలు చాలించి, అష్టమగర్భ శిశువుగా విష్ణునిరాకకు సుగమం చేసింది. ఇదంతా విష్ణుమాయే.)

దేవకీదేవి తన ఆరుగురు కుమారుల్ని కంసుడు వెనువెంట చంపివేయగా పుత్రవియోగదుఃఖంతో శోకించి, ఆమె ఆ పుత్రుల్ని చూడాలని మమ్మల్ని కోరింది. ఆ కారణంగా మేము వచ్చాము.

ఓ పుణ్యపురుషా! మాకు ముందు జన్మించిన ఆ ఆరుగురుని తిరిగి మా తల్లి దేవకీదేవికి చూపించెదమని ఆమె కోర్కె తీరుటకై మేమునీ వద్దకు వచ్చాం. నీవద్ద సుఖంగా ఏ విరోధమూ లేకుండా ఉంటున్న ఈ ఆరుగురు వీరే అని చెప్పారు.

వీరిని ఇపుడే తీసుకొనిపోయి తల్లి పుత్రశోకాన్ని తీరుస్తాం. వీరుకూడా శాపవిముక్తులై నా అనుగ్రహాన్ని పొందుతారు.

పిదప వారికి ఉత్తమలోకాలు సిద్ధిస్తాయి అని కృష్ణుడు చెప్పి, వారిపై కరుణగల్గి, బలి అనుమతి పొంది భూలోకానికి తీసుకొనివచ్చాడు.

ఆ విధంగా బలి అధీనంలోని సుతలలోకంనుండి ఆ ఆరుగురు అన్నలను తీసుకొనివచ్చి కృష్ణుడు దేవకీదేవితో ఇలా అన్నాడు.

ఆ పిల్లలను సంతోషంగా తీసుకొనివచ్చి "వీరే నీ కుమారులు అని తల్లికి చూపించగా ఆమెకుకూడా పిల్లలమీద వాత్సల్యంతో మోహం కలిగిందై

పిల్లలను చూడగానే స్తనాలనుండి క్షీరధారలు స్రవింపగా, ఆనందబాష్పాలతో కౌగిట్లోకి(ఒడిలోకి) తీసుకొని నా కన్నబిడ్డలు వచ్చారంటూ తమకంతో లాలిస్తూ

(తాను కన్నబిడ్డలే అయినప్పటికీ ఒక కన్నతల్లి తనబిడ్డను దేవుడిగా భావించి, గౌరవవాచకంతో సంబోధించి లాలించడం లోకసహజమైందే! ఆ విధంగా దేవకీదేవి తన ఆరుగురు బీడ్డల్ని “నను గన్న అన్నలు” అని వారిపై లాలన, ప్రేమ చూపింది.)

తల్లి దేవకీదేవి చనిపోయిన తన ఆరుగురు పిల్లలు బతికిరాగా సంతోషంగా కౌగిట్లోకి తీసికొని, ఒడిలో కూర్చోబెట్టుకొని, తలలు ఆఘ్రాణించి, చెంపలు, గడ్డం ప్రేమతో పుణికి, వాత్సల్యంతో గగుర్పాటురాగా, పాలివ్వగా, వారు విష్ణమాయకు లోబడి బాలకులవలెనే పాలుతాగి, భగవంతుడైన కృష్ణుని స్పర్శతో పాపాలు పోయి విధిశాపసముద్రాన్ని హరిదయ అనే నావతో దాటి, నిజరూపాలతో, తల్లిదండ్రులకు, కృష్ణునికి నమస్కరించి, ఆకాశమార్గాన స్వర్గోకానికి చేరుకున్నారు. దేవకీదేవి తన మనస్సులో (ఇలా ఆలోచించింది)

ఓ పరీక్షిన్మహారాజా! మరణించిన తన బాలకులను తిరిగి బతికించి తేవడం చాలా చిత్రమని మనసులో దేవకీదేవి ఆశ్చర్యపడి, ఇది అంతా అచ్చంగా విష్ణమాయ అని భావించింది.

ఓ పరీక్షిన్మహారాజా! పరమాత్మా, సమస్తలోకాధిపతి అయిన కృష్ణుడు లీలలుగా సత్కార్యాలు ఎన్నో చేసినాడు అని అనగా శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

సుభద్రా పరిణయము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Naaradaadi Maharshulu Srikrishnu Darsanambu Sesikoni Vasudevuniche Grathuvu Seyinchuta - నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట

బలవంతులైన శత్రువుల్ని అణచివేయడంలో సమర్థులూ, తెల్లని, నల్లని దేహకాంతులు కలవారూ, తమ ముఖకమలాల ప్రకాశంచేత నిండు చంద్రునివర్తులాకార సౌందర్యాన్ని గెలిచినవారూ, పరమపదస్థానాధిపతులైనవారూ, లీలతో మనుష్యులవలె ప్రవర్తించేవారూ, ప్రకాశమానమైన అలంకారాలుకలవారూ, దయాసముద్రులూ, ఓర్పులో నేర్పరులూ, అయిన బలరామకృష్ణులు

ద్వారకలో ఉన్నారని తెలిసి వారిని చూడాలనే నిశ్చలబుద్ధితో తాపస శ్రేష్ఠులైన ద్వితుడు, త్రితకుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్ఠుడు, గాలవుడు, అంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, సుక్తీర్తి మార్కండేయుడు, అగస్త్యుడు, అంగిరులు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు - మొదలైన ఇరువదియొక్క ఋషులందరూ

(పైన పేర్కొనబడిన వివిధ కాలాలలోని తపస్సంపన్నులైన వీరు నిరంతరం హరిపదచింతనతో మోక్షార్థులై ఉన్నారు. తపస్సుతో సాధించవలసిన భగవత్‌ సాక్షాత్కారం చాలా సులభంగా ద్వారకలో లీలామానుషరూపంతో ఉన్న శ్రీకృష్ణుని సంగతివల్ల - కష్టసాధ్యమైన తపంకంటె, సులభసాధ్యమైన కృష్ణదర్శనం శ్రేష్ఠమని పురాణ ఋషులు భావించారు.)

వచ్చిన ఆ మునులకు శ్రీకృష్ణుడు ఆహ్వానంపలికి, ఎదురేగి, మహర్షులకు నమస్కరించి, అతిథులకిచ్చే అర్ఘ్య, పాద్య, తాంబూలాది సకల మర్యాదలూచేసి, ఇలా అన్నాడు.

ఓ సత్పురుషులైన మునులారా! జన్మలు అనుభవించాల్సిన, మోక్షాన్ని వెదుకవలసిన మా వంటి మానవులకు మీ అనుజ్ఞతో దేవతలకు కూడా, దేవతలకు లభించని మీ దర్శనం లభించింది. అదృష్టహీనులం, ఇంద్రియాసక్తులం, జ్ఞానహీనులం అయిన మాకు సంతోషాన్నిచ్చే మీ దర్శనం, తాకడం అదృష్టం, ధ్యానించే అదృష్టం, పాదసేవ చేసేభాగ్యం సహజంగా అందనివి. అయినా, మాకు ఈరోజు ఇవన్నీ అతిసులభంగా లభించాయి. సాధుబుద్ధిగల సత్పురుషులైన మిమ్మందరినీ దర్శింస్తే చాలు, ఇక వేరుగా పుణ్యతీర్థాలు వెదికే పనిలేదుగదా!

(దేవదేవుడైన శ్రీకృష్ణుడే సామాన్యునివలె మాట్లాడుతున్నాడు. మానువ జన్మల సారహీనత, సాధుజనసేవనం, తీర్ధసేవనంవంటి పుణ్యప్రదమైన అంశాల ఔన్నత్యాన్ని చెప్పడం - లోకోద్ధరణకోసమే. సత్పురుష సమాగమం - వుణ్య తీర్ధసేవనంతో సమాన పుణ్యఫలప్రదం. ఇక్కడ శ్యమంతక తీరపంచక సేవనం, నారదవ్యాసాది మహర్షి దర్శనం రెండూ లభించాయి.)

అంతేకాదు, నీటితో నిండిన తీర్ధాలు, మట్టి, శిలలతో నిర్మించిన దేవతావిగ్రహాలూ, తీర్ధదేవతల రూపాలతో సేవించిన వారిని అనుగ్రహించేవే. కాని, వాటిల్ని చాలాకాలం సేవిస్తేనే పవిత్రత సిద్ధిస్తుంది. కానీ, పవిత్రులైన మహాత్ములను కేవలం చూస్తేనే పుణ్యం లభించి జనులు పావనులౌతారు.

మనచుట్టూ ఉన్న పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని సూర్యచంద్ర నక్షత్రాలు, వాయువు, ఆకాశం, వాక్కు మనస్సు అనే వాటిల్ని ఉపాసించినంతమాత్రాన మనలను అవి పవిత్రం చేయలేవు. అన్ని విషయాల్లో జ్ఞానంగల మహాత్ములు తమను సేవించిన క్షణకాలంలోనే మానవుల్ని పవిత్రులుగా చేస్తారు. అదలాఉంచి, ధాతుత్రయంతో నశ్వరమయ్యే శరీరాన్ని ఆత్మగా భావించడం, భార్యాపుత్రులు తనవారేననే అభిమానం కలిగి ఉండడం, సామాన్యజలాల్ని తీర్థా లని భ్రమించడం మూర్ఖుని పని. వాడు జ్ఞానహీనమైన జంతువుమార్గంలో పోవువాడు. పంచభూతోపాసనకంటె మహాత్ముల ఉపాసన చాలా శ్రేష్ఠం.

ఇలా కృష్ణుడు పలికిన - ఆలోచనాత్మకమైన మాటలు విని, మునులంతా ఆశ్చర్యంగా చూచి కొంత సేపు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కక్షణంలో ఆయన అనుమతి పొంది, చిరునవ్వులతో ఇలా అన్నారు. “దేవా! మేమూ, సృష్టి రహస్యం తెలిసిన బ్రహ్మాదులూకూడా నీ మాయచేత మోహితులమై ఉన్నాము. ఎవ్వరికీ అంతుబట్టని నీ సంకల్పంతో మమ్మల్ని దయతలిచావు. నీ లీలలు ఆశ్చర్యకరమైనవి. ఈ భూమి ఒకటే ఐనా వేరువేరు ప్రాంతాల్లో వివిధ రూపాలుగా కనబడినట్టే నీవుకూడా సృష్ట్యాదిలో కారణరూపంతో ఉండి, భిన్నరూపాలుగా కనబడి, ఈ ప్రపంచంయొక్క సృష్టి, స్ధితి, లయాలకు కారణమైన అనేక లీలలుగా అవతారాలెత్తి దుష్టజన శిక్షణం, శిష్టజనరక్షణం చేస్తున్నావు. చాతుర్వర్ణ్యాశ్రమధర్మాలు స్వీకరించి, వేదాలు చెప్పిన మార్గాన్ని అనుమోదించిన బ్రహ్మస్వరూపుడవు. నిరంతర తపస్స్వాధ్యాయ నియమాలతో పవిత్రుడవు. వేద విహిత స్వరూపుడివి. బ్రాహ్మణ జాతిని రక్షించిన బ్రహ్మణ్యమూర్తివి. మహానుభావుడివి. మోహమనే తెరవెనుక ఉండి ఆడిస్తున్న నిన్ను నీ సహచరులైన ఈ రాజలోకాన్ని మేమూ సందర్శించే భాగ్యం పొందాము. మా పుట్టుక, మా చదువు, మా తపస్సు, మా మహిమ, దీంతో సార్థకమయ్యాయి. నీకు నమస్కరిస్తున్నాము” అని మునులు శ్రీకృష్ణుణ్ణి పొగడి నుతించి, తమ నివాసాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు.

ఆ మహర్షులందరికీ వసుదేవుడు నమస్కరించి “మునీశ్వరులారా! మీరు ధర్మం బాగా తెలిసినవారు. క్షమించి నా మనవి వినండి. పూర్వజన్మకర్మల సంచితఫలం ఈ జన్మలో అనుభవించనక్కరలేని సత్కర్మాచరణం ఏదైనా ఉంటే దయతో తెలుపండి.” అనగా ఆ ఋషులంతా వసుదేవునితో రాజులందరూ వినేలా “సమస్తయజ్ఞాలకి అధీశ్వరుడు ఈ శ్రీకృష్ణుడు. ఈతణ్ణి గూర్చి చేసిన యాగాలు మీరు ఆచరిస్తే ఎంతటి దుష్కర్మ అయినా తొలగిపోతుంది. ఇదే ధర్మరహస్యం” అని అన్నారు.

అంతేగాక

వసుదేవ మహారాజా! దేవ, ఋషి పితౄణాలు పుట్టిన ప్రతివానికి ఆవశ్యకమై వస్తాయి. వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. దేవఋణం - యజ్ఞాదులచే, ఋషి ఋణం - వేదాధ్యయనంచేత, పితృఋణం - పుత్రపౌత్రాది వంశ పరంపరాభివృద్ధిచే తీర్చబడుతుంది. వీటిని తీర్చలేని నరుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి వెళతాడు.

(దేవతలు హవిస్సుచేత తృప్తి చెందుతారు. కనుక యజ్ఞాల ఆచరణ అవసరం. ఋషులు వేదాలు చెప్పారు. నీ తీరంలో నీవు అధ్యయనం చేసి అధీతి బోధనలచే వేదం తరతరాలకు అందించాలి. ఇది ఋషి ఋణం తీర్చుకోవడానికి మార్గం. పితృఋణం తీర్చాలంటే సంతానం ద్వారానే సాధ్యం.

గమనం “ఊర్ధ్వ లోకాలవైపే ఉంటే శ్రేష్ఠం. అధోలోకగమనం” హీనం. పుత్రులవల్ల ఊర్ధ్వలోకాలు, పుణ్యచ్యుతితో అధోలోకం రెండూ సూచించబడ్డాయి. త్రివిధ ఋణాలు, వాటిని సాధించే ఉపాయాలు సూచింపబడ్డాయి.)

అలా కావడం వల్ల నీవు (వసుదేవుడు) కూడా

శ్రేష్ఠుడైన కుమారుణ్ణి కని, పితౄణం తీర్చుకొన్నావు. వేదాధ్యయనంతో ఋషిఋణం తీర్చుకొన్నావు. పెద్దల అనుమతంతో యజ్ఞాలు చేసి దేవఋణం తీర్చుకోవడం యుక్తం అని ఋషులు తెలిపారు.

షులు చెప్పిన సూచనను అంగీకరించి, ఎంతో వినయంగా, “సూర్యసమానులైన ఓ మునీశ్వరులారా! మీరు చెప్పినట్లే యాగం నిర్వహించి, దేవణం తీర్చుకుంటాను. కానీ, మీరే నాతో నిర్వహింప చేయించాలి” అని ప్రార్థించాడు.

(వసుదేవుడు అడిగిందే తడవుగా వారిసలహాను పాటించదలచాడు. 'శుభస్య శీఘ్రమ్‌' అని కదా! పైగా మహారాజు శ్రీకృష్ణుని తండ్రి. స్థలం శ్యమంతక పంచక భూమి, అతిపవిత్రం. సమయం సూర్యోపరాగపుణ్యసమయం. బంధువర్గం అందరూ సిద్ధం. సూర్యగ్రహణవేళ సూర్యునివంటి తేజస్వులైన, అతి శ్రేష్ఠులైన మునులంతా ఎదురుగా ఉన్నారు. పెద్దల సూచన శిరోధార్యంగా, ఆముష్మికఫలదాయకంగా ఉంది. ఇంక ఆలస్యం దేనికి? ఈ అవకాశం లోకంలో ఎవ్వరికీ రానిది.)

వసుదేవుడు మునిశ్రేష్ఠులను ప్రార్థించి,ఆ మునీంద్రులనే, యజ్ఞంచేయించే 
త్విక్కులుగా ఎన్నుకొని, ఆ శ్యమంతకపంచక పుణ్యతీర్థాల దగ్గరి భూమిపై, ఇంద్రవైభవంతో, పద్దెనిమిదినుంచిభార్యలతో, దీక్ష స్వీకరించి, ఆ గొప్పయజ్ఞాన్ని వేదవిహితంగా పూర్తిచేసి,  త్విక్కులను గొప్పగా వినిమయ ద్రవ్యదానాలతో తృప్తిపెట్టి, భార్యలతో అవభృథ స్నానాలాచరించి, వజ్రాభరణాలు, విచిత్రవస్త్రాలు, సుగంధలేపనాలు, సుపుష్పమాలలు ధరించి, అక్కడ ఉన్న సమస్త బ్రాహ్మణ, ముని, బంధు, రాజులను యోగ్యంగా సన్మానించి, తృప్తిపెట్టినాడు. యజ్ఞానంతరం అందరూ కృష్ణుని అనుమతితో ఎవరిండ్లకు వారు వెళ్లిపోయారు.

