పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొని తోడ్కొనిపోవుట
శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థనగరం పొలిమేరలోని వనాలలో విడిసె నని తెలిసి ధర్మరాజు ఆ తమ్ములు, చుట్టాలు, కుటుంబములోని పెద్దలు, పురోహితుడగు ధౌమ్యుడు, పరిచారక జనులు, చతురంగబలాలు తన వెంటరాగా
శంఖాలు మ్రోయగా, గాయకులు పాడే పాటలు వింటూ కృష్ణుణ్ణి సేవించాలనుకొనే కోరిక మనస్సును నింపగా మిక్కిలి ఆనందంతో శ్రీకృష్ణుణ్ణి ఎదురేగి స్వాగతించుటకు ధర్మరాజు వచ్చాడు.
ఆ రీతిగా ధర్మరాజు తమ్ము చూడవచ్చిన శ్రీకృష్ణునికి ఎదుర్కోలు చేసి, చాలసేపు గట్టిగా కాగలించుకొని పులకించిన శరీరం గలవాడై, ఆనందబాష్పాలచే చెక్కిళ్లు తడిసిపోగా, మనస్సు సంతోషంతో సర్వాన్ని మరచిపోయిన స్థితిలో ఉన్నాడు. భీమార్జునులును శ్రీకృష్ణుణ్ణి కౌగలించుకొని సంతసం పొందారు.

నకుల సహదేవులు శ్రీకృష్ణునికి సాగిలబడి మొక్కి వారి దీవెనలు పొంది కేకయుడు, సంజయుడు మున్నగు రాజులను సన్మానించి, తనతో కూడా వచ్చిన సూతులకు, మాగధులకు వివిధ బహుమానాలిచ్చి చతురంగబలాలతో కదిలి, వివిధరత్నతోరణాలతో అలంకరించిన ఆ ఇంద్రప్రస్థపట్టణంలో ప్రవేశించి రాజమార్గంలో ప్రయాణిస్తూ ఉండగా ఆ పట్టణంలోని స్త్రీలు - ఆ సమయంలో
అరచందమామను ఆవరించిన చీకట్లవలె నొసళ్లపై అలకలు అల్లలాడగా, రత్నాలకమ్మలకాంతులు చెక్కిళ్లపై వ్యాపించగా; ఎఱ్ఱని పగడాలవలె, దొండపండ్లవలె పెదవులకాంతులతో చిరునవ్వు వెన్నెలలు వినోదింపగా, గబ్బిగుబ్బలు ముఖంవైపునకు నిక్కుతుండగ, కాలిమట్టెలఅందెలరవళులు మనోజ్ఞంగా ధ్వనిస్తూ ఉండగా, సన్నని నడుములు అల్లాడగా నడిచేటప్పుడు పైటలు జారుతుండగా, భుజాలపై వారి జుట్టు ముడులు నాట్యమాడగా తొందరతో
ఆ విధంగా పురస్త్రీలు శ్రీకృష్ణుణ్ణి చూడాలనే వేడుకతో ఒకరిని ఒకరు పిలుచుకొంటూ కదలి - తలిదండ్రులు, భర్తలు, కొడుకులు, చుట్టాలు మొదలైన తమవారంతా పోవద్దన్నా వినక వారిమాటను త్రోసిపుచ్చి, ఎత్తయిన బంగారు సౌధాల పై భాగాలపైకి ఎక్కి శ్రీకృష్ణుణ్ణి చూచి తమలో తాము ఇట్లు అనుకోసాగారు.
ఓ పరీక్షిన్మహారాజా! ఇతడు ఈ విశ్వమునంతా తనగర్భంలో ఉంచుకున్నవాడైనా యశోదకు, నందునికి ప్రియపుత్రుడై మెలగాడు. బ్రహ్మ మొదలుగా గల దేవతలకు కూడా ఇట్టివాడని తెలియరానివాడు గొల్లపిల్లడై తిరుగాడాడు. వేదాలు, శాస్త్రాలు పరిశోధించికూడా కనుగొనలేని ఈ ఘనుడు గొల్లవారియింట రోటికి కట్టుబడ్డాడు. దేవతలకు పూనికతో అమృతము తెచ్చియిచ్చిన భక్తసులభుడైన దేవుడు వెన్నదొంగగా ప్రసిద్ధిపొందాడు. లక్ష్మీదేవికి కూడా మనస్సు ఈయని ఈ మహానుభావుడు గోపికా స్త్రీల మనస్సులు రంజింప చేశాడు గదా అంటూ ఆ పురస్త్రీలందరూ మేడలపై చేరి గుమిగూడి శ్రీకృష్ణుని గూర్చి ఒకరితో ఒకరు చెప్పుకోసాగారు.
