దేవయాని యయాతిని వరించుట
యయాతి మహారాజు దేవయానికి చూచి ముందుగా తన పై బట్టను ఇచ్చి, ఏడు సముద్రాలు ఒడ్డాణంగా చుట్టుకొని ఉన్న భూమి అనే కన్యను రక్షించడంలో సామర్థ్యంగల తన కుడిచేతిని ఆలంబనంగా ఇచ్చి, స్వేదంతో ఒడలంతా తడిసినది, సఖీజనులకు కామధేనువు వంటిదైన భృగువంశంలో జన్మించిన దేవయానిని నూతినుండి పైకి తీశాడు.
(సర్వం సహత ఇతి సర్వం సహా. సర్వమునూ సహించునదికనుక భూమికి ఈ పేరున్నది.)
ఈ విధంగా తనను నూతినుండి బైటకు తీసిన యయాతి మహారాజుతో చంద్రముఖి దేవయాని ఇలా అన్నది.
ఓ రాజా! ఈ నూతిలోనుండి నన్ను పైకి తీస్తూ నీవు నా కరగ్రహణం చేశావు. నీవే నా భర్తవు. ఇది దైవికమైన యోగం. పురుష ప్రయత్నానికి కూడా నా వాక్యం సిద్ధమైనదే. సర్వసుఖాలకు నిలయమైన నిన్ను వదిలి వేరొక వరుణ్ణి నేను కోరుకుంటానా? పద్మాల మకరందాన్ని తాగ మరగిన తుమ్మెద మరొక పుష్పమకరందాన్ని కోరుకోదు కదా!
అంతేకాక, ఓ గుణవంతుడా! వినుము. నేను శుక్రాచార్యుని కూతురు అయిన దేవయానిని. పూర్వం బృహస్పతి కుమారుడు కచుడు మా తండ్రి వద్ద మృతసంజీవని విద్య అభ్యసించే సమయంలో, నేను అతనిని కామించాను. అతడు అంగీకరించని కారణంగా అతడు నేర్చిన మృతసంజీవనీ విద్య నశించిపోవాలని నేను శపించాను. అతడు నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండా పోతాడు అని శపించాడు. ఆ కారణంగా నాకు బ్రాహ్మణుడు ప్రాణనాథుడు కాడు. నీవే నా పతివి అని పలుకగా తాను దేవయానిపై మనసు పడి తొందరపాటు ఏమాత్రం లేకుండా ఆలోచించి
దైవయోగం కాకపోతే, నా మనస్సు బ్రాహ్మణసుతను వరిస్తుందా? ఈశ్వరాజ్ఞ కూడా ఈ విషయంలో ఇలాగే ఉంది కాబోలు! అని భావించి రాజైన యయాతి దేవయానిని వరించాడు. ధీరబుద్ధులకు చేయవలసిన పనులు చేయకూడని పనులు అనే సందేహం కలిగినప్పుడు వారి వారి మనస్సులే అందుకు ప్రమాణం.
ఈ విధంగా యయాతి వరించి వెళ్ళిన తరువాత దేవయాని తండ్రివద్దకు వచ్చి శర్మిష్ఠ అన్నమాటలు చేసిన చేష్టల సమాచారం అంతా చెప్పి విలపించగా
క్రూరాత్ముల ఇళ్ళలో పురోహిత వృత్తి చేస్తూ జీవనం సాగించడంకంటె పావురాలలాగా రాళ్ళు తిని బతకడం ఇంతకంటె చాలా ఉచితంగా ఉంటుంది.
(పావురాలు ఆహారం జీర్ణం అవడానికి గులకరాళ్ళు తింటాయని ప్రతీతి. పావురాలలాగా బతకడం అంటే దేనినీ ఆశించక ఏది దొరికితే దాన్ని తిని జీవించడం అని భావం.)
ఈ విధంగా వృషపర్వునివద్ద ఉండడం తప్పని భావించి శుక్రాచార్యుడు తన కొమార్తెను తీసికొని వృషపర్వపురాన్ని వదిలి వెళ్ళుతూ ఉండగా, ఈ విషయం తెలిసిన వృషపర్వుడు శుక్రాచార్యుని వలన మాత్రమే దేవతలను గెలవగలం అని తెలిసినవాడు కాబట్టి శుక్రాచార్యుని దారి కడ్డుపడి పాదాలపై బడి శుక్రాచార్యుణ్ణి ప్రసన్నం చేసికోగా, కోపం విడిచిన శుక్రాచార్యుడు శిష్యుడైన వృషపర్వునితో ఇలా అన్నాడు.
కూతురైన శర్మిష్ఠ తన చెలికత్తెలు వేయిమందితో నా కూతురికి దాస్యం చేస్తే నా కోపం తీరుతుంది. అలా చేస్తేనే నా కూతురుతో నీ రాజ్యానికి వస్తాను అనగానే వృషపర్వుడు సఖీబ్బందంతో కూడిన శర్మిష్ఠను దేవయానికి సేవ చేయడానికి వెంటనే నియోగించాడు.
తండ్రియైన వృషపర్వుడు తన్ను ఆదేశించగా, ఇంక పట్టుదల ఎందులకని నిష్ఠతో, సఖీజన సహస్రంతో, శర్మిష్ఠ కోపాగ్నిచే బాధపడుతూ, గర్వానికి నిలయమైన దేవయానిని సమీపించి ఆమె పగ చల్లారేలా ఆమెకు దాసి అయ్యింది.
అటు తరువాత, అతిశయించిన వేడుకతో వృషపర్వుని మంత్రియైన శుక్రుడు రాక్షస రాజు కొమార్తెతో కూడిన తన సుతను పిలిచి, ప్రీతితో, అధిక ఐశ్వర్య సంపన్నుడు, క్షత్రియుడు, నిర్భయుడు, సాధువిధేయుడు, అచ్చమైన కీర్తి గలవాడు దుష్టశత్రువుల పీచమణచ గలవాడు అయిన యయాతికిచ్చి పెండ్లి చేశాడు.
ఈ విధంగా యయాతికి శుక్రాచార్యుడు తన కొమార్తె అయిన దేవయానిని ఇచ్చి పెండ్లిచేసి, శర్మిష్ఠతో మాత్రం నీవు కలుసుకో కూడదు అని నిబంధన చేసి వెళ్ళిపోయాడు. పిదప ఆ దేవయాని యయాతివల్ల యదువు, తుర్వసుడు అనే కుమారులను కని, ఒకనాటి రాత్రి ఋతుమతియై బయట ఉండగా, శర్మిష్ఠ అదనుకోసం ఎదురుచూచి, ఒంటరిగా ఉన్న యయాతి దగ్గరకువచ్చి, మన్మథ ఆవేశానికి లోనై తన కోరికను తెలియజేయగా
శుక్రాచార్యులు యయాతికి శాపం బొసంగుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
పంచాంగం
Sunday, March 29, 2026
Yayati Charitramu - యయాతి చరిత్రము
యయాతి చరిత్రము
రాజైన యయాతి అల్లుడుగను, భృగువంశ్రేష్ఠుడు, బ్రహ్మఋషి అయిన శుక్రాచార్యుడు మామగా అవడం ఏ విధంగా జరిగింది? క్షత్రియుడు క్షత్రియ కన్యను వివాహమాడుటకు కోరవచ్చు గాని విప్రకన్యను (బ్రాహ్మణకన్యను) స్వీకరించుట తగునా?
ఆ పరీక్షిత్తు ప్రశ్నకు శుకమహర్షి ఇలా బదులు చెప్పాడు.
ఒకనాడు ప్రొద్దు గడవక దానవ రాజపుత్రిక శర్మిష్ఠ గురుపుత్రిక దేవయానితో వేలమంది సఖీజనులు వెంటరాగా, బాగా పూచి ఉన్న ఉద్యానవనంలో గుబురుగా ఎదిగిన మామిడిచెట్ల సమీపంలో ఉన్న సరోవరానికి వెళ్ళి, ఆ సరోవరంలోని పద్మాల మకరందాన్ని గ్రోలుతూ ఉన్న తుమ్మెదలు చేసే శబ్దానికి గంతులువేస్తూ కట్టిన చీరలు విడిచి సరస్సులోనికి దిగి ఒకరిపై ఒకరు నీళ్ళు చిమ్ముకుంటూ అందరూ ఆనందిస్తూ ఉండగా అటుగా నంది వాహనుడు తలపై చంద్రకాంతి చిమ్ముతూ ఉండగా పార్వతితో కూడి ఈశ్వరుడు ఆ ప్రాంతానికి వచ్చాడు.
పరమేశ్వరుని చూచి ఆ సరస్సులో స్నానం చేస్తున్నవారంతా సిగ్గుపడి, తత్తరపాటుతో గట్టుపైకి వచ్చి, వస్త్రాలు కట్టుకొంటున్న సమయంలో రాక్షస రాజపుత్రిక శర్మిష్ఠ రాక్షస గురువైన శుక్రాచార్యుని కొమార్తె దేవయాని వస్త్రాన్ని ధరించింది. అది చూచి దేవయాని తెలిసి తెలిసి దాసివైన నీవు నా వస్త్రాన్ని ఎలా ధరించావు అంటూ ఎత్తిపొడుపు మాటలు పలుకుతూ ఇంకా
దేవయాని ఇలా అంది.
పరమాత్మ ముఖంనుండి బ్రాహ్మణకులం ఉద్భవించింది. ఈ బ్రాహ్మణులందరు లోకానికి మేలు కలిగించే వైదిక ధర్మమార్గాలు తెలిపేవారుగా కీర్తి పొంది ఆకాశాన్ని అందే ఎత్తు ఎదిగారు. అందులో భార్గవులు గొప్ప నడవడి గలవారు. అందునా శుక్రుడు బుద్ధిమంతులచే సేవింపదగినవాడు. నేను వాని పుత్రికను. రాక్షస వంశంలో జన్మించిన ఓ సేవకురాలా ఇంత గొప్పదాననైన నా వస్త్రాన్ని నీవెలా కట్టుకున్నావు?
ఎంతో మహిమ గల బ్రాహ్మణ స్త్రీల సంపదలు ఇతర స్త్రీలకు లభిస్తాయా? కుక్కలకు బంగారపు గొలుసులు వేసినంత మాత్రంచేత దేవతలకు దక్కవలసిన హవిర్భాగాలు కుక్కలకు లభిస్తాయా?
మీ తండ్రి శిష్యుడు. మా తండ్రి గురువు. అందుచే నీవు నన్ను ఎంతో గౌరవంగా చూడాలి. కొంచెమైనా ప్రేమ లేకుండా ప్రీతి కలిగించకుండా, నీ దుశ్శీలంతో నన్ను అవమానపరుస్తావా?!
ఆ విధంగా మండిపడుతున్న దేవయాని మాటలు విని శర్మిష్ఠ పెద్దగా అరుస్తూ బుసకొడుతున్న ఆడుపాములా నిట్టూర్పులు విడుస్తూ పెదవులు కొరుకుతూ ఇలా అంది.
మా తండ్రిని మీ తండ్రి ఐన శుక్రాచార్యుడు బిచ్చగానివలె దయాధర్మ భిక్షం అడుగగా, మా తండ్రి మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. చివరికి ఆశ్చర్యంగా ఒడలు మరచి రాజసుతవలె సుగుణవతిని, రాక్షస రాజపుత్రికను ఐన నాతో సమానంగా పేలుతోంది. ఓ చెలికత్తెలారా! దీనిని కడుపు పగిలేలా నూతిలోనికి తోయండి.
అని పలికి, చెలికత్తెల బృందంతో పట్టించి, గర్వంతో, రాక్షస రాజపుత్రిక శర్మిష్ఠ వస్త్రం ఈయకుండా దేవయానిని నూతిలోనికి దుఃఖించేలా తోయించింది.