ఓ పరీక్షిన్మహారాజా! 'మాతో ఉండమని' ఉగ్రసేన, శ్రీకృష్ణ, బలరాములు, ప్రేమతో అర్ధించగా యశోదానందులు తమ గోపీగోపాలుర బృందాలతో కొన్నాళ్లు వారితో కలిసి సంబరంగా అక్కడే ఉన్నారు.

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణాదుల ప్రార్థనను మన్నించి, నందుడు వారితో కలిసి మూడునెలలు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుని మర్యాదలతో, తల్లిదండ్రులపట్ల ప్రేమలతో, మధురమైన పలుకులతో, అతని లీలలుగా చెప్పుకునే జీవిత విశేషాలతో ఆనందంగా ఆస్వాదిస్తూ, కుటుంబ, బంధుమిత్రాదులమధ్య సాటిలేని విధంగా గడిపారు.

బలరామ కృష్ణాదులు, తక్కిన యాదవులు, సకలవిధాలుగా గౌరవించి, ఆభరణ వస్త్రాదులు బహూకరించి వీడ్కొల్పగా, నందయశోదాది వ్రేపల్లె వాసులు కృష్ణపాదకమలాల మకరందం కోలే తమ మనస్సులనే తుమ్మెదల్ని బలవంతంగా మళ్లించుకొంటూ, విడువలేక, విడువలేక, చివరకు

వెళ్లలేక వెళ్లలేక వెడుతూ, మాటిమాటికి వెనుకకు తిరిగిచూస్తూ, కృష్ణనామస్మరణచేస్తూ ప్రేమతో, ఆప్యాయతతో, భక్తిసూచకంగా పిలుస్తూ, స్మరిస్తూ మథురా రాజ్యంవైపు నందాదులు సాగిపోయారు. అప్పుడు

ఆ సమయంలో వర్షాకాలం ఆసన్నమైనందున బలరామకృష్ణులు ఆ శ్యమంతక పంచకభూమిని వదలి, యాదవ, బంధువర్గాలు కొలుస్తూండగా, దేవతానమస్కారాలందుకొంటూ ద్వారకకు (పయనమయ్యారు)

బలకృష్ణులు ద్వారకచేరి సుఖంగా ఉన్నారు. అపుడు

శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Lakshana Yanu Sri Krishnuni Yustamabharya Draupadi Deviki Dana Vivaha Vruttantambu Deluputa - లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట

ముచ్చటలో భాగంగా శ్రీకృష్ణునిగాథలు చెప్పుకుంటుండగా ద్రాపదీదేవి, రుక్మిణి మొదలగు కృష్ణుని దేవేరుల్ని, మీ మీ వివాహవృత్తాంతాల్ని చెప్పండనగా వారు శ్రీకృష్ణుణ్ణి పరిణయమాడిన విధం వివరించారు. ఓ పరీక్షిన్మహారాజా! అది నేను నీకు గతంలో చెప్పాను. ఒక్క లక్షణాదేవి కథమాత్రం ఆమె ద్రౌపదికి చెప్పిన వృత్తాంతము ఇపుడు సవిస్తరంగా చెప్తానని శుకుడన్నాడు.

ద్రౌపదితో లక్షణ తననుగూర్చి ఇలా చెప్పింది. సంగీత విశారదుడైన నారదుడు వీణావాదన తోడుచేసుకొని శ్రీకృష్ణుని కథల్ని పాటలుగా పాడి వినిపించగా, నేను వాటికి ఆకర్షితురాలనై, శ్రీకృష్ణుణ్ణే మనస్సునందు నిల్పి తన్మయురాలనై ఉండగా, ఆ విషయం తెలిసిన మా తండ్రి నామీద ప్రేమతో, శ్రీకృష్ణునకే ఇచ్చి నన్ను పెళ్లి చేయడానికి ఇతరరాజులకు కోపం రాకుండా ఒక ఉపాయం పన్నాడు. ఆకాశంలో ఉంచినా, ఎవరికీ కనబడకుండ, కింద నీటిలో మాత్రం ప్రతిబింబం కనబడేట్లు మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేశాడు. ఎంతటి గొప్పవాళ్లకైనా కదిలించడానికీ, అల్లెత్రాడు ఎక్కిరావడానికీ వీలుకాని

(లక్షణకు శ్రీకృష్ణునిపై మక్కువ కల్గడానికి నారదుడు కారణం. ఆమె ప్రేమ తండ్రికి తెలిసింది. తండ్రికి పుత్రికపై అమితానురాగం. ఆయనకు అందుకే “దుహితృవత్సలు” డని విశేషణం వాడబడింది. కృష్ణుడుమాత్రం ఛేదించగల్గేటట్లు, ఇతరులెవ్వరికీ సాధ్యంకాని ఒక ప్రత్యేమైన మత్స్యయంత్రాన్ని స్వయంవరానికై ఏర్పాటుచేశాడు. అర్జునుని మత్స్యయంత్రభేదనంలో చేప కనబడుతుంది. ఇక్కడ పైన చేప కనబడదు. అదీ విశేషం. శ్రీకృష్ణుడు విలువిద్యలో అర్జునునికన్నా మేటి అని తెలుస్తూంది.)

ధనుస్సునూ, వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని మత్స్యయంత్రంవద్ద గంధాక్షతలు, పుష్పాలతో పూజించి, “ఏ పురుషుడైనా ఈ ధనుస్సు ఎక్కుపెట్టి, ఈ బాణాన్ని విల్లుకు ఎక్కుపెట్టి, మ
త్స్యయంత్రాన్ని నేలగూల్చిన ధనుర్విద్యా నైపుణ్యంగల శూరుణ్ణి నా కూతురు వరిస్తుందని అందరూ వింటుండగా (ప్రకటించాడు)

మాతండ్రి చాటింపు వేయిస్తే విని దానికనుగుణంగా, నన్ను వివాహమాడాలనే వేగిరపాటుతో గొప్పగొప్ప ధనుర్ధరులైన రాజులు వివాహసంబరాన్ని చూచే ఉబలాటంగలవారు అయిన అందమైన రాజకుమారులు క్రీర్తిమంతులు అమిత సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు.

స్వయంవరానికి వచ్చిన రాజుల్ని అర్ఘ్య, పాద్య, మజ్జన, భోజనవసతి తాంబూలాది అతిథిమర్యాదలతో సంతోషంగా ఆహ్వానించినాడు. మహాబలులైన వారు స్వయంవరమంటపంలో మత్స్యయంత్రభేదనానికి సన్నద్ధులై ధైర్యంగా ధనుస్సు దగ్గరగా పోయి

ఇలా సమీపించి ఆ ధనుస్సును చూచి

సభాప్రాంగణంలో కొందరు ధనుస్సు వద్దకే వెళ్లక, వెళ్లినా కొందరు కదల్చలేక, కొందరు కొంచెమెత్తి విఫరురై, కొందరునేలపై ఉంచి, అల్లెత్రాడు బిగించి, మరికొందరు బాణం బిగించలేక సిగ్గుపడి, “ఛీ! ఇక్కడికి రావడమే పెద్ద తప్పు” అనుకొంటూ

భీముడూ, కర్ణుడూ ఆర్భాటంగా ముందుకు వచ్చి, విల్లు ఎక్కుపెట్టి బాణంవేసి, ఆ మత్స్యం అలుపెరుగని రీతిగా వేగంగా పైన తిరుగుతుంటే - దాన్ని కనుక్కోలేక విఫలురై వెనుతిరిగిన తరువాత

ఇంద్ర తనయుడైన అర్జునుడు మత్స్యయంత్రాన్నికొట్టే ఉపాయం తెలిసినవాడైనా, బాణంవేసి, చేపను పడగొట్టలేక విముఖుడై, వికలమనస్కుడై తిరిగిపోయాడు.

వచ్చిన రాజకుమారులంతా మత్స్యయంత్రాన్ని ఛేదించే యత్నాలుచేసి అవి వమ్ముకాగా, చిన్నబోయి, దిగులుతో కూడిన ముఖాలతో చూస్తుండగా

శ్రీకృష్ణుడు వింటికి అల్లెత్రాడుకట్టి, మెరిసే బాణాన్ని సంధించి, తన విలువిద్యా నైపుణ్యం ప్రకాశించగా ఆకాశంలో తిరుగాడే యంత్ర మీనాన్ని కూలవేశాడు. సురసిద్ధాదిదేవజాతులు జయజయ ధ్వానాలు చేశారు. ఆకాశంనుండి పూలవాన కురిసింది.

ఆ సమయంలో అంతులేని ఆనందం కల్గింది. ముఖం వికసించింది. సంభ్రమంవల్ల కల్గిన చెమట బిందువులు ఫాలభాగాన కారి కస్తూరితిలకాన్ని చిత్తడిచేయగా, ఆ రేఖల్లో చిక్కుకున్న తుమ్మెదల గుంపుల్లాంటి నల్లనికురుల్ని చిగురుటాకు చేతులతో పక్కకు జరుపుతూ, తళుకులీనే మోముపై మెరుపులు వ్యాపించగా, అందమైన నడుము వణకుతుండగా మెల్లని నడకలతో

(కృష్ణుడు కాక ఇతరులు మత్స్యయంత్రంకొడితే, వారినే పెళ్లాడవలసిన లక్షణకు తా నిష్టపడిన కృష్ణుడే మత్స్యయంత్రాన్ని భేదించడం వల్ల ఆమెకు అంతరంగం ఆనందంతో నిండింది. దానివల్ల ఉద్విగ్నత, స్వేదం, వణుకు ఏర్పడగా, నడుము వణుకుతుండగా, మెల్లగా నడుస్తూ)

కాలి అందెలు ఘల్లుమని మోగగా, చిరునవ్వులు పెదవులపై ప్రకాశింపగా, బంగారు కుండలాలకాంతి చెక్కిళ్ల పై పడగా, చేతికడియాలు మనోహరంగా ధ్వనిస్తూండగా సభామంటపంలోకి వచ్చి నాల్గుదిక్కుల్నీ మొగమెత్తి చూస్తూ

(సహజంగా స్వయంవరంలో కవియే స్వయంవర వధువును వర్ణిస్తాడు. కాని, ఇక్కడ వధువే తన ఆత్మకథ (స్వీయానుభవం) చెప్పడం కథనంలో విశేషం.)

సభాభవనం మధ్యలో రాజులందర్ని జూచి, వారిని తిరస్కరించి, నా చేతుల్లోగల దివ్యమణులు పొదిగిన కాంచన హారాన్ని శౌరిమెడలో వేశాను. అలాగే, ఇప్పపూలమాలనుకూడా విలాసంగా ఈ కృష్ణుని కొప్పుపై ఉంచాను. అపుడు నా కన్నుల్లో సిగ్గు దోబూచులాడింది.

వరమాలవేసిన ఆ మధురక్షణంలో శుభసూచకంగా, ఆనంద చిహ్నంగా ఢమరుక, ఢంకాలు, శంఖాలు, మృదంగాలు, మధుర మురళీ దుందుభులు, ఢక్కామర్దళాలు మొదలైన వివిధరకాల వాద్యధ్వనులు చెలరేగి భూమ్యాకాశాల్లో నిండాయి. నాట్యకత్తెల నాట్యాలు మనోహరంగా ప్రదర్శింపబడినాయి.

ఆ క్షణంలో దేవతల సైన్యాన్ని పారదోలి గరుత్మంతుడు అమృతభాండాన్ని ఎలా హరించాడో అలాగ, అపారమైన శత్రురాజసమూహాన్ని తిరస్కరించి, శ్రీకృష్ణుడు నన్ను అక్కున చేర్చుకొని సింహగమనంతో అందమైన బంగారు రథంమీదకు చేర్చాడు.

లక్షణతో కూడి, శ్రీకృష్ణుడు రథమెక్కి సారథి అయిన దారుకుడు శత్రుసంహారశౌర్యంతో ప్రకాశించడానికి యోగ్యమైన మేలైన నాలుగు గుర్రాలు పూన్చిన రథం తోలుతూండగా, శత్రువులనే దట్టమైన చీకట్ల సమూహాలకు తీక్ష్ణమైన సూర్యకాంతివంటి ధనుస్సును తాల్చి, దాని అల్లెతాటి ధ్వనులతో దిగంతరాలు నింపుతూ, రథంపై ప్రయాణిస్తూ ఉండగా

స్వయంవరానికి వచ్చిన రాజులంతా శ్రీకృష్ణుని వైభవానికి కన్నుకుట్టి, ఓర్వలేక, స్వయంవర నియమాలు ఉల్లంఘించి, ఆయన మహిమల్ని తెలుసుకోలేక గర్వాంధకారంతో గుంపులుకట్టి యుద్ధసన్నద్ధులుకాగా

మన్మథుని పూలబాణాల తాకిడికి ఓర్వలేక కామాతురులై, రాజులంతా, ధైర్య, శౌర్య, శక్తి సామర్ధ్యల్ని ప్రకటిస్తూ, ఎల్లప్పుడూ దేవతల నమస్కారాలందుకొనే మహిమాన్వితుడైన కృష్ణునితో గర్వించి యుద్ధం ప్రారంభించారు.

సింహంవంటి పరాక్రమంతో చెలరేగుతూ తన శార్ఙ్గం నుండి బంగారు రెక్కలవాడి బాణాలను శత్రువులపై వేశాడు. తన భుజబల ప్రదర్శనతో ప్రకాశిస్తూ, వారితో యుద్ధంచేసి సైన్యాన్ని చెదరగొట్టే భీకర ధ్వనిగల తన పాంచజన్యాన్ని విజయ సూచకంగా ఊదాడు.

ఆ సమయంలో పరాక్రమవంతులైన శత్రురాజులు మృగాలన్నీ ఒక్కసారి సింహంమీద దూకినట్లు, తత్తరపాటుతో తమ చతురంగ బలాలతో కళంకరహితుడైన శ్రీకృష్ణుని చుట్టుముట్టగా

చుట్టుముట్టిన రాజులపై మిక్కిలి కోపించినవాడై తన బాణాలతో కుండలాలు ధరించిన వారితలల్ని అందెలు ధరించిన పాదాల్ని కడియాలు ఉంగరాలు ధరించిన చేతుల్ని నేలపై పడేలా తెగవేశాడు.

యుద్ధంలో చావగా మిగిలిన రాజుల్ని తీక్ష్ణమైన వాయవ్యాస్త్రం ప్రయోగించి, ఎండుటాకుల్లా ఎగురగొట్టి, పారదోలి, విజయుడై ద్వారకా నగరానికి (నన్ను తీసికొని) చేరుకున్నాడు.

మంగళకరంగా అలంకరించబడి, మనోహరమైన వైభవంతో అందంగా ఉన్న ద్వారకానగరానికి మేము రాగా, మా వెనుకనే ఎంతో సంతోషంతో నా తండ్రికూడా వచ్చి పెళ్లి కూతురితోబాటు అల్లునికి బహుమానంగా ఇచ్చేసారెగా రత్నభూషణాలైన గండపెండేరములు, హార, కుండల, కిరీట, కంకణ, అంగులీయకాలు, శ్రేష్ఠమైన పీతాంబరాదివస్త్రాలు, హంసతూలికా తల్పాలు, రథగజ తురగాది వాహనాలు, వివిధరకాల ఆయుధాలు, దాసదాసీ జనాలు మొదలైన వాటిని లెక్కపెట్టలేనంత సంఖ్యలో ప్రేమగా సమర్పించాడు.

ఈయన వైభవమంతా శ్రీకృష్ణానుగ్రహమే అయినా రాజోచిత, వివాహోచిత ధర్మంగా తన కన్యను, సంపదల్ని తిరిగి సమర్పించాడు - అని బ్రాహ్మణులు పలికి, ఆశీర్వదించి పొగడగా, బృహత్సేనుడు, కన్యాకనకసంపన్నాది ఉపాయనాలు అల్లుడైన శ్రీకృష్ణునికి సమర్పించి, వరుసక్రమంలో పెద్దవారైన దేవకీవసుదేవాదులు మొదలుకొని, యదుపుంగవుల్ని పూజించి, మరలి, తన రాజధానికి పోయాడు.” అని లక్షణ తనవివాహవృత్తాంతాన్ని చెప్పగా, అక్కడ ఉన్న కుంతి గాంధారి ద్రౌపది, ఇతరరాజపత్నులు, గోపికలు తమ హృదయాల్లో భగవంతుడైన విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి ఆనంద పరవశులై


నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Krishnudu Sakutumbamuga Grahana Snaanamunaku Bovuta - శ్రీ కృష్ణుడు సకుటుంబముగా గ్రహణ స్నానమునకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీ కృష్ణుడు సకుటుంబముగా గ్రహణ స్నానమునకు బోవుట

అవతారిక: దీనికి ముందు జరిగిన కథలో తన బాల్యసఖుడైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు చిన్ననాటి చెలిమితో ఆదరించి చక్కగా ఉజ్జీవింపజేసిన కథ వినిపించినాడు. విన్నశ్రోత పరీక్షిత్తు. వక్త శుకమహర్షి అందుకే, భాగవతగాథ అంతా “వేదకల్పవృక్షవిగళితమై శుకముఖసుధాద్రవం”లో తడిసిందని చెప్పబడింది. భక్తిరసార్ద్రత భాగవతజీవధాతువు.

