అనిరుద్దుని వివాహ సమయమున బలరాముడు రుక్మి మొదలగు వారినిం జంపుట
కృష్ణునిచే అవమానం పొంది, అతణ్ణి జయించాలని అనుకొంటున్న రుక్మి శత్రుకుమారుడగు ప్రద్యుమ్నునితో తన కుమార్తె వివాహం ఏ విధంగా చేశాడు? ఓ శుకమునీ! ఈ విషయం నాకు తెలిసేటట్లు విశదంగా చెప్పు.
శుకమహర్షి పరీక్షిన్మహారాజున కిలా చెప్పాడు. ఓ రాజా! నీవు అన్నట్లుగానే రుక్మిణీ వివాహ సందర్భంలో కృష్ణునిచే పొందిన అవమానానికి రుక్మి బాధపడుతూ, తన పగను తీర్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.
కానీ, అవి ఏమియు ఫలింపలేదు సరికదా! తన సోదరియందలి ప్రేమతో - తన కుమార్తె రుక్కవతిని కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నున కివ్వడానికి పూనుకున్నాడు. స్వయంవరానికి రాజకుమారులను అందరిని ఆహ్వానించాడు. ఆ వార్త విని కృష్ణుని కుమారుడగు ప్రద్యుమ్నుడూ వచ్చాడు.
ఉత్తమ మణిభూషణాలతో ప్రకాశిస్తూ, రమణీయరథమెక్కి రాజకుమార్తె స్వయంవరానికి వచ్చిన రాజకుమారులున్న రుక్మి నగరానికి ప్రద్యుమ్నుడు చేరాడు.
యదుసింహ కిశోరమైన ప్రద్యుమ్నుడు రుక్మినగరంలో ప్రవేశించి, స్వయంవరానికి వచ్చిన రాజకుమారులకు తన బాణసంపదనుచూపగా వారు భయపడిపారిపోయారు. అంతట ప్రద్యుమ్నుడు రుక్మవతిని తీసుకొని వచ్చి, వేడుకతో తన భవనంలో ప్రవేశించాడు.
తన భవనంలో ప్రవేశించిన తరువాత ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడి, అన్ని సుఖాలను పొందసాగాడు.

పిదప కృతవర్మ కుమారుడు రుక్మికుమార్తె చారుమతిని వివాహమాడాడు.
(కృతవర్మ భోజదేశపురాజు హృదికుని కుమారుడు. దుర్యోధనునకు మిత్రుడు. కౌరవపాండవుల యుద్ధంలో దుర్యోధనుని పక్షంలో ఉండేవాడు.)
(కృతవర్మ భోజదేశపురాజు హృదికుని కుమారుడు. దుర్యోధనునకు మిత్రుడు. కౌరవపాండవుల యుద్ధంలో దుర్యోధనుని పక్షంలో ఉండేవాడు.)
ప్రసిద్ధుడగు రుక్మి తన మనుమరాలగు రుక్మలోచన వివాహాన్ని అనిరుద్ధునితో చేస్తున సమయంలో
(అనిరుద్దుడు శ్రీకృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్నుని కుమారుడు. ఈతడు మొదట మేనమామ కుమార్తెయగు రుక్మలోచనను, తదుపరి బాణాసురుని కుమార్తెయగు ఉషను వివాహం చేసికొన్నాడు)
రత్నభూషణాల నలంకరించుకొని తేజస్వంతుడై శుభసమయంలో వివాహానికి రుక్మిరాజధానీ నగరానికి
రుక్కిణీ కృష్ణులు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, మొదలగు రాజకుమారులతో సైన్యయుక్తులై వివాహానికి వెళ్ళి, వివాహం జరిగినన్ని రోజులు సంతోషంగా గడిపారు. అనంతరం
యాదవకుమారులు మిక్కిలి ఉత్సాహంతో ఉండడం చూడలేక, కొందరు రాజులు పరిహసించగా
కళింగ దేశప్రభువు రుక్మిముఖంవైపు చూచి, హెచ్చరిస్తున్నట్లుగా, నీ యొక్క అవమానాన్ని తీర్చికొనేందుకు ఇదే సరైన సమయం అని చెప్పాడు. బలరామునికి జూదమాడే కోరిక ఉంది. కాని, ఆటయందు నేర్పరికాడు. ఆతడు నీకు విజయమిస్తాడు. నీవు పూర్వం పడ్డ అవమానాలు తీర్చుకో.
ఈ విధంగా కళింగదేశరాజు రుక్మిని ప్రోత్సహించాడు. రుక్మికోరికను బలరాముడు అంగీకరించాడు. విధివ్రాతను ఎవరు తప్పించగలరు?
రుక్మి కావాలనే కపటవినోదియై బలరాముణ్ణి జూదమాడటానికి పిలిచాడు.
ఓ బలరామ! పాచికలాట నీకు తెలుసునని విని ఉన్నాను. కనుక, కాలక్షేపానికి పాచికలు పందెంవైచి ఆడదాం - ఆడదాం అనగానే బలరాముడు ఉత్సాహం చూపాడు.