ఈ విధంగా శర్మిష్ఠ దేవయానిని నూతిలోనికి త్రోసిపోయిన పిమ్మట యయాతి మహారాజు వేటాడుతూ అడవి అంతా తిరుగుతూ అదృష్టం కొలదీ దేవయాని ఉన్న నూతివద్దకు వచ్చి అందులో
నూతి నీళ్ళలో పడి వస్త్రం లేక బంధువులనందరిని పిలుస్తూ బయటకు రావడానికి వీలులేక బావిలో చిక్కుకొనిపోయి సిగ్గు అనే సముద్రంలో మునిగిపోయిన దేవయానిని చూచాడు యయాతి మహారాజు.

Vishwamitra Charitra - విశ్వమిత్రుని చరిత్రము
విశ్వమిత్రుని చరిత్రము
గాధికి అగ్నితో సమానమైన తేజస్సుగల విశ్వామిత్రుడు జన్మించాడు. ఈ విశ్వామిత్రుడు రాజు అయినప్పటికి తన రాజధర్మాన్ని, క్షాత్రధర్మాన్ని వదిలి తన తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు. నూర్గురు సుతులను కన్నాడు.
భృగువంశంలో జన్మించిన అజీగర్తుడు అనే వానికొడుకు శునశ్శేపుడు హరిశ్చంద్రునికి తన తల్లిదండ్రులచే యజ్ఞపశువుగా అమ్మబడ్డాడు. అతడు యజ్ఞస్తంభానికి కట్టివేయబడగా బ్రహ్మ మొదలైన దేవతలను స్తుతించి, మెప్పించి పితృదేవతల చేత బంధవిముక్తుడయ్యాడు. ఆ శునశ్శేఫునియందు దయగలిగిన విశ్వామిత్రుడు తన పుత్రులతో ఇలా అన్నాడు.
(అజీగర్తుడు భృగువంశంలో జన్మించాడు. ఒక సమయంలో క్షామం వచ్చింది. ఆహారంలేక అందరూ బాధపడుతున్నవేళ ఈ అజీగర్తుడు తన కుమారుడైన శునశ్శేపుణ్ణి హరిశ్చంద్రునకు అమ్మివేసినాడు. హరిశ్చంద్రుడు ఈ శునశ్శేపుణ్ణి యాగపశువును చేసి యూపస్తంభానికి కట్టాడు. ఈ శునశ్శేఫుడు తనను యజ్ఞపశువుగా బలి చేస్తారనే భయంతో బ్రహ్మాది దేవతలను ప్రార్ధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. పితృదేవతలచే శునశ్శేపునకు బ్రహ్మ దయవల్ల బంధవిముక్తి అయ్యింది. హరిశ్చంద్రునకు యాగఫలం లభించేలా చేశాడు. బ్రహ్మ దేవతలు వచ్చి ఈ శునశ్శేఫుని విడిపించారు. కాబట్టి ఇతనికి దేవరాతుడనే పేరు వచ్చింది. ఈ శునశ్శేఫుడనే దేవరాతునిమీద విశ్వామిత్రునకు ప్రేమ కలిగింది.
శునశ్శేఫుని అమ్మిన కారణంగా తదుపరి అజీగర్తునకు పిశాచత్వం వచ్చింది. తన మూలంగా తండ్రికి పిశాచత్వం వచ్చిందని తెలిసికొన్న శునశ్శేపుడు గౌతమీతీరంలో తపస్సు చేశాడు. శివుడు విష్ణువు ప్రత్యక్షం అయ్యారు. వారి అనుగ్రహంతో ఈ శునశ్శేఫుడు తన తండ్రికి వచ్చిన పిశాచత్వాన్ని పోగొట్టాడు.)
ఈ శునశ్శేఫుణ్ణి నేను కళ్ళారా చూచాను. ఇతడు నాకు ప్రియమైన కుమారుడు. వీనిని మీరందరూ ప్రేమతో అన్న అన్న అని పిలవండి. ఇతణ్ణి గౌరవించండి అని విశ్వామిత్రుడు తన కొడుకులతో అనగా వారు మదించిన వారై
ఇతడు మాకు అన్న అగునా! బాగు బాగు. మేము ధన్యులమయ్యాం అంటూ గేలి చేస్తున్న తన కుమారులను చూచి, సంయమనం విడిచి "మీరు మ్లేచ్చులు అయిపొండి" అని శపించి వెళ్ళిపోతూ ఉండగా
ఆ సమయంలో తండ్రి ఇచ్చిన శాపానికి భయపడి విశ్వామిత్రసుతులలో నడిమివాడైన మధుచ్చందుడనే వాడు యాభైమంది సోదరులతోవచ్చి తండ్రికి నమస్కారంచేసి 'ఓ తండ్రీ నీవు చెప్పిన విధంగా ఈ శునశ్శేపుని మేము మాకు అన్నగా భావించి మన్నించి నమస్కరిస్తాము అని అనగా విశ్వామిత్రుడు ఆనందించి మంత్రద్రష్ట్ర అయిన శునశ్శేపుని వారిలో పెద్దవాణ్ణి చేసి (ఆ యాభై మందికి అగ్రజుని గావించి) మధుచ్చందునితో ఇలా అన్నాడు.
ఓ కుమారులారా! తండ్రిమాటను వినాలనే ధర్మం మీరు తప్పని కారణంగా ఈ శునశ్శేఫుడు నాకు కొడుకయ్యాడు. మీరంతా ఈ దేవరాతునితో ప్రేమతో ప్రవర్తించి మీరు కడుపారా సుతులను పొందండి.
అలా విశ్వామిత్రుడు మధుచ్చందాదులతో చెప్పాడు. శునశ్శేఫుడు దేవతలచేత విముక్తి పొందడంచేత దేవరాతుడని పేరు పొందాడు. మధుచ్చందుడు మొదలైన ఏబదిమంది దేవరాతునకు సోదరులయ్యారు. పెద్దవాళ్ళైన అష్టక, హారీత, జయంత, సమదులు మొదలైనవారు ఏబదిమంది వేరుగా వెళ్ళిపోయారు. ఈ క్రమంలో విశ్వామిత్రుని సుతులు, రెండు విధాలుకాగా విశ్వామిత్ర సుతులలోనే మరొక ప్రవర కలిగింది అని చెప్పి భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పే శుకుడు ఇలా అన్నాడు.
ఆ పురూరవుని కొడుకైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనస్సు అనేవారు జన్మించారు. వారిలో క్షత్ర వృద్దుడు అనేవానికి కుమారుడైన సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు కృత్స్నమదుడు అనే ముగ్గురు సుతులు కలిగారు. ఆ కృత్స్నమదునకు శునకుడు, శునకునకు శౌనకుడు, గొప్పవాడైన శౌనకునకు బహ్వృచ ప్రవరుడు జన్మించారు. ఆ బహ్వృచప్రవరుడు నియమవంతుడై తపస్సు చేసికోవడానికి వెళ్ళాడు.
ఇక కాశ్యుడు అనేవానికి కాశి, కాశికి రాష్ట్రుడు, రాష్ట్రునకు దీర్ఘతపుడు అనేవారు జన్మించారు.
(విశ్వామిత్రుని కొడుకులు రెండు భాగాలుగా విడిపోయారు. తండ్రి మాట విని శునశ్శేఫుని సోదరునిగా గ్రహించిన మధుచ్చందాదులు ఒకవర్గం, తండ్రి మాట వినక శాపగ్రస్తులైన అష్టక హారీత జయంత సమదాదులు వేరొక వర్గంగా ఏర్పడ్డారు. ఈ విధంగా విశ్వామిత్ర సుతులలో రెండు ప్రవరలు ఏర్పడ్డాయి. ప్రవర అంటే పై తరాల చరిత్ర.)
ఆ దీర్ఘతపుడనేవానికి విష్ణుమూర్తి అంశతో ఆయుర్వేదం తెలిసినవాడు, ఎల్లరు కొలువదగినవాడు అయిన 'ధన్వంతరి' జన్మించాడు. ఆ ధన్వంతరిని కీర్తనచేస్తే కష్టాలు బాధలు తీరుతాయి.
శ్రీ విష్ణుమూర్తి అంశతో జన్మించిన ధన్వంతరి యజ్ఞంలోని హవిస్సులు స్వీకరింప అర్హుడు. ధన్వంతరికి కేతుమంతుడు, అతనికి భూమరథుడు, భూమరథునకు దివోదాసుడని చెప్పబడే ద్యుమంతుడు జన్మించారు. ఆ ద్యుమంతునకు ప్రతర్దనుడు జన్మించాడు. ఆ ప్రతర్దనుడు శత్రుజిత్తని, ఋతధ్వజుడని పిలువబడ్డాడు. ఆ ప్రతర్దనునకు కువలయాశ్వుడు జన్మించాడు.
ఓ పరీక్షన్మహారాజా! కువలయాశ్వుడనే రాజు లలిత పుణ్యుడైన అలర్కుని కన్నాడు. ఆ అలర్కుడు భూమిని అరవై ఆరువేల ఏండ్లు పాలించాడు. అలర్కునివలె భూమిని పాలించినవారు లేరు.
ఆ అలర్కునకు సన్నతి, వానికి సునీతుడు, వానికి సుకేతనుడు, వానికి ధర్మకేతువు వానికి సత్యకేతువు, వానికి ధృష్టకేతువు, అతనికి సుకుమారుడు, అతనికి వీతిహోత్రుడు, అతనికి భర్గుడు, ఆ భర్గునకు భార్గభూమి జన్మించారు.
ఓ వంశశ్రేష్ఠా! కాశ్యవసుమతీశుని నుండి ఈ భార్గభూమి వరకు గల రాజులు క్షత్రవృద్ధుని వంశంలో పుట్టినవారై, కాశులనే పేరుతో భూమిపై ప్రసిద్ధి పొందారు.
క్షత్రవృద్దుని రెండవ కొడుకైన కుశునకు ప్రీతి, వానికి సంజయుడు, వానికి జయుడు, వానికి కృతుడు, వానికి హర్యధ్వనుడు, వానికి సహదేవుడు, వానికి భీముడు, వానికి జయత్సేనుడు, వానికి సంకృతి, వానికి జయుడు వానికి క్షత్రధర్ముడు పుట్టారు. వీరంతా క్షత్రవృద్దుని వంశంలోగల రాజులు.
రంభునికి రభసుడు, వానికి గంభీరుడు, వానికి కృతుడు జన్మించారు. ఆ కృతునకు బ్రహ్మకులం పుట్టింది. అనేనసునకు శుద్ధుడు, వానికి శుచి, శుచికి బ్రహ్మకు సారథ్యంచేసే త్రికకుత్తు జన్మించారు. ఆ త్రికకుత్తుకు శాంతరజుడు పుట్టాడు. ఆ శాంతరజుడు విజ్ఞాని, కృతకృత్యుడు విరక్తుడు.
ఓ పరీక్షన్మహారాజా! రజి అనేవానికి అధికమైన బలంగల ఐదువందల మంది కొడుకులు జన్మించారు. దేవతల ప్రార్ధనలు విని రజి ఎందరో రాక్షసులను చంపి స్వర్గాన్ని దేవేంద్రునకు ఇచ్చాడు. దేవేంద్రుడు కృతజ్ఞతగా రజి పాదాలకు నమస్కరించి, అతనికి దేవతాశరీరాన్ని ఇచ్చాడు. సంతోషంగా రజిని అర్చించాడు. కొంతకాలానికి రజి మృతి చెందాడు. అతని ఐదువందలమంది సుతులు దేవేంద్రుడు ప్రార్థించినా వినకుండా స్వర్గలోకాన్ని తామే పాలించారు. గర్వంతో యజ్ఞయాగాదులలో హవిస్సులను కూడా వారు స్వీకరించారు.