పాపులను శిక్షించి, వారి దుష్టకార్యాలను ముందు తరాలలో ఎవ్వరూ చేయకుండా కట్టడిచేసి, వారిచే బాధితులైన మంచివారికి రక్షణనిచ్చే మహాకార్యాలు చేసే లక్ష్యంతో శ్రీకృష్ణభగవానుడుగా అవతారమెత్తిన విష్ణుకథను విపులంగా చెప్పవయ్యా! అని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగినాడు.

శుకమహర్షి పరీక్షిత్తు అడిగినదానికి జవాబుగా ఇలా అన్నాడు.

కుచేలు
ణ్ణి సత్కరించిన ఘట్టం తరువాత - కొంతకాలం గడిచింది. బలరామకృష్ణులు సుఖంగా కాలం గడుపుతున్నారు. జగత్ప్రళయకాలంలో వలె కన్నులు భరించలేనంత దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యబింబానికి గ్రహణంపడుతోందని తెలిసి, ప్రజలు పూర్వం జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు మహాక్రోధంతో తన తండ్రిమృతికి కారణమైన రాజలోకాన్ని తన పదునైనగండ్రగొడ్డలి అంచుతో ఇరవై ఒక్కసార్లు తలలు నరికి, వారిరక్తధారల ప్రవాహాలతో (నిండిన ఐదు మడుగుల శ్యమంతకమనే పవిత్ర సరోవరాలున్న చోటికి కదలివెళ్లారు. )

(సూర్యగ్రహణాన్ని సూర్యోపరాగమనీ, చంద్రగ్రహణాన్ని చంద్రోపరాగమనీ అంటారు. ఉపరాగమంటే గ్రహణం.)

పరశురాముడు ఇరువదొక్కమార్లు చంపిన రాజుల రక్తధారలతో శ్యమంతక పంచకమనే పేర ఐదుచెరువులను సృష్టించినాడు. అక్కడికి ద్వారకా ప్రజలు, ఆపై బలరామకృష్ణులుకూడా స్నాన, దానాదికాలకోసం సూర్యగ్రహణ సమయానికి అక్కడికి బయల్దేరినారు.

కర్మలను ఆచరించవలసిన అవసరంలేనప్పటికీ, లోకాచారాన్ని అనుసరించి, గ్రహణవేళస్నానాదిధర్మకర్మలను ఆచరించదలచి, ద్వారకా నగర రక్షణకు ప్రద్యుమ్నాదియువకులైన యోధులను నియమించి, వృద్ధులైన వసుదేవాదులతో, మిగిలిన పరివారంతో, స్త్రీజనంతో గంధమాల్యాభరణాదులు ధరించి, అందమైన అలంకరణలతో, పుష్పకాలవంటి రాతల్ని, మేఘాలవంటి ఏనుగుల్ని శ్రేష్ఠమైన గుఱ్ఱాల్ని ఎక్కి సేవకజనం వెంటరాగా, సూర్యగ్రహణవేళ పవిత్రమైన సరోవరాల్లో స్నానంచేసి, ఉపవాస దీక్షతో ఉండినారు. ఆ తరువాత

(1. పుణ్యకార్యాచరణం సంస్కారబలాన్ని పెంచి, మనస్సును పాప సంకల్పాలనుంచి దూరం చేస్తుంది. అవతారపురుషులైన బలరామ, శ్రీకృష్ణులకు సామాన్య మానవులకువలె పుణ్యకర్మలు ఆచరించవలసిన పనిలేదు కనుక వారు నిష్కర్ములని సూచించబడింది. కాని, వారు ఇపుడు సాధారణప్రభువులవలెనే ఉన్నారు కనుక లోకాచారాలైన ధర్మాచరణం చేయవలసి ఉంది. “యథా రాజా తథా ప్రజాః" అన్నట్లుగా రాజులు ప్రజలందరికీ ఆదర్శప్రాయులు. కనుక, సామాన్య ప్రజలకు
ఈ పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కలిగించడానికి, ప్రేరణగా బలరామకృష్ణులు ఆచరించారని భావించవచ్చు. అందుకే, సూర్యగ్రహణపవిత్రసమయంలో స్నానదానాదిధర్మకర్మాచరణానికై పవిత్ర తీర్ధస్నానాలకు వెళ్లడం.

2.  ఒక జాతిలోని సంఘటిత శక్తిని ప్రచోదనం చేయడానికి ఇలాంటి సత్కార్యాచరణాలు, సదాచారాలు దోహదం చేస్తాయి. ఈ సామాజిక ప్రయోజనాన్ని కూడా రాజులు భావించి ప్రోత్సహించారు.

3. ప్రవాహవేగం గల నది / తరంగాలలో స్నానంచేయడం ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది.

4. ప్రభువులు రాజధాని విడిచివెళ్లుతున్నారు కాబట్టి, ద్వారకారక్షణానికై యోధులను, యువకులను నియోగించినారు. వృద్దులకు ధర్మాచరణం ఆవశ్యకం కనుక వసుదేవుడు, ఉగ్రసేనుడు మొ॥ వారు వెంబడి వచ్చినారు. ధర్మకార్యాచరణానికి పత్నీసమేతంగా వెళ్లాలి కనుక, స్త్రీ జనాన్ని తీసుకొనిపోయారు.

సాటిలేని దుస్తులు, ఆభరణాలు, గోవులు, బంగారు, రత్నాలు, భూమి మున్నగు విలువైన వస్తువులను యోగ్యులైన బ్రాహ్మణులకు దానముచేసి, వారిచే సంతోషపెట్టబడినవాళ్లై

(దానంవల్ల అహంకార, మమకారాలు లేని మానసిక స్థితి ఏర్పడుతుందని, ప్రజల్లో త్యాగగుణం పెంపొందుతుందని పెద్దలు చెప్పారు.)

గ్రహణం విడిచాక మోక్షణస్నానాలు ఉత్సాహంగా చేసి, అంతవరకు ఉపవసించినారుకనుక భోజనాదులు, బంధువులందరితో ఆత్మీయతలు వికసించేలా పరస్పరప్రేమలతో గావించి, ఆ ప్రదేశంలో చక్కగా

(సూర్యచంద్ర గ్రహణాలకు కొన్నిగంటలముందే ఉపవాసదీక్ష గ్రహణవేళ స్నానం మోక్షణవేళవరకు దాన, జప, తపాదులతో గడిపి, మోక్షణ స్నానానంతరం వంటలు ప్రారంభం - ఇది శాస్త్రసమ్మతవిధి. ఈ విధిని రామకృష్ణులు ఆచరించారు.)

నదీ తీరంలో బంధుమిత్రులతో సూర్యగ్రహణ మోక్షణ స్నానానంతరం వంటలు వండుకొని సామూహికంగా భోజనాదులు చేయడంలో అనురాగం వెల్లి విరిసిందని పోతన వివరించాడు. ప్రజలలో సామరస్యం, సంఘటితభావం పెంపొందటానికి ఇలాంటి విధానాలు సహకరిస్తాయి.

పొన్నచెట్లు బాగా కొమ్మలు, రెమ్మలతో విస్తరించుటచేత సూర్యకిరణాలు చొరలేనంత దట్టమైన ఆ అటవీ భూములలో విశ్రమించిన శ్రీకృష్ణుడు, అతని పరివారం

చిగురాకుల ఆసనాలపై సద్గోష్ఠులతో మనసులు ఆనందం పొందుతుండగ, ఆ శమంతక సరోవరాలలో మరికొన్నిసార్లు స్నానంచేయడానికి ఆసక్తికలవారై

(రాజులైనా, ప్రస్తుతం ప్రకృతి ఒడిలో ఉన్నారు కనుక చిగురుటాకులసెజ్జలే! సత్పురుషులు చుట్టూ ఉన్నారు గనుక సద్గోష్ఠులే! రాచకార్వాలు, మంత్రాంగాలకు దూరమైనచోటు. స్థలం, సమయం ఆధ్యాత్మిక వాతావరణం కనుక మనసు గోష్టిలో ఉల్లాసం పొందుతున్నది. జలాశయ పంచకం అతిశ్రేష్ఠమైందికనుక కేవల గ్రహణ స్నానంచేసి, తిరుగు ప్రయాణానికి బదులు 'తీర్ధసేవారతి' అనగా మరింత సేవించే అభిలాష. పుణ్యనదీజలాలకు తీర్చాలని, పుణ్యప్రదేశాలకు క్షేత్రాలని స్థూలవ్యవహారం. జలస్థలాలన్న అర్థాలుగల ఈ పదాలకు అర్థవిశేషత స్థిరమైనది. గోవులుండే ప్రదేశం గోష్ఠం. పవిత్రమైనచోటు. సత్పురుషులుండునది అలాంటిదే. వారుచేసే చర్యలవల్ల ఆ స్థలం(గోష్ఠము) 'గోష్ఠి' అన్న అర్థం పొందింది. గొడవలుపడే చోటులు గోష్ఠులు కాజాలవు.)

ద్వారకనుండి శ్రీకృష్ణాదులు వచ్చినట్టే, వివిధ దేశాలనుండి రాజులు వచ్చినారు. ధర్మరాజు, ఆయనతో తక్కిన పాండవులు, ఆయనను అనుసరించి వచ్చిన భీష్మ ద్రోణ, ధృతరాష్ట్రులు, గాంధారి, కుంతి, కురు-దేశాల రాజులూ, వారి వారి భార్యలు సంజయుడు మొదలైన ధృతరాష్ట్రానుచరులు, బంధువులైన కుంతిభోజ, విరాట, భీష్మకాదిరాజులు వచ్చారు. యాదవ వంశంలోని వృద్ధులైన ఉగ్రసేనాదులను పూజించి గౌరవించారు. ఉభయులు సంతుష్టులైనారు. అప్పుడు

(వచ్చినవారంతా వృద్ధులు, స్త్రీలు, ఏకాగ్రమైన పట్టుదలతో పుణ్యకార్యాలు చేసేవాళ్లు, శారీరక శ్రమకోర్చి సుదూర శ్యమంతక తీర్థానికి వచ్చారు. ఉత్తములు కనుక వృద్దులకు పూజలు చేశారు. ఇందరు రాజులు వచ్చినా, దుర్యోధనాదులు, వారిని అనుసరించి వచ్చినవారు లేరు. వారికి పుణ్యమైన పనులను కలిసివచ్చెట్లు చేయడంగాని, ధర్మంపట్ల ఆసక్తిగాని లేదు. అందుకే వారి ప్రస్తావన లేదు. పై వచనంలో స్త్రీజనాన్ని మాటిమాటికి చెప్పటంచేత పుణ్యకార్యాలందు వారికి అభిరుచి అతిశయమని, ఇది నాటికి నేటికి ఒకే తీరుగా ఉన్నదని గమనించాలి. పురుషులకన్న స్త్రీలకు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి తొలినాళ్లనుండి అధికమే! సహజమే!)

వచ్చిన రాజులంతా భార్యాసమేతులై ధైర్యవంతుడు, దానవసంహారి, గోపీజనవల్లభుడు, పరివారసహితుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసికొన్నారు.

(పూర్ణపురుషుడు, అవతారమూర్తి, రాక్షససంహారకుడైన శ్రీకృష్ణభగవానునిదర్శనం భార్యాసమేతులై వచ్చి దర్శించుకొన్న రాజులకు సూర్యగ్రహణ పవిత్ర సమయాన మరింత పుణ్యప్రదం. కానీ కేవలం ద్వారకకురాజుగా ఇతర రాజులు సందర్శించినట్టుగాక, భార్యాసమేతులై ఒక పుణ్యకార్యంగా దర్శించుకొన్నారని సూచన.)

ఆ శ్రేష్ఠులైన రాజులు బలరామకృష్ణులచే ఉచితమైన గౌరవాలు పొంది, శ్రీకృష్ణుని సన్నిధివల్ల తృప్తులై, వారి దయచేత సంపదలు, వైభవాలు పొందిన ఉగ్రసేనాదులతో కృష్ణుడు వింటుండగా ఇలా అన్నారు.

మన శాస్త్రాలు నిరూపించిన ఆచరణ విధులు, ఏ లక్ష్మీవల్లభుని పాదప్రక్షాళిత జలం మనవల్ల త్రికరణాలు పావనమవుతాయో, ఏ మహాత్ముని పాదాలు సోకిన మాత్రాన ఆ ప్రాంతం ముక్తిప్రదం అవుతుందో ఆ పుణ్యపురుషుడు ఈ కృష్ణుడే సుమా!

(1. సమకాలీనులైన రాజన్యులంతా శ్రీకృష్ణుని పరమాత్మగా భావించినారు. భగవంతుడు గోకులంలో పుట్టి, పెరిగి, తమలో ఒకడుగా జీవించడంవలన ఆత్మీయుడుగా భావిస్తున్న వారికి, ఈ మాటలు కృష్ణుణ్ణి మహిమాన్వితునిగా వివరిస్తున్నాయి. తమవాడని భావించడంవల్ల శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయిన వీరికి ఉద్ధవాదుల బోధలు అవసరమయ్యాయి.)

సనకసనందనాది గొప్ప మునులే యోగదృష్టితో భగవంతుణ్ణి దర్శించలేక సకలఆత్మలందు వెతికి, దొరకక ప్రయత్నిస్తున్నారు కదా! ఈ గోపకులు ఏమి తపస్సు చేశారో కాని, యోగమక్కరలేక, భౌతిక శరీరాలతో, చర్మ చక్షువులతో హరిని నిరంతరం చూడగలిగే భాగ్యవంతులయ్యారే! వీరి తపస్సు ఎంత గొప్పదో కదా!

ఉగ్రసేనుడు మొదలుగాగల శ్రీకృష్ణుని బంధుకోటిలోని యదుపుంగవులకు, తాము చేసే పనులతో అనగా పాప, పుణ్యకర్మలతో సంబంధంలేకుండా, వాటిని వదిలివేసి, మోక్షస్వరూపుడైన ఆ భగవంతుడే తమ పక్కన ఉండుటచే ఆతనితో సాధారణ మానవునివలె, చూడడం, మాట్లాడించడం, శరీరాన్ని తాకడం, పాటలు పాడడం, కలిసి తిరగడం, ఆయనతోబాటే ఆసనాలు, పరుపులు, శయ్యలవంటివానిపై కూర్చోవడం, పడుకోవడం, ఆయనతో బంధుత్వస్నేహాలను పాటిస్తున్న ఈ అదృష్టం ఎలా దక్కిందో!

రాజులంతా, కృష్ణుని దయవల్ల తీరిన సకలమైన కోర్కెలుగల్గి హాయిగా జీవిస్తున్న వైనాన్ని పలుమార్లు ప్రశంసించి, చివరకు వీడ్కోలు తీసికొన్నారు

కృష్ణుడు అవతారపురుషుడని పొగడి రాజులు వెళ్లిన పిదప, కుంతీదేవి, దుర్యోధనాదులవల్ల తన కుమారులైన పాండవులకు కల్గుచున్న ఇక్కట్లను మనసులో స్మరించి, బాధపడుతూ, పుణ్యాత్ముడు, కల్మషాలులేని తన అన్న వసుదేవునితో ఇలా అన్నది.

నీకు అల్లుళ్ళైన పాండురాజకుమారులు ధర్మజాదులు క్రూరమృగాల మధ్య అరణ్యాలలో కష్టాలు పడుతుంటే మీరు దయార్ద హృదయంతో వారి బాధలను పట్టించుకోరా?

పైవిధంగా చెప్పి, అనేకవిధాలుగా బాధపడుతూ, కుంతి అన్నగారైన వసుదేవునితో ఇలా అంది.

విధియే బలవత్తరమై వ్యతిరేకంగా ఉంటే బంధువులుఉండి మాత్రం ఏమి చెయ్యగలరని కన్నీరు ఒలుకగా దుఃఖించే చెల్లెలు కుంతిని చూచి వసుదేవుడు ఇలా అన్నాడు.

అమ్మా! ఎందుకు తపించిపోతావు? ఆలోచించకుండా విధినెందుకు నిందిస్తావు? అన్నిటికి కర్త ఈశ్వరుడు. మాయ అనేది ఒక తెర. దానికి వెనుక ఉండి, బొమ్మలనాడించే సూత్రధారి ఈశ్వరుడు. అతనిచేతిలో ఉండి నటించే కీలు బొమ్మలవంటివారు మానవులు. దేవతలైనా, విధిని తప్పి ప్రవర్తించలేరు. మేము అలా దుర్మార్గుడైన కంసుని చేతిలో చాలా బాధలుపడి, తాళలేక అడవులు పట్టినాము. దయానిధియైన ఈ కృష్ణుని అనుగ్రహంవల్ల మా కష్టాలు తొలగి తిరిగి స్థిరనివాసులమైనాము.

ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు శ్యమంతక ప్రదేశానికి రాగా, వ్రేపల్లెలో ఉన్న శ్రీకృష్ణుని బాల్య బంధుగణం, తల్లిదండ్రులైన నందుడు, యశోదలతోపాటు గోపగోపికాగణం కృష్ణుణ్ణి చూచే సంబరంతో కలిసివచ్చారు.

ఈ విధంగా కృష్ణునివద్దకు వచ్చి

చాలాకాలం తరువాత వచ్చిన నందుణ్ణి చూచి వృష్టి యాదవ, భోజవంశీకుల గుంపులు ఎదురేగి ఒకరి తరువాత ఒకరు ఆలింగనాలు చేసుకొన్నారు.

యశోదానందులకు వసుదేవుడు సంతోషంగా ఆతిథ్యమిచ్చాడు. తల్లిదండ్రులకు బలరాముడు, కృష్ణుడు వినయంగా నమస్కరించారు.

ఆ విధంగా బలరామకృష్ణులు నమస్కారాలుచేసి కౌగిలించుకొని తామరలవంటి కన్నులలో సంతోషంతో ఉబికిన కన్నీళ్లు కారగా, సంపూర్ణమైన మమకారాలు మనసులలో వ్యాపించగా ఏమీ మాట్లాడలేక ఉండిపోయారు. అప్పుడా యశోదమ్మ బలరామకృష్ణులను తన ఒడిలో ఉంచుకొని, తన వక్షస్థ్సలానికి దగ్గరగా లాగుకొని చెంపలకు ముద్దుపెట్టి, తన ముఖాన్ని వారిశిరస్సులకు ఆనించి చిబుకాన్ని నిమురుచు మరల మరల కౌగిట్లోకి తీసుకుంటూ ఎంతో సంతోషాన్ని పొందుతుండగా, ఆ తర్వాత

రోహిణీ, దేవకీ సతులిద్దరు యశోదాదేవిని నిండైన మనసుతో కౌగిలించుకొని, బలరామకృష్ణులను పెంచడంలో ఆమె పాటించిన అన్ని విధాల సత్కార్యాలను తలచుకొంటూ అమ్మా! యశోదా! మీ దంపతులిద్దరు బంధుప్రీతితో మాకు చేసిన మేలు (కార్యాలు) మరచిపోగలమే! అని అన్నారు.

పుట్టినప్పటినుండి మీరే ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసినందువల్ల రామకృష్ణులిద్దరూ ఈనాటికీ నీ బిడ్డలమనే భావిస్తున్నారు. మమ్మల్ని తల్లిదండ్రులుగా అనుకోవటం లేదు.

(కన్న ప్రేమ కన్న పెంచిన ప్రేమ విశేషమైనదని ఈ సన్నివేశం వల్ల తెలుస్తోంది.)

మీరు వీరిని ఎంతోప్రేమగా కంటికి రెప్పల్లా కాపాడుతూ పెంచి పెద్దచేశారు. మాకంటే మీరే ఎక్కువగా ప్రేమించారు. కనుక వారు మీ ఇండ్లల్లోనే  ఇంతకాలం ఉన్నారు.

రోహిణి, దేవకీదేవులు మాట్లాడుతుండగా గోపికాస్త్రీలు, తమ హృదయేశ్వరుడైన శ్రీకృష్ణుడు చాలాకాలం తరువాత రావడంచేత, ఆయనను చూడటానికి కోర్కెలు హృదయాలలో పొంగుతుండగా వచ్చారు.

సుందర రూపుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి చూడగానే ఆ గోపికలు కన్నులు రెప్పలు వాల్చక చూచినారు. మనసులలోనే ఆయన దేహసౌందర్యానికి మోహించి కౌగిళ్లు ఇచ్చినారు. బ్రహ్మమును ఆరాధించే యోగులు ధ్యానంలో పరవశించినట్టు, శరీరాలలో పులకలు కలుగగా గోపికలు భౌతిక ప్రపంచాన్ని మరచారు.

(గోపీకృష్ణుల పరస్పర ప్రేమ జీవాత్మ పరమాత్మల బాంధవ్యంవంటిదని భాగవతవ్యాఖ్యాతలు చెప్పారు.)

గోపికలయొక్క ప్రేమను శ్రీకృష్ణుడు పసిగట్టాడు. ఆ గోపికల మనోభావాలను గమనించిన శ్రీకృష్ణుడు ఏకాంత ప్రదేశానికి తీసుకొనిపోయి, ప్రేమతో కౌగిలింతలుఇచ్చి ఎడతెగని భక్తిభావంతో నిండిన వారితో చిరునవ్వులు చిందిస్తూ (ఇలా) పలికాడు.

ఓ వనితలారా! మిమ్మల్ని విడిచిపోవడానికి కారణం ఉంది. బలవంతులైన శత్రువులను అణచి వేయడానికి విజయయాత్ర చేసినందువల్ల ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమైంది. దీనికి మీరు కోపించవద్దు. గాలికెగుర గొట్టబడే దూది వలె, గడ్డిపోచలవలె విధి చరాచర ప్రపంచంలో జీవులను ఒక్కోసారి కలుపుతుంది. ఒక్కోసారి విడగొడుతుంది. (కలియుట విడిపోవుట ప్రాణులకు సహజమైనదని భావం.)

గోపికల్లారా! నా యందలి భక్తివల్ల ప్రాణులకు మోక్షానందం సిద్ధిస్తుంది. భక్తిలేకుండా కేవలం జపతపాదులవల్ల, మోక్షం కలుగదు. శివుడు, బ్రహ్మ సనకాది మునులు తమ మనస్సుల్లో నిలిపిన నిర్మలభక్తి మీలో పుట్టింది. మీ పూర్వజన్మ సంచిత పుణ్యం ఫలవంతమైంది. నా సంబంధమైన (భగవత్ సంబంధమైన) జ్ఞానంచేత ఇంక మీకు నరకాదులు, జననాదులు, పాపపుణ్యకర్మలు ఏవీ ఉండవు, అతీతమైన మోక్షం లభిస్తుంది. ఇది అసత్యం కాదు.

(కర్మాది అనుభవాలవల్ల స్వర్గనరకాదులు, సంచిత కర్మఫలాలవల్ల పునర్జన్మాదులు, తిరిగి పాపపుణ్యకర్మాచరణం ఇది ఒక చక్రభ్రమణం. దీనినుండి తప్పించుకొనడం మోక్షస్థితి. దీనికై జపతపాదులు మాత్రమేగాక, భగవంతునియందు గాఢభక్తి అవసరం. బ్రహ్మేశ్వరాదులకుమాత్రమే అనుభవంలోనికి వచ్చిన ఈ మానసికస్థితి ప్రస్తుతం కృష్ణునివల్ల గోపికలకు అనుభవమైంది. గోపికల అనన్యభక్తి, జప, తప, దాన, ధర్మాది కర్మాచరణంకంటె శ్రేష్ఠమైందని భాగవత సందేశం.)

సర్వభూతాల్లో(సమస్త ప్రాణికోటిలో) జన్మ, జీవన, మృత్యువులు నేనే! లోపల, బయట నేనే వ్యాపించి ఉన్నాను. ఘటపటాది వస్తుజన్యతకు(సకలప్రాణి కార్యాలకు) ఉపాదానకారణాలైన పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు (భూమి, నీరు, అగ్ని/తేజస్సు, వాయువు, ఆకాశం) వీటి ఐక్యకార్యఘటనకు నేనే కారణం. సకల లోకాల్లోని పంచీకరణ వ్యవస్థతో నడుపబడే ప్రాణులకు కారణమైన గగనాదిపంచభూతాలకు (పంచప్రాకృతికశక్తులకు) వాటి మధ్యగల కార్యకారణసంబంధం నేనే. ఆధారమూ నేనే. సర్వానికీ నేనే కర్తను. నాకు స్వపరభేధాలు లేవు. అంతా సమానమే! ఓ పడతులారా! ఇంతకన్న ఇంక ఎక్కువ చెప్పడమెందుకు?

మోహపరవశులైన ఆ గోపికలు శ్రీకృష్ణుని సర్వవ్యాప్త ఈశ్వరతత్త్వాన్ని భగవంతునినోటనే విని, వివేకాన్ని పొంది, తమ దేహాభిమానాల్ని విడిచారు. విష్ణుస్వరూపా! జగత్తులు నీలో నిల్పుకొన్నవాడా! భక్తుల కోర్కెలు తీర్చే పారిజాతమా! అని ప్రార్షించి

ఘోరమైన సంసారసముద్రాన్ని దాటించేవీ, జ్ఞానయోగులైనవారి హృదయాల్లో ప్రతిష్టితమై ధ్యానింప తగిందై ప్రకాశించే నీ చరణ కమలాల్ని మా మనస్సుల్లో నిరంతరం ధ్యానించేలా వరమివ్వమని వేడినారు.

(దేహికి ముందు దేహాభిమానం, ఆపై జ్ఞానసంపాదనం, ఆపై భగవద్భక్తి, ఆపై భగవల్లీనం - కాగల్గే  ధ్యానయోగం - ఈ వరుసలో గోపికల పరిణతి ప్రదర్శించబడింది. కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు భగవత్సన్నిధికి సోపానక్రమం అని భాగవత సందేశం.)

గోపికల ప్రార్ధనవిని, మునులచే నమస్కారాలు పొందేవాడు, కరుణాసముద్రుడు, భక్తులంటే అపారంగా వాత్సల్యంచూపే ఆ శ్రీకృష్ణుడు గోపికలు కోరినట్లుగా నిరంతరపదధ్యానాసక్తిని ప్రసాదించాడు.

అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి, పాదాలకు నమస్కరించి, కపటంలేని భక్తితో సపర్యలుచేసి, “నీవూ, తమ్ములూ, బంధువులూ. సత్కర్మలు చేస్తూ సుఖంగా ఉన్నారా?” అని కుశలం అడుగగా, ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా బదులిచ్చాడు.

పద్మనాభుడా! మురారీ! నీవంటి భక్తపారిజాతాన్ని ఆశ్రయించిన భక్తజనులు నిత్యసంతుష్టులై ఉంటారుగదా! అని ధర్మరాజు జవాబు ఇచ్చాడు.

ఇంకా

కృష్ణా! జాగ్రదాదిఅవస్థాత్రయానికి నీవు అతీతుడివి. సర్వత్ర వ్యాపించినవాడివి. విశ్వంలో నీవు, నీలో విశ్వం ఉన్నాయి. విశ్వాన్ని నిలిపి ఉంచేది నీవే. సర్వభువనాలు నీలోపుట్టి; నీలో స్థితికల్గి, నీలోనే నశిస్తాయి. అఖండ జ్ఞానస్వరూపుడివి. యోగమాయను నీలో ధరించినవాడివి. పుణ్యాత్ములు, నిత్యముక్తులైన యోగులైనవారికిసైతం లభించేవాడివి. నీరజాక్షుడివి, నిఖిలలోకేశ్వరుడివి, దయాసముద్రుడివి, సమస్త వికారాలూ దూరంచేసే ఓ జగద్రక్షకా! నీకు నమస్కరిస్తున్నాను అని ధర్మజుడు స్తుతించాడు.

(భాగవతం దశమస్మంధం అంతా కృష్ణావతారగాథ, భగవత్తత్త్వం, భగవంతుణ్ణి చేరే జీవన విధానం, విశ్వమూలాలు - వీటిమీదే విషయం కేంద్రీకృతమౌతుంది. సందర్భోచితంగా ఆయాపాత్రల రూపంలో భగవన్నుతి సువ్యక్తమౌతుంది. తనకు పాదాభివందనంచేసి నమస్కరించిన శ్రీకృష్ణుణి ధర్మజుడు స్తుతించిన ఈ విధానంలో ధర్మజుడు నిమిత్తంగా వ్యాసమహర్షి సర్వలోకులకూ భగవత్తత్త్వం సువ్యక్తం చేస్తున్న సందర్భమిది.)

ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణు
ణ్ణి స్తుతించగా అక్కడ ఉన్న రాజులు, బంధువులు, మిత్రులు, గోపాలకులు, తదితరులు నిండైన మనసుతో సంతోషంతో విన్నారు.

అటువంటి చక్కని సందర్భంలో స్నేహంతోకూడి, ఒకేచోట గుమిగూడి, కృష్ణుని భార్యలు, ద్రౌపది ఆనందంగా సరసల్లాపాల్లో మునిగి ఉండగా

లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

kuchelopakyanamu - కుచేలోపాఖ్యానము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - కుచేలోపాఖ్యానము

అని శుకమహర్షి పల్కగా, పరీక్షిత్తు ఇలాగ అంటున్నాడు : 'కమలదళాక్షుని అంతులేని పరాక్రమప్రశస్తిని గురించి, అంతులేని గుణగణాలనుగూర్చి వెయ్యిమార్లు విన్నా మనస్సుకు తృప్తి కలుగదు. ఆ విష్ణుదేవుని కథావైభవాన్ని ఒక్క పర్యాయం వింటే చాలు, కామునిబాణాలచే పీడింపబడినవాడుసైతం మళ్లీమళ్లీ వినకుండా ఉండలేడు.

పైన చెప్పినదానితోపాటుగా, ఈ క్రింది విషయంకూడా చిత్తగింపదగి ఉంది.

మునిచంద్రా! ఈ లోకంలో శ్రీహరిని పూజించే చేతులే సార్థకమైన చేతులు. ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు. ఆ చక్రధారియందు లగ్నమైన మనస్సే మనస్సు. ఆ లక్ష్మీనాథుణ్ణి చూచే కన్నులే కన్నులు. ఆ మురారిని స్తుతించే నోరే నోరు. శాశ్వతుడయిన ఆయనయొక్క దివ్యకథలను వినే చెవులే నిజమైన చెవులు సుమా!

మౌనీంద్రా! శ్రీహరిపాదతీర్థాన్ని సేవించటంలో ఆసక్తి కలిగి ప్రకాశించే పరమభాగవతుని అవయవాలే నిజమైన అవయవాలు. అలాంటి విశిష్టమైన పాదతీర్థ ప్రభావంగలిగిన ఆ పరమేశ్వరుణ్ణి గూర్చి విశదంగా తెలియజీయగోరుతున్నాను.

అలా అడిగిన పరీక్షిత్తును చూచి శుకుడు సంతోషంతో ఇలా పలికాడు. “రాజేంద్రా! శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన కుచేలుడు అభిమానధనుడు, గొప్పవిజ్ఞాని, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి", ధర్మమార్గతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మవేత్త, తననూ, తనకుటుంబాన్నీ దారిద్య్రం బాధిస్తూ ఉన్నా ఇతరుల నెవ్వరినీ దీనతతో చేయిసాచి యాచించి యొరుగడు. తనంత తానుగా న్యాయంగా తనకు లభించిన చిన్నకాసునుకూడ పదివేల బంగారు మొహరీలనుగా భావించి, ఏదో ఒక రీతిగా భార్యా పుత్రులను పోషిస్తూ ఉండినాడు. ఇలా ఉండగా ఒక రోజున

కుచేలుని పత్ని పతివ్రతాశిరోమణి ఉత్తమవంశంలో జన్మించినట్టిది. బిడ్డలు ఆకలితో నకనకలాడుతూ ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకుదొన్నెలు పట్టుకొని ఒకనాడు తనవద్దకు వచ్చి 'అమ్మా! పట్టెడన్నం పెట్టిమని అడుగగా, ఆ మాటలకు ఆమె మిక్కిలి బాధపడి భర్తను సమీపించి దుఃఖపడుతూ ఇలా వేడుకొన్నది. 'జీవితేశ్వరా! ఇంటిలో పెల్లుగా పేదఱికం తాండవిస్తూవుంది. దీన్ని నివారించే సదుపాయాన్ని మీరాలోచించకున్నారుకదా!'
అని మనవిచేసి, మళ్లీ భర్తతో ఇలా పల్కింది.

'మీ బాల్యమిత్రుడైన ఆ శ్రీకృష్ణదేవుణ్ణి సందర్శించండి! ఆయన కరుణాకటాక్షమనే సూర్యకాంతిచే దారిద్య్రమనే చీకట్లో మ్రగ్గిపోతున్న మమ్మల్ని ఉద్ధరించండి.

భక్తవత్సలుడు, వరప్రసాది, ఆర్తరక్షకుడు, లక్ష్మీవల్లభుడు, దయాసముద్రుడు, భగవానుడు అయిన శ్రీకృష్ణుడు యాదవ బృందాలు తనను సేవిస్తూ ఉండగా ద్వారకాపురిలో విరాజిల్లుతూ ఉన్నాడు గదా! ఒక్కసారి వెళ్లి ఆ సర్వసమర్థుడైన ప్రభువును సందర్శించండి! ఆ దేవదేవుడు మిమ్మల్ని చూస్తేచాలు. ఆ క్షణమే మీకు అంతులేని సంపదలను తప్పక అనుగ్రహిస్తాడు.'