మనస్సులోని పట్టును వదలక పది, ఇరవై, నూరు, వేయి, పదివేలు అంటూ పందెం వేస్తూ రుక్మియు, బలరాముడును దురభిమానంతో పాచికలాటను ఆడసాగారు.
బలరాముడు ఆడిన ప్రతి ఆటా ఓడిపోవడంవల్ల శత్రురాజసమూహానికి సంతోషం కలిగింది. బలరాముణ్ణి పరిహాసమాడుతూ అవమానపరుస్తూ కళింగరాజు వెళాకోళపుమాటలు పలుకసాగాడు.
బలరాముడు కోపంతో ఒక లక్షపందెం కట్టి, ఆట గెల్చాడు. నేను పందాన్ని గెలిస్తే, విజయం నీదని మోసగిస్తున్నావా? అని రుక్మి పలికినాడు.
బలరాముడు అచ్చట ఉన్న రాజకుమారుల్ని చూచి, నిజం చెప్పండని కోరాడు. వారు రుక్మి పక్షంవాళ్లు కనుక మొగమోటమి చెంది సమాధానం చెప్పలేదు.
బలరాముడు పందెంవేసి మరో ఆటలో కూడా గెలిచాడు. ఈ విజయం నాదా? రుక్మిదా? అని అచ్చట ఉన్నవారిని అడిగాడు. అప్పుడు ఆకాశవాణి ఈ ఆటను బలరాముడే గెల్చాడు. రుక్మి ఓడిపోయా డని స్పష్టంగా చెప్పింది. తర్వాత
ఆకాశవాణి మాటలు విని, అక్కడివారంతా సంతోషించారు. రాజులలో కొందరు కపటస్వభావంతో రుక్మిని ప్రేరేపించగా అతడు "ఈ ఆటను కూడ నేనే గెల్చాను. కాని, నీవు వ్యర్థంగా వక్రమైన మాటలు చెబుతున్నావు అంటూ జూదమాడటంలో నేర్పరులైన రాకుమారులతో పసులకాపరులు సరితూగగలరా?" అని పల్కాడు.
ఆ మాటలకు బలరాముడు తోక త్రాక్కిన పాములాగా, కొట్టబడిన పెద్దపులిలాగా విజృంభించి బలమైన చేతులు చాచి రుక్మినీ, అతనికి అనుకూలురైన రాజుల్నీ ఇనుపగుదెతో చావమోదాడు.
ఇంతకుముందు తనను చూచి నవ్విన కళింగ ప్రభువును కిందికి పడవైచి ఎడమచేతితో ముఖంపై ఒకదెబ్బ వేయగానే వాని పండ్లు ఊడి పడిపోయాయి.
అంతటితో ఆగక, రుక్మియొక్కపండ్లు ముందే ఊడగొట్టి, శరీరాన్ని భేదింపగా రాజులందరూ భయపడేటట్లుగా వాణ్ణి యముని నగరానికి పంపాడు(చంపాడని భావం).
ఆ విధంగా యాదవ సింహమైన బలరాముడు అసామాన్య పరాక్రమంతో విజృంభించాడు.
శ్రీ కృష్ణునకు తన బావమరదియగు రుక్మి హతుడైన విషయం తెలిసినా కూడా భార్య రుక్మిణి, సోదరుడు బలరాముడు ఏమి అనుకుంటారో అని తన అభిప్రాయం ప్రకటించలేదు.
రుక్మి బలరామునిచే చంపబడిన తర్వాత వారు విదర్భానగరం నుండి బయలుదేరి
యాదవవీరులు ఎంతో ప్రేమ ఉప్పొంగే హృదయంతో, ఆదరంతో, వధూవరులను రథంలో కూర్చుండబెట్టి, బలరాముని, శ్రీకృష్ణుని, రుక్కిణీదేవిని సేవించి
శుభకరాలైన వాద్యాలశబ్దం పెద్దపెట్టున వ్యాపించగా, మదించిన ఏనుగులతో, గుర్రాలతో, ఉత్తములైన సైనికులతో వెళ్ళి, నారింజ, లవంగ, మాది ఫలవృక్షాలలో స్వేచ్చగా సంచరిస్తున్నవై మదించిన తుమ్మెదల ఝుంకారనాదాలతో, నిరంతరం పుణ్యనదులతో కూడి స్వచ్చతనొందిన కుశస్థలీనగరాన్ని చూచారు.
ఈ విధంగా కుశస్థలీపురంలోని ఉద్యానవన సమీపానికి వెళ్ళి
ఆ ఉద్యానవనంలో చందన, మందార, కుంద, చూతవృక్షాల నీడలలో బలరామ, కృష్ణులు మొదలగువారు విడిది చేశారు.
తరువాత నగరప్రవేశం చేసినా రని శుకమహర్షి పరీక్షితుకు చెప్పాడు.