దేవతల రాజు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిచే హోమం చేయించి, ఆ హోమప్రభావంతో బలాన్నిపొంది తన వజ్రాయుధంతో రజి కుమారులను ఐదువందల మందినీ చంపి స్వర్గాన్ని తన హస్తగతం చేసికొన్నాడు.
అది అలా ఉండగా నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనబడే ఆరుగురు కొడుకులు ప్రాణికి, పంచేంద్రియాలు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియాలవలె జన్మించారు. వారిలో పెద్ద కొడుకైన యతికి నహుషుడు రాజ్యం ఇయ్యగా అతడు విరాగియై
(విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు. వైదికచ్చందం తర్వాత సృష్టించబడింది లౌకికచ్చందం. విశ్వామిత్ర సంభవుడు (కొడుకు) మధుచ్చంద. ఆయన వంశపరంపరలో యతి, యయాతి, సంయాతి, నాయాతి, వియతి, కృతి అనే వారు సంభవిస్తారు. ఇవన్నీ లౌకికఛందస్సంబంధితమైన పేర్లుకావటం విశేషం. మధుచ్చంద అనగా స్రవించే మధువు, ఛందంకూడా అంతే. యతులతో ఒప్పారి కృతి చివరగా కృతి ఉద్భవిస్తుంది.)
రాజ్యం పాపానికి మొదలు. ఈ రాజ్యం వస్తే ఒళ్ళు తెలియని గర్వం వస్తుంది. ఎంతటి జ్ఞానియైన రాజ్యాధికారం వస్తే ఎవరు పూజింపదగినవారో వారిని గుర్తించలేడు. అయినా ముక్తికోరేవారికి ఈ రాజ్యాలు గీజ్యాలు అవసరం లేదు కదా!
ఈ విధంగా మాట్లాడి యతి అనేవాడు రాజ్యాన్ని వదలి వెళ్ళిపోయాడు.
ఆ నహుషుడు నూరు యజ్ఞాలుచేసి, ఇంద్రపదవిని పొంది, ఇంద్రుని భార్య శచీదేవిని పొంద గోరి, మహర్షులు మోసే పల్లకినుండి సర్పమై జారి భూమిపై పడ్డాడు.
(నహుషుడు నూరు యజ్ఞాలు చేశాడు. దాని ఫలితంగా ఇంద్ర పదవి లభించింది. యజ్ఞం అనేది పవిత్ర కార్యం. అటువంటి నూరు యజ్ఞాలు చేయడం అందరివల్లా సాధ్యం కాదు. ఇన్ని యజ్ఞాలు చేసినా ఇంద్రపదవి పొందినా నహుషుని మనసులో పావిత్య్రం లేదు. తాను ఇంద్రపదవి పొందాడు. కాన ఇంద్రుని భార్య పరమపతివ్రత శచీదేవిని పొందగోరాడు. మహర్షులు పల్లకిపై నహుషుని శచీదేవి వద్దకు తీసికొనిపోతున్నారు. ఆ మహర్షులలో అగస్త్యుని శాపంవల్ల నహుషుడు సర్పమై నేలకూలాడు.
ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగి ఇంద్ర పదవినందినా మానసిక పావిత్య్రం లేనివానికి అధోగతి తప్పదు అని నహుషుని కథ అందరికి తెలియజేస్తుంది.)
అన్న అయిన యతి విరక్తుడు కాగా, తండ్రి అయిన నహుషుడు ఇంద్రలోకమున కేగగా యయాతి రాజై తన నలుగురు సోదరులకు నాల్గుదిక్కుల రాజ్యాన్ని భాగంగా ఇచ్చి, శుక్రుని కొమరితను, వృషపర్వుని కూతురును (ఇద్దరిని) వివాహమాడి న్యాయవర్తనుడైన యయాతి రాజ్యభారాన్ని వహించాడు.
అనగా విని పరీక్షిత్తు అనే రాజు ఇలా అన్నాడు.

Parashurama Story - పరశురాముని చరిత్రము
పరశురాముని చరిత్రము
ఓ ముని చంద్రమా! శుకమహర్షీ! ఇరువది ఒక్కమార్లు జమదగ్ని కుమారుడు రాముడు రాజులను ఏ కారణంగా చంపాడు? రాజులు చేసిన తప్పేమిటి? బ్రాహ్మణుడైయుండి కూడా రజోగుణ తమోగుణాలను అతడెందుకు పొందాడు? భూభారం ఏ విధంగా నివారింపబడింది? నా యీ మాటకు సమాధానం స్పష్టంగా చెప్పు.
పరీక్షిత్తు వేసిన ప్రశ్నలను విని శుకమహర్షి రాజుతో ఇలా అన్నాడు.
హైహయ వంశంలోని అర్జునుడు రాజులలో ఎన్నదగినవాడు. అతడు పురుషోత్తముని అంశావతారమైన దత్తాత్రేయుని ఆరాధనచేసి ఆయన దయవలన శత్రుజయం, వేయిచేతులు, అణిమాది గుణాలు, కీర్తి, బలం, యోగీశ్వరత్వం, ఓజస్సు, తేజం, వసివాడని ఇంద్రియాలు, ధనం పొందాడు. గాలి అడ్డులేకుండా నిరాటంకంగా అన్నిలోకాలలో ఎలా సంచరిస్తుందో అలా తాను ఎక్కడికైనా వెళ్ళేవిధంగా, వచ్చేవిధంగా తిరుగుతూ; ఎక్కడైనా తన ఆజ్ఞ చెల్లుబడి అయేవిధంగా; వినువీధిలో సూర్యునిలా భూమిపై ప్రకాశించాడు.
(దేవతారాధనను సక్రమపద్ధతిలో చేసేవారికి ఈ అష్టసిద్ధులు లభిస్తాయని ప్రతీతి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, ఈ ఎనిమిదింటిని అష్టసిద్ధులు అంటారు.)
ఒకనాడు కార్తవీర్యార్జునుడు తన కాంతులతోగూడి, బలగర్వితుడై; తన పట్టణాన్ని విడిచి రేవానదీ తీరానికి వెళ్ళి, తన భార్యలతో రేవానదీ స్వచ్చజలాలతో జలక్రీడలాడుతూ, తన పొడవైన హస్తపద్మాలతో నదీజలాలకు అడ్దుకట్టవేయగా; ఆ నదీజలం పొంగి ముందు భాగానకు ఉబికి, అక్కడ యుద్ధసన్నద్ధుడై ఉన్న రావణునిపై పడగా
ఈ విధంగా దిగ్విజయం చేయడంకోసం వచ్చిన రావణాసురుడు; ఆ కార్త వీర్యార్జునునిచే నదీజలం కట్టివేయబడి పొంగడాన్ని సహించక, రోసంతో వీరునివలె, ఆ గొప్ప పరాక్రమశాలి అయిన కార్తవీర్యార్జునునితో యుద్దానికి తలపడగా; ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురుని బలాన్ని లెక్కచేయక, తన బాహుబల పరాక్రమంతో రావణాసురుని జుట్టు పట్టుకొని మోకాళ్ళతో కుమ్మి కోతిలా కట్టి భటులచే చెరసాలలో వేయించాడు.
అటుపిమ్మట కార్తవీర్యార్జునుడు తన నగరమైన మహిష్మతీపురానికి వచ్చి
ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురునితో "ఓరీ ఇకపై మౌనంగాఉండు. ప్రపంచంలో నేనే వీరుణ్ణి అని విర్రవీగకు, రక్షించాను పో" అని సిగ్గుపడే మాటలు పలికి రావణుని పంపించాడు.
అటుపిమ్మట, ఒకరోజున కార్తవీర్యార్జునుడు దైవప్రేరితుడై అడవికి వేటకువెళ్ళి, వేటాడి అలసి, జమదగ్నిముని ఆశ్రమానికి వచ్చి, మునికి మొక్కి నిలబడగా, ఆ జమదగ్నిమహర్షి రాజైన కార్తవీర్యార్జునుని ప్రేమతో పూజించి, రాజునకు రాజభటులకు తన హోమధేనువుద్వారా మృష్టాన్నాలు సమృద్ధిగా పెట్టించాడు. ఆరగించినరాజు హోమధేనువు మాహాత్మ్యాన్ని చూచి దాన్ని సొంతం చేసికోవలెననే కోరికతో "నాకెన్ని సంపదలున్నా ఈ ఆవుముందు తక్కువే. నాకు సంపదలెందుకు? ఈ ఆవు చాలు. ఇటువంటి గోవులను మున్ను నేను ఎరుగను" అని అనుకుంటూ "ఈ హోమధేనువును పట్టితెండ" ని తన భటులకు ఆజ్ఞాపించాడు.
(కార్తవీర్యార్జునుడు సామాన్యుడుకాదు నారయణాంశజుడైన దత్తాత్రేయస్వామి ఉపాసనతో అణిమాది సిద్దులు పొందినవాడు. వేయిచేతులు, ఓజస్సు, తేజస్సు సంపదలుగలవాడు. తన ఆజ్ఞ అన్నిలోకాలలో చెల్లేటట్లు చేసికొన్న ప్రతాపశాలి.
ఐనా విచిత్రం ఏమంటే బడలిన తనకు తన భటులకు ఒక మహర్షి సేదతీర్చి ఇష్టాన్నాలు పెడితే, భుజించి, ఆనందపడి, కృతజ్ఞత చూపక జమదగ్ని అతిథిసత్కారాలకు ఆలంబనమైన హోమధేనువును కైవసం చేసికోవాలనుకొన్నాడు. అష్టసిద్దులున్నా అంతరంగం అదుపులో లేకపోతే అనర్దాలు తప్పవు.)
ఆ విధంగా కార్తవీర్యార్జునుడు ఆజ్ఞాపించగా అతని భటులు గర్వంతో వెళ్ళి.
"నా దూడను నాకు దూరంచేయకండి; నేను ఆపదలోపడ్డాను; రాజులు ఎదుటివారి గొప్పతనాన్ని ఓర్వరు కదా" అని తల్లి ఆవు అంబా అని ఆక్రోశిస్తూ బాధపడుతుండగా ఆ కామధేనువును కార్తవీర్యార్జునుని భటులు తమ పట్టణానికి తీసికొని వచ్చారు.
ఆ విధంగా కామధేనువుతో కార్తవీర్యార్జునుడు మాహిష్మతీపురానికి వచ్చాడు. అక్కడ పరశురాముడు తన తండ్రి ఉన్న ఆశ్రమానికి వచ్చాడు
ఔరార! మా యింట మృష్టాన్నం భుజించి, నా తండ్రి "వద్దువద్దు" అంటున్నా వినకుండా, ఆశ్రమాన్ని ఆక్రమించి, మా గోవును ఆ రాజు కార్తవీర్యార్జునుడు తీసికొనిపోయాడు. ఆ రాజు నేను పరశురాముడనని ఎరుగడు కాబోలు.
ఈ విధంగా పలికి
పరశురాముడు ప్రళయకాలాగ్నిలాగా, ఏనుగు కుంభస్థలాన్ని చీల్చడానికివచ్చే సింహంలాగా, భూమి అంతా అదిరిపోయేలా గొడ్డలి, కవచం, కోదండం, బాణం, మృగచర్మం, అమ్ములపొది ధరించి సాహసంతో కార్తవీర్యార్జునుని వెంటపడాడు.