కలలోకూడా తనను ఎన్నడూ స్మరించని పాపాత్ముడే అయినా, ఆపద వచ్చిన వేళలో ఒక్కసారి ఆ ఆర్తశరణ్యుని పాదపద్మాలను మనసారా స్మరిస్తేచాలు, అట్టివాణ్ణి సైతం ఆ భగవానుడు కనికరిస్తాడు. అవసరమైతే తనను తాను సమర్పించుకోగలడు. అటువంటి దయామయుడు సుస్థిరమైన భక్తిభావంతో నిత్యమూ తనను ఆరాధించేవారికి గొప్ప గొప్ప ఐశ్వర్యాలను ఇయ్యకుండా ఉంటాడా? (తప్పక ప్రసాదిస్తాడు.)

తన యిల్లాలు చెప్పినట్లుగా శ్రీకృష్ణుణ్ణి సందర్శించటానికి వెళ్లటం ఇహపరసాధకం కాగలదని భావించి, కుచేలుడు సతితో (ఇలా పలికినాడు)

కుచేలుడు తన భార్యతో ఇలా అన్నాడు - నీవు చెప్పినట్లు 'శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించడం మనకు శుభప్రదమైనదే! కానీ, ఆ చక్రపాణికి సమర్పించటానికి మనవద్ద ఏమైనా కానుక ఉందా?' చూడు.

శ్రీకృష్ణుడు రాజు, దైవం, గురువు - ఈ మూడూ కాబట్టి, అతని వద్దకు రిక్తహస్తాలతో పోనేపోరాదు. ఈ ధర్మం తెలిసినవాడూ, సహజంగా భక్తుడూ కనుక, కుచేలుడు ఆ కృష్ణునికి అర్పించటానికి ఏదైనా ఉందేమో చూడుమని తన పత్నికి చెప్పాడు.

'అవును నిజమేకదా! - అని పలికి కుచేలునిభార్య కొన్ని అటుకుల్ని ఆతని చినిగిన ఉత్తరీయపు కొంగున ముడివేసి, ప్రియంగా పతిదేవుణ్ణి సాగనంపింది. ఆ విప్రోత్తముడు గోవిందుణ్ణి దర్శింపబోతున్నాననే ఉత్సాహంతో పయనం సాగించాడు.

ఆ విధంగా కృష్ణుడిని చూడాలనే కోరికతో వెళ్తూ, ఆ కుచేలుడు తన మనస్సులో (ఆలోచింపసాగాడు) ద్వారకా పురికి వెళ్లుతూ కుచేలుడు దారిలో ఇలా ఆలోచించాడు. 'అంత పెద్ద ద్వారకాపురిని నేను ఎలా ప్రవేశించగలను? ఒక వేళ ప్రవేశించినా, అంతఃపురంలో నివసిస్తూవున్న శ్రీకృష్ణుణ్ణి ఎలా చూడగలను? ఒకవేళ ఆయన నివసించే భవనాన్ని సమీపించినా, అచ్చటి కావలివారు నన్ను లోపలకు వెళ్లనివ్వకపోతే, వాళ్లకు బహుమానంగా ఏమియ్యగలను? అయినా ఆ శ్రీకృష్ణుని దయాద్భష్టిపై, నా అదృష్టం ఆధారపడి ఉంది. ఆ దయామయుడు తన భక్తుడైన నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడు? ఆయన నన్ను తప్పక ఆదరిస్తాడు' - అని నిర్ణయించుకొని, ఆ విప్రవర్యుడు ద్వారకలో ప్రవేశించి

కుచేలుడు రాజమార్గంలో ముందుకు సాగిపోయాడు. అలా వెళ్లి, కొన్ని భవనద్వారాలను దాటి, శ్రీకృష్ణుడుండే మందిరాన్ని చేరుకొని ముందు భాగంలో

కుచేలుడు బంగారంతో నిర్మించిన, రత్నాలు తాపినగోపురాలతో గొప్పగా గోచరిస్తూవున్న పదారువేలమంది (శ్రీకృష్ణుని) పత్నుల నివాసభవనాలను చూచి, బ్రహ్మానందం పొందినాడు. ఆ ఆనందంతో ఒక వధూమణి (రుక్మిణీదేవి) మందిరాన్ని ప్రవేశించాడు. ఆ మందిరంలో యువతులు వింజామరలు వీస్తూవుండగా హంసతూలికాతల్పంమీద రుక్కిణీదేవితోగూడి అనేక వినోదాలతో ఆనందిస్తూవున్న శ్రీకృష్ణుని చూచాడు. ఆ మహనీయ దృశ్యాన్ని దర్శింపగాదే ఆతని కన్నులనుండి ఆనందబాష్పాలు పెల్లుబికి ప్రవహింపసాగాయి.

నల్లకలువల వంటి దేహచ్చాయగలవాడు, దేవేంద్రునిచే భక్తితో నమస్కారం చేయబడేవాడు, దయకు నిలయమైనవాడు, ప్రకాశించే చెక్కిళ్లుగలవాడు, కౌస్తుభమణిని ధరించినవాడు, భక్తులైనవారికి కల్పవృక్షమైనవాడు, మిగుల ఆకర్షణీయమైన సౌందర్యంతో విలసిల్లేవాణ్ణి, దేవతలందరికీ దిక్కైనవాణ్ణి, సింహమధ్యముణ్ణి, సకలలోకాలలోనూ పూజనీయుడు, మహాసుదర్శనాయుధుడు, విశ్వవిఖ్యాతుడు, గరుడవాహనుడు, పీతాంబరధారి, శేషశాయి, అరవిందనేత్రుడు, మకరకుండలాలంకారుడు, మధురభాషణుడు, సాటిలేని సుందరస్వరూపుడు, క్షీరసాగరంలో విహరించేవాడు, సమస్తసద్గుణసముపేతుడు, యాదవకులమనే సాగరానికి పున్నమి చంద్రుడైనవాడు, తేజశ్శాలి, జయశీలుడు, సహనస్వభావుడు, శ్రీమన్నారాయణుని అవతారమైనవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి కుచేలుడు సంతోషంతో సందర్శించాడు.

నిరంతర దారిద్య్రపీడితుడూ, కృశించిన శరీరంకలవాడూ, చినిగిపోయిన వస్త్రం కట్టుకొన్నవాడూ, ఆశాపూరిత చిత్తుడూ, పరిహాసానికి స్థానంగా ఉన్నవాడూ, చినిగిన పైపంచెను కప్పుకొన్నవాడూ ఐన కుచేలుడు తనవద్దకు వస్తూవుండగా అల్లంత దూరంలోనే చూచి, శ్రీకృష్ణుడు గౌరవభావంతోకూడిన తొందరతో గబగబా పానుపునుండి దిగాడు.

శ్రీకృష్ణుడు అతిశయించిన ఆదరభావంతో కుచేలునికి ఎదురుగా వెళ్లి, అతణ్ణి ఆప్యాయతతో కౌగిలించుకొన్నాడు. బంధురీతితోగూడిన స్నేహం ఉట్టిపడేలాగున తోడ్కొని వచ్చి, తనపాన్పుపై కూర్చుండబెట్టాడు.

కుచేలుడు తల్పంమీద కూర్చుండిన పిదప శ్రీకృష్ణుడు బంగారుకలశంలోని నీళ్లతో ఆయన పాదాలను కడిగాడు. ఆ విధంగా కడిగినజలాన్ని భక్తితో తలమీద చల్లుకొన్నాడు.

శ్రీకృష్ణుడు కస్తూరీ, పచ్చకప్పురమూకలిపిన మంచిగంధాన్ని కుచేలుని శరీరానికి దట్టంగా పూసి, మార్గాయాసం తీరేలాగున స్వయంగా వీవన వీస్తూ, మణిమయాలైన దీపాలతో (మిత్రునికి మంగళదాయకంగా) హారతియిచ్చాడు.

శ్రీకృష్ణుడు కుచేలుని సిగలో పూలమాలలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, పాడియావును సమర్పించి, ప్రియమార కుశలమడిగాడు. గోవిందుడు చేసిన ఆ గౌరవానికి కుచేలునిశరీరం పులకించి, కనులనుండి ఆనందబాష్పాలు జలజల ప్రవించాయి. ఆ దేవదేవుని ప్రియపత్ని పట్టపురాణి అయిన రుక్మిణీదేవి కరకంకణాలు మనోజ్ఞంగా ధ్వనిస్తూ ఉండగా వింజామర వీచింది. ఆ చల్లని మెల్లని గాలికి కుచేలుని చెమట ఆరిపోయి, శ్రమ తొలగి, హాయి కలిగింది. ఆ దృశ్యాన్ని చూచి అంతఃపురంలోని కాంతలు ఆశ్చర్యంతో ఇలా అనుకొన్నారు.

ఈ బ్రాహ్మణోత్తముడు మునుపటి జన్మలో ఎటువంటి తపస్సు చేశాడో కదా! యోగిజన వందనీయుడైన లక్ష్మీనాథుని పానుపుపై కూర్చొని ఉన్నాడు. ఎంతగొప్ప మునీశ్వరులైన ఈ మహాత్మునికి సాటిరారు కదా!

యోగీశ్వరులు ఈ మహనీయునికి సమానులు కాజాలరనే విషయంతోపాటుగా

తన ప్రియపత్నియైన రుక్మిణీదేవి తనతోపాటుగా ఆసీనురాలైయున్నప్పటికీ, ఎటువంటి భేదభావన లేకుండా శ్రీకృష్ణుడు వెంటనే లేచి, ఈ భూసురునికి ఎదురేగివెళ్లి, ప్రేమతో కౌగిలించుకొన్నాడు. తగినట్లు సత్కారాలుచేసి ఎంతో వినయంతో సేవించాడు. నిజంగా ఈ విప్రుడు ఎంతటి అదృష్టశాలియో కదా!

అని అంతఃపుర కాంతలు పరస్పరం అనుకొంటూ ఉన్న సందర్భంలో

అంతపురకాంతలు అలా అనుకొంటూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు ప్రేమతో కుచేలునిచేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకులవాసం చేసిన రోజుల్లో జరిగిన విశేషాల్లో కొన్నిటిని ప్రస్తావించాడు. నిపుణతతో మళ్లీ

'భూసురశ్రేష్ఠా! వేదాధ్యయనంలోనూ, అధ్యాపనం(వేదాన్ని అభ్యసింపచేయటం) లోనూ నేర్పరులైన వారియింట జన్మించిన నీ పత్ని సద్గుణవతియై నీకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు ఇల్లూ, పొలాలూ, సంపదా, భార్యా, బీడ్డలూ - మొదలైన ఇహలోకవిషయాల యొడల లగ్నమై ఉన్నట్లుగా తోచటంలేదు. ఈ లోకక్షేమంకోసం నేను విధ్యుక్తకర్మల ఆచరిస్తూ ఉన్నరీతిగా, కొంతమంది సజ్జనులు మాయతో గూడిన ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ, శ్రేష్ఠమయిన కర్తవ్యాలను మాత్రం ఆసక్తితో ఆచరిస్తూ జీవిస్తారు.'

అని పై రీతిగా పలికి, శ్రీకృష్ణుడు మళ్లీ కుచేలునితో ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఈ విధంగా పలికినాడు. 'మనం గురువుగారిఇంటిలో ఉండి విద్యాభ్యాసం చేసేకాలంలో ఆయనవల్ల సమస్త విషయాలను తెలుసుకొన్నాము; అంతేగాక, పరతత్త్వాన్ని గూర్చికూడా ఆ గురువర్యుడు మనకు బోధింపగా చక్కగా తెలుసుకోగలిగాము. ఈ విషయాలన్నీ నీకు జ్ఞాపకంలో ఉన్నాయా? మిత్రమా!'

గురుకులంలో తాము అభ్యసించిన జ్ఞాన, విజ్ఞానాల్ని గురించి, జ్ఞాపకం చేసి, అనంతరం గురువుగారిని ప్రస్తుతింపదలంచి శ్రీకృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు.

మన గురువరేణ్యుడు అజ్ఞానమనే అంధకారానికి గొప్ప దీపంలాంటివాడు. బ్రహ్మానంద అనుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు. సత్కర్మపరాయణుడు. పుణ్యాత్ముడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడు. సజ్జనుల ప్రశంసలందుకునే మహనీయుడు.

నేను సకలజనులకూ విజ్ఞానాన్నిచ్చే జగద్గురువునై ఉండీ కూడా, నాలుగుజాతులందలి, నాలుగుఆశ్రమాలలోని ప్రజలందరికీ గురుసేవనం ఆచరించవలసిన ఉత్తమధర్మమని ప్రబోధించేందుకే, మనగురువుగారిని సేవించాను.

లోకంలోగల బ్రాహ్మణులందరికీ అత్యంత ఆప్తుడనై సకలవర్ణాలకూ, సమస్తాశ్రమాలకూ ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడినై శ్రేష్ఠుడగు గురువర్యుడినై సర్వత్ర శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటాను.

సమస్తానికి గురువర్యుడనైన నాఉపదేశాన్ని అంగీకరించి, నా పాదపద్మాలను ధ్యానించుటయందే అమితమైన ఆసక్తిగలవారు ఈ సంసారసాగరాన్ని శీఘ్రంగా దాటి, మోక్షాన్ని పొందుతారు. అన్ని వర్ణాలలోనూ, ఆశ్రమాలలోనూ అలాంటివారలే పరమార్ధాన్ని తెలిసిన పండితులు.

సమస్త ప్రాణులలోను ఆత్మయైయున్న నేను తపస్సు, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, ఇంద్రియనిగ్రహం - మున్నగు ఆచరణలవల్ల అంతగా సంతోషించను; మరేమంటే భక్తితో గురువర్యుణ్ణి సేవించేవారిని చూచి ఎంతో సంతోషిస్తాను. ఈ విధంగా పలికి, శ్రీకృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు. 'మనం గురువుగారిఇంటిలో ఉన్నకాలంలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం వంటకట్టెలు తీసుకొనిరావటానికి అడవికి వెళ్లాము. అది గుర్తుందికదూ! ఆ సందర్భంలో మనం అడవికి వెళ్లిన ఆ వేళలో గొప్పధ్వనులతో ఉరుముతూ ఆకాశమంతటా కారుమబ్బులు ఆవరించాయి. గాలివాన గొప్పవేగంతో వీచి, అడవిలోని వివిధజంతుసమూహాలను నిలువనీయకుండా చెల్లాచెదురు చేశాయి. వర్షధారలు దిగజాల తొండాలంత పరిమాణంతో పడుతూ భూమిని ముంచివేశాయి. సూర్యకిరణాలను మించిన కాంతితో ప్రకాశిస్తూ మెఱుపులు మిఱుమిట్లు గొలిపాయి. అంతలో సూర్యుడు అస్తమించగా చీకట్లు ఎంతో దట్టంగా అలముకొన్నాయి ఏ వస్తువుకూడా కంటికి కనబడటంలేదు. అటువంటి ఆ జడివానలో మనమిద్దరం తడిసి ముద్దయిపోయి

బయలు ప్రదేశంగాని, సందుగానున్నచోటుగాని, ఎత్తుగాని, పల్లంగాని, లోతులేని ప్రదేశంగాని, లోతుగల ప్రదేశంగాని గుర్తింపవీలుగాకుండిన ఆవాననీటిలో ఆ చీకటిరాత్రిలో మనం ఒకరిచేతిని మరొకరు గట్టిగా పట్టుకొని ఆ అడవిలో నడిచాము కదా!

నిరంతరం వీస్తూవున్న తీవ్రమైన ఆ చలిగాలులకు మనదేహాలు వణకి దొడగాయి. అందువల్ల మనం దారి తెలియక, దిక్కుతోచక ఆ అడవిలో అటునిటు సంచరింపసాగాము. అలా సంచరిస్తూ ఉండగా, ఎట్టకేలకు సూర్యోదయం అయింది.

తెల్లవారగానే పక్షుల కలకలధ్వనులు అంతటా వ్యాపించాయి. సూర్యుడు ఉదయింపగానే ధవళకాంతులు దిక్కులందంతటా నిండిపోయాయి.

అప్పుడు మన గురువర్యుడైన సాందీపుడు మనలను వెదకుకొంటూ అడవికి వచ్చాడు. వాననుండీ, చలినుండీ కొంచెం తేరుకొని ఉన్న మనల్ని చూచి చింతిస్తూ ఈ విధంగా అన్నాడు.

'అయ్యో! శిష్యులారా! మా కోసమై ఈ విధంగా అడవికి వచ్చి చాలా బాధపడినారు. దీనివల్ల మీరు గురు ఋణం తీర్చుకొన్నవారైనారు. కనుక ఇకపై మీ కిరువురకు అతిశయించిన ధన, బంధు, దార, బహుపుత్ర సంపదలూ, దీర్ఘాయు, రున్నతులూ, విజయశ్రీలూ సమకూరగలవు' (అని ఆశీర్వదించినాడు).

అలాగా దీవించి సాందీపని వాత్సల్యంతో మనలను తన మందిరానికి పిలుచుకొని వెళ్ళాడు. ఈ సంగతులన్నిటినీ నీవు ఎప్పుడైనా మనస్సులో అనుకుంటూ ఉంటావా? అని అంటూ, శ్రీకృష్ణుడు కుచేలునితో మళ్లీ ఈ విధంగా పలికాడు.