వ్రేపల్లెలో గోపబాలురతో కలసి ఆడుకొనే బాలకృష్ణుడు మజ్జిగలు అమ్ముకోవడానికి వెళ్లే గొల్లపడుచుల పైటలను లాగి, వారి చెక్కిళ్లను నొక్కి అందగత్తె అయిన గోపిక తనను ముద్దులాడ చేరబిలిచి కౌగిలించగా ఆమె స్తనాలను పుణికి, ఎంతో ప్రేమతో చేరబిలిచిన స్త్రీని ముద్దాడి - బహుకాలం శ్రమకోర్చి అష్టాంగయోగం అభ్యసించి, సమాధి నిష్ఠులై ఉండే యోగీశ్వరులకు చిక్కని పరబ్రహ్మం గోపికల వనంలో కల్పవృక్షమా అనేటట్లు వర్తించాడని ఆ పురంలోని స్త్రీలు శ్రీకృష్ణుణ్ణి ప్రశంసించారు.
ఈ విధంగా ఆ గోపికాస్త్రీలు మేడల పైభాగాలనుండి శ్రీకృష్ణుని దివ్యమైన స్వరూపాన్ని చూచి, ఎంతో అనురాగంతో ఆ మూర్తిని మనసులో నిలుపుకొని, సంతోషసాగరంలో మునిగి తేలుతూ, చాలా ప్రీతితో శ్రీకృష్ణచరిత్రను గానం చేస్తూ, క్రొత్తపేలాలను, మందారకుసుమాలను అతనిపై చల్లారు.
ఆ తరువాత - బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమతమ స్థాయికి తగురీతిలో మంగళకరమగు వస్తువులను తెచ్చి, శ్రీకృష్ణునకు కానుకలుగా సమర్పించారు. ముత్తైదువలు బంగారుపళ్లెరాలలో కర్పూరపుహారతుల్ని ఇచ్చారు. కృష్ణుడు ఆ మర్యాదలను ప్రీతితో స్వీకరిస్తూ అంతఃపురంలోనికి ప్రవేశింపగా అచట పానుపుపైనున్న కుంతీదేవి లేచి పాన్పుదిగి వచ్చి మేనల్లుని కౌగలించుకొని ఆదరింపగా శ్రీకృష్ణుడును మేనత్తయగు కుంతికి సాగిలపడి మొక్కాడు. ద్రౌపది శ్రీకృష్ణునికి నమస్కరించింది. తన అత్తగారగు కుంతీదేవి చెప్పిన విధంగా రుక్మిణి మొదలైన శ్రీకృష్ణుని భార్యలకు గంధపుష్పాదులు, మనోహరాలైన వస్త్రాలు, రత్నమయాలైన ఆభరణాలు ఇచ్చి అర్చించింది. ధర్మరాజుకూడా శ్రీకృష్ణునిభార్యలను, కృష్ణునితో కూడా వచ్చిన చుట్టాలను, మిత్రులను, పరిచారకలను గౌరవించి, వారివారికి తగిన విడిదిగదులు ఏర్పాటుచేసి, ఏ రోజుకారోజు వారందరికీ క్రొత్తక్రొత్తవైన సేవలు చేయిస్తూ వచ్చాడు.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడుకూడా ధర్మరాజు చేసే వివిధాలైన ఉపచారాలకు మనసులో ఆనందించి, అర్జునుడితో పాటు తాను వినోదంగా సంచరిస్తూ కొన్నినెలలు సుఖంగా ఇంద్రప్రస్థపురంలో గడిపాడు.
అంతట