పరశురాముడు క్రోధంతో వెళ్ళి మాహిష్మతీపురాన్ని చేరి నిలబడ్డసమయంలో
కార్తవీర్యార్జునుడు తనముందు, కయ్యాన్ని, విజయాన్ని కోరివచ్చినవాడు, విల్లు అమ్ములపొదులతో గండ్రగొడ్డలితో భయంకరాకారుడు, తీవ్రమైన కోపంతో కదిలే కనుబొమ్మలు కడచూపులుగలవాడు, జింక చర్మాన్ని మరెన్నో కంఠహారాలను ధరించినవాడు, గర్వించే రాజుల భార్యల మంగళసూత్రాలు లేకుండా చేసేవాడు అయిన పరశురాముణ్ణి చూచాడు.
కార్తవీర్యార్జునుడు చూచి కోపించి
ఈ పరశురాముడు వెర్రి బ్రాహ్మణుడు. ఇతడు బ్రహ్మజ్ఞానం కలిగి సాత్వికమైన ప్రవృత్తిగల బ్రాహ్మణునిలా ఉండక, బలంగల రాజులతో భయంలేకుండా యుద్దానికివచ్చాడు. ఇక మనకు పాపం అంటదు. క్షమించే పనిలేదు. ఈ బ్రాహ్మణుని కొట్టడానికి, నరకడానికి భూమిపై కూల్చడానికి లెండి!
(పరశురాముడు బ్రాహ్మణజాతికి చెందినవాడు. కార్తవీర్యార్జునుడు క్షత్రియజాతికి చెందినవాడు. సాత్త్విక ప్రవృత్తితో బ్రాహ్మణులు, రాజసప్రవృత్తితో క్షత్రియులు ఉండాలి. పరశురాముడు సత్త్వస్థితిలో ఉండక తనంత తానుగా క్షత్రియుల పైకి అందునా బలమైన క్షత్రియులపైకి యుద్దానికి వచ్చాడు. యుద్దానికి వచ్చిన బ్రాహ్మణుని హింసించడం దోషం, పాపం అనుకోవలసిన పనిలేదు. కాబట్టి మీరందఱు ఈ బ్రాహ్మణుని చంపడానికి లేవండి అంటూ తనని తాను కార్తవీర్యార్జునుడు సమర్థించుకుంటున్నాడు.)
ఈ విధంగా పలికి, సేనానాయకుని ఉత్సాహపరచగా, వాళ్ళు రథగజతురగపదాతిసమూహంతో, పదిహేడు అక్షౌహిణుల సంఖ్యతో ఎదుర్కొని బాణం చక్రం గద మొదలైన ఆయుధాలతో పరశురాముని బాధించగా, ఆ బ్రాహ్మణుడైన పరశురాముడు కన్నులనే సరస్సులలో నిప్పులు రాలగా అధికమైన కోపంతో ఎగిరిపడి, జందెము సరిచేసికొని, బొబ్బపెట్టి, గట్టిగా అదలిస్తూ, పరుషమైన గొడ్డలి చాచి, కార్తవీర్యార్జునుని సైన్యంపైకి ఉరికి, తొలకరిలో బీడు నేలను చదును చేసే రైతువలె శత్రుసేనలపాదాలు తెగగొట్టి, తోటమాలి అరటిబోదెలను నరికినట్లు సేనల నడుములు తెగగొట్టి, తాటిపళ్ళు రాల్చే వృక్షారోహకుడిలా శత్రుసేనల తలలు తెంచి, జంతువులను ఖండించి వండే వంట వాడివలె శత్రుసేనల అవయవాలుకోసి అంతటితో తృప్తిపడక ప్రళయకాలాగ్నిలా మంటలు క్రక్కుతూ, ధనుస్సుతో పిడుగుల వర్షాన్ని కురిపించే పెద్ద మేఘంలా బాణాలు కురిపిస్తూ, బలమైన భటుల సముదాయాన్ని బాధించి, అడ్డులేని పరాక్రమంతో తన కోపాగ్నిలో బాణాలవర్షం అనే నేతితో గుఱ్ఱపు రౌతులను ఆహుతి చేస్తూ గుఱ్ఱల కాళ్ళు తలలు నరికి, రథములు విరగగొట్టి, ఏనుగులను రథాలపైకి తోలి ఈ విధంగా శత్రుసేనలను బాణవర్షంలో ముంచి రూపుమాపగా
(21870 ఏనుగులు, 21870 రథాలు, 65610 గుర్రాలు, 109350 కాలిబంట్లు కలిగిన సేన అక్షౌహిణి (గురుబాలప్రబోధికవ్యాఖ్య - పుట 512).)
భూతాల గుంపులు మత్తెక్కి ఆనందనాట్యాలు చేసే విధంగా ఆ యుద్ధరంగమంతా నెత్తురు, కొవ్వు, మాంసఖండాలతో ఎర్రబారింది.
అప్పుడు, అరె బాగు బాగు. ఈ బాపడు ఒక్కడే నా సేనాసమూహాన్ని నేలకూల్చాడు. ఇక ఉపేక్షించకూడదు. నా భుజపరాక్రమంతో ఈ పరశురాముని విజ్బంభణం నిర్మూలిస్తాను.
అని పలికి, కార్తవీర్యార్జునుడు ఉత్సాహంతో ఐదువందల చేతులతో ధనుస్సులను పట్టుకొని, మిగిలిన ఐదువందల చేతులతో వింటినారుల చప్పుళ్ళతో, క్రూరమైన వాడిబాణాలను సమకూర్చి ఓ బాపడా నీ గొడ్డలితో సహా నిన్ను కూలగొడతాను చూడు మంటూ బాణపరంపరను పరశురామునిపై ఎడతెరిపి లేకుండా వేసి బాధించాడు.
వేగంగా వేసిన ఐదువందల బాణాలు గుండ్రంగా ఏర్పడగా వాటిమధ్యనున్న కార్తవీర్యార్జునుడు పరివేష మండలం మధ్యలో ప్రచండసూర్యుడిలా అందగించాడు.
ఈ విధంగా కార్తవీర్యార్దునుడు తన బాణప్రయోగంలో సొంపు చూపగా.
ప్రపంచంలోనే మేటి విలుకాడు, గొప్పవాడు, బాపడైన పరశురాముడు, ఒక ఉగ్రమైన ధనుస్సున బాణాన్ని సంధించి, కార్తవీర్యార్జునుని ధనుస్సులను విరుగగొట్టాడు. కార్తవీర్యార్జునుడు అంతటితో ఊరుకోక వేగంగా పరశురామునిపై చెట్లను విసిరాడు. తీక్ష్ణమైన గొడ్డలి అంచుతో పరశురాముడు కార్తవీర్యార్జునుని చేతులను నరికివేశాడు.
కార్తవీర్యార్జునుని చేతులు తెగగా, కొండ శిఖరంలా అతని శిరస్సు మాత్రం మిగిలింది. శత్రుజనులకు సంతాపం కలిగించే పరశురాముడు వేగంగా అతని తలనుకూడ తెగనరికాడు.
తండ్రి కార్తవీర్యార్జునుడు నేలకూలగా అతని పదివేలమంది కొడుకులు పరశురాముని ఎదుర్కొనలేక యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోయారు. శత్రు భయంకరుడైన ఆ పరశురాముడు ఆపై దూడతో సహా ఆవును తీసికొని వెళ్ళాడు.
ఈ విధంగా హోమధేనువును తిరిగితెచ్చి ఇచ్చి తండ్రికి, తోడబుట్టిన వారికి తన పరాక్రమాన్ని తెలియజెప్పేసరికి జమదగ్ని పరశురామునితో ఇలా అన్నాడు.
ఓ కుమారా! దేవత లందరూ తమ తమ పరాక్రమాన్ని తెచ్చి ఒకచోట పెట్టి రాజును చేస్తారు. ఆ విధంగా గొప్పవేలుపైన రాజును పట్టుదలతో వెళ్ళి ఎందుకు చంపావు?
ఓర్పు మనకుండవలసిన ధర్మం, అన్ని ధర్మతత్త్వాలకు ఓర్పే మూలం. అటువంటి ఓర్పు ఉందనే ఈశ్వరుడు మనల్ని బ్రహ్మపదాన్నంతటిని పాలించేలా చేస్తాడు.
ఓ కుమారా! ఓర్పు ఉన్నవారికి సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య లభిస్తుంది. అన్ని సౌఖ్యాలు ఓర్పుతోనే లభిస్తాయి. సదయుడైన విష్ణువు క్షమ కలిగినవారిని మెచ్చుకుంటాడు.
ఓ కుమారా! మహారాజును చంపుట అనేది కోపంతో బాపని చంపినదానికంటె ఎక్కువ పాపం. ఇక నీవు మారుమాటాడక, ఈ పాపం పోయేలా తీర్థయాత్రలకు వెళ్లు.
ఓ పరీక్షన్మహారాజా! ఆ విధంగా తండ్రి ఆజ్ఞాపించగా, మహాప్రసాదం అని ఆ పరశురాముడు శీఘ్రంగా ఒక సంవత్సరం ప్రయాణం చేసి ప్రయత్నపూర్వకంగా తీరయాత్రలను సేవించి తిరిగివచ్చాడు.
ఒకరోజున జమదగ్ని భార్య రేణుక నీటికోసం గంగానదికి వెళ్ళి, ఆ గంగాప్రవాహంలో అప్పరఃకాంతా సమూహంతో సాగసుగా జలవిహారం చేస్తున్న వానిని; చూడవీలుగానివానిని పద్మమాలికలు ధరించిన చిత్రరథుణ్ణి, తన భర్త ఆజ్ఞను మరచి ఆసక్తితో చూస్తూ ఉండిపోయింది.
ఈ విధంగా గంధర్వరాజైన చిత్రరథుణ్ణి చూచిన కారణంగా ఆలస్యంచేసి
అయ్యో! గంగకు వచ్చి చాల జాగైంది. హోమ సమయంకూడా దాటిపోయింది. నేనిక్కడ ఇలా ఉండి పోయానేమిటి? మునీశ్వరుడు జమదగ్ని ఏమంటాడో అనుకుంటూ వెంటనే నీటి కడవను తలకెత్తుకొని వచ్చి అక్కడపెట్టి నమస్కరించి చేతులు జోడించి భర్తముందు నిలబడగా చూచి
అప్పుడు, తపస్వి అయిన జమదగ్ని తన భార్య ఎందుకు ఆలస్యంగా వచ్చిందో అన్న విషయాన్ని దివ్యదృష్టితో గ్రహించి, మదించిన దీనిని చచ్చేలా కొట్టండి అని తన సుతులకు చెప్పగా ఆ కుమారులు దుఃఖిస్తూ తమ తల్లిని చంపలేకపోయారు.
జమదగ్ని మహర్షి తన భార్యను చంపని కొడుకులను, తన భార్య రేణుకను చంపుమని పరశురాముని ఆజ్ఞాపించగా అతడు తండ్రి అడుగులకు మొక్కి వెనకాడక అన్నలను తల్లిని ఖండించాడు.
పరశురాముడు తన తల్లిని సోదరులను చంపుమని తండ్రి ఆజ్ఞాపించగా, "తాను చంపకపోతే కీడు కలిగేలా జమదగ్ని శపిస్తాడు. అలాకాక తండ్రి ఆజ్ఞను పాటిస్తే, తపోధనుడైన తండ్రి, తల్లిని, సోదరులను, తప్పక బ్రతికించగలడు" అని భావించి వెంటనే తల్లిని సోదరులను చంపాడు. తన తండ్రి గొప్పతనం తెలియకపోతే తండ్రిపై అంత నమ్మకం లేకపోతే చంపడానికి పరశురామునికి చేయాడుతుందా? ఆడదు కదా!
పరశురాముడు ఎదురుచెప్పకుండా గొడ్డలితో జమదగ్ని భార్యను, సుతులను వధింపగా జమదగ్ని తల ఊపుతూ మనస్సులో మెచ్చుకొన్నాడు.