పుణ్యాత్మా! మనం గురుకులంలో వేదాధ్యయనం చేస్తూ ఉండిన దినాలలో పరస్పరం స్నేహంతో, వాత్సల్యంతో చేసిన పనులన్నిటిని నీవు మఱచిపోలేదు కదా! - అని మాధవుడు తను చిన్ననాటి ముచ్చట్లను ఉదాహరిస్తూ పల్కిన మధుర వాక్యాలను విని కుచేలుడు సంతోషించినవాడై, ఇలా అన్నాడు.

'నిర్మలచరిత్రుడవైన పద్మనాభా! విద్యాభ్యాసంనిమిత్తమై మనం గురువుగారిగ్భహంలో నివసించినకాలంలో సంతోషంతో ఆచరింపని కార్యాలంటూ ఉన్నాయా? అవి అలా ఉండనీ! ఇప్పుడు నేను మనవిచేసేది చిత్తగించు.

శ్రీకృష్ణదేవా! మూడులోకాలకూ గురువర్యుడవైన నీకుకూడా మరొక గురువు దగ్గర చేరి అధ్యయనం చెయ్యటం, నీవు ఆయనకు శిష్యుడివి కావటం - ఇదంతా చూస్తే లోకులకు ఆదర్శంగా ఉండేందుకై నీవు లోకాన్ని అనుకరించటమేగాని, వేఱొకటి కాదుకదా! (ఇవన్నీ నీ లీలలే కదా!).

కుచేలుడు సాభిప్రాయంగా పలికిన పలుకులు విని సమస్తభావవేత్త అయిన శ్రీకృష్ణుడు వాటిలోని ఆంతర్యాన్ని గ్రహించాడు. చిఱునగవుచే అందగించిన ముఖకమలంకలవాడై 'మిత్రమా! నీవిచ్చటికి వస్తూ భక్తిభావంతో నాకేమి కానుక తీసుకొని వచ్చావు? నీవు తెచ్చిన ఆ కానుక కొంచెమైనా సరే, దాన్ని పదివేలరేట్లుగా స్వీకరిస్తాను. నా యందు భక్తిలేని నీచుడు మేరుపర్వతమంతటి పదార్ధాన్ని తెచ్చియిచ్చినా అది నాకు ప్రియమైంది కాజాలదు'- అని

'మిత్రమా! నిశ్చలమైన భక్తిభావంతో నన్ను సేవించే జనులు పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా సరే! నాకు సమర్పిస్తే, దాన్ని రుచికరమైన ఆహారంగా స్వీకరించి, పరమప్రీతితో ఆరగిస్తాను' - అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.

అని శ్రీకృష్ణుడు పల్కిన వినయంతో కూడిన పల్కులకు కుచేలుడు ఎంతో ఆనందించాడు. కాని, తాను తెచ్చిన అటుకులను శ్రీకృష్ణునికి అర్పించజాలక సంకోచిస్తూ తలవంచి మౌనంగా ఉండినాడు.

శ్రీకృష్ణుడు తన దివ్యచిత్తంతో కుచేలుని రాకకుగల కారణాన్ని తెలుసుకున్నాడు. “పూర్వజన్మలో ఈ భూసురుడు ఐశ్వర్యంకోసం నన్ను సేవించలేదు. ఇప్పుడు తన భార్యసంతోషంకోసం నా వద్దకు వచ్చాడు. కనుక ఈతనికి ఇంద్రాదులకుసైతం లభించని అనేకసంపదలను ఈ క్షణంలోనే ప్రసాదించాలి” - అని భగవానుడు నిశ్చయించుకొన్నాడు.


కుచేలుని చినిగిన ఉత్తరీయం అంచులో ముడివైచి ఉన్న చిన్న అటుకుల మూటను గమనించి 'ఇదేమిటి?' - అని అడిగి, ఆ మూటను విప్పి, ఒక పిడికెడు తీసుకొన్నాడు. 'నాకూ, ఈ సమస్త లోకాలకూ సంతృప్తి నీయటానికి ఇవి సరిపోతాయి' - అని తలంచి కృష్ణుడు వాటిల్ని ఆరగించాడు.

శ్రీకృష్ణుడు పిడికడు అటుకులను ఆరగించిన పిదప, కుతూహలంతో కుచేలుని ఉత్తరీయం కొంగులో ఉండే మూటలో ఇంకొక పిడికడు అటుకులు తీసుకొంటూ ఉండగా, అప్పుడు రుక్మిణీదేవి తన పతిదేవునిహస్తాన్ని గట్టిగా పట్టుకొనింది.

'ముల్లోకాలకు సమస్త సంపదలను అనుగ్రహించే దేవదేవుడవైన శ్రీకృష్ణదేవా! ఈతనికి సమస్త సంపదలను అందించటానికై ఇంతకు ముందు మీరు తినిన పిడికెడు అటుకులే చాలు! కాబట్టి, ఇకపై భుజించకండి!' - అని రుక్మిణీదేవి భర్తను వారించింది.

(రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి రెండవ పిడికెడు(అటుకలను) భక్షింపనీయకుండా నివారించటానికిగల కారణాన్ని సంస్కృత భాగవతంయొక్క వ్యాఖ్యాతలు సముచితమైన రీతిలో వివరించారు. మొదటి పిడికెడు అటుకులతోనే ఆతనికి ఇహలోక పరలోకాలకు రెండిటికి సంబంధించిన సకల సంపదలూ సిద్ధించాయి. అటుపై రెండవ పిడికెడు అటుకులను గనుక భుజించినట్లైతే, సాక్షాల్లక్ష్మీదేవియే ఆతని అధీన కావలసివస్తుందని, అందువల్ల అలా చేయవద్దనీ లక్ష్మీదేవియొక్క అవతారమైన రుక్మిణీదేవి అలా స్వామిచేతిని పట్టుకొన్నది.)

కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణునిమందిరంలో ఎంతో రుచికరాలైన అనేకఆహారపదార్థాలను ఆరగించాడు. మెత్తని పాన్పుపై నిద్రించాడు. తాను గొప్పస్వర్గభోగాన్ని పొందిన భాగ్యవంతుడిగా భావించాడు. తెల్లవారగానే ఆతడు కాలోచిత కృత్యాలను నిర్వర్తించుకొని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణునిచే కొంత దూరం సాగనంపబడి, వెళుతూ, గోవిందుణ్ణి సందర్శించి నందువల్ల కలిగిన అతిశయించిన ఆనందంతో తన మనస్సులో ఇలా అనుకోసాగాడు.

నేను ఈ తరుణంలో పుణ్యాలరాశీ, ప్రశాంతస్వభావుడూ, అచ్యుతుడూ, సర్వవ్యాపకుడూ, బ్రాహ్మణహితం కోరేవాడూ, జ్ఞానస్వరూపుడూ, పరాత్పరుడూ - అయిన పురుషోత్తముణ్ణి కన్నులార కనుగొన గలిగాను. నిజంగా నేను చేసుకొన్న పుణ్యం ఎంత గొప్పదోకదా!

కుచేలుడు తన మనస్సున ఇంకా ఈ రీతిగా భావించాడు. “నిఱుపేదనైన నే నెక్కడ? జగదీశ్వరియైన శ్రీదేవికి నిత్య నివాసమైన వాసుదేవుడెక్కడ? ఆ నందనందనుడు నన్ను తన తోబుట్టువుతో సమానునిగా భావించి, అనురాగంతో కౌగిట చేర్చినాడు. దేవునిగా భావించి, తన పాన్పుపై కూర్చుండజేసి పరిచర్యలు కావించాడు. ఆయనపత్ని నాకు వింజామర వీచి నాబడలికను పోగొట్టింది. సాక్షాత్తు లక్ష్మీదేవియైన రుక్మిణిని సంభాళించిన అరచేతులతో ఆప్యాయంగా నా పాదాలు ఒత్తి ఆదరించాడు కదా!

నన్ను అలాగ ఆదరించాడు కనుకనే

ఈ రీతిగా నన్ను ఆదరించిన శ్రీకృష్ణుడు నాకు ధనం ఏమాత్రం ఇవ్వలేదు. దరిద్రుడు సంపన్నుడైతే ఆ సంపదవల్ల అహంకారంతో అంధుడై తనను సేవించడని తలచినాడు కాబోలు! లేకుంటే ఆశ్రితజనుల ఆర్తిని నివారించే ఆ అపార కృపాసముద్రుడు తన భక్తుడైన నన్ను సకలసంపదలతో పరిపూర్ణునిగా చేయకుండా ఉంటాడా? తప్పక చేసి ఉండేవాడే!

(శ్రీకృష్ణుడు తనకు సంపదలను ప్రసాదించకపోవటానికిగల కారణాన్ని ఊహించటంలో, భక్తి భరితమైన ఆయన శీలం వెల్లడవుతున్నది.)

కుచేలుడు పైరీతిగా తన మనస్సులో ఆలోచన చేస్తూ తన పురాన్ని చేరుకున్నాడు.

కుచేలుడు తనయెదుట సూర్యచంద్రుల ప్రభలతో ప్రకాశించే సువర్ణమయాలైన, చంద్రకాంతశిలానిర్మితాలైన భవనాలూ, చిలుకలు, కోయిలలు, నెమళ్లు మున్నగువాటికూజితాలలో విలసిల్లుతున్న ఉద్యానవనాలూ, వికసించిన పలురకాల పద్మాలతో, కలువపూలతో కన్నులపండువు కావిస్తూవున్న సరోవరాలూ, మణిమయ కనక కంకణాలు, రకరకాల భూషణాలు ధరించిన దాసదాసీ జనులూకలిగి వెలుగొందే మహోన్నతమందిరాన్ని చూచి ఆశ్చర్యపడినాడు. ఇది ఏ పుణ్యాత్ముని నివాసభవనమో? సిరిసంపదలకు నిలయమై అపూర్వంగా ప్రకాశిస్తూందని కుచేలుడు భావించాడు.

కుచేలుడు తనయెదుట నూతనంగా గోచరించిన అపూర్వసౌధాన్ని చూచి 'ఈ మహనీయసౌధం ఏ పుణ్యాత్ముని నివాస మందిరమో కదా!' అని ఆలోచిస్తూ ఉండినాడు. ఆ సందర్భంలో

“ఆ సమయంలో దేవతాస్త్రీలను పోలిన యువతులు కుచేలునివద్దకు వచ్చి ఈ మందిరంలోనికి వేంచేయండి” అని ఇంపుగా పలుకుతూ మనోజ్ఞాలైన సంగీతన్ఫత్యనాట్యవాద్యాలతో మంగళకరమైన శబ్దాలు ప్రసరిస్తుండగా వైభవోపేతంగా అలంకరించిన మందిరంలోనికి పిలుచుకొని వెళ్లారు.

కుచేలుడు ఆ విధంగా యువతీమణులవెంట అంతఃపురంలోనికి విచ్చేసిన పిదప, ఆయన భార్యయైన ఉత్తమ సతీమణి తన మనస్సునందు ఎంతో సంతోషించింది.

పతివ్రతాశిరోమణియైన కుచేలుని యిల్లాలు తన వల్లభుని రాకను తెలుసుకొని ఎంతో సంతోషంతో ఎదురు వచ్చింది. మానవరూపాన్ని ధరించిన మహాలక్ష్మిలాగా విలసిల్లుతూ ఉన్న ఆమెకడగన్నుల నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా భర్త పాదాలకు మనస్సులో నమస్కరించి, భావంలో కౌగిలించుకొనింది. దివ్యాంబరాలు, దివ్యాభరణాలు ధరించి మన్మథుని బాణాలలాగా ఉన్న పరిచారికల సేవలందుకొంటూ ఐశ్వర్యశోభతో తులతూగుతూ ఉన్న తన ధర్మపత్నిని కుచేలుడు చూచి

ఉత్తమ దంపతులైన కుచేలుడూ, ఆయన ధర్మపత్నీ అన్యోన్యమైన అనురాగం విలసిల్లగా శ్రీకృష్ణునికృపతో లభించిన అంతులేని ఐశ్వర్యంతో నిత్యానందాన్ని పొందుతూ

ఎర్రని పద్మరాగమణులు తాపిన చిరుకంబాలు, తెల్లని సృటికశిలా నిర్మితాలైన గోడలు, గరుడపచ్చలు చెక్కిన నవరత్నాల వాకిళ్లు, ఇంద్రనీల మణులు తాపిన గవాక్షాలు, చంద్రకాంత శిలావినిర్మిత వేదికలు, హంసతూలికాతల్పాలు, సువర్ణ మయాలైన శయనశాలలు, సిరులొలికే ఉన్నత భద్రపీఠాలు, పల్లకీలు, ఆవశ్యకాలైన ఉత్తమవస్తువులతో, సమస్త సంభారాలతో పరిపూర్ణాలై విలసిల్లుతూవున్న వాడలు - వీటన్నింటితో విరాజిల్లుతూవున్న మందిరాన్ని కుచేలుడు (సతీసతుడై) ప్రవేశించి

కుచేలుడు నూతనమందిరంలో సతీసమేతంగా సుఖంగా నివసిస్తూ, మనస్సులో ఇంద్రియవికారాలు కలుగకుండా ప్రవర్తిస్తూ, తనలో తాను ఇలా అనుకొన్నాడు : 'ఇంతకాలం అంతులేని పేదరికం అనే దుఃఖసముద్రంలో మునిగి ఉండిన నాకు చివరిదశలో ఈ ఐశ్వర్యం లభించింది.

పరిశీలించినట్లైతే శ్రీకృష్ణుని దయావీక్షణంవల్లనే నాకు క్రొత్తగా ఈ ఐశ్వర్యాలన్నీ సంప్రాప్తించాయి. ఈ సంపదలను కోరటానికే కదా కుచేలుడనైన నేను ఆ శ్రీహరిసన్నిధికి వెళ్లటం!

సంపదలను అర్ధిస్తూ నేను ఆ శ్రీహరి వద్దకు వెళ్ళాను. ఆ దేవదేవుడు నా సంగతి తెలిసికూడా నన్నేమీ అడుగలేదు. నన్ను వీడ్కొలిపి సాగనంపి, తరువాత నాకు ఈ సంపదలు ప్రసాదించి, నన్ను వీటికి అధీశుణ్ణి చేశాడు. ఆయన ఎంతటి దయామయుడోకదా!

అటువంటి దయామయుడైన పురుషోత్తముడు భక్తిభావ తత్పరులైన సత్పురుషులు సమర్పించిన వస్తువు కొంచెమైనా, దాన్ని కోటిరెట్లుగా భావించి, స్వీకరించి, భక్తజనులను ఆదరిస్తా డనటానికి నావృత్తాంతమే నిదర్శనం. మలినమైన నా శరీరాన్నీ జీర్ణవస్త్రాల్నీ చూచి ఆ శ్రీకృష్ణుడు ఏ మాత్రం ఏవగించుకొనక, నావద్దనుండిన అటుకులను ప్రీతితో భుజించి, నన్ను ధన్యుణ్ణి చేశాడు. ఇలా చెయ్యటంలో అచ్యుతుని నిర్హేతుకవాత్సల్యం వెల్లడౌతున్నది. అంతటి దయాసముద్రుడైన గోవిందుని చరణకమలాలపై పరిపూర్ణమైన భక్తినాకు ప్రతిజన్మలోనూ కలుగుగాక!' - అని యీరీతిగా భావించి హరిస్మరణ తత్పరుడై కుచేలుడు తన ధర్మపత్నితో గలసి జీవించాడు. భోగాలయెడల ఆసక్తి లేనివాడై, రాగద్వేషాదిద్వంద్వాలకూ, అరిషడ్వర్గాలకూ అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారసపానంతో తన్మయుడై, భవబంధాలను పాసి, మోక్షాన్ని పొందినాడు.

దేవదేవుడూ, అఖిలభావవేత్తా, ఆశ్రితవరదుడూ అయిన వాసుదేవునికి బ్రాహ్మణులు దైవస్వరూపులు. అందువల్లనే భూలోకంలో బ్రాహ్మణులకంటే వేఱొకదైవం లేడు.

(శ్రీకృష్ణుడు బ్రాహ్మణోత్తములను దైవస్వరూపులుగా ఆదరించే స్వభావంకలవాడు కావుననే, కుచేలునికి అఖండమైన ఐహికాముష్మిక సంపదలను ప్రసాదించినా డని సారాంశం.)

ఫలశ్రుతి:
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణదేవుడు కుచేలుడనే విప్రపుంగవుణ్ణి చరితార్థుణ్ణి గావించిన పవిత్ర చరిత్రను విన్న సత్పురుషులకు ఇహ, పరసుఖాలూ, హరిభక్తీ, యశస్సూ సంప్రాప్తిస్తాయి.