మెచ్చుకొన్న తండ్రిని చూచి పరశురాముడు వెంటనే 'ఈ చచ్చిపడి ఉన్న వారి ప్రాణాలను ప్రసాదించాన'ని చెప్పు అని తండ్రి పాదాలకు నమస్కరించాడు. ముని వారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించగా వాళ్ళు ఎప్పటిలాగా లేచి నిలిచారు.
తన తండ్రి జమదగ్ని - చనిపోయిన తన తల్లిని, సోదరులను బతికింపగల సామర్థ్యం గలవాడని తెలిసి పరశురాముడు వారిని చంపాడు. అత డలాచంపాడు కదా అని తన తండ్రి ఆజ్ఞాపించినా ఎవ్వరూ తల్లిని సోదరులను చంపకూడదు.
(లోకంలో కొంతమంది మహాత్ములు ఉంటారు. వారు నిగ్రహానుగ్రహసమర్థులు. వారు ఏ పనైనా చేయగలరు. అలాంటి సమర్థుడు జమదగ్ని, ఈ విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం కొడుకు పరశురామునకు ఉన్నది. అందుకే తండ్రి ఆజ్ఞను పాలించి కన్నతల్లిని సోదరులను కుఠారంతో నరికి వేశాడు. తండ్రిని తిరిగి బతికించమని ప్రార్ధించాడు. సమర్ధుడైన జమదగ్ని తన భార్యను పిల్లలను తిరిగి బ్రతికించాడు. దీనిని ఉదాహరణగా తీసికొని నా తండ్రి చంపమన్నాడంటూ లోకంలో మిగిలినవారు తల్లిని సోదరులను సంహరిస్తారేమో, పితృవాక్య పరిపాలనకు కట్టుబడ్డామంటారేమోనని కవి ఈ అంశాన్ని గూర్చి స్పష్టంగా అందరికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏ గ్రంథానికైనా ప్రయోజనం ప్రపంచ శ్రేయస్సు. చారిత్రక విషయాలను, సత్యాలను, స్పష్టంగా సూటిగా కవి చెప్పవలసి ఉంటుంది. ఎవరో ఏదో చేశారని అవన్నీ మనం చేయలేము. చేయకూడదు కూడా. అందుకే పరశురామ కథాప్రసంగంలో అపూర్వ ప్రయోజనాన్ని ఆశించి కొసమెరుపుగా ఈ పద్యాన్ని చెప్పాడు కవి.)
పరశురాముని ముందు నిలబడలేక ఓడి పారిపోయిన కార్తవీర్యార్జుని సుతులు, తమ తండ్రి మరణించినందులకు చాల బాధపడి, తగిన సమయంకోసం ఎదురుచూస్తూ, ఒకరోజు పరశురాముడు తన అన్నలతో అడవికి వెళ్ళిన వేళ పగ తీర్చుకోవడానికి ఇదే అదనని వచ్చి, హోమశాలలో నిశ్చలంగా కూర్చొని, తన చిత్తంలో పరమేశ్వర ధ్యానం చేస్తున్న జమదగ్ని మహర్షిని, రేణుక అడ్డువచ్చి ఆపు చేస్తున్నా ఆగక, కదలకుండా గట్టిగా పట్టుకొని అతని తల నరికి వెళ్ళారు.
అంతేకాక, కార్తవీర్యార్జునసుతులు తమ తండ్రిని నీవు చంపిన వైరం మరచిపోకుండా, ఈనాడు వచ్చి మీ తండ్రిని చంపారు. ఓ పరశురామా! ఈ శత్రువులను శిక్షించుటకురా అంటూ ఆ ముని కళేబరం పైపడి రేణుక బాధాతప్తహృదయంతో పరశురాముడు వచ్చి చూచేసరికి ఇరవై ఒక్కమార్లు గుండెపై మోదుకొన్నది.
ఈ విధంగా రోదిస్తున్న తల్లి మొరవిని జమదగ్ని సుతులు అక్కడకు వచ్చి ఇలా దుఃఖించారు.
ఓ తండ్రీ! నీ కొడుకులు తోడు రాకుండా వాకిలి నుండి కూడా కదలవు గదా! అలాంటి నీవు కార్తవీర్యార్జునుని కొడుకులవల్ల శ్రమపడి స్వర్గానికి (ఒంటరిగా) ఎలా వెళ్ళగలిగావు?
ఈ ప్రకారంగా దుఃఖిస్తూ ఉన్న సోదరులతో పరశురాముడు ఇలా అన్నాడు.
అన్నలారా! దుఃఖించకండి. మన తండ్రి శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను పగతీర్చుకొని వస్తాను అంటూ తన చేతి గండ్రగొడ్డలి అంచుకాంతి అధికంకాగా భయంకరుడై పరశురాముడు కోపంతో కార్తవీర్యార్జునుని కొడుకులున్న పట్టణానికి వెళ్ళి బ్రహ్మఘాతులైన ఆ అర్జున పుత్రులను పట్టి చంపాడు.
ఓ పరీక్షన్మహారాజా! పరశురాముడు శత్రువుల శిరస్సులు తెగగొట్టి కొండలుగా పోగులు పెట్టాడు. ఆ యుద్ధంలో రాజులు శత్రువులు భయపడేలా పెద్ద రక్తనదులు పొంగిపారాయి.
పరశురాముడు అంతటితో ఆగకుండా
తన తండ్రిని చంపిన రాజపుత్రులపై పగతీర్చుకొనే నిమిత్తం, లోకంలో క్షత్రియ శబ్దం లేకుండా ఇరవై ఒక్కమార్లు పరశురాముడు క్షత్రియులనందరిని వెదకి వెదకి చంపాడు. పగ తీర్చుకోకపోతే అతడు కొడుకేనా?! ప్రతీకారం తీర్చుకొని పరశురాముడు నిజమైన కొడుకు అనిపించుకున్నాడు.
ఆ పరశురాముడు శత్రురాజులను దునుమాడిన రక్తంతో శమంతకపంచకమనేచోట తొమ్మిది మడుగులుచేసి, తన తండ్రియొక్క తెగిన శిరస్సును శరీరంతో కలిపి, తాను సర్వదేవ స్వరూపుడు కాబట్టి తనను ఉద్దేశించి యాగాన్ని నిర్వహించి హోతకు తూర్పు భాగాన్ని బ్రహ్మకు దక్షిణ భాగాన్ని అధ్వర్యునకు పశ్చిమభాగాన్ని, ఉద్గాతకు ఉత్తరదిక్కును మిగిలినవారికి మిగిలిన విదిక్కులను, కశ్యపునకు అన్నిదిక్కుల మధ్యలో గల భూమిని, ఉపద్రష్టకు ఆర్యావర్త ప్రాంతాన్ని సదస్యులుగా వచ్చిన బ్రాహ్మణ సభ్యులకు తక్కిన ప్రాంతాలను దానంగా ఇచ్చి, బ్రహ్మనదిగా పేరు పొందిన సరస్వతీనదిలో అవభృథ స్నానంచేసి పాపరహితుడై మేఘాలనుండి వెలువడ్డ సూర్యునిలా గొప్పకాంతితో ప్రకాశించాడు. అంతలో
(యజ్ఞయాగాది క్రియలలో అన్ని వేదాలకు సంబంధించిన క్రియాకలాపాలు జరుగుతాయి. అందుకొరకు ఋగ్వేదాన్ని చదువుతూ ఆ ఋగ్వేదంలో చెప్పబడ్డ క్రియలు ఆచరించే వ్యక్తిని హోత అని, యజుర్వేదాన్ని చదువుతూ తత్క్రియలను నిర్వహించే వానిని అధ్వర్యుడని, సామవేదాన్ని గానంచేస్తూ యజ్ఞక్రియను నడిపేవానిని ఉద్గాత అని, మొత్తం యజ్ఞక్రియనంతటిని పర్యవేక్షించే వానిని ఉపద్రష్ట అని అంటారు. అంతేగాక ఈ యజ్ఞానికి ఆధ్యక్షం వహించి నిర్వహింపచేసేవాడు బ్రహ్మ అనే పేరుగల స్థానంలో ఉండేవాడు. యాగాన్ని నిర్వహించేవేళ ఎందరెందరో బ్రాహ్మణోత్తములు చూచే నిమిత్తం ఆహూతులై, అనాహూతులై కూడా వస్తారు. వారు సదస్యులు. ఇలా యజ్ఞనిర్వహణ చాల ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇంత జరిగినా ఎక్కడైన మంత్రంలోగాని, స్వరంలోగాని, అక్షరాల ఉచ్చారణలోగాని, ద్రవ్యాల నిర్వహణలోగాని తక్కువతనం లేదా ఎక్కువతనం - దీనినే న్యూన అతిరిక్తదోషం అంటారు. ఇది ఏర్పడితే ఆ దోషనిమిత్తం యజ్ఞాంతంలో ఒక పవిత్రస్నానాన్ని మంత్రపూతంగా యజ్ఞ దీక్షలో ఉన్నవారు నిర్వహిస్తారు. దానినే అవభృథ స్నానం అంటారు.)
రాజా! ఆప్తుడైన పరశురామునివల్ల శరీరాన్ని పొందిన జమదగ్ని తన తపోబలంతో ఆకాశంలో ఉన్న సప్తర్షి మండలంలో ఏడవ నక్షత్రంగా వెలుగులు చిమ్ముతున్నాడు.
(సప్తర్షి మండలంలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని అనేవారున్నారు)
జమదగ్ని మహర్షి పుత్రుడు, గొప్పవాడు, పద్మాక్షుడు అయిన పరశురాముడు కీర్తి గలవాడై రాబోయే మన్వంతరంలో సప్తర్షులలో ఒకడై ప్రకాశిస్తాడు.
(డెబ్బది యొక్క దివ్య యుగాల కాలం ఒక మన్వంతరం. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతర కాలంలో ఉన్నాం.)
పరశురాముడు ప్రశాంతచిత్తుడై, బంధాలు విడివడినవాడై, యోగ్యుడై, గంధర్వులు, సిద్దులు మొదలగువారు కీర్తిస్తుండగా మహేంద్ర పర్వతంపై ఉన్నాడు.
ఓ పరీక్షన్మహారాజా! భగవంతుడైన విష్ణువు ఈ విధంగా భృగువంశంలో పరశురాముడై జన్మించి పగతో యుద్ధంలో రాజులందరిని భూభారం తగ్గేవిధంగా పలుమార్లు చంపాడు.
(భగవంతుడు - షడ్గుణైశ్వర్య సంపన్నుడు. షడ్గుణాలు: ఐశ్వర్య, బల, శక్తి , వీర, జ్ఞాన, తేజస్సులు ఆరూన్నూ కలవాడు భగవంతుడు.)

Saturday, March 28, 2026
The Chandra Vansha King Legends - చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము
చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము
ఓ రాజచంద్రా! చంద్రకాంతివలె తెల్లనైన చంద్రవంశంలో చంద్రునివలె తెల్లని కీర్తితో పుట్టి పుణ్యాత్ములైన ఐళాది రాజుల చరిత్రను ఇకపై విను.
వేయితలలు గల శ్రీహరి నాభికమలం నుండి ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. సుగుణాలలో అతనితో పోల్చదగిన సమర్థుడైన అత్రి ఆ బ్రహ్మకు పుట్టాడు. అత్రి క్రీగంటి చూపులనుండి కలువల చెలికాడు చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ ఆజ్ఞతో ఆ చంద్రుడు బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్రసమూహానికి రాజయ్యాడు. చంద్రుడు రాజసూయ యాగాన్నిచేసి, ముల్లోకాలను జయించి, మూర్ఖత్వంతో వెళ్లి, సౌందర్యవతి అయిన బృహస్పతి భార్య తారను ఆమె ఇంటినుండి తనతో తీసికొని వచ్చాడు. దేవగురువు బ్రతిమాలినా అతని భార్య తారను చంద్రుడు విడిచిపెట్టలేదు.
అప్పుడు దేవతలతో రాక్షసులకు యుద్ధం అయింది. బృహస్పతితో విరోధంవల్ల శుక్రాచార్యుడు రాక్షసులతో కలిసి చంద్రుని పక్షంచేరి బృహస్పతిని తరిమాడు. ఈశ్వరుడు తన భూతగణపరివారంతో బృహస్పతిపక్షాన నిలిచాడు. ఇంద్రుడు దేవతాసమూహంతో బృహస్పతికి సాయంగా నిలిచాడు. ఆ సమయంలో బృహస్పతిభార్య తార కారణంగా దేవతలకూ, రాక్షసులకూ వినాశం కలిగించే యుద్ధం జరిగింది. అంతలో బృహస్పతి తండ్రి అంగిరసుడు చెప్పగా బ్రహ్మ చంద్రునిపై కోపించి గర్భవతియైన తారను బృహస్పతికి తిరిగి ఇప్పించాడు. బృహస్పతి తారను చూచి ఇలా అన్నాడు.
ఓ దుష్టురాలా! ఏ మాత్రం సిగ్గు లేకుండా, వెలయాలివలె ధర్మాన్నీ, కీర్తిని మంటగలిపి జారుడైన చంద్రునితో పొందుకోరి గర్భాన్ని తెచ్చుకోవడం నీకు తప్పుగా తోచడం లేదా! ఇప్పుడే ఈ గర్భాన్ని దించుకో. నిన్ను కాల్చేస్తాను అసలు నిన్ను చూచి అభీమానవతులు మెచ్చుకుంటారా?
తారపై ఈ విధంగా బృహస్పతి ఆగ్రహిస్తుండగా, ఆ తారకు బంగరు రంగు గల ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను చూచి మోహాన్ని పొందిన బృహస్పతి 'ఈ బిడ్డ నా బిడ్డ' అని, చంద్రుడు 'ఈ సుతుడు నా సుతుడే' అనీ వాదులాడుకున్నారు అప్పుడు
వారు వాదులాడుకోవడం ఆపు చేయడానికి వచ్చిన మునులు 'ఆ బిడ్డ ఎవరి బిడ్డ' అనే విషయాన్ని నిర్ణయించలేక, దేవతలను అడిగారు. ఈ విషయం ఆ వగలాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలియదన్నారు దేవతలు.
ఈ మాటలు విని సిగ్గుతో నిలిచిన తారతో అందాల కుమారుడిలా అన్నాడు.
ఇంటి పరువు పోయేలా, బంధువులు తలవంచుకొనేలా, భర్త అసహ్యించుకొనేలా అన్యులవల్ల నన్ను ఎందుకు కన్నావు? తల్లీ! నా తండ్రి చంద్రుడా? బృహస్పతా?
ఇలా అడుగుతూ ఉన్న కొడుకునకు జవాబు చెప్పలేక నిలిచిన తారను బ్రహ్మ ఏకాంతానికి పిలిచి రహస్యంగా ఇలా అన్నాడు.
ఓ కాంతా! నీ సిగ్గు విడిచి ఈ చిన్ని బాలుని తండ్రి దేవగురుడో, చంద్రుడో చెప్పుము. ఎందుకు దాస్తావు? ఈ ఆలోచన నీకే పుట్టిందా? నిట్టూర్పులు విడవడం మాను. సహజంగా కాంతలు కాముకురాండ్రు కదా! మాట చెప్పినంత మాత్రాన నష్టం రాదు. నే నెవ్వరికీ చెప్పను. నిజం చెప్పుము.
అలా మాట్లాడిన బ్రహ్మకు ఎదురు చెప్పలేక తార రహస్యంగా ఈ బిడ్డను చంద్రునివల్ల కన్నాను అని చెప్పగా, ఆ బిడ్డకు బుధుడని పేరుపెట్టి ఆ బాలుని చంద్రునకిచ్చి బ్రహ్మ వెళ్ళిపోయాడు.
బుద్ధిమంతుడైన బుధుడు తన సుతుడుకాగా, చంద్రుడు వృద్ధి పొంది, ఆకాశాన్ని తాకాడు. జ్డానం కలిగిన కొడుకును కన్నతండ్రి ఆనందంతో ఉప్పాంగి ఆకాశాన్ని అందుకోడా?!
ఆ బుధునికి ఇంతకుమునుపు చెప్పినట్లు ఇళా కన్యకవల్ల పురూరవుడు జన్మించాడు. అతడి సౌందర్యాన్నీ శౌర్యాదిగుణాలను ఇంద్రసభలో ఊర్వశి నారదుడివల్ల విన్నది. మిత్రావరుణుల శాపంవల్ల ఆమె మనుష్య స్వరూపాన్ని ధరించి భూలోకానికి వచ్చింది.
ఊర్వశి తామరలవంటి కన్నులు కలవాడు, సింహం నడుమువంటి నడుము కలవాడు, వెడదఱొమ్ము కలవాడు, మహాభుజుడు, అందమైన చంద్రునివంటి కాంతిమంతమైన మొగము కలవాడు, సుకుమారుడు, పురుషశ్రేష్ఠుడయిన పురూరవుణ్ణి చూచి, మన్మథుడు వేసే పూల బాణాలకు మనసు చిన్నబోగా వివశురాలై నిలిచి ఉన్న సమయంలో
పురూరవుడు ఊర్వశిని చూచి ఇది మన్మథుని బాణమా? మబ్బును వదలిన మెరుపా? మోహినీ దేవతయా? ఆకాశలక్ష్మియా? దీనిచేయి పట్టకుంటే జీవితం ఎందుకు? అనుకుంటూ తామరాకు పై నీటిబొట్టులాగా మన్మథ బాణాలవల్ల చలించిపోయాడు.
ఈ విధంగా రాజపుత్రుడు పురూరవుడు మన్మథ బాణాలకు గురియై, ఎలాగో స్తిమితపడి ఊర్వశితో ఇలా అన్నాడు.
ఓ అబలా! నీవు ఎక్కడనుండి వస్తున్నావు? మనకిద్దరికి ఈడు జోడు సరిపోతుంది. నీకు నేను దక్కాను. మన్మథుని బాణపు దెబ్బలతో నాకు దిక్కు తోచడం లేదు. నేను అసత్యం ఆడటం లేదు. నా శరీరానికి నీ శరీరాన్ని నా చేతికి నీ చేతిని, నా చెక్కిలికి నీ చెక్కిలిని చేర్చి తగినరీతిగా ఆపదలోనున్న నన్ను కాపాడు.
పురూరవుని పలుకులు విని, ప్రాఢురాలైన ఊర్వశి ఇలా అంది.
చంద్రవంశ సంజాత శ్రేష్ఠా! విశేష విలాసాలను కోరే పురూరవా! ఈ రెండు పొట్టేళ్ళు నాకు చాలా ఇష్టమైనవి. వీటిని ఎల్లప్పుడు నీవు రక్షించాలి. నా వద్ద నీ వెప్పుడూ దిగంబరుడవై ఉండకూడదు. నేను భుజించే నేయి నీవు కూడా తినాలి. ఈ అంశాలకు నీవు అంగీకరిస్తే నేను నిన్ను మన్మథ వినోదాలలో ఓలలాడిస్తాను. నీకు అంగీకారమేనా?
ఇలా పల్కిన దేవవేశ్య ఊర్వశి పలుకులకు తన అంగీకారాన్ని పురూరవుడు తెలిపి తన మనసులో (ఇలా అనుకున్నాడు)
ఈమె ఆకారం సుందరం, అనురాగం అనుకూలం, దేవవేశ్య, మన్మథునిచే మనసు చంచలంకాగా నన్నుకామించింది. ఇంతకంటె మేలు ఉంటుందా?
ఈ విధంగా ఒక నిశ్చయానికి వచ్చి, పురూరవుడు చంద్రముఖి ఊర్వశిని బంగారు మేడలలో, చెట్ల నీడలలో, తోటలలో రత్నాల చావిళ్ళలో, సరస్సులలో పర్వత పార్శ్వాలలో శృంగార క్రీడలలో ముంచి తేల్చాడు.
అలా అన్నిచోట్ల రతిక్రీడాసక్తులైన ఆ ఊర్వశీపురూరవులకు విడదీయరాని అనుబంధం ఏర్పడగా
ఒకప్రక్కకే వా రుభయులు వెళ్ళి, ఒకచోటనే ఉండి, తమ ఇరువురి మనసులలో ఒక విషయాన్నే ఆలోచిస్తూ, ఒక్క నిమిషం కూడా ఒకరి నొకరు వదలక ఊర్వశీ పురూరవులు ఉంటారు.
ఊర్వశీపురూరవుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ, సత్యశీలత, దాంపత్య ధర్మం దేవునికి మాత్రమే తెలుసు. ఇద్దరికి మధ్య పైటకొంగు అడ్డమైనా 'ప్రాణాలు వదిలేస్తారా' అన్నంతగా కలిసి ఉండేవారు.
ఈ విధంగా ఊర్వశీ పురూరవులు ఇరువురు ఒకరిపై ఒకరికి ప్రేమ అధికంకాగా పగలనక రేయనక అన్నిచోట్ల విహరిస్తూ ఉండగా, ఒకరోజు దేవలోకంలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నవేళ సభలో ఊర్వశి లేకపోవడంచూచి.
ఇన్నాళ్ళవలె నా సభాంతరములోని వేదిక ఊర్వశి లేకపోవడంచేత వన్నె తగ్గిన పైడిలా తెల్లబోయి ఉంది అంటూ
ఇంద్రుడు గంధర్వులను పంపించగా, వారు అర్ధరాత్రమున చీకటిలో వెళ్ళి, ఊర్వశి పెంచుకుంటున్న పొట్టేళ్ళను బంధించారు. అవి రెండు మొర పెట్టాయి. ఆ ఆర్తనాదాలను విని శృంగార క్రీడలలో అలసి నిద్రిస్తున్న పురూరవుని ఆలింగనంలో ఉన్న ఊర్వశి ఇలా అంది.
నా బిడ్డలైన పొట్టేళ్ళను దొంగలువచ్చి, అహంకారంతో, మదంతో తీసికొనిపోతున్నారు. ఆ దొంగలకు అడ్డుపడలేక ఈ మగపంద నిద్రలో కళ్ళు మూసికొని నా కౌగిలి వదలకుండా పడి నిద్రపోతున్నాడు అయ్యో!
శత్రువులు దొంగలను పంపితే, వారిపై తన పౌరుషాన్ని చూపలేక, ఆడువారి కౌగిళ్ళలో మగతనాన్ని చూపే మగాడు, పురుషుడుగా ఉండటంకంటె ఆడుదిగా ఉంటే బాగుంటుంది.
తక్కువతనము గలవానికి భార్య కావడంకంటె అధిక గుణసంపన్నుని ఇంటిలో దాసిగా ఉండటం ఆడవారికి మేలు. నీచుణ్జి పొంది ఆడుతనాన్ని హింసించడంకంటె పొందుకోరక ఊరకే ఉండటమే మంచిది.
నీ రాచరికం ఎందుకు? ఒక ఆడుది మొరపెడుతూ ఉంటే, పశువులు ఆతురపడుతూ ఉంటే, ఆడుది పిలుస్తోంది కదా అని లేవవు, దొంగలను దూరంగా తరిమికొట్టవు. శవంలా పడి ఉంటావు.
విని కూడా ఏమీ విననట్లుగా ఉంటావు; యుద్ధభీతి గలవాడిని, మనుజులలో అధముని, ఎల్లప్పుడు నిద్రపోయేవాడిని మందుడు అయిన నిన్ను చక్రవర్తిని చేసిన బ్రహ్మకంటె వెర్రివాడు ఉంటాడా (ఉండడు అని భావం).
అని ఈ ప్రకారంగా ఆ ఊర్వశి కఠినపు మాటలనే కత్తులు చెవిలో చొప్పించగా, రాజశ్రేష్ఠుడైన పురూరవుడు అంకుశపు పోట్లకు విజ్బంభించే మత్తేభంవలె, బట్టమరచి, దిగంబరుడై, కత్తి చేతబట్టి, ఆ అర్ధరాత్రంలో, దొంగలను నరకి, పొట్టేళ్ళను విడిపించుకొని, తిరిగివచ్చే సమయంలో
దిగంబరంగా ఉన్న పురూరవుణ్ణి ఊర్వశి చూచింది. అనుకున్న మాట ప్రకారంగా ఊర్వశి అతనికి కనపడకుండా వెళ్ళిపోయింది. ఆమె అదృశ్యం కాగా, పురూరవుడు వెఱ్ఱివాడిలా తనను తాను స్వాధీనపరచుకోలేక మిక్కిలి దుఃఖించి అవస్థ పడ్డాడు.
పురూరవుడు మన్మథుని బాధకు తాళలేక ఊర్వశి కొరకు అన్వేషిస్తూ, సరస్వతీ నదీతీరంలో సఖీజనంతో కూడి ఉన్న ఊర్వశిని చూచి వికసించిన మోముతో ఇలా అన్నాడు.
ఓ ఊర్వశీ ఇలా నన్ను విడచి రావడం నీకు ధర్మమా! సంతోషమా! మనం కొన్ని ఒడంబడికలు చేసికొన్నాము కదా! అవి మేర తప్పటం బాగున్నదా! నిన్ను నేను విడిచినప్పటినుండి నా శరీరం నా స్వాధీనంలో లేదు. ఈ శరీరం భూమిపై పడకపూర్వమే (చనిపోక పూర్వమే) నన్ను దయాదృష్టితో వీక్షించు.
పురూరవుని పలుకులు విని ఊర్వశి ఇలా అన్నది.
స్త్రీలకు ఇంతగా లొంగిపోతావు. నీవసలు మగవాడవేనా? ఇలా మృగంలా దుఃఖించడం నీకు న్యాయమా? మనుష్యరూపంలో ఉన్న పశువును చూచి పశుజాతి “మనకంటె వీళ్ళు అజ్ఞానంగా ఉన్నారే” అనే భావంతో అసపహ్యించుకుంటాయి తప్ప కనీసం ఆహారంగానైనా స్వీకరించవు.
అంతేకాకుండా, వెలయాండ్ర ఆలోచనలు అగ్నిహోత్రాలవలె మంటలెగసిపడుతున్నాా మాటలు తీయని అమృతవర్షంలా ఉంటాయి. సాక్షాత్తుగా మన్మథుడే భర్త అయినా మెచ్చే లక్షణం వీరికి ఉండదు. అంతటి అందగాడైన మన్మథునే మెచ్చని వీరు ఇతరులను ప్రేమిస్తారా? కృతజ్ఞతలేక, క్రూరమైన భావాలు కలిగి తనకు తోడునీడగా ఉండే భర్తనైనా చంపడానికి వెనుకాడరు. ధర్మం లేనివారు, దయలేనివారు, చంచలమైన మానసిక స్థితిగలవారు వీరు. అటువంటి వేశ్యల మాటలు జ్ఞానాన్ని ఉపదేశించే వేదాంతసూక్తా లనుకొన్నావా?
ఓ రాజా! పురూరవా! ఇంకొక సంవత్సరం గడిచాక ఆ తరువాతి రోజు రాత్రి నీవు నా సంగమానికి వచ్చి శుభలక్షణ లక్షితులయిన కుమారులను కంటావు. ఏ మాత్రము నా మాటలను శంకించవద్దు అని ఊర్వశి పలుకగా రాజు పురూరవుడు ఊర్వశిని గర్భవతిగా భావించి మనసులో ఏ మాత్రం సంకోచించక తన పట్టణానికి వెళ్ళాడు.
ఇలా వెళ్ళి తన పట్టణంలో ఒక సంవత్సరం ఉండి, తరువాత ఊర్వశి దగ్గరకు వెళ్ళి ఒక రాత్రి ఆమెవద్ద ఉండగా, ఊర్వశి 'నీవు గంధర్వులను వేడుకో. వారు నన్ను నీకు ఇస్తారు' అని చెప్పగా పురూరవుడు గంధర్వులను ప్రార్ధించగా, గంధర్వులు పురూరవుని పొగడ్తలకు మెచ్చుకొని, ఒక అగ్నిస్థాలిని (కుంపటిని) పురూరవునకు ఇవ్వగా, ఆ అగ్నిస్థాలిని ఊర్వశిగా భావించి దానితో అడవంతా తిరిగి ఒకరోజు అది ఊర్వశి కాదు అగ్నిస్థాలి అని గ్రహించి, దానిని అడవిలో విడిచి, ఇంటికి వెళ్ళి, నిత్యం ఊర్వశినే చింతిస్తూ ఉండగా, త్రేతాయుగం వచ్చింది. ఆ రాజైన పురూరవునకు కర్మానుష్ఠానాన్ని బోధించే మూడు మార్గాలుగా వేదాలు తోచాయి. అంత పురూరవుడు అడవిలోని అగ్నిస్థాలి వద్దకు వెళ్ళి అక్కడ జమ్మిచెట్టు నుండి పుట్టిన రావిచెట్టును చూచి, ఆ రావి కొమ్మలతో అగ్నిని మథించే రెండు కొయ్యలు తయారు చేశాడు. (వాటిని అరణులు అంటారు) అందులో మొదటి అరణిని తానుగా, రెండవ అరణిని ఊర్వశిగా, మధ్యనున్న కాష్ఠాన్ని పుత్రుడుగా భావన చేస్తూ మంత్రజపం చేస్తూ ఆ అరణులను మథిస్తుండగా జాతవేదుడనే పేరుగల అగ్ని పుట్టాడు. ఆ అగ్ని మంత్రారాధన పూర్వక సంస్కారంతో ఆహవనీయాది మూడురూపాలుగా ప్రవర్తిల్లి పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డాడు. పురూరవుని పుత్రుడుగా చెప్పబడ్డ ఆ అగ్ని పురూరవుణ్ణి పుణ్యలోకాలకు పంపుటకు కారణం అవడంచేత
సుగుణాన్వితుడైన పురూరవుడు తన పుత్రునిగా చెప్పబడ్డ అగ్నిచేత అనంతుడు, హరి, వేదమయుడు, లక్ష్మీదేవితో కూడినవానిని గూర్చి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయడం తన ప్రియురాలైన ఊర్వశిని చూడడానికి వెళ్ళాలనే కోరికతో చేశాడు.
త్రేతాయుగంలో అగ్ని ఒకే రూపంతో ఉండేవాడు. దైవమైన పురుషోత్తముడు ఒకేరూపంలో ఉండేవాడు. సమస్త భాషాస్వరూపమైన వేదము ఒకటిగానే ఉండేది. నిత్యనూతనంగా ప్రకాశించే ఓంకార ప్రణవాక్షరము ఒక్కటిగా ఉండేది. ఒకే ఒక్క ఆకారంలో ఉన్న పై అంశాలు సామాన్యులకు తేలికగా అవగతం అవడంకోసం పురూరవుడు తన అమితమైన ధీశక్తితో మూడు మూడుగా విభాగం చేశాడు.
ఈ విధంగా వేదవిభాగంచేసి, యాగంచేసి, పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వ లోకానికి వెళ్ళాడు, ఆ పురూరవుడు అనే రాజుకు ఊర్వశివల్ల ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అనే ఆర్గురు కొడుకులు పుట్టారు. ఆ ఆరుగురిలో శ్రుతాయువునకు వసుమంతుడు, సత్యాయువు అనేవానికి ద్రుతంజయుడు, రయుడు అనేవానికి శ్రుతుడు, ఏకుడు అనే ఇద్దరు జన్మించారు. జయునకు అమితుడనేవాడు, విజయుడు అనేవానికి భీముడు జన్మించారు. ఆ భీమునికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు, హోత్రకునకు గంగాప్రవాహాన్ని తన నోటిపుక్కిలిలో బంధించిన జహ్నుడు, ఆ జహ్నుడికి పూరుడు, పూరునకు బాలకుడు, ఆ బాలకునికి అజకుడు ఆ అజకునికి కుశుడు, ఆ కుశునికి కుశాంబుడు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అనే నలుగురు జన్మించారు. అందులో కుశాంబుడు అనేవానికి గాధి పుట్టాడు. ఆ గాధి రాజ్యం చేసే సమయంలో
గాధిరాజు కుమార్తె సత్యవతిని ఋచికుడనే బ్రాహ్మణుడు తనకిచ్చి వివాహం చేయుమని అడిగాడు. గాధి ఈ ఋచికుడు తన కుమార్తెకు ఈడు కాడు అనే ఆలోచనతో తెల్లగా సుకుమారంగా ఉండే శరీరాలు, నల్లటి చెవులు గలవేయి గుఱ్ఱలు కన్యాశుల్కంగా ఇస్తే నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఋచికుడు వరుణుని దగ్గరకు వెళ్ళి గాధి కోరినవిధంగా వేయి గుఱ్ఱలను తెచ్చి ఇచ్చాడు. గాధి ఋచికునకు తన కూతురు సత్యవతినిచ్చి వివాహం చేశాడు.
సత్యవతి, సత్యవతి తల్లి ఇద్దరు ఋచికుని తమకు కొడుకులు కావాలని కోరారు. ఋచికుడు అంగీకరించి బ్రహ్మ మంత్రాలతో, రాజమంత్రాలతో యజ్ఞంచేసి హవ్యాన్ని తయారుచేసి నదీస్నానానికి వెళ్ళాడు.
(పురాణకాలంలో కూడా 'ఉంకువ' (కన్యాశుల్మం) ఇవ్వటం ఉందని తెలుస్తున్నది.)
ఆ ఋచికుడు స్నానానికి వెళ్ళిన సమయంలో సత్యవతి తన తల్లి కోరిన ప్రకారంగా బ్రాహ్మణ మంత్రాలతో యజ్ఞం చేసిన యజ్ఞ ప్రసాదాన్ని తల్లికిచ్చి, క్షత్రియ మంత్రాలతో తన తల్లికి తయారు చేయించిన హోమద్రవ్యాన్ని తాను స్వీకరించింది. ఇంతలో ముని వచ్చాడు. ఒకరి చరువును మరొకరు తీసికోవడాన్ని తెలిసికొని భార్య సత్యవతితో ఇలా అన్నాడు.
ఓ చంచలాక్షీ! సత్యవతీ! నీ కొరకు తయారుచేసిన చరువు నీ తల్లికిచ్చి ఆమెకొరకు తయారుచేసిన చరువు నీవు ఎందుకు తీసికొన్నావు? విను. నీకు క్రూరమైన ఆలోచనలుగల కొడుకు, నీ తల్లికి బ్రహ్మజ్ఞాని పుడుతారు.
ఋచికుడు తన భార్యను ప్రశ్నించేసరికి సత్యవతి భయపడి, మ్రోక్కి వినయంగా మాట్లాడగా, ఆ మాటలకు ఋచికుడు జాలిపడ్డాడు. నీ కొడుకు సాధువై, నీ మనుమడు క్రూర కర్ముడవుతాడని దయదలచి పలికాడు. సత్యవతికి సాధువైన జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీనదిగా మారి లోకాలను పవిత్రం చేస్తూ ప్రవహించింది. ఆ జమదగ్ని రేణువనే వాని కుమార్తె రేణుకను పెండ్లి చేసుకొని వసుమనాది పుత్రులను కన్నాడు. అందులో
విష్ణుమూర్తి యొక్క అంశతో జమదగ్నికి పరశురాముడు జన్మించాడు. అతడు తనచేతి గొడ్డలితో రాజుల శిరములను ఇరువదియొక్క మార్లు నరికాడు.
ఆ మాటలు ఆలకించి పరీక్షిత్తు శుకమహర్షితో ఇట్లన్నాడు.

Bhavishyadrajetihasa the stories of the kings of the Chandravanshi dynasty - భవిష్యద్రాజేతిహాసము
భవిష్యద్రాజేతిహాసము
'శ్రీ శుకమహర్షి తన తండ్రి వ్యాస భాగనుడు తనకుపదేశించిన భాగవతాన్ని పరీక్షన్మహారాజునకు వినిపిస్తున్నాడు' అంటూ సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు.
చంద్రవంశ్యులగు రాజుల ఇతిహాసము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
'శ్రీ శుకమహర్షి తన తండ్రి వ్యాస భాగనుడు తనకుపదేశించిన భాగవతాన్ని పరీక్షన్మహారాజునకు వినిపిస్తున్నాడు' అంటూ సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు.
వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు మొదలైన కొడుకులు పదిమంది కలిగారని చెబుతారు కదా! ఇక్ష్వాకువంశం ఎలా ప్రవర్తిల్లింది? ఆ వంశంలో వెనుకటివాళ్లను గూర్చి, ఇప్పటివాళ్లనుగూర్చి, పుట్టబోయే వాళ్ళను గూర్చి దయతో నాకు విశదీకరించు అని పరీక్షిత్తు ప్రార్థించకగా శుకమహర్షి ఇక్ష్వాకు మహారాజునుండి అభిమన్యుని చేతిలో మరణించిన బృహద్బలుడి వరకు వంశచరిత్రను, వారి వంశంలో విశేష చరిత్ర గలవారిని గూర్చి ఇంతవరకు చెప్పాడు. ఇక్ష్వాకువంశంలో బృహద్బలుని తరువాత జన్మించబోయే రాజులను గూర్చి తెలియజేస్తున్నాడు శుకమహర్షి.
ఓ పరీక్షన్మహారాజా! నీ వంశంలో ఇక్ష్వాకుడు మొదలుగా బృహద్బలునివరకు ఉన్న రాజుల చరిత్రను నీకింతవరకు చెప్పాను. ఇక్ష్వాకువంశంలో ఇకపై పుట్టబోయే రాజులనుగూర్చి తెలియజేస్తాను.
ఆ బృహద్బలుడికి బృహద్రణుడు, ఉరుక్షతుడు, వత్సప్రీతుడు, ప్రతివ్యోముడు, భానుడు, సహదేవుడు, బృహదశ్వుడు, భానుమంతుడు, ప్రతీకాశ్వుడు, సుప్రతీకుడు, మేరుదేవుడు, సుతక్షత్రుడు, ఋక్షకుడు, అంతరిక్షుడు, సుతపుడు, అమిత్రజిత్తు, బృహద్వాజి, బర్హి, ధనంజయుడు, రణంజయుడు, సృంజయుడు, శాక్యుడు, శుద్దాదుడు, లాంగలుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, ఋణకుడు, సురథుడు, సుమిత్రుడు క్రమంగా జన్మిస్తారు, సుమిత్రుని తరువాత సూర్యవంశం నశిస్తుంది. వీళ్ళు బృహద్బలుడి నుండి క్రమంగా జన్మించేవారు అని శుకుడు ఇలా అన్నాడు.
ధన్యుడైన ఇక్ష్వాకు పుత్రుడు నిమి యాగం చేయాలనే ఆలోచనతో ఆ యజ్ఞానికి వసిష్ఠుని ఋత్విక్కుగా ఉండి నిర్వహింపుమని కోరాడు. వసిష్ఠుడు ఇంద్రుని యజ్ఞం చేయించడానికి ఇంతకుముందే ఒప్పుకొని ఉన్నాను. అది పూర్తి అయిన తరువాత వస్తాను. ఏ లోటూ ఉండదు అన్నాడు. ఇంటికి వచ్చిన నిమి “సంసారం నిలకడలేనిది. కాలయాపనం చేయడం మంచిది కాదు". యజ్ఞం చేద్దామని ఆలోచించి ఇతర ఋత్విక్కులను పిలిచి వారిచే యజ్ఞం చేయించాడు.
వసిష్ఠుడు ఇంద్రుని యాగం పూర్తి చేయించి వచ్చి తాను లేకుండా యజ్ఞం పూర్తి చేయటాన్ని చూసి సహించలేక ఆయన శిష్యునిపై ఆగ్రహించి 'ఓరీ నేను వచ్చేదాక ఆగలేకపోయావు' అంటూ అతని శరీరం కూలిపోవాలని నిమి చక్రవర్తిని శపించాడు.
ఈ విధంగా వసిష్ఠుడు తనను శపించగా, నిమి కూడా వసిష్ఠుని దేహం కూలిపోవుగాక! అని తిరిగి శపించాడు. ఆ వసిష్ఠుడు ఊర్వశి అనే అప్పరసకు మిత్రావరుణుల వలన జన్మించాడు. శాపాంతకాలంలో బ్రహ్మజ్ఞాని నిమి గురుశాపంవల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ నిమిదేహాన్ని మునీశ్వరులు సుగంధవస్తువులతో భద్రపరచి, ప్రారంభించిన సత్రయాగాన్ని పూర్తి చేశారు. యాగం పూర్తి అయిన తరువాత మెచ్చి వచ్చిన దేవతాబృందానికి నిమిదేహాన్ని చూపించి 'ఇతనిని బ్రతికించండి' అని ప్రార్ధించారు. 'నిమి ప్రాణం వచ్చుగాక' అని దేవతలు ఆశీర్వదించారు. కాని నిమి మాత్రం తన శరీరాన్ని పొందడానికి ఇష్టపడక ఇలా అన్నాడు.
మోహంవల్ల కలతపొంది, మమతాహంకారాలకు మూలమై, సుఖదుఃఖాలతో పీడింపబడి, అశాశ్వతమైన ఈ దేహంతో సంసర్గం నాకెందుకు? ఎప్పుడు, ఎవరిచేతికి, ఎలా చిక్కి ప్రాణం కోల్పోతుందో తెలియక భయపడే చేప బ్రతుకులాంటి జీవనాన్ని విజ్ఞులు అంగీకరించరు. కావున నేను పరమేశ్వరుని మనసులో సేవిస్తాను.
నిమి పల్కిన మాటలు విన్న దేవతలు కాదనలేక, శరీరధారులు కళ్ళు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు నిమి అస్తిత్వం కానవస్తుంది అని చెప్పి వెళ్ళారు. అంత
మునీశ్వరులు రాజ్యానికి రాజు లేకపోతే అరాజకత్వం వస్తుందని భావించి నిమి శరీరాన్ని మథించగా దానినుండి ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారుణ్ణి లోకాలన్నీ జనకుడు అని పిలిచాయి.
నిమిని మధించగా పుట్టినవాడు వైదేహుడని, మథించడంవల్ల పుట్టడంచేత మిథిలుడని పేరు పొందాడు. మిథులుడు నిర్మించడంవల్ల ఆ నగరానికి మిథిలానగరం అని పేరు వచ్చింది. ఆ జనకునకు ఉదావసుడు, వానికి నందివర్ధనుడు, వానికి సుకేతుడు, వానికి దేవరాతుడు, వానికి బృహద్రథుడు, వానికి మహావీర్యుడు, వానికి సుధృతి, వానికి ధృష్టకేతుడు, వానికి హర్యశ్వుడు, వానికి మరువు, అతనికి ప్రతింధకుడు, వానికి కృతరయుడు, వానికి దేవమీధుడు, వానికి విధృతి, వానికి మహాధృతి, వానికి కీర్తిరాతుడు, వానికి మహారోముడు, వానికి స్వర్ణరోముడు, వానికి హ్రస్వరోముడు, వానికి సీరధ్వజుడు జన్మించారు.
సీరధ్వజుడు యజ్ఞభూమిని దున్నిస్తూ ఉండగా, నాగేటి కర్రుకొనకు తగిలి, సీత లభించింది. ఆమె శుభలక్షణాలు గల దేహం కలిగింది. ఈ కారణంచేత సీరధ్వజుడు అనే ప్రశస్తి కలిగి అతడు ధన్యు డయ్యాడు.
(జనక, వైదేహ, మిథిల, సీరధ్వజ అనే పేర్ల వ్యుత్పత్తిని గుర్తిస్తే జనకచక్రవర్తి జీవిత విశేషాల మౌలిక విషయాలు తెలుసాయి.)
ఆ సీరధ్వజునకు కుశధ్వజుడు, కుశధ్వజునకు ధర్మధ్వజుడు, ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇరువురు కొడుకులు పుట్టారు. వారిలో కుశధ్వజనికి కేశిధ్వజుడు జన్మించాడు. అతడు ఆత్మవిద్యలో నేర్పరి, మితధ్వజునకు ఖాండిక్యుడు జన్మించాడు. అతడు తండ్రివల్ల యజ్ఞయాగాది కర్మకాండలను గూర్చి తెలిసికొని, కేశిధ్వజునకు భయపడి పారిపోయాడు.
ఖాండిక్యునకు భానుమంతుడు, భానుమంతునకు శతద్యుమ్నుడు, శతద్యుమ్నునకు శుచి, శుచికి సనద్వాజుడు, సనద్వాజునకు ఊర్థ్వకేతుడు, ఊర్థ్వకేతునకు అజుడు, అజునకు కురుజిత్తు, కురుజిత్తుకు అరిష్టనేమి, అరిష్టనేమికి శ్రుతాయువు, శ్రుతాయువుకు పార్శ్వుడు; వానికి చిత్రరథుడు, చిత్రరథునకు క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు, హేమరథునకు సత్యరథుడు, సత్యరథునకు ఉపగురుడు, ఉపగురునకు అగ్నిదేవుని దయవల్ల ఉపగుర్వుడు, ఉపగుర్వునకు సావనుడు, సావనునకు సువర్చసుడు జన్మించారు. ఈ సువర్చసుడే సుభూషణుడని కీర్తింపబడతాడు. ఆ సుభూషణునకు జయుడు, జయునకు విజయుడు, విజయునకు ధృతుడు, ధృతునకు అనఘుడు, అనఘునకు వీతిహవ్యుడు, వీతిహవ్యునకు ధృతి, ధృతికి బహుళాశ్వుడు, బహుళాశ్వునకు కృతి, కృతికి మహావశి జన్మించారు వీరందఱు మైథిలులు అని పిలువబడతారు. యోగీశ్వరుని దయవల్ల వీరు గృహస్థులై ఉండి కూడా కర్మబంధముక్తులై ఆత్మజ్ఞానంతో, ఎల్లప్పుడు పరబ్రహ్మానుసంధానంతో ఉంటారు అని శుకుడు ఇలా అన్నాడు.

Vontimitta Kodanda Rama Swamy - ఒంటిమిట్ట రామాలయం
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది.
ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది.
గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే.
స్థల పురాణం
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
ఆలయ విశిష్టత
ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు.
ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు.
గోపురనిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు.
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది.
పూజలు,ఉత్సవాలు
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు.
బ్రహ్మోత్సవాలు
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.
ప్రస్తుతం ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానములు కు అప్పగించింది
Subscribe to:
Comments (Atom)
Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము
శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...