(ఇది కుచేలోపాఖ్యానం చివర చెప్పబడిన ఫలశ్రుతి ఇలాగే, భాగవతంలోని చాలా ఉపాఖ్యానాలకు ఇటువంటి ఫలశ్రుతులు పేర్కొనబడి వుండటం ముఖ్యమైన విశేషం!)


శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Balaramudu Teerdhayatraku Januta - బలరాముడు తీర్థయాత్రకు జనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - బలరాముడు తీర్థయాత్రకు జనుట

ఆ విధంగా బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి మొదట ప్రభాసతీర్దానికి వెళ్లి, పుణ్యస్నానం ఆచరించి, ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. 

బ్రాహ్మణోత్తములు వెంటరాగా, సరస్వతీనది, బిందు సరోవరం, వజ్రతీర్ధం, విశాలానది, సరయూనది, యమున, గంగ మున్నగుపుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవ, ఋషి పితృగణాలకు తర్పణాలు నిర్వహించాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులకు సంతర్పణలు చేశాడు. 

అనంతరం సమస్తలోకాలకు స్తుతి పాత్రమైందీ, సకల మునిసమాజానికి నివాసమూ - అయిన నైమిశారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ మునీశ్వరులు సుదీర్ఘకాలికమైన సత్రయాగాన్ని నిర్వహిస్తున్నారు.

వారందరూ బలరామునికి భక్తితో ఎదురేగి, వినయంతో స్వాగతం పలికి, అతిథి సత్కారాలు ఆచరించారు. అందుకు ఆనందించి, బలరాముడు సపరివారంగా ఆసీనుడైనాడు.

(“ప్రభాసము” ; సౌరాష్ట్రదేశంలో సరస్వతీనది పడమటిసముద్రంలో కలిసేచోట వెలసియున్న పుణ్యతీర్థం. చంద్రుడు ఈ నదిలో స్నానంచేసి, తనకృశత్వాన్ని వదిలించుకొని ప్రభాసుడైనాడు. ఇందువలన ఆ తీర్థానికి 'ప్రభాస తీర్ధ'మనే నామధేయం సార్ధకంగా ఏర్పడింది.

ఆ సమయంలో తక్కిన మునులలాగా తన కెదురేగి వచ్చి నమస్కారాది సముచిత కార్యాలను చెయ్యకుండా ఉన్నతా సనంమీద అలాగే కూర్చుండిన ప్రజ్ఞాసముపేతుడైన సూత పౌరాణికుణ్ణి

(“జ్ఞానవయోవృద్దుడు వచ్చినప్పుడు యువకుడుగా ఉన్నవాడి ప్రాణాలు నిలువున పైకి పోవడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి, చిన్నవయస్సులో ఉన్నవాడు కూర్చున్నస్థానం నుండి లేచి, ఎదురేగి నమస్కరించి, మర్యాద చేయడంవలన ఆ ప్రాణాలు పోకుండా నిలుస్తాయి.” అని మనుధర్మశాస్త్రం సూచించింది.)

సూతుడు తనను జూచి లేవనందుకు బలరాముడు కోపించాడు. వెంటనే అచ్చటి ఋషులను చూచి ఇలా పల్కాడు 'వీడు మహర్షులసభలో తానే పెద్దగా భావించి, దురభిమాని ఐనాడు. వ్యాసునివద్ద కొన్ని కథలూ, గాథలూ నేర్చుకొని విద్వాంసుడినని విర్రవీగుతున్నాడు. విద్య ఇలాంటి అల్పులలో గర్వాన్నే పెంచుతుందిగాని సత్త్వగుణాన్ని పెంపొందించదు కదా! ధర్మాన్ని సంరక్షించేందుకై అవతరించిన మాకు ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం అవశ్యకర్తవ్యం' - అని పలుకుతూ తన చేతిలోగల దర్భపోచయొక్క కొనతో సూతుణ్ణి సంహరించాడు. అది చూచి అక్కడి మునీంద్రులందరూ హాహాకారాలు చేశారు. అనంతరం బలరామునితో ఇలా పల్కినారు.

(సూతుడు : క్షత్రియునికి బ్రాహ్మణస్త్రీయందు జన్మించినవాడు; లేదా వైశ్యునికి క్షత్రియస్త్రీయందు జన్మించినవాడు సూతుడు. అందువల్లనే బలరాముడు సూతుజ్జి 'ప్రతిలోమజాతుడు' - అని పేర్కొనినాడు. ద్వాపరయుగంలోని భారతీయసమాజంలో సూతకులస్థులు విద్యావేత్తలైన పారాణికులుగా, యుద్ధనీతినిపుణులుగా, రథసారథులుగా ప్రముఖస్థానాన్ని వహించియుండినారు)

మహానుభావా! బలరామా! మా కందరికీ పురాణాలు వివరిస్తూ ఉన్న ఈ సూతునికి (ఈ యజ్ఞంపూర్తి అయ్యేదాకా) శ్రేష్ఠమైన బ్రహ్మాసనాన్ని మేమే ఏర్పరచాము. అందువల్లనే నీవు వచ్చినప్పుడు ఈతడు బ్రహ్మాసనంనుండి దిగలేదు. (అవతార పురుషుడవయిన) నీ మనస్సుకు ముందుగా ఈ విషయం తెలియకుండా ఉంటుందా? (ఉండదు కదా!)

దుష్టులను సంహరించే స్వభావంగల బలరామదేవా! తెలిసితెలిసీ నీవు బ్రహ్మహత్యాపాతకానికి పాల్పడినావు. ఈ పాప నివారణకు తగిన ప్రాయశ్చిత్తకార్యాన్ని వెంటనే ప్రారంభించవలసింది.

(సూతుడు పుట్టుకచేత బ్రాహ్మణేతరుడైనను నైమిశారణ్యఋషులు తమ తపశ్శక్తివల్ల ఉన్నతమగు బ్రహ్మాసనంపై ఆయన్ను కూర్చుండజేసినారు. ఆ విధంగా అతనికి బ్రాహ్మణత్వం ప్రాప్తించింది. ఆతణ్ణి సంహరించినందున బలరామునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొనింది.)

అంతేగాక, పరమపవిత్రుడవైన నీవే ధర్మాన్ని తప్పితే, ఇక మాన్పగలవారెవరు? కాబట్టి, నీవు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ధర్మానికి మనుగడ ఉండదు గనుక, నీవు ఇందుకు అనుగుణమైన ప్రాయశ్చిత్తాన్ని ఆలోచించు. అప్పుడు బలరాముడు వాళ్లతో ఇలా అన్నాడు. 'తొందరపడి ఈ పాపం చేశాను. దీనికి ప్రతిక్రియను మీరే తెల్పగలరు. నా యోగమాయా ప్రభావంచేత సూతుణ్ణి బ్రతికించి, దీర్ఘమైన ఆయుర్దాయంగల గొప్ప బలవంతుణ్ణిగా చేస్తాను. అది మీకు సమ్మతమేనా?' (అన్నాడు)

అప్పుడు ఋషులు ఇలా అన్నారు :

'దేవా! నీ అస్త్రప్రభావానికీ, మృత్యుదేవతకూ, మాకూ (మా సత్యవాక్కులకూ,) ఎటువంటిలోటు వాటిల్లకుండే విధంగా చేయవలసింది. అప్పుడు బలరాముడు మరల ఋషులతో ఇలా పల్కినాడు.

పరీక్షిన్మహారాజా! ఉదాత్తచరితుడైన బలరామదేవుడు నిశ్చయభావంతో ఋషుల నుద్దేశించి ఇలా పలికినాడు. “ఆత్మా వై పుత్ర నామాసి” - అనే పవిత్రమైన వేదవాక్యం ప్రసిద్ధమై ఉన్నది కదా! అందువలన

విద్వత్‌ శ్రేష్ఠులైన మునీంద్రులారా! నేను బతికిస్తున్న ఈతని పుత్రుడు నేటినుండి అధికమైన బలం, పరిపూర్ణమైన ఆయుస్సు, మంచి ఆరోగ్యం, చక్కని విద్యాప్రావీణ్యం గలిగినవాడై ఈ లోకంలో ప్రకాశిస్తాడు.

(1. బలరామదేవుడు తాను సంహరించిన సూతునినుండి తన యోగమాయాప్రభావంతో ఆతని పుత్రుని(మరియొక సూతుని) సృష్టించాడు. ఆతనికి అమితబలాన్ని ఆయుస్సును, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. 

చనిపోయిన తండ్రియగు సూతుని పేరు రోమహర్షణుడు; ఆతనినుండి సృష్టింపబడిన సూతుని పేరు రౌమహర్షణి (ఉగ్రశ్రవసుడు).

2. రోమహర్షణుడు సాక్షాత్తుగ జీవితుడు కాకపోవటంచేత బలరాముని అస్త్రానికి, మృత్యువునకు సత్యత్వం చేకూరింది. అలాగే సూతుడు పుత్రుని రూపంలో జీవించడంచేత, అతనికి బలం, ఆయుస్సు, ఆరోగ్యం చేకూరటంచేత ఋషీశ్వరుల వాక్కులకు సత్యత్వం సిద్ధించింది.)

బలరామదేవుడు సూతుణ్ణి ఆతని పుత్రుని రూపంతో బ్రతికించి మళ్లీ ఇలా అన్నాడు.

'నేను మీయెడల తెలియక చేసిన ఈ అపరాధం శాంతించే విధంగా, అందుకు ప్రాయశ్చిత్తంగా మీకు మిగుల ఇష్టమైన ఏదైన ఒక కార్యాన్ని చేస్తాను; సెలవీయండి!' అని పల్కగా ఆ మహర్షులు బలరాముణ్ణి చూచి

'బలరామదేవా! ఇల్వలుడనే రాక్షసుని కుమారుడు పల్వలుడు. వాడు బలగర్వితుడై పట్టుబట్టి ద్వేషంతో ప్రతియొక్క పర్వంనాడూ వచ్చి, మా యజ్ఞశాలలమీద మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను కురిపించి, ఆ శాలల్ని పాడుచేస్తూన్నాడు.

కాబట్టి, ఆ దుష్టరాక్షసుణ్ణి సంహరించి మాకు సంతోషాన్ని కలిగించు అటు పిమ్మట నిర్మలచిత్తంతో సంచరిస్తూ పన్నెండుమాసాలు భారతవర్షంలోని వివిధపుణ్యతీర్థాల్లో పవిత్రస్తానాలు ఆచరించు! అందువల్ల సమస్తపాపాలు తొలగిపోతాయి అని వాళ్లు అంటూ ఉండగానే పర్వదినం వచ్చేసింది.

(మామూలు దినాల్లోకన్నా పర్వదినాల్లో యజ్ఞయాగాదులు ఆచరించటం అధికఫలదాయకమని త్రికాలజ్ఞులైన మహర్షిపుంగవుల నిశ్చయం.

పూర్ణిమ, అమావాస్య, రవిసంక్రాంతి, బహుళ అష్టమి, బహుళ చతుర్దశి - ఈ ఐదిటికి 'పంచపర్వము'లని వ్యవహారం. ఈ పంచపర్వాలలోను పూర్ణిమకు ప్రాధాన్యం చెప్పబడింది.)

పర్వదినం కావటంచేత నైమిశారణ్యంలోని మహర్షులు యజ్ఞకార్యానికి పూనుకొనటం పల్వలుడు పసికట్టాడు. వెంటనే వచ్చి ఆకాశంనుండి రక్తాన్ని మలమూత్రాలను, మద్యమాంసాలను కురిపించి, మున్యాశ్రమాలను నానాబీభత్సం కావించాడు. ధూళితో, రాళ్లతో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలాగున చేశాడు. కాటుక కొండను పోలిన నల్లని భారీ శరీరం, క్రొత్తగా ఒలిచిన మానవచర్మాన్ని వస్త్రంగా చుట్టుకొని, ఎర్రనిగడ్డం, మీసాలు గలిగి, పెద్దముక్కూ మిడిగ్రుడ్లూ, నిప్పులు విరజిమ్మేచూపులు, వ్రేలాడుతున్నపెదవులూ, మిగుల పొడుగైన, భీకరమైన నాలుకా కలిగి, ముడివడినకనుబొమలతో అమితభయం గొల్పుతూ ఆకసంలో సంచరిస్తూ ఉండిన ఆ పల్వలుణ్ణి బలరాముడు చూచాడు.

పల్వలుడనే ఆ రాక్షసుడిచేతిలో యమదండంలాంటి శూలాయుధం తీవ్రంగా చూస్తూవుంది. ఆతనిదౌడలు మానవరక్తుచేత బాగా తడిసి ఉన్నాయి. వాడు అత్యధికమైన యుద్దోత్సాహంకలవాడుగా గోచరిస్తున్నాడు. వజ్రాయుధంలాంటి వాడికోరలనుండి నిప్పురవ్వలు వెలువడుతూ దిగంతరాళాన్ని ఆవరిస్తున్నాయి. వాడిమెడలోని తలల, ఎముకల హారాన్నిబట్టి ప్రాణుల్ని చంపడమే వాని స్వభావంగా వెల్లడవుతున్నది. అటువంటి భయంకరాకారుడైన రక్కసు
ణ్ణి బలరామదేవుడు చూచాడు.

ఆకాశంలో క్రొత్తకాంతులను విరజిమ్మే విధంగా గదను వేగంగా త్రిప్పుతూ, పల్వలుడు తనమీదికి రావటాన్ని బలభద్రుడు గమనించాడు. వెంటనే రాక్షస సంహారకార్యంలో సమర్థాలైన రోకలి, నాగలి - అనే తన రెండు ఆయుధాలను స్మరించాడు అవి తత్‌క్షణమే సూర్య సమాన తేజంతో బలరాముని యెదుట ప్రత్యక్షమయ్యాయి.

ఆ రీతిగా తాను సంకల్పించినవెంటనే తన వద్దకు చేరిన తన కార్యాన్ని సాధించే శక్తిమంతాలైన ఆయుధాలను రెండిటిని ధరించిన పిమ్మట

ఆ రీతిగా సాక్షాత్కరించిన తన ఆయుధాలను రెండిటిని అందుకొని బలరామదేవుడు ఆకాశంలో సంచరిస్తూవున్న పల్వలుని కంఠానికి తన ఎడమచేతియందలి నాగలిని తగిలించి, క్రిందికి లాగినాడు. వెనువెంటనే కుడిచేతిలోని రోకలితో వాని నడినెత్తిపై బలంగా మోదినాడు. ఆ దెబ్బకు దేవేంద్రుని వజ్రాయుధంవేటుకు ఱెక్కలు విరిగి పడ్డ కొండలాగా భుగభుగమను ధ్వనితో శరీరంనుండి నెత్తురు స్రవిస్తూవుండగా భూమిపై బోరగిలపడిపోయాడు.

ఆ విధంగా బలరాముని చేతిలో పల్వలుడు మృతి నొందిన పిమ్మట

పైవిధంగా పల్వలుడు కూలిపడటం చూచి, వృత్రాసురు
ణ్ణి సంహరించిన దేవేంద్రుణ్ణి దేవతలు వినుతించిన విధంగా నైమిశారణ్యమునీశ్వరులు బలరామదేవుణ్ణి అనేకరీతుల ప్రస్తుతించారు.

నైమిశారణ్యలోని మహర్షులు బలరామదేవుణ్ణి పుణ్యజలాలతో అభిషిక్తు
ణ్ణి కావించారు. సౌరభాలు వెదజల్లే సుందర పద్మమాలికతో అలంకరించినారు. అందమైన ఆభరణాలను, దివ్యవస్త్రాలను ప్రీతితో సమర్పించారు. మునీంద్రులకు ఆనందం కలిగేటట్లు బలరాముడు వాటిల్ని సముచితంగా ధరించాడు.

నైమిశారణ్య మునీశ్వరులచే సమ్మానితుడైన బలరాముడు దేవేంద్రునివలె భాసించాడు. బుద్దిశాలియైన ఆయన ఆ మునిసమూహాన్ని వీడ్కొని, విప్రోత్తములు కొందరు తనను సేవిస్తూ వెంటరాగా 'కౌశికి' అనే నదీతీరానికి

బలరాముడు కౌశికీనదిలో స్నానంచేశాడు. అక్కడ నుండి వెళ్లి సరయూనదిలో మునిగాడు. అటుపై ప్రయాగకేగి త్రివేణీ సంగమంలో దేవర్షి పితృతర్పణాలు నిర్వహించాడు. పులస్త్యాశ్రమంమీదుగా వెళ్లి గోమతీనదిని దర్శించి, గండకీ నదిని దాటి, సంసారబంధమోచనియైన విపాశలో పవిత్ర స్నానంచేసి, శోణనదంలోనూ, గయలోనూ మునుకలువెేసి, అటుపై గంగా సాగరసంగమ సందర్శనానంతరం మహేంద్ర పర్వతం చేరుకొన్నాడు.

బలరాముడు(నిరంకుశులైయున్న) క్షత్రియకులాన్ని తునుమాడినవాడూ, దయాది సమస్తసద్గుణాలకు నెలవైనవాడూ, సజ్జనులకు అలంకారమైనవాడూ, భృగువంశ జాతుడూ అయిన పరశురామస్వామిని మహేంద్రాచలంమీద సందర్శించినాడు.

బలరాముడు కుతూహలం విలసిల్లగా పరశురామదేవుణ్ణి సందర్శించి వందనం కావించాడు. అచ్చటినుండి మిగుల మనోహరమైయున్న సప్తగోదావరిని సందర్శించి, అందులో పుణ్యస్నానం కావించాడు.

(సప్తగోదావరి ; గౌతమి, వశిష్ట ఆత్రేయ, వైనతేయ, తుల్యభాగ, భరద్వాజ(విశ్వామిత్ర), జమదగ్ని - అనే పేర్లుగల ఏడు పాయలుగా చీలినందువల్ల గోదావరికి సప్తగోదావరం' అనే పేరు ప్రసిద్ధం.)

సప్తగోదావరిని సందర్శించిన అనంతరం బలభద్రస్వామి కృష్ణవేణీనదిని, పంపాసరోవరాన్ని తిలకించాడు. అటు పిమ్మట భీమరథీనది వద్ద కరిగి, అచ్చట నెలకొని ఉన్న సుబ్రహ్మణ్యస్వామిని సందర్శించాడు. ఆ తరువాత శ్రీశైలం, వేంకటాచలం, కాంచీపురి మొదలయిన పుణ్య క్షేత్రాలను చూచి, కావేరిని చేరి, ఆ మహానదిలో పుణ్యస్నానం కావించాడు.

(భరతఖండంలోని 18 శక్తిపీఠాల్లో కాంచీపురం ఒకటి.)

తనను శరణుపొందిన ఆశ్రితులనే క్షీరసాగరానికి పున్నమచంద్రుడైనవాడూ, పాపాలనే కాలకూటాన్ని కబళించే పరమేశ్వరుడూ, రాక్షసుల సంపదలను ఉపసంహరించేవాడూ, దేవతలచే వినుతింపబడిన అనంత నామధేయాలు గలవాడూ, అద్వితీయమయిన బుద్ది విశేషంచేత మనోజ్ఞంగా భాసించేవాడూ, సమస్తదేవతలకు సార్వభౌముడూ, కావేరీ మధ్యదేశంలో వేంచేసివున్నవాడూ అయిన శ్రీరంగనాథు
ణ్ణి బలరాముడు భక్తిప్రపత్తులతో సేవించాడు.

(కావేరీకొల్లడం నదుల మధ్య గల భూభాగానికి (ద్వీపానికి) 'రంగ'మని పురాణ ప్రసిద్ధి. ఆ 'రంగము' ను నివాసంగా గలిగి ఉన్నందున అచ్చట వెలసివున్న అర్చామూర్తికి 'రంగధాము'డని వ్యవహారం. 'ఇవతల కావేరి, అవతల కొల్లడము, నడుమనే శ్రీరంగనాథపురము' అని స్త్రీల పాటల్లో ప్రసిద్ధి.)

కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరమ్‌ |
సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్‌ ॥
- గరుడపురాణమ్‌.

'రంగమునకు 'శ్రీరంగము' - అనేది పవిత్రమైన నామాంతరం.

ఇక్కడ సంస్కృతమూలంలో "శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్రసన్నిహితో హరిః” - అని అర్ధశ్లోకంలో చెప్పబడిన విషయాన్ని భక్తకవీశ్వరుడైన బమ్మెరపోతన తెలుగున స్రగ్ధరావృత్తంలో పెంపొందించివుండటం విశేషం!

“స్రక్‌” - అనగా పూలదండ. “స్రగ్ధరా - అనగా పూలమాలను ధరించినట్లుగా ఉండే పద్యమని భావం.
అర్చామూర్తులలో అగ్రగణ్యుడైన శ్రీరంగనాథు
ణ్ణి వర్ణించటంలో మహాకవి ఈ పద్యాన్ని రచించడం సాభిప్రాయమైన విశేషం! శ్రీరంగనాథునికి ఆళ్వారులలో ప్రసిద్ధుడైన పెరియాళ్వార్‌ యావజ్జీవం చేసింది పుష్ప మాలాకైంకర్యమే! అంతేకాదు, పెరియాళ్వార్‌ పెంపుడు కూతురు గోదాదేవి చేసింది కూడా పుష్పమాలా కైంకర్యమే! కాబట్టి 'స్రగ్ధరా' వృత్తం సార్ధకం!)

బలరాముడు శ్రీరంగనాథు
ణ్ణి సందర్శించిన పిదప వృషభాద్రి, మధుర, సేతుబంధం దర్శించి, అచ్చటి బ్రాహ్మణులకు పదివేల పాడియావులను దానం చేశాడు. రామేశ్వరం మొదలైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూచి, మలయాచలంఎక్కి అగస్య మునీంద్రునికి అభివందనం కావించి, కన్యాకుమారిని గాంచి, గోకర్ణక్షేత్రంలో పరమేశ్వరుణ్ణి సందర్శించాడు. తాపి, పయోష్ణి, నిర్వింధ్యానదులను దాటి, దండకారణ్యంలో ప్రవేశించి, క్రమంగా మళ్లీ ప్రభాసతీర్థం చేరినాడు. కౌరవపాండవయుద్ధంలో సమస్తరాజులూ హతులయ్యారనీ, భీమదుర్యోధనులు గదాయుద్దానికి సన్నద్దులౌతున్నారనీ ప్రభాసతీర్థమందలి బ్రాహ్మణులవల్ల తెలుసుకొన్నాడు. అందువల్ల వారిరువురినీ ఆ గదాయుద్దాన్నుండి నివారించేందుకు ఆ ప్రదేశానికి వెళ్లాడు.

బలరాముడు భక్తితో తనకు నమస్కరించిన శ్రీ కృష్ణుణ్ణి, పాండవులను చూచికూడా పలుకరింపలేదు. గదాయుద్దానికి సంసిద్దులౌతూవున్న భీమదుర్యోధనుల దగ్గరికే సరాసరి వెళ్లాడు.

బలరాముడు భీమ సుయోధనులను చూచి, దగ్గరకు వెళ్లి, వాళ్లతో ఇలా అన్నాడు.

అలా భీమదుర్యోధనులను సమీపించిన బలరాముడు వారితో ఇలా పల్కాడు. 'వీరశ్రేష్ఠులారా! మీలో ఒకడు(భీముడు) భుజబలంలో అధికుడు; మరొకడు(సుయోధనుడు) అభ్యాససంపదలో శ్రేష్ఠుడు. అందువల్ల మీరిద్దరూ గదాయుద్ధంలో సమానబలశాలురు. కనుక మీలో ఎవరూ ఎవరినీ గెలువలేరు. అలాంటప్పుడు ఊరక యుద్ధం చెయ్యడమెందుకు?' - అని. ఆ హితవచనాలు వాళ్లకు రుచించలేదు. అందుకు కారణం వాళ్ల మనస్సుల్లో మెదలుతూవున్న పాత పగలు, ప్రతిజ్ఞలూను. అందువల్ల వాళ్లిరువురూ పట్టుదలతో, పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించుకొన్నారు. వీళ్లకు మేలు కీడులు ఎలా జరుగవలసివుంటే అలా జరుగుతాయి' - అని నిర్ణయించుకొని, బలరాముడు ద్వారకకు మరలినాడు.

ఉగ్రసేనాది బంధువుల బృందాలు ద్వారకలోనుండి ఎదురేగి, వచ్చి బలరామదేవునికీ స్వాగతం పలికారు. ఆయన అచ్చట కొంతకాలంనుండి మళ్లీ సపరివారంగా నైమిశాటవికి వెళ్లినాడు. అక్కడ ఋషీశ్వరుల అంగీకారంతో ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. భూరిదక్షిణలతో ఋత్విక్కుల్ని తదితర బ్రాహ్మణుల్ని సంతోషింపజేశాడు; యజ్ఞం చివర ధర్మపత్ని రేవతీదేవితోనూ, బంధుజనులతోనూ కూడి అవభృథస్నానాన్ని చక్కగా ఆచరించాడు.

(అవభృథము : యజ్ఞం ముగించిన తర్వాత వివిధ దోషపరిహారంకోసం చేసే మంత్రపూర్వకమైన పవిత్రస్నానం.)

బలరామదేవుడు పుష్పమాలికలను ధరించి, చందనపు మైపూతతో; వినూత్న భూషణాలతో రత్నాంబరాలతో పున్నమ చంద్రునివలె ప్రకాశిస్తూ, బంధువుల నేత్రాలనే తెలకలువల సమూహానికి పరిపూర్ణమైన వికాసాన్ని ప్రసాదించాడు. మిక్కిలి తెల్లని కీర్తి గలిగి భాసిస్తూ, అమిత వైభవంతో విరాజిల్లసాగాడు.

ఆదిశేషుని అవతారమైనవాడూ, మహామహిమోపేతుడూ, మాయామానుషవేషధారీ, అమితబలశాలీ - అయిన బలరామదేవుడు ఈ విధంగా మహావైభవంతో ద్వారకను ప్రవేశించి, అచ్చట సుఖంగా ఉన్నాడు - అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మళ్లీ చెప్పటానికి ఉపక్రమించాడు.

మాయా మానుషస్వరూపుడు, గొప్ప భుజబలంకలవాడు, హలాయుధుడు అయిన బలరామస్వామి నిర్వహించే ఆశ్చర్యకరాలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. చతుర్ముఖబ్రహ్మకుకూడా వాటిని ఇన్నని లెక్కపెట్టడం సాధ్యంకాదు - అని శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుతో చెప్పాడు.

కుచేలోపాఖ్యానము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ ధ్వంసంచేయటం తెలుసుకొన్నవాడై, దంతవక్త్రుడు ఆ వాసుదేవునిచే సంహరింపబడిన తన మిత్రుడగు పౌండ్రకవాసుదేవునికీ, తన అన్నయగు శిశుపాలునికీ, స్నేహితుడైన సాల్వునికీ వరుసగా పరలోకక్రియలు చక్కగా నిర్వర్తించాడు. అనంతరం అతిభీషణమైన ఆకారంతో శ్రీకృష్ణుని మీదికి యుద్ధసన్నద్దుడై వెళ్లాడు.

దంతవక్త్రుడు పండ్లు పటపట కొరుకుతూ, బిగ్గరగా అరుస్తూ కన్నులనుండి మిణుగురులు రాలుస్తూ, కాలితాపులచే నేల వణకేలాగున నడుస్తూ, గదను గిరగిర త్రిప్పుతూ, వేసవియందలి సూర్యబింబంలాగా తీవ్రంగా మండిపడుతూ శ్రీకృష్ణుని మీదికి విజ్బంభించాడు.

ఆ రీతిగా తనపైకి వస్తూ ఉన్న దంతదవ
క్త్రుణ్ణి చూచి, ఉల్లాసంతోగూడిన మనస్సుతో శ్రీకృష్ణుడుకూడా గదాహస్తుడై రథం దిగినాడు. విరోధికి ఎదురుగా నడిచాడు. మిగుల నీచస్వభావంగల ఆతడు కుడిచేత గదను త్రిప్పుతూ, అట్టహాసం ఉట్టిపడుతుండగా శ్రీహరితో ఇలా చెప్పాడు.

“కృష్ణా! నా భాగ్యవశాన నేడు నీవు నాకంటబడినావు. బంధురూపంలో ఉన్న శత్రుడివి నీవు. శరీరంలో ప్రవేశించిన భయంకరమైనవ్వాధిని శక్తిమంతమైన ఔషధంతో నివారింపజేసేవైద్యునివలె నా మిత్రద్రోహివైన నిన్ను - మేనమామ కుమారుడనే ఆదరభావం చూపక ఇంద్రుని వజ్రాయుధంలాంటి నా గదాదండపు పెట్టుచేత యముని లోకానికి పంపిస్తాను. ఆ విధంగా నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకోగలను” - అంటూ దంతవక్త్రుడు పరిహాస పూర్వకమైన దుర్భాషలాడుతూ శ్రీకృష్ణుణ్ణి సమీపించాడు.

అలాగ దుర్భాషలాడుతూ దంతవక్త్రుడు తన గదాదండంతో శ్రీకృష్ణునితలపై మోదినాడు. అంకుశంపోటుచే ఆగ్రహించిన మదపుటేనుగులాగా కోపగించిన శ్రీకృష్ణుడు వజ్రాయుధంవంటి తనగదాయుధాన్ని వేగంగా గిరగిర త్రిప్పివేసి, దంతవక్త్రుని వక్షఃస్థలాన్ని పగులగొట్టాడు. ఆ దెబ్బకు వాడు కుప్పగూలి, రక్తం క్రక్కుతూ పడిపోయాడు.

ఆ క్షణంలోనే దంతవక్త్రుడు పర్వతంలాంటి శరీరంతో నేలపై బడి తన్నుకొంటూ ప్రాణాలు విడిచినాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న సమస్తప్రాణి సమూహం ఆశ్చర్యపడుతూవుండగా, ఒకానొక సూక్ష్మతేజస్సు ఆతని శరీరంలోనుండి బయలువెడలి శ్రీకృష్ణునిలో ప్రవేశించింది. ఆ సమయంలో దంతవక్త్రుని తమ్ముడైన విదూరథుడు మిగులకోపంతో ప్రళయాగ్ని జ్వాలలాగా అత్యంత భీకరమైయున్న ఖడ్గాన్నీ డాలునూ ధరించి, శ్రీకృష్ణునిమీదికి దూకినాడు.

శ్రీకృష్ణుడు తన సుదర్శనాయుధాన్ని నిపుణతతో ప్రయోగించి విదూరథుని శిరస్సును త్రుంచివేశాడు. బలవంతుడైన ఆ కమలలోచనుడు ఈ రీతిగా సౌభకాన్ని సాల్వుణ్ణి, శిశుపాలుని సోదరుడైన దంతవక్త్రుణ్ణి, వాని తమ్ముడైన విదూరథుణ్ణి, తనను ఎదిరించడానీకి వచ్చిన అతని సోదరులను, అలాగే ఆ వంశీయులు చాలమందినీ సంహరించాడు.

ఆ రీతిగా శ్రీకృష్ణుడు విదూరథుణ్ణి, వాని వంశంవారిని సంహరించిన సమయంలో

ఆ సమయంలో నరులూ, మునులూ, యోగులూ, దేవతలూ, రాక్షసులూ, గరుడులూ, నాగులూ, సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ, తరచుగా ఆకాశంలో సంచరిస్తూ ఉండే కిన్నరులూ, కింపురుషులూ మొదలైనవారందరూ ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ శ్రీకృష్ణుని మహిమను ప్రస్తుతించారు.

అప్సరసలు నృత్యాలు చేస్తూ ఉండగా, దేవతలు పుష్పవర్షాలు కురిపిస్తూ ఉండగా, దేవదుందుభులు బ్రహ్మాండంగా మ్రోగుతూ ఉండగా, యదువృష్టి వీరవరులు అనుసరించి నడువగా, వందిమాగధులు తన విజయగాథల గీతాలను ఆలాపిస్తూ ఉండగా వాసుదేవుడు మహావైభవంతో శుభముహూర్తంలో చక్కగా అలంకరింపబడిన ద్వారకా నగరం ప్రవేశించాడు.

ఆ వేళలో ద్వారకపురమందలి పుణ్యస్త్రీలు ఎత్తెన మేడలమీది నుంచి తనపై మంగళాక్షతలను కురిపిస్తూవుండగా, శ్రీకృష్ణుడు శుభముహూర్తంలో ఆనందంతో అంతఃపురాన్ని ప్రవేశించాడు.

(అధిపతి శత్రువులను జయించి రాజధానిని ప్రవేశించినప్పుడు పుణ్యస్త్రీలు మేడలమీదనుండి ఆయనపై మంగళ కరంగా పూవులతో కూడిన అక్షతలను చల్లటం భారతదేశంలో ప్రాచీనకాలంనుండీ ఆచరింపబడుతూవున్న ఉత్తమమైన ఆచారం.)

ఆ రీతిగా యోగీశ్వరేశ్వరుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడూ, సమస్తజగత్తుకు అధిపతీ అయిన శ్రీకృష్ణుడు ద్వారకానగరిలో సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత

పరీక్షిన్మహారాజా! బలరామదేవుడు కౌరవపాండవయుద్ధం త్వరలో ప్రారంభం కానున్నదని తెలుసుకొన్నవాడై ఇరు పక్షాలకూ సమానంగా కావలసినవాడు కాబట్టి, తీర్థయాత్రలు చెయ్యాలనే నెపంతో ద్వారకనుండి తరలివెళ్లాడు.


బలరాముడు తీర్థయాత్రకు జనుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Sree Maha Bhagavathamu Part 11 - శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

శ్రీరస్తు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము  శ్రీ సీతాపతి! లంకే, శాసురసంహారచతుర! శాశ్వత! నుత వా  ణీసత్యధిభూభవవృ, త్రాసురరిపుదేవజాల! రామనృపాలా! శ్